అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
27, జనవరి 2021, బుధవారం
Private Jobs
ఐటీఐ అభ్యర్థులకు సింగరేణి స్వాగతం
‣ 372 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల
‣ మహిళా అభ్యర్థినులకు 84 స్టాఫ్ నర్స్ ఖాళీలు
ప్రజలకు వెలుగులు పంచేందుకు చీకట్లో నిరంతరం శ్రమిస్తారు సింగరేణి కార్మికులు. అత్యుత్తమ మైనింగ్ టెక్నాలజీతో 20 ఓపెన్ కాస్ట్, 26 భూగర్భ గనుల్లో బొగ్గు వెలికితీత ప్రధానంగా ఎంతోమంది రకరకాల విధులను నిర్వహిస్తుంటారు. వీరికి మంచి జీతాలు, సౌకర్యాలతో పాటు ఉద్యోగ భద్రత ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి కాలరీస్ కల్పిస్తోంది. అందుకే చాలామంది అభ్యర్థులు ఈ సంస్థలో పనిచేయాలని కలలు కంటుంటారు. అలాంటి వారందరికీ మంచి అవకాశం వచ్చింది. వివిధ విభాగాల్లో 372 ఉద్యోగాల భర్తీకి కొత్తగూడెంలోని ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టులు.. రిజర్వేషన్లు
మొత్తం పోస్టుల్లో 305 స్థానిక రిజర్వేషన్ (లోకల్) కింద ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల అభ్యర్థులతో భర్తీ చేస్తారు. మిగతా ఖాళీలకు తెలంగాణ సహా మిగతా అందరూ (అన్‌రిజర్వుడ్) పోటీ పడవచ్చు. జూనియర్ స్టాఫ్ నర్సు పోస్టులకు మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. మిగతా పోస్టులకు పురుషులు మాత్రమే అర్హులు. జూనియర్ స్టాఫ్ నర్సుకు జీతం నెలకు రూ.29,460 అందుతుంది. మిగతా అన్ని పోస్టులకు కేటగిరీ-1లో భాగంగా రోజుకి రూ.1011 చెల్లిస్తారు.
‣ ఫిట్టర్ ట్రెయినీ పోస్టులు 128 ఉన్నాయి. వీటిలో లోకల్ వాళ్లకు 105, అన్‌రిజర్వుడ్ కు 23 పోస్టులు కేటాయించారు.
‣ ఎలక్ట్రీషియన్ ట్రెయినీ పోస్టులు 51 ఉంటే స్థానికులకు 43, అన్‌రిజర్వుడ్ 8గా నిర్ణయించారు.
‣ వెల్డర్ ట్రెయినీ 54 పోస్టులు ఉన్నాయి. లోకల్ 44, అన్‌రిజర్వుడ్ 10.
‣ టర్నర్/ మెషినిస్ట్ ట్రెయినీ పోస్టులు 22 ఉండగా.. లోకల్ 18, అన్‌రిజర్వుడ్ 4 .
‣ మోటార్ మెకానిక్ ట్రెయినీ 14 పోస్టులు. వీటిలో లోకల్ 12, అన్‌రిజర్వుడ్ 2 .
‣ ఫౌండ్రీ మెన్/ మౌల్డర్ ట్రెయినీ 19 పోస్టులు. అందులో లోకల్ 16, అన్‌రిజర్వుడ్ పోస్టులు 3 .
‣ జూనియర్ స్టాఫ్ నర్సు పోస్టులు 84 ఉన్నాయి. వీటిలో లోకల్ 67 పోస్టులు, అన్‌రిజర్వుడ్ 17.
ఎవరు అర్హులు?
ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, మోటార్ మెకానిక్, టర్నర్/ మెషినిస్ట్, ఫౌండ్రీ మెన్/మౌల్డర్ పోస్టులకు పదో తరగతితోపాటు ఆయా విభాగాల్లో ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే నేషనల్ అప్రెంటీస్ సర్టిఫికెట్ తప్పనిసరి. జూనియర్ స్టాఫ్ నర్స్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఇంటర్మీడియట్ డిప్లొమా/జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ(జీఎన్ఎం)/బీఎస్సీ(నర్సింగ్) చేసి ఉండాలి. ఆయా పోస్టులకు కనిష్ఠ వయసు 18 ఏళ్లు. గరిష్ఠ వయసు 30 సంవత్సరాలకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు వయసులో అయిదేళ్ల సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం
అభ్యర్థులు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష రుసుం రూ.200 ఆన్లైన్లోనే చెల్లించాలి. అప్లికేషన్ లో లోకల్, నాల్‌లోకల్ వివరాలను జాగ్రత్తగా చూసుకుని నమోదు చేయాలి. సంబంధిత ధ్రువపత్రాలను అప్లోడ్ చేయాలి. వాటి ఆధారంగానే పరీక్ష హాల్‌టికెట్ జారీ చేస్తారు.
ఎంపిక ఎలా?
పోస్టుల ప్రకారం అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. రిజర్వేషన్ల వారీగా సంస్థ నిర్ణయించిన కనీస మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఓసీలకు 30% మార్కులు, బీసీలకు 25%, ఎస్సీ, ఎస్టీలకు 15% మార్కులను కటాఫ్‌గా నిర్ణయించారు. మెరిట్ ఆధారంగా తుది ఎంపికలు నిర్వహిస్తారు.
దరఖాస్తుకు చివరి తేదీ; ఫిబ్రవరి 4, 2021(సాయంత్రం 5 గంటలు).
వెబ్సైట్: www.scclmines.com
Tableau Administrator
టాబ్లూ అడ్మినిస్ట్రేటర్
మైక్రో ఫోకస్ సంస్థ టాబ్లూ అడ్మినిస్ట్రేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* టాబ్లూ అడ్మినిస్ట్రేటర్
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
అవసరమైన నైపుణ్యాలు:
1. టాబ్లూ డెస్క్‌టాప్ అండ్ టాబ్లూ సర్వర్‌పై అవగాహన.
2. టాబ్లూ సర్వర్‌ను కాన్ఫిగర్ చేయాలి.
3. రోలెవల్ సెక్యూరిటీపై అవగాహన.
4. టాబ్లూ సర్వర్‌ను ఆప్టిమైజ్ చేయాలి.
5. ఇంటరాక్టివ్ విజువలైజేషన్లపై పరిజ్ఞానం.
6. డాష్బోర్డులను నిర్మించడం.
7. డేటా మోడళ్లను సృష్టించడం.
8. ఎక్స్ట్రాక్ట్ రిఫ్రెష్లతో సహా టేబుల్ సర్వర్ షెడ్యూల్‌పై అవగాహన.
ఉద్యోగ వివరణ:
1. డాష్‌బోర్డ్‌లు, నివేదికలను సృష్టించడం.
2. సర్వర్ పనితీరుపై అవగాహన.
3. సర్వర్‌ను ఇన్స్టాల్, చేయడం.
4. కాన్సెప్ట్ సొల్యూషన్స్ రూపొందించడం.
పని ప్రదేశం: బెంగళూరు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్.
Test Automation Engineer
టెస్ట్ ఆటోమేషన్ ఇంజినీర్
బార్ల్కేస్ సంస్థ టెస్ట్ ఆటోమేషన్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* టెస్ట్ ఆటోమేషన్ ఇంజినీర్
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
ఉద్యోగ వివరణ:
1. ఆటోమేటెడ్ టెస్ట్వేర్ తయారి, అంచనాలు, డేటా పరీక్షలు చేయాలి.
2. టెస్ట్ ఆటోమేషన్ కోడ్, ఫ్రేమ్‌వర్క్‌ల నిర్వహణ.
3. ప్రాజెక్ట్ / అప్లికేషన్ బృందంతో కలిసి పనిచేయడం.
4. టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ను గుర్తించాలి.
5. సొంత నివేదికలు, సమస్యలకు సంబంధించిన పరిష్కారాల ధ్రువీకరణ.
6. కొత్త వ్యవస్థలు, సిస్టమ్ మార్పులకు ఉద్దేశించిన కార్యాచరణ పాటించడం.
7. డెలివరీ, కార్యకలాపాలు, పనిలో నాణ్యత కోసం సంస్థ మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలి.
అవసరమైన నైపుణ్యాలు:
1. ఐటీ వ్యవస్థలను అర్థం చేసుకోవడంతో పాటు డొమైన్లు / వెబ్సర్వీస్లను నేర్చుకోవాలి. టానికి ఆప్టిట్యూడ్‌తో పనిచేయడం
2. మంచి సాంకేతిక నేపథ్యం. టెస్టింగ్ ఆటోమేషన్ అనుభవంతో సహా సమస్య పరిష్కార సామర్ధ్యాలను కలిగి ఉండాలి.
3. ఆటోమేషన్ ఫ్రేమ్‌వర్క్‌లకు ఎక్స్పోజర్, స్క్రిప్టింగ్ నైపుణ్యాలు.
4. పైథాన్ వంటి ఆధునిక ప్రోగ్రామింగ్ భాషపై అవగాహన.
5. ఎజైల్ పిరమిడ్‌లో పనిచేసిన అనుభవం ఉండాలి.
6. ప్రోగ్రామింగ్ / ఆటోమేషన్ స్క్రిప్టింగ్‌లో ప్రొఫెషనల్ సర్టిఫికేషన్లు అవసరం.
పని ప్రదేశం: పుణె.
దరఖాస్తు విధానం: ఆన్లైన్.
Notification Information
Posted Date: 26-01-2021
-
AP KGBV Non-Teaching Recruitment 2024 Notification కేజీబీవీల్లో 729 బోధనేతర పోస్టులు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్ట...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...