ఐటీఐ అభ్యర్థులకు సింగరేణి స్వాగతం

 


372 పోస్టుల భర్తీకి ప్రకటన‌ విడుదల

మహిళా అభ్యర్థినులకు 84 స్టాఫ్ నర్స్ ఖాళీలు

 

 

ప్రజలకు వెలుగులు పంచేందుకు చీకట్లో నిరంతరం శ్రమిస్తారు సింగరేణి కార్మికులు. అత్యుత్తమ మైనింగ్ టెక్నాలజీతో 20 ఓపెన్ కాస్ట్, 26 భూగర్భ గనుల్లో బొగ్గు వెలికితీత ప్రధానంగా ఎంతోమంది రకరకాల విధులను నిర్వహిస్తుంటారు. వీరికి మంచి జీతాలు, సౌకర్యాలతో పాటు ఉద్యోగ భ‌ద్ర‌త‌ ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి కాలరీస్ కల్పిస్తోంది. అందుకే చాలామంది అభ్యర్థులు ఈ సంస్థలో పనిచేయాలని కలలు కంటుంటారు. అలాంటి వారందరికీ మంచి అవకాశం వచ్చింది. వివిధ విభాగాల్లో 372 ఉద్యోగాల భర్తీకి కొత్తగూడెంలోని ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్‌) నోటిఫికేషన్ విడుదల చేసింది. 

 

పోస్టులు.. రిజర్వేషన్లు

మొత్తం పోస్టుల్లో 305 స్థానిక రిజర్వేషన్ (లోకల్) కింద ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల అభ్యర్థులతో భర్తీ చేస్తారు. మిగతా ఖాళీలకు  తెలంగాణ సహా మిగతా అందరూ (అన్‌రిజ‌ర్వుడ్‌)  పోటీ పడవచ్చు.  జూనియర్ స్టాఫ్ నర్సు పోస్టులకు మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.  మిగతా పోస్టులకు పురుషులు మాత్రమే అర్హులు. జూనియ‌ర్ స్టాఫ్ న‌ర్సుకు జీతం నెల‌కు రూ.29,460 అందుతుంది. మిగ‌తా అన్ని పోస్టుల‌కు కేట‌గిరీ-1లో భాగంగా రోజుకి రూ.1011 చెల్లిస్తారు.

ఫిట్టర్ ట్రెయినీ పోస్టులు 128 ఉన్నాయి. వీటిలో లోకల్ వాళ్లకు 105, అన్‌రిజ‌ర్వుడ్ కు 23 పోస్టులు కేటాయించారు. 

ఎలక్ట్రీషియన్ ట్రెయినీ పోస్టులు 51 ఉంటే  స్థానికులకు 43, అన్‌రిజ‌ర్వుడ్ 8గా నిర్ణయించారు. 

వెల్డర్ ట్రెయినీ 54 పోస్టులు ఉన్నాయి. లోకల్ 44, అన్‌రిజ‌ర్వుడ్ 10. 

టర్నర్/ మెషినిస్ట్ ట్రెయినీ పోస్టులు 22 ఉండగా.. లోకల్ 18, అన్‌రిజ‌ర్వుడ్ 4 . 

మోటార్ మెకానిక్ ట్రెయినీ 14 పోస్టులు. వీటిలో లోకల్ 12, అన్‌రిజ‌ర్వుడ్  2 .

ఫౌండ్రీ మెన్/ మౌల్డర్ ట్రెయినీ 19 పోస్టులు. అందులో లోకల్ 16, అన్‌రిజ‌ర్వుడ్ పోస్టులు 3 . 

‣ జూనియర్ స్టాఫ్ నర్సు పోస్టులు 84 ఉన్నాయి. వీటిలో లోకల్ 67 పోస్టులు, అన్‌రిజ‌ర్వుడ్ 17.

 

ఎవరు అర్హులు?

ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, మోటార్ మెకానిక్, టర్నర్/ మెషినిస్ట్, ఫౌండ్రీ మెన్/మౌల్డర్ పోస్టులకు పదో తరగతితోపాటు ఆయా విభాగాల్లో ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే నేషనల్ అప్రెంటీస్ సర్టిఫికెట్ తప్పనిసరి. జూనియర్ స్టాఫ్ నర్స్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఇంటర్మీడియట్ డిప్లొమా/జనరల్ నర్సింగ్ మిడ్‌వైఫ‌రీ(జీఎన్ఎం)/బీఎస్సీ(నర్సింగ్) చేసి ఉండాలి. ఆయా పోస్టులకు కనిష్ఠ వయసు 18 ఏళ్లు. గరిష్ఠ వయసు 30 సంవత్సరాలకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు వయసులో అయిదేళ్ల సడలింపు వర్తిస్తుంది.

 


 

దరఖాస్తు విధానం

అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లోనే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.  ప‌రీక్ష రుసుం రూ.200 ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి. అప్లికేష‌న్ లో లోక‌ల్‌, నాల్‌లోక‌ల్ వివ‌రాల‌ను జాగ్ర‌త్త‌గా చూసుకుని న‌మోదు చేయాలి. సంబంధిత ధ్రువ‌ప‌త్రాల‌ను  అప్‌లోడ్ చేయాలి. వాటి ఆధారంగానే ప‌రీక్ష హాల్‌టికెట్ జారీ చేస్తారు. 

 

ఎంపిక ఎలా?

పోస్టుల‌ ప్రకారం అభ్యర్థులకు రాత ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. రిజ‌ర్వేష‌న్ల వారీగా సంస్థ నిర్ణ‌యించిన క‌నీస మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఓసీల‌కు 30% మార్కులు, బీసీల‌కు 25%, ఎస్సీ, ఎస్టీల‌కు 15% మార్కుల‌ను క‌టాఫ్‌గా నిర్ణ‌యించారు. మెరిట్ ఆధారంగా తుది ఎంపికలు నిర్వహిస్తారు. 

 

దరఖాస్తుకు చివరి తేదీ;  ఫిబ్ర‌వ‌రి 4, 2021(సాయంత్రం 5 గంట‌లు).

 

వెబ్‌సైట్‌: www.scclmines.com

 

 

 

 

 

 

 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

AP KGBV Non-Teaching Recruitment 2024 Notification Overview కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్ కుక్ పోస్టులు 48, అసిస్టెంట్ కుక్ 263, నైట్ వాచ్మెన్ 95, పారిశుధ్య కార్మికులు 78, స్వీపర్లు 63 టైప్ 1, 2, 3 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నా మని తెలిపారు. టైప్-4 కేజీబీవీల్లో హెడ్కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, అటెండర్ 58 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.