Jeevan Pramaan: పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. ఆన్‌లైన్‌లో జీవన్ ప్రమాణ్ సర్టిఫికేట్ సబ్‌మిట్ చేయండలా..!
Life Certificate: ప్రతి సంవత్సరం పెన్షన్‌దారులు తమ లైఫ్ సర్టిఫికేట్‌ను పెన్షన్ మంజూరు చేసే సంస్థలకు సమర్పించాలి Life Certificate: ప్రతి సంవత్సరం పెన్షన్‌దారులు తమ లైఫ్ సర్టిఫికేట్‌ను పెన్షన్ మంజూరు చేసే సంస్థలకు సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటికీ జీవించే ఉన్నామని రుజువుగా బ్యాంకులు, పోస్టాఫీసులు వంటి పెన్షన్ డిస్బర్సింగ్ అథారిటీలకు లైఫ్ సర్టిఫికేట్ లేదా జీవన్ ప్రమాణ్ పత్రాన్ని సమర్పించాలి. ప్రతినెలా పెన్షన్‌ను పొందాలంటే ఈ సర్టిఫికేట్ అందించడం తప్పనిసరి అయితే ఈ ఏడాది పింఛనుదారులు తమ జీవన్ ప్రమాణ్‌ను నవంబర్ 30 లోపు సమర్పించాలి. దీంతో వృద్ధులు కేంద్ర ప్రభుత్వం సూచించిన ఫార్మాట్లలో కూడా లైఫ్ సర్టిఫికెట్సమర్పించే వెసులుబాటు ఉంది. వృద్ధులు కార్యాలయాలకు వెళ్లి జీవన్ ప్రమాణ్ పత్రాన్ని రూపొందించుకుని సబ్మిట్ చేయడం చాలా కష్టతరంగా మారింది. ప్రస్తుత కరోనా కాలంలో బయటికి రావడం వారి ప్రాణాలకు ముప్పుగా మారింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌లోనే ప్రమాణపత్రం జనరేట్ చేసుకొని సమర్పించడానికి వెసులుబాటు కల్పిస్తోంది. సురక్షితమైన ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్, జీవన్ ప్ర...