20, డిసెంబర్ 2020, ఆదివారం

Anantapuramu District Classifieds

 

DIVIS Laboratory Jobs 2020 Telugu || దివిస్ ల్యాబోరేటరీ హైదరాబాద్, వైజాగ్ లలో ఉద్యోగాల భర్తీ

దివిస్ ల్యాబోరేటరీ  వైజాగ్, హైదరాబాద్ లలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల :

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లలో ఉన్న నిరుద్యోగ  అభ్యర్థులకు శుభవార్త.


ప్రముఖ బల్క్ డ్రగ్ పరిశ్రమ దివిస్ ల్యాబోరేటరీస్ లిమిటెడ్ కు చెందిన  హైదరాబాద్ మరియు విశాఖపట్నం బ్రాంచ్ లలో ప్రొడక్షన్ విభాగంలో ఖాళీగా ఉన్న ట్రైనీ పోస్టుల భర్తీకి గాను ఒక ప్రకటన విడుదలైనది.

ఇంటర్వ్యూ ల భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు అర్హతలు మరియు శారీరక ధారుడ్యం కలిగిన యువతీ యువకులు అందరూ హాజరు కావచ్చు.

ముఖ్యమైన తేదీలు :

ఇంటర్వ్యూ తేదీలు మరియు నిర్వహణ ప్రదేశాలు :

డిసెంబర్ 21,2020   :      హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ,  అమరావతిరోడ్,  గుంటూరు.

డిసెంబర్ 22,2020   :  సిద్దార్థ్ కాలేజీ ఆఫ్ ఆర్ట్స్&సైన్సెస్, ఏ. ఎస్. రామ రావు రోడ్,మొగల్రాజపురం ,సిద్దార్థ్ నగర్, విజయవాడ.

ఇంటర్వ్యూ నిర్వహణ సమయం :   9 AM  to 4 PM

విభాగాల వారీగా ఖాళీలు మరియు అర్హతలు :

ట్రైనీ హెల్పర్స్ :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఎస్ఎస్సీ ను పూర్తి చేయవలెను. మరియు డీజిల్, మెకానికల్, ఫిట్టర్ మొదలైన విభాగాలలో ఐటీఐ కోర్సు ను పూర్తి చేయవలెను.

ట్రైనీ సూపర్ వైజర్ :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీ. ఎస్సీ (కెమిస్ట్రీ )/బీ. ఫార్మసీ /బీ. టెక్ (కెమిస్ట్రీ, మెకానికల్)/  ఎం. ఎస్సీ (ఆర్గానిక్, ఎనాలిటికల్, మైక్రో బయాలజీ) కోర్సులను పూర్తి చేయవలెను.

వయసు :

ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూ లకు హాజరు కాబోయే అభ్యర్థులు 19 సంవత్సరాలనుండి 24 సంవత్సరాల వయసు కలిగి ఉండవలెను.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన ట్రైనీ హెల్పర్స్ కు 12,500 రూపాయలు జీతం మరియు ట్రైనీ సూపర్ వైజర్స్ కు 15,000 రూపాయలును  జీతముగా అందుకోనున్నారు.

జీతం తో పాటు బాచిలర్స్ కు ఉచిత వసతి, యూనిఫామ్, ప్రొవిడెంట్ ఫండ్, ఈఎస్ఐ, వార్షిక బోనస్ మరియు భోజన రాయితీ మొదలైన సౌకర్యాలు లభించనున్నాయి.

ఈ ఉద్యోగాల  ఇంటర్వ్యూ ల గురించి అభ్యర్థులు మరింత ముఖ్యమైన సమాచారం కొరకు ఈ క్రింది ఫోన్ నంబర్స్ ను సంప్రదించవచ్చు.

ఫోన్ నంబర్స్ :

8341624170,

9505792440.

BRAOU Admissions Update 2020 Telugu || అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో డిగ్రీ, పీజీ కోర్సుల ప్రవేశాల దరఖాస్తు గడువు పెంపు


డిగ్రీ మరియు పీజీ కోర్సుల గడువు పెంపు :

దూర విద్యా విధానంలో డిగ్రీ మరియు పీజీ కోర్సులను  చదవాలనుకునే అభ్యర్థులకు  అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుండి ఒక మంచి అప్డేట్ వచ్చినది. BRAOU Admissions Update 2020 Telugu


డిగ్రీ /పీజీ /పీజీ డిప్లొమా సర్టిఫికెట్ కోర్సులలో విద్యార్థుల ప్రవేశాలకు సంబంధించిన గడువును ఈ నెల డిసెంబర్ 31వరకూ పెంచుతున్నట్లు డాక్టర్ బీ. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఒక ప్రకటన ద్వారా తెలిపినది.

ఈ కోర్సుల ప్రవేశాలకు సంబంధించిన అడ్మిషన్స్ గురించిన మరింత ముఖ్యమైన సమాచారం మరియు  వివరాలకు అభ్యర్థులు ఈ క్రింది వెబ్సైటు మరియు ఫోన్ నెంబర్స్ ను సంప్రదించవచ్చును.

Website

ఫోన్ నంబర్లు :

7382929570/590/600

🔳ఆంధ్రప్రదేశ్ వైద్య,ఆరోగ్య విభాగం

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ :    మెడిక‌ల్ ఆఫీస‌ర్లు (MBBS‌)
ఖాళీలు :    33
అర్హత :    ఎంబీబీఎస్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, ఇంటర్న్ షిప్ పూర్తి చేసి ఉండాలి.
వయసు :    42 ఏళ్లు మించ‌కూడ‌దు.
వేతనం :    రూ.55,500 /- రూ.1,20,000/-
ఎంపిక విధానం:    అకాడమిక్ మార్క్స్ ఆధారంగా,ప‌ని అనుభ‌వం ఆధారంగా.మెరిట్ లిస్టు ఆదారంగా.
దరఖాస్తు విధానం:    ఈ-మెయిల్ ద్వారా
ఈ-మెయిల్:    nuhmwg@gmail.com
దరఖాస్తు ఫీజు :    జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది:    డిసెంబర్ 18, 2020.
దరఖాస్తులకు చివరితేది:    డిసెంబర్ 31, 2020.

http://www.westgodavari.org/Recruitment.aspx

🔳ఆంధ్రప్రదేశ్ వైద్య,ఆరోగ్య విభాగం

ప్ర‌కాశం జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ :    మెడిక‌ల్ ఆఫీస‌ర్లు (MBBS‌)
ఖాళీలు :    25
అర్హత :    ఎంబీబీఎస్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, ఇంటర్న్ షిప్ పూర్తి చేసి ఉండాలి.
వయసు :    42 ఏళ్లు మించ‌కూడ‌దు.
వేతనం :    రూ.53,500 /- రూ.1,20,000/-
ఎంపిక విధానం:    అకాడమిక్ మార్క్స్ ఆధారంగా,ప‌ని అనుభ‌వం ఆధారంగా.మెరిట్ లిస్టు ఆదారంగా.
దరఖాస్తు విధానం:    ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు ఫీజు :    జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది:    డిసెంబర్ 18, 2020.
దరఖాస్తులకు చివరితేది:    డిసెంబర్ 24, 2020.

https://prakasam.ap.gov.in/notice_category/recruitment/

🔳ఇందిరాగాంధీ నేష‌న‌ల్ సెంటర్ ఫ‌ర్ ది ఆర్ట్స్‌(ఐజీఎన్‌సీఏ)

 మీడియా సెంట‌ర్ లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న‌ ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ :    టెక్నిక‌ల్ అసిస్టెంట్,బ్రాడ్‌కాస్ట్ ఇంజినీర్‌,వీడియో ఎడిట‌ర్‌, కెమెరాప‌ర్స‌న్‌, సౌండ్‌రికార్డిస్ట్‌, త‌దిత‌రాలు.
ఖాళీలు :    08
అర్హత :    పోస్టును అనుస‌రించి సంబంధిత స్పెష‌లైజేష‌న్‌లో ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్, ఐటీఐ(ఎల‌క్ట్రానిక్స్‌),డిగ్రీ, బీటెక్‌/ డిప్లొమా ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం ఉండాలి.
వయసు :    45 ఏళ్ళు మించకుడదు .
వేతనం :    రూ. 35000/- రూ.80,000/-
ఎంపిక విధానం:    స్క్రీనింగ్ ,ఇంట‌ర్వ్యూ ఆదారంగా .
దరఖాస్తు విధానం:    ఆఫ్‌లైన్‌
దరఖాస్తు ఫీజు :    జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది:    డిసెంబర్ 19, 2020.
దరఖాస్తులకు చివరితేది:    డిసెంబర్ 28, 2020.

http://ignca.gov.in/

🔳టెక్స్‌టైల్‌ కంపెనీలో ఉద్యోగాలకు దరఖాస్తులు



జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: ప్రకాశం జిల్లా అద్దంకిలోని ఓ టెక్స్‌టైల్‌ కంపెనీలో నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి షేక్‌ బాజీబాబు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. మిషన్‌ ఆపరేటర్‌, క్వాలిటీ ఇన్వెస్టిగేటర్స్‌, ఆన్‌ లూమ్‌ చేకెర్స్‌, క్వాలిటీ ఇన్‌ఛార్జ్‌, డైయింగ్‌ మిషిన్‌ ఆపరేటర్‌, రోల్‌ డ్రోప్స్‌ పోస్టులకు పదో తరగతి నుంచి ఇంటర్‌, డిగ్రీ విద్యార్హత గల అభ్యర్థులు ఈనెల 21 లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఉద్యోగాలకు ఎంపికయిన అభ్యర్థులకు 3 నెలలు ఉచిత వసతి, భోజనం, ఆధునిక సాంకేతిక విధానాలతో కార్యశాల, సాఫ్ట్‌ స్కిల్స్‌, ఆంగ్లంలో శిక్షణ ఇస్తారని వివరించారు. వివరాలకు www.apssdc.in వెబ్‌సైట్‌ని చూడాలని కోరారు.