అమరావతి: ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు జూన్ 13 సాయంత్రం విడుదలయ్యాయి. తాడేపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో బోర్డు కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు ఫలితాలు విడుదల చేశారు. ఈ ఏడాది సప్లిమెంటరీకి 2,51,653 మంది జనరల్ అభ్యర్థులు, ఒకేషనల్ కోర్సులకు 26,735 మంది, మరో 38,666 మంది ప్రైవేటు విద్యార్థులు హాజరైనట్టు వివరించారు. మొదటి సంవత్సరం 1,69,347 మంది బెటర్‌మెంట్ రాశారన్నారు. కాగా, ఈ ఏడాది మార్చి, మే నెలల్లో నిర్వహించిన పరీక్షల్లో మొత్తం 84.35 శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. మొదటి సంవత్సరం రెండు దశల్లోను 4,16,639 మంది పరీక్షకు హాజరు కాగా మార్చిలో 2,66,326 మంది, అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీలో 56,767 (77.54 శాతం) మంది ఉత్తీర్ణులైనట్టు తెలిపారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం మార్చి, అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీకి 3,73,341 మంది హాజరవగా, మార్చిలో 2,72,001, సప్లిమెంటరీలో 42,931 (84.35 శాతం) మంది ఉత్తీర్ణులైనట్లు చెప్పారు. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌కు జూన్ 23 లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. మొదటి సంవత్సరం బెటర్‌మెంట్‌కు హాజరైన 1,69,347 మ...
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యానం 3.00 గంటల నుండి సాయంత్రం 9.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు