కొత్త కంపెనీలో చేరిన తర్వాత జాగ్రత్తగా పూర్తి చేయాల్సిన అతిముఖ్యమైన పని EPF ఖాతాను విలీనం చేయడం. పాత యూఏఎన్ నంబర్ ద్వారా కొత్త పీఎఫ్ పాస్‌బుక్ సృష్టించబడుతుంది. అయితే పాత కంపెనీలోని పీఎఫ్ నిధులు మాత్రం ఇందులో కలవవు. అందువల్ల PF ఖాతాదారు EPFO వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఖాతాను విలీనం చేసుకోవాల్సి ఉంటుంది. అలా విలీనం చేస్తేనే డబ్బు మెుత్తం ఒక ఖాతాలోకి చేరుతుంది.
ఇందుకోసం ఉద్యోగులు తమ PF ఖాతాను ఆన్‌లైన్‌లో సులభంగా విలీన ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ముందుగా మీరు EPFO అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి. ఇక్కడ సేవలకు వెళ్లాలి. ఆ తర్వాత వన్ ఎంప్లాయీ వన్ ఈపీఎఫ్ ఖాతాపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. అక్కడ పీఎఫ్ ఖాతా విలీనానికి ఫారమ్ తెరవబడుతుంది. అక్కడ ముందుగా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, UAN, ప్రస్తుత సభ్యుల IDని నమోదు చేయాలి. ఆ తర్వాత ఓటీపీ వివరాలు అందించాల్సి ఉంటుంది.
అలా ఓటీపీ వివరాలు అందించగానే మీ పాత అకౌంట్ వివరాలు స్క్రీన్ పై కనిపిస్తాయి. ఆ తర్వాత PF ఖాతా నంబర్‌ను పూరించి.. సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి. దీంతో పీఎఫ్ ఖాతా విలీనం కోసం అభ్యర్థన ఆమోదించబడుతుంది. కొన్ని రోజుల వెరిఫికేషన్ తర్వాత విలీన ప్రక్రియ పూర్తిచేయబడుతుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి