20, డిసెంబర్ 2020, ఆదివారం

🔳టెక్స్‌టైల్‌ కంపెనీలో ఉద్యోగాలకు దరఖాస్తులు



జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: ప్రకాశం జిల్లా అద్దంకిలోని ఓ టెక్స్‌టైల్‌ కంపెనీలో నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి షేక్‌ బాజీబాబు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. మిషన్‌ ఆపరేటర్‌, క్వాలిటీ ఇన్వెస్టిగేటర్స్‌, ఆన్‌ లూమ్‌ చేకెర్స్‌, క్వాలిటీ ఇన్‌ఛార్జ్‌, డైయింగ్‌ మిషిన్‌ ఆపరేటర్‌, రోల్‌ డ్రోప్స్‌ పోస్టులకు పదో తరగతి నుంచి ఇంటర్‌, డిగ్రీ విద్యార్హత గల అభ్యర్థులు ఈనెల 21 లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఉద్యోగాలకు ఎంపికయిన అభ్యర్థులకు 3 నెలలు ఉచిత వసతి, భోజనం, ఆధునిక సాంకేతిక విధానాలతో కార్యశాల, సాఫ్ట్‌ స్కిల్స్‌, ఆంగ్లంలో శిక్షణ ఇస్తారని వివరించారు. వివరాలకు www.apssdc.in వెబ్‌సైట్‌ని చూడాలని కోరారు.

కామెంట్‌లు లేవు: