📑🔍 డీఎస్సీ-2025 సర్టిఫికెట్ల రీ-వెరిఫికేషన్ – బోగస్ నివారణకు కఠిన చర్యలు 🚫🎓 📑🔍 DSC-2025 Certificate Re-Verification – Strict Action Against Fake Certificates 🚫🎓
📑🔍 డీఎస్సీ-2025 సర్టిఫికెట్ల రీ-వెరిఫికేషన్ – బోగస్ నివారణకు కఠిన చర్యలు 🚫🎓 📑🔍 DSC-2025 Certificate Re-Verification – Strict Action Against Fake Certificates 🚫🎓 🌟 తెలుగు వెర్షన్ అనంతపురం, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): డీఎస్సీ-2025లో బోగస్ సర్టిఫికెట్లను అరికట్టేందుకు రాష్ట్ర విద్యాశాఖ కఠిన చర్యలు చేపట్టింది. గత నెల 28, 29 తేదీల్లో 770 మంది సెలెక్ట్ అయిన అభ్యర్థుల సర్టిఫికెట్లను కమిటీలు పరిశీలించాయి. కానీ, అనుమానాస్పద వివరాలు వెలుగులోకి రావడంతో రాష్ట్ర అధికారులు మళ్లీ రీ-వెరిఫికేషన్ చేయాలని ఆదేశించారు. డీఈఓ ప్రసాదబాబు పర్యవేక్షణలో ఈనెల 4, 5 తేదీల్లో రీ-వెరిఫికేషన్ నిర్వహించారు. ఈ ప్రక్రియలో అనేక రిమార్కులు రావడంతో, కొందరు అభ్యర్థులపై వివాదాలు తలెత్తాయి. అనంతపురం జిల్లాకు చెందిన ఐదుగురి వివరాల్లో కూడా లోపాలు బయటపడ్డాయి. ఒక ఎంఈఓ డబ్బులు తీసుకుని బోగస్ అభ్యర్థులకు మద్దతు ఇచ్చినట్లు ఆధారాలతో బయటపడడంతో, ఆయన్ని సర్వీస్ నుంచి తొలగించాలంటూ కమిషనర్ ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఈసారి ఇతర జిల్లా బృందాలను అనంతపురానికి రప్పించి సర్టిఫికెట్లను మళ్లీ పరిశీలించనున్నారు. ఇప్పటికే 20 మందికి ప...