Alerts

--------

7, డిసెంబర్ 2021, మంగళవారం

PM Mudra Yojana: ప్రజలకు అండగా నిలుస్తున్న కేంద్ర సర్కార్‌ పథకం.. ఇందులో దరఖాస్తు చేసుకుంటే రూ.10 లక్షల రుణం!

PM Mudra Yojana: కేంద్ర సర్కార్‌ ప్రజల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోంది. ప్రజలు ఉపాధిని పెంపొందించేందుకు ఆర్థికంగా ఎదిగేందుకు రకరకాల స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకువస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీమ్‌లలో ప్రధాన మంత్రి ముద్ర యోజన ఒకటి. ఇందులో మొదటి దశలో చాలా మందికి అండగా నిలిచింది ఈ పథకం. ఇప్పుడు మరో దశ ముద్ర పథకం కూడా ప్రారంభమైంది. ఈ స్కీమ్‌ కింద బ్యాంకులు రుణాలు పంపిణీ చేస్తున్నాయి. రుణాలు పొందడానికి అవకాశం కోసం చూస్తున్న వారికి ఇది మంచి అవకాశమనే చెప్పాలి.

సులభంగా రుణాలు..

ఈ స్కీమ్‌ ద్వారా అర్హులైన వారు సులభంగా రుణాలు పొందే అవకాశం ఉంటుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించే వారు దరఖాస్తు చేసుకోవచ్చు. పీఎం ముద్రా యోజన కింద గరిష్టంగా రూ.10 లక్షల వరకు రుణం అందజేస్తారు. అయితే ఇందులో కొన్ని కేటగిరిలు ఉన్నాయి. శిశు, కిశోర్, తరుణ్ అనే మూడు కేటగిరిలు ఉన్నాయి. వీటిల్లో శిశు కేటగిరి కింద రూ.50 వేల వరకు రుణం పొందే అవకాశం ఉంటుంది.

అయితే నిధుల కోసం కటకటలాడే చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి పొందేవారికి చేయూతనిచ్చేలా 08 ఏప్రిల్ 2015 ప్రధాని నరేంద్ర మోదీ ‘ముద్ర’ యోజనను ప్రారంభించారు. మైక్రో యూనిట్స్ డెవలప్‌మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ (ముద్ర) తక్కువ వడ్డీ రేటుకే చిన్న వ్యాపారులకు రూ. 10 లక్షల వరకు రుణాలను అందిస్తుంది. దాదాపు 12 కోట్ల మంది వరకు ఉద్యోగాలు కల్పిస్తున్న 5.75 కోట్ల పైగా లఘు, చిన్న తరహా సంస్థల ఆర్థిక అవసరాలు తీర్చడంపై ఇది దృష్టి పెడుతుంది. పెద్ద సంస్థల్లో కేవలం 1.25 కోట్లకుపైగా ఉపాధి పొందుతుండగా, చిన్న సంస్థలు 12 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఇలాంటి వాటికి తోడ్పాటునిచ్చేందుకే ముద్ర పథకాన్ని ప్రవేశపెట్టారు.

దరఖాస్తు చేసుకోండిలా..

ఈ పథకంలో అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. చిరునామా, ఐడెంటిటీ ప్రూఫ్, రెండు ఫోటోలు, బిజినెస్ ప్రూఫ్ వంటివి ఉంటే ఈ రుణం పొందవచ్చు. దీని కోసం బ్యాంకు బ్రాంచుకు వెళ్లాలి. లేదంటే ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ముద్రా వెబ్‌సైట్‌కు వెళ్లి రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రుణ రేట్లు బ్యాంక్ ప్రాతిపదికన మారుతూ ఉంటాయి. https://udyamimitra.in/ లింక్ ద్వారా లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. చేపల పెంపకం, తేనెటీగల పెంపకం, పౌల్ట్రీ, పశువుల పెంపకం, గ్రేడింగ్, సార్టింగ్, అగ్రిగేషన్ అగ్రో ఇండస్ట్రీస్, డైరీ, ఫిషరీ, అగ్రికల్నిక్స్, అగ్రిబిజినెస్ సెంటర్లు, ఫుడ్ అండ్‌ అగ్రో-ప్రాసెసింగ్ వంటి వ్యవసాయానికి సంబంధించిన వాటికి అర్హులు.

రుణ రకాలు:

► శిశు: రూ. 50,000 వరకు రుణాలు
► కిశోర్: రూ. 5 లక్షల వరకు
► తరుణ్: రూ. 5 లక్షల నుండి రూ. 10 లక్షల వరకు రుణాలు అందిస్తున్నారు.

రుణం పొందేందుకు అర్హత:

► భారత పౌరుడై ఉండాలి
► ఒక వ్యవసాయేతర వ్యాపార ఆదాయ ప్రణాళిక సూచించే విధంగ ఉండాలి,
► ఉదాహరణకు తయారీ, ప్రాసెసింగ్, వ్యాపార లేదా సేవా రంగంలో.
► రుణ అవసరం రూ.10 లక్షల లోపు ఉండాలి.
► పైన పేర్కొన్న అర్హత గల వారు దగరలో ఉన్న బ్యాంక్, సూక్ష్మ ఋణ సంస్థ (ఎంఎఫ్‌ఐ), లేదా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ) అధికారులను సంప్రదించాలి.

Gemini Internet

కామెంట్‌లు లేవు:

Recent

Reasoning Book for SI Constable SSC CGL CPO CHSL MTS Banking Railway Telugu

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...