#Brokers, #Banks నమ్మకంగా మన పక్కనే ఉండే వాళ్ళు చేసే మోసాలు. చాలా మంది తెలియక మోసపోతూ ఉంటారు వారికోసం ఇది. ( కొంత మంది మాత్రమే)
%%%%ముందుగా Brokers చేసే మోసాలు%%%%%
1) #Brokers స్థలం కొనేటప్పుడు తప్పుడు వివరాలు ఇస్తారు. 100% వాళ్ళ మాటలు నమ్మవద్దు. సంపాదించడం చేతకాని వాళ్ళు ఇలాంటి తప్పుడు మాటలు చెప్పి సంపాదిస్తారు. ఎంగిలి మెతుకులు కోసం ఆశ పడే వారు ( కొంత మంది కి మాత్రమే)
2) 2% broker commision తీసుకుంటారు. బేరం మాట్లాడేటప్పుడు ఎక్కువ brokers వస్తారు. మనలని రెచ్చ కొట్టి ఎక్కువ రేట్ కి కొనే విధముగా చేస్తారు.
3)నిజ యజమానిని తీసుకురాకుండా నకిలీ వాళ్ళని తీసుకొచ్చి బేరం చేస్తారు.
4) ఆస్తి ఎవరి పేరు మీద ఉందొ తెలుసుకోవాలి అంటే #registration office లో #EC తెస్తే తెలుస్తుంది. 300 అవుతుంది EC కి.
5) కొనే ముందు original #sale #deed (Original document) లో ఉండే యజమాని photo చూడండి. అన్ని links documents history చూడాలి.
6) ఎట్టి పరిస్థితుల్లో #Sale agreement ( #contract) min 3months ఉండేలా చూడండి. మీ దగ్గర డబ్బు ఉన్న 3Months తక్కువ వెయ్యవద్దు. ఈరోజు ఏమి జరుగుతుందో తెలియదు. Agreement amount 5-10% కన్నా ఎక్కువ ఇవ్వవద్దు. #Agrement cancel చేస్తే తిరిగి ఇవ్వకుండా బాగా తిప్పుకుంటారు.
7) మీ సొంత మనుషులు, మీ స్నేహితులు చెప్పే మాటలు నమ్మవద్దు. వల్లే #commission కోసం కకృతి పడతారు.
8.) A, B brokers ఉన్నారు అనుకుందాం. A broker నీకు తెలుసు, వీడు B broker దగ్గరకి బేరం కోసం తీసుకొని వెళ్తాడు. యజమాని B broker కి agrement వేసాడు అని అబద్ధం చెపుతారు. స్థలం రేట్ 1Lakh అనుకుందాం, స్థలం యజమానికి తో ఈ brokers 1Lakh కన్నా ఎక్కువ వస్తే మేము తీసుకుంటాము అని deal చేసుకుంటారు. అప్పుడు B broker 1,10,000 కి కొనే వారి దగ్గర బేరం కుదుర్చుకుంటాడు.
9) ఎట్టి పరిస్థితుల్లో బేరం మాట్లాడే తప్పుడు నిజమైన యజమానితోనే మాట్లాడండి. ఈ brokers యజమాని busy గా ఉన్నాడు, వేరే దేశాలలో ఉన్నాడు అని అబద్దాలు చెపుతారు. కనీసం video call లో ఇన మాట్లాడండి. యజమాని ఏదయినా ID proof చూపించమనాలి.
10) మీరు కొనే స్థలం , వాటి డాకుమెంట్స్ #address నిజమో కాదో తెలుసుకోండి. ఎక్కడో ఉన్న స్థలం డాకుమెంట్స్ తో మంచి area లో ఉన్న స్థలం చూపించి మోసం చేస్తారు.
మీరు అనుకున్న స్థలం orginal స్థలాలు వేరుగా ఉంటాయి.
11) original స్థలం size, document స్థలం size లో తేడాలు ఉంటాయి.
#Documents required for Property
1) Main Owner Sale Deed document original, ఒరిజినల్ పేపర్స్ మీద stamp చూడాలి.
2) All Linked Documents
3) అన్ని డాకుమెంట్స్ లో కొనేవారు, అమ్మేవారు ఒక్కరు కాకపోతే అమ్మేవాడి Family tree certificate ( తండ్రి చనిపోతే పిల్లలు స్థలం ఆమ్మితె లేదా వరాసత్వముగా వచ్చే ఆస్తి ఐతే)
4) Documents front page లో ఏదయినా court seal, sign ఉంటే property మీద case ఉన్నది అని అర్థం.
5) EC - Encumbrance certificate (EC)
6) #Mother deed certificate
7) #RTC - Record of Rights, Tenancy and Crops (For Agriculture Land)
8.) Survey Sketch
9) #Layout Approval
10) #Katha Certificate
11) #DC #Conversion certificate ( agriculture to Non-Agriculture land conversion)
12) #Property Tax Certificate
13) SC, ST సోదరులకు ప్రభుత్వామ్ ఉచితముగా స్థలాలు ఇచ్చినది. అటువంటి స్థలాలు కొన్న మళ్ళీ వారికే వెళ్తాయి, రిజిస్ట్రేషన్ చెల్లదు.
14) పేద వారికి ప్రభుత్వామ్ ఉచితముగా స్థలాలు ఇచ్చినది, అటువంటి స్థలాలు కొనకూడదు.
14) #apartments ఐతే plan approval, OC, CC ఉండాలి. 3Floors కి plan approval తీసుకొని 4 or 5 floors కడతారు. వాళ్ళు బ్యాంక్ వాడితో link పెట్టుకొని మీ లోన్ easy గా చేపిస్తారు resale అప్పుడు problem అవుతుంది.
15) మనతో మంచిగా నటిస్తూ మనం అనుకునే మాటలని brokers చెప్తూ #commission తీసుకుంటారు. వాళ్ళతో జాగ్రత్త.
16) స్థలం కాగితాల copys ఎట్టి పరిస్థితులలో ఎవరికి ఇవ్వకండి. ఆ copy #paper ఇతరుల దగ్గర ఉండటం వల్ల మనకి చెడు చేసే అవకాశం ఎక్కువ.
17) ఇల్లు కట్టి ఉంటే #building #Plan #approval ఉండాలి.
18)Agrement రోజు, #Registration ముందు రోజు EC తీయండి. కొంత మంది వేరే వాళ్ళకి అమ్మి మన దగ్గర Agrement వేస్తారు. EC లో స్థల యజమాని ఎవరో , ఎప్పుడు కొన్నారు, ఎవరి దగ్గర కొన్నారు ఉంటాయి.
19) ఆ ల్యాండ్ పైన ఎమైనా విద్యుత్ lines ఉన్నాయా, ల్యాండ్ క్రింద ఎమైనా #underground #drainage ఉన్నదా. #Land govt ప్రజా అవసరాలకు తీసుకుంటున్న కోనకూడదు.
20) ఇప్పుడు Online Registration process ఉన్నది. 15Years back online లేదు ఆ time లో ఒకే property ని ఎక్కువ మంది పేరుతో రిజిస్టర్ చేశారు మోసం చేసి.
21) మీరే నెను కింద ఇచ్చిన గవర్నమెంట్ వెబ్ సైట్ లో స్వయంగా మీరే చూసి తెలుసుకోండి. మీరు కోనాలనుకున్న, లేదా కోనుకున్న స్థలం, ప్లాట్ భూమి ఎదైనా కావచ్చు. దానికి సంబంధిత ఈసి, అది ప్రబుత్వ స్థలమా పోరంబోకు స్థలమా పట్టా ఉన్న స్థలమా అనేవి ఇందులో పోందుపరచిఉంటాయి. మీ ప్లాట్, భూమి కి సంబంధిత రిజిస్ట్రేషన్ వివరాలు తెలుసుకోవచ్చు లింక్ డాక్యుమెంట్స్ తో సహా. మీ ప్లాట్ కోలతలు హద్దులు ఎవరి నుంచి ఎవరికి హక్కుగా సంక్రమించింది తదితర వివరాలు ప్రింటుతో సహా ఉచితంగా తిసుకోవచ్చు. మీరుకోనే భూమి, ప్లాట్ రిజిస్ట్రేషన్ విలువ ఎంత తదితర వివరాలకు సైతం ఈ వెబ్ సైట్ చాలా చాలా ఉపయోగం. మన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధిత రిజిస్ట్రేషన్ సైట్స్.
http://registration.ap.gov.in/
http://registration.telangana.gov.in/
.
.
.
.
** #Loan తీసుకొనేఅప్పుడు బ్యాంక్ వాళ్ళు చేసే మోసాలు***
1) ఎట్టి పరిస్థితుల్లోనూ Broker లేదా యజమాని Refer చేసిన బ్యాంక్ లో Loan తీసుకోవద్దు. వాళ్ళు బ్యాంక్ వాడికి కమిషన్ ఇచ్చి వాళ్ళకి అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉన్నది. Agrement time period లో మీకు loan sanction కాకుండా చేసి agreement డబ్బులు brokers, bank, owner పంచుకుంటారు.
2) బ్యాంక్ Loan రావాలి అంటే పైన చెప్పిన documents compulsary ఉండాలి. అవి లేకుండా బ్యాంక్ loan ఇవ్వదు.
3) బ్యాంక్ loan 70% నుంచి 80% వరకు ఇస్తారు. అది కూడా మీరు Registration Document లో చూపించిన Property value లో. Property government value 5Lak అనుకోండి. Actual market price 30Lak అనుకోండి. మీకు loan 15Lak కావాలి అనుకోండి. అప్పుడు మీరు registration document లో 20L చూపించి Register చేసుకోవాలి. మీకు 20L లో 75% అంటే 15L బ్యాంక్ లోన్ ఇష్టది.
4) మీరు 20Lks registration document లో చూపిస్తే మీకు registration charges పెరుగుతాయి. స్థల యజమానికి TAX పడుతుంది. INDEX based Tax యజమాని Govt కి కట్టాలి. అందువల్ల యజమాని ఒప్పుకొడు.
5) బ్యాంక్ లోన్ ఇచ్చేటప్పుడు processing fee ఉంటది min 10,000. 1.5% loan amount లో #Insurance తీసుకోవాలి . కొన్ని Banks (#DHFL) 5% కన్నా ఎక్కువ insurance charge చేస్తాయి మనకి తెలియకుండా Enable చేస్తారు. Mortage(తాకట్టు) registration బదులు 0.3% value లో #Revenue #stamp మీద లోన్ agrement వేస్తే సరిపోతుంది.
6) Registration అప్పుడు #Bank #agent వచ్చి #check యజమానికి ఇచ్చి, అన్ని Original documents తీసుకొనిపోతారు. అందువల్ల వాటి zerox తీసుకోండి.
7) పైన చెప్పిన process బ్యాంక్ లో చేసేది. అవి అవసరం లేదు మేము Loan ఇప్పిస్తాము , Sale agreement వేసుకొండి అని బ్యాంక్స్ చెపుతాను. 1Week లో Loan process complete అవుతుంది అని చెపుతారు. Agreement వేసుకొని వెళ్లిన తరువాత చుక్కలు చూపిస్తారు.
8) బ్యాంక్ లోన్ process min 20days పడుతుంది. బ్యాంక్ వెదవలు ( కొంత మందికి మాత్రమే) చెప్పే మాటలు నమ్మి sale agrement తక్కువ రోజుల్లో వేసుకోవద్దు. Min 3months agreement వేసుకోవాలి.
9) #personalLoan తీసుకుంటే Processing fee ఉంటది, #Insurance optional. ముందే Insurance వద్దు అని చెప్పాలి.
10) బ్యాంక్ Loan కి రెండు రకాల వడ్డీలు ఉంటాయి #fixed, #variable. #Fixed #interest ఐతే future లో వడ్డీ rates మారవు. Variable interest ఐతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వడ్డీ rates మారుస్తూ ఉంటారు.
11) pre Closing charges, #pre #Closing ఎన్ని నెలలు తరువాత చెయ్య వచ్చు. #Parshial #closing #charges వంటి వివరాలు తెలుసుకోవాలి.
12) బ్యాంక్ వాళ్లు చెప్పిన ప్రతి మాటని #record చేసుకోండి. వాడు చెప్పిన దానిని #official mail నుంచి మీ mail కి పంపమని చెప్పండి.
13) ఇప్పుడు కొంత మంది #Bank వాళ్లే పెద్ద దొంగలు, వారితో జాగ్రత్త
14) బ్యాంక్ #EMI లో .. వడ్డీ + అసలు . ఉండాలి. కొన్ని దొంగ బ్యాంక్స్ వడ్డీ మాత్రమే తీసుకుంటాయి. #Principle మనం బ్యాంక్ కి వెళ్లి కట్టాలి. దొంగ rules ఇవి.
15) #Land కొంటె #Income #Tax #Exception క్రింద రాదు.
#House #Flat #Plot #Fraud #Mindgame #Careing #Land #Property #Bank #Brokers #Loan #HomeLoan #PersonalLoan #DHFL #IncomeTax #Registration #Documents #Brokers
సోర్స్: KoteswaraRao Sandra
అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR APPOINTMENT ON CONTRACT BASIS - Spl. Magistrate Courts Applications in prescribed proforma are invited from eligible candidates for appointment on Contract basis (on consolidated monthly remuneration) to the following posts in the Unit of the Prl. District Judge, Ananthapuramu, as per Rule 9 of A.P. State and Subordinate Service Rules, 1996 and in accordance with the instructions issued by Hon'ble High Court from time to time. Name of the Post No. of Vacancies Name of the Court Junior Assistant 2 1 Vacancy in I Special Magistrate Court, Ananthapuramu and 1 Vacancy in Special Magistrate Court, Hindupur ...
కామెంట్‌లు