నిమ్స్‌లో ఏపీ చిన్నపిల్లలకూ ఉచిత గుండె చికిత్సలు హైదరాబాద్ సిటీ, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): నిమ్స్ (నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఆసుపత్రిలో ఆంధ్రప్రదేశ్ చిన్నపిల్లలకు కూడా ఉచిత గుండె చికిత్సలు అందిస్తున్నట్లు కార్డియోథెరాసిక్ విభాగం వైద్యులు తెలిపారు. ఆరోగ్యశ్రీ, సీఎం సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) నుంచి అనుమతి పత్రాలు ఉంటే అన్ని వర్గాల పిల్లలకు ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించనున్నారు. చికిత్సలు ఎక్కడ జరుగుతాయనే సందేహాలు చాలా మందికి ఉన్నాయని, పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు డాక్టర్ ప్రవీణ్ వివరించారు. తెలంగాణకు: తల్లిదండ్రుల ఆధార్ కార్డు రోగి జనన ధ్రువీకరణ పత్రం రేషన్ కార్డు ఆంధ్రప్రదేశ్‌కు: ఆధార్ కార్డు సీఎంఆర్‌ఎఫ్ లేఖ చికిత్స సేవలు: నిమ్స్ పాత భవనంలో మొదటి అంతస్తులో ఆరో నెంబరు వార్డు వద్ద పీడియాట్రిక్ కార్డియాక్ ఐసీయూ లో ఉచిత శస్త్రచికిత్సలు అందిస్తారు. ప్రతి రోజు ఉదయం 10:00 గంటల నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు డాక్టర్ అమరేష్ రావు మార్గదర్శకంలో డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ గోపాల్ అందుబాటులో ఉంటారు. మరిన్ని...
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యానం 3.00 గంటల నుండి సాయంత్రం 9.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు