Gemini Internet
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
Gemini Internet
ఇంటర్మీడియెట్ ఎంపీసీ లేదా బైపీసీ పూర్తి చేశారా.. త్రివిధ దళాల్లో చేరాలనే ఆసక్తి ఉందా.. అయితే మీకు స్వాగతం పలుకుతోంది.. భారత నావికా దళం! కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశ పెట్టిన.. ‘అగ్నిపథ్’ స్కీమ్‌లో భాగంగా.. నావికా దళంలో.. 2,800 ‘అగ్నివీర్–ఎస్‌ఎస్‌ఆర్ (సీనియర్ సెకండరీ రిక్రూట్)’ పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది! ఈ పోస్ట్‌లకు.. ఈ నెల 15 నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలు కానుంది. ఈ నేపథ్యంలో.. అగ్నివీర్ ఉద్యోగ ఎంపిక ప్రక్రియ, రాత పరీక్ష, సర్వీస్ కాలం, వేతనం తదితర సమాచారం...
త్రివిధ దళాల్లో చేరాలనుకునే యువత దేశంలో లక్షల సంఖ్యలో ఉంటారనడంలో సందేహం లేదు. ఇలాంటి వారి కోసం ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త పథకం ప్రకటించింది. త్రివిధ దళాల్లో ఉద్యోగ నియామకాల కోసం అగ్నిపథ్ పేరిట ప్రత్యేక విధానానికి రూపకల్పన చేసిన సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియెట్ అర్హతలతో సాయుధ బలగాల్లో అగ్నివీర్ పేరుతో పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఇండియన్ ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌లలో అగ్నివీర్, అగ్నివీర్‌వాయు పోస్ట్‌ల భర్తీ ప్రక్రియ మొదలైంది. తాజాగా ఇండియన్ నేవీలోనూ అగ్నివీర్(ఎస్‌ఎస్‌ఆర్)కు నోటిఫికేషన్ వెలువడింది.
నేవీ అగ్నివీర్ (ఎస్‌ఎస్‌ఆర్) రాత పరీక్ష నాలుగు విభాగాల్లో వంద మార్కులకు నిర్వహిస్తారు. ఇంగ్లిష్ 25 ప్రశ్నలు–25 మార్కులు, సైన్స్ 25 ప్రశ్నలు–25 మార్కులు, మ్యాథమెటిక్స్ 25 ప్రశ్నలు–25 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ 25 ప్రశ్నలు–25 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షకు కేటాయించిన సమయం 60 నిమిషాలు.
రాత పరీక్ష, పీఈటీలలో ప్రతిభ చూపిన వారికి చివరగా మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులోనూ విజయం సాధిస్తే.. ఐఎన్‌ఎస్ చిల్కాలో ఆరు నెలలపాటు పలు ట్రేడ్‌లకు సంబంధించి శిక్షణనిస్తారు. తాజా బ్యాచ్‌కు సంబంధించిన శిక్షణ నవంబర్‌లో ప్రారంభం కానుంది. శిక్షణ కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటే.. ఆయా విభాగాల్లో మిగిలిన మూడున్నరేళ్లు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
మొత్తం నాలుగేళ్ల వ్యవధిలో ఉండే అగ్నివీర్ సర్వీస్ పూర్తి చేసుకున్న వారిలో 25 శాతం మందిని నేవీలో శాశ్వత సెయిలర్‌గా నియమించనున్నారు. దీనికోసం ప్రత్యేక నోటిఫికేషన్ వెలువరిస్తారు. సంబంధిత ఎంపిక ప్రక్రియలో విజయం సాధించాల్సి ఉంటుంది. అగ్నివీర్‌లుగా సర్వీస్ పూర్తి చేసుకున్న తర్వాత సీఏపీఎఫ్, అస్సాం రైఫిల్స్ నియామాకాల్లోనూ పది శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.
అగ్నివీర్‌లుగా ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది నెలకు రూ.30 వేలు, రెండో ఏడాది రూ.33 వేలు, మూడో ఏడాది రూ.36,500, నాలుగో ఏడాది రూ.40 వేలు చొప్పున నెల వేతనం లభిస్తుంది. ఈ వేతనంలోంచి ప్రతి నెల 30 శాతం చొప్పున అగ్నివీర్ కార్పస్ ఫండ్‌కు జమ చేస్తారు. ఈ 30 శాతానికి సమానమైన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా జమ చేస్తుంది. ఇలా నాలుగేళ్లు పూర్తయ్యేసరికి అభ్యర్థుల కార్పస్ ఫండ్‌లో రూ. 10.04 లక్షలు జమ అవుతాయి.
నేవీలో అగ్నివీర్‌లుగా ఎంపికైన వారు ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్స్, గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్స్, ఫ్రైగేట్స్, రిప్లెనిష్‌మెంట్ షిప్స్, టెక్నికల్ సబ్ మెరైన్స్, నేవీ ఎయిర్ క్రాఫ్ట్స్ వంటి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
Gemini Internet
నోయిడాలోని నవోదయ విద్యాలయ సమితి (ఎన్‌వీఎస్).. దేశవ్యాప్తంగా టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 1616
పోస్టుల వివరాలు: ప్రిన్సిపల్–12, పీజీటీ (పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు)–397, టీజీటీ
(ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు)–683, టీజీటీ (థర్డ్ లాంగ్వేజ్)–343, మిసిలేనియస్ కేటగిరీ (ఆర్ట్, పీఈటీ, లైబ్రేరియ¯Œ )–181.
ప్రిన్సిపల్:
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీతో పాటు బీఈడీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పని అనుభవం ఉండాలి.
వయసు: 50 ఏళ్లు మించకుండా ఉండాలి.
పీజీటీ(పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు):
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో
ఆర్‌సీఈ(ఎన్‌సీఈఆర్‌టీ) నుంచి రెండేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ డిగ్రీతో పాటు
బీఈడీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 40 ఏళ్లు మించకుండా ఉండాలి.
టీజీటీ(ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు):
అర్హత: కనీసం 50శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో
ఆర్‌సీఈ(ఎన్‌సీఈఆర్‌టీ) నుంచి నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీతో పాటు బీఈడీ
డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సీటెట్ అర్హత సాధించి ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకుండా ఉండాలి.
మిసిలేనియస్ కేటగిరి (ఆర్ట్, పీఈటీ, లైబ్రేరియన్):
అర్హత: గ్రాడ్యుయేషన్, డిప్లొమా(లైబ్రరీ సైన్స్),
బీపీఈడీ, డిప్లొమా(ఫైన్ ఆర్ట్స్), బ్యాచిలర్స్ డిగ్రీ(మ్యూజిక్)
ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతో పాటు ఇంగ్లిష్, హిందీ, ప్రాంతీయ
భాషల్లో నాలెడ్జ్ ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ/పర్సనల్ ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 22.07.2022
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://navodaya.gov.in/
Gemini Internet
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్).. 2023–2024 సంవత్సరానికి సంబంధించి కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్(సీఆర్‌పీ)–గీఐఐ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 6035
తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు: ఆంధ్రప్రదేశ్–209, తెలంగాణ–99.
ఉద్యోగాలు కల్పిస్తున్న బ్యాంకులు:
బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో
బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్
నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్
మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్ తదితరాలు.
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు: 01.07.2022 నాటికి 20–28 ఏళ్ల మధ్య ఉండాలి.
వయసు సడలింపు: ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు వయసులో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ,
మెయిన్ ఎగ్జామ్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్ష 100
మార్కులకు ఉంటుంది. ఇంగ్లిష్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్‌లో ప్రశ్నలు
అడుగుతారు. ప్రిలిమ్స్ పరీక్ష సమయం 60 నిమిషాలు. మెయిన్స్ పరీక్ష 200
మార్కులకు ఉంటుంది. జనరల్ అవేర్‌నెస్, జనరల్ ఇంగ్లిష్, రీజనింగ్,
కంప్యూటర్ ఆప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు
వస్తాయి. మెయిన్స్ పరీక్ష సమయం 160 నిమిషాలు. ప్రిలిమ్స్, మెయిన్స్
పరీక్షల్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 21.07.2022
ప్రిలిమినరీ పరీక్ష: ఆగస్టు 2022
మెయిన్స్ పరీక్ష: అక్టోబర్ 2022
వెబ్‌సైట్: https://www.ibps.in/
Gemini Internet
రాష్ట్రంలో ప్రభుత్వం సూచించిన మేరకు ఖాళీ పోస్టుల భర్తీకి ఎంపిక ప్రక్రియను మరింత వేగవంతం చేయనున్నామని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) చైర్మన్ పి.గౌతమ్ సవాంగ్ చెప్పారు. మంగళవారం గ్రూప్–1 తుది ఫలితాల విడుదల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే నెలలో 110 గ్రూప్–1 పోస్టులు, 182 గ్రూప్–2 పోస్టులకు కొత్తగా నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు.
ఇప్పటికే వివిధ ఉద్యోగాల భర్తీకి 16 నోటిఫికేషన్లు విడుదల చేయగా.. వాటిలో మూడింటిని పూర్తి చేశామని తెలిపారు. ఇంకా 13 నోటిఫికేషన్లకు సంబంధించి పరీక్షలు, ఇతర ప్రక్రియలను ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో పూర్తి చేస్తామని ప్రకటించారు. 2 వేల వరకు వివిధ పోస్టుల భర్తీ ఉంటుందన్నారు.
670 జూనియర్ అసిస్టెంట్, 119 ఏఈ పోస్టులకు ఈ నెలాఖరున పరీక్షలు ఉంటాయన్నారు. ఈ పోస్టులకు 5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారన్నారు. అత్యంత పారదర్శకంగా నిపుణులైన ఉద్యోగులను రాష్ట్రానికి అందించేలా కమిషన్ చర్యలు చేపడుతుందన్నారు. పోస్టులకు ఎంపిక ఎలాంటి అనుమానాలకు ఆస్కారం లేకుండా కమిషన్ ముందుకు వెళ్తుందన్నారు.
గ్రూప్–1 కేడర్‌లోనూ సీపీటీ పరీక్ష
గ్రూప్–1 కేడర్ పోస్టులకు కూడా ఇకనుంచి కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (సీపీటీ) నిర్వహించనున్నట్టు సవాంగ్ తెలిపారు. ఈ–గవర్నెన్స్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లతో పరిపాలనలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయని, అందుకు అనుగుణంగా అధికారులు కూడా సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. గ్రూప్–1 పోస్టులకు సంబంధించి సీపీటీ సిలబస్‌లో మార్పులు చేస్తామన్నారు. అంతేకాకుండా ప్రొబేషనరీ ఖరారుకు ఎంపికైన వారికి డిపార్ట్‌మెంటల్ టెస్ట్ కూడా నిర్వహించే ప్రతిపాదన ఉందన్నారు.
గ్రూప్–1 పోస్టులకు ఇంటర్వ్యూలు ఉండాలా వద్దా అనే దానిపై చర్చిస్తున్నామని, తుది నిర్ణయమేదీ లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అత్యున్నత పోస్టులకు ఎంపికైన వారికి అందుకు తగ్గ సామర్థ్యాలు ఉన్నాయా లేదా అన్నది తెలుసుకోవాలంటే రాత పరీక్షలతో పాటు ఇతర రకాల పరీక్షలు కూడా ముఖ్యమేనని అభిప్రాయపడ్డారు. దీనిపై జాతీయ స్థాయిలో కూడా చర్చ జరుగుతోందన్నారు. యూపీఎస్సీతో సహా పలు రాష్ట్రాల కమిషన్లతో దీనిపై చర్చిస్తున్నామని తెలిపారు. కేరళలో ఇంతకుముందు జరిగిన వివిధ రాష్ట్రాల కమిషన్ల భేటీలో దీనిపై చర్చ జరిగిందని, వచ్చేనెల 8న విశాఖపట్నంలో ఆలిండియా కమిషన్ల సమావేశం ఉంటుందని అందులోనూ చర్చిస్తామని తెలిపారు.
గవర్నర్‌కు వివరణలు పంపించాం
గ్రూప్–1పై ఇటీవల కొందరు అభ్యర్థులు గవర్నర్‌కు ఫిర్యాదు చేయడంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు సవాంగ్ సమాధానమిస్తూ.. ఈ అంశాలు కోర్టు పరిధిలో ఉన్నందున బయటకు స్పందించలేమన్నారు. సంబంధిత అంశాలపై గవర్నర్ కార్యాలయానికి వివరణలు పంపించామన్నారు. తెలుగు మాధ్యమం అభ్యర్థులకు అన్యాయం జరిగిందనడం వాస్తవం కాదని, వీటిపై ఇంతకుమించి స్పందించలేమని పేర్కొన్నారు.
అన్ని ఫైళ్లను కోర్టు ముందుంచామన్నారు. సమాధాన పత్రాలను అభ్యర్థులకు అందుబాటులో ఉంచడమనే విధానం ఏపీపీఎస్సీలో లేదని, యూపీఎస్సీలో కూడా లేదని వివరించారు. కొత్త నోటిఫికేషన్లకు సంబంధించి వయోపరిమితి సడలించాలని అభ్యర్థుల నుంచి వస్తున్న వినతిపై స్పందిస్తూ దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో కమిషన్ సభ్యులు విజయకుమార్, ప్రొఫెసర్ పద్మ రాజు, డాక్టర్ సుధాకర్‌రెడ్డి, సలాంబాబు, రమణా రెడ్డి, పి.సుధీర్, ఎన్.సోనీవుడ్, ఎన్.సుధాకర్‌రెడ్డి, కార్యదర్శి అరుణకుమార్ పాల్గొన్నారు.
Gemini Internet