PM-SYM: రోజుకు 2 రూపాయలు చెల్లించండి.. ఈ పథకం ద్వారా నెలకు 3 వేల రూపాయల పెన్షన్ పొందండి.. ఎలా అంటే..
PM-SYM: ప్రతి మనిషికీ జీవిత కాలంలో బాధ్యతల బరువులు మోసిన తరువాత వృత్తి, ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ తీసుకోవడం సహజం. పదవీవిరమణ అంటే రిటైర్మెంట్ తీసుకున్న తరువాత జీవితం నడవాలంటే ప్రతి నెల కొంత ఆదాయం తప్పనిసరిగా అవసరం అవుతుంది. అయితే, ప్రభుత్వ ఉద్యోగులకు.. కొన్ని ప్రైవేట్ కొలువులకు రిటైర్మెంట్ తరువాత పెన్షన్ అందే సౌకర్యం ఉంది. కానీ, అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికుల్ ఆపరిస్థితి దీనికి భిన్నం. కాలూ..చెయ్యి పనిచేయడం మొరాయిస్తే వీరి జీవితం కష్టాల కొలిమిలో పడిపోయినట్టే. వీరికి రిటైర్మెంట్ అనే పదం అంటేనే భయం పుడుతుంది. ఎందుకంటే.. పని మానేసి ఇంటిలో కూచుంటే వారికి కాలం గడిచే పరిస్థితి ఉండదు. అందుకోసమే.. ఇటువంటి వారికి సహకరించేలా రెండేళ్ళ క్రితం కేంద్ర ప్రభుత్వం ఒక పధకాన్ని తీసుకువచ్చింది. ఇప్పుడు ఈ పధకంలో చేరే వారి సంఖ్యా ఎక్కువ అవుతుంది. కేంద్రం తెచ్చిన ఈ పథకం ఏమిటి? ఈ పథకం పేరు ప్రధాన్ మంత్రి శ్రమయోగి మంధన్ యోజన అంటే PM-SYM. అసంఘటిత రంగ కార్మికులకు నెలవారీ పింఛను అందించేందుకు 2019లో ఈ పథకాన్ని ప్రారంభించారు. 60 ఏళ్లు నిండిన అసంఘటిత రంగ కార్మికులకు నెలకు 3,000 రూపాయల పింఛను అంది...