1, జనవరి 2021, శుక్రవారం

Anantapuramu District Classifieds

 

Competitive Bits



🌎 *చరిత్రలో ఈ రోజు*
👉 *01 జనవరి  2021*
👉 *శుక్రవారం*
👉 *సంవత్సరములో మొదటి రోజు. మొదటి వారం*
👉 *సంవత్సరములో మొదటి రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 364 రోజులు మిగిలినవి*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🔴 *ప్రత్యేక  దినాలు*    
🚩 *ప్రపంచ వ్యాప్తంగా క్రొత్త సంవత్సరం జరుపుకుంటారు*
🚩 *అంతర్జాతీయ సార్వజనీన దినోత్సవం(పబ్లిక్ డొమైను డే, ప్రజాక్షేత్ర దినోత్సవం)*
ప్రతి సంవత్సరం జనవరి 1న నిర్వహించబడుతుంది. రచనల కాపీహక్కులు కాలం చెల్లిపోయినపుడు సార్వజనీనం అయ్యి ప్రజాక్షేత్రంలోనికి వస్తాయి. కాపీహక్కులు అనేది అనుసరించి జనవరి 1న ఆయా దేశాల వ్యక్తిగత కాపీహక్కుల చట్టం ఆధారంగా జరుగుతుంది.
సార్వజనీన దినోత్సవం పాటించడం మొదట్లో అనధికారికం. 2004లో మొట్టమొదటిసారిగా కెనడియన్ పబ్లిక్ డొమైన్ కార్యకర్త వాలెస్ మెక్లీన్ ఈ దినోత్సవం గురించి ప్రస్తావించాడు, లారెన్స్ లెస్సిగ్ మద్దతు ఇచ్చాడు.
ప్రపంచంలోని అనేక వెబ్‌సైట్లు ప్రతి సంవత్సరం జనవరి 1న పబ్లిక్ డొమైన్‌లోకి ప్రవేశించే రచయితల జాబితా విడుదల చేస్తాయి. ఈ దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలోని సంస్థలు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
కాపీహక్కుల పరిరక్షణ నిబంధనలు సాధారణంగా రచయిత జీవితకాలం లేదా రచయిత మరణించిన కొన్ని సంవత్సరాల తరువాత లెక్కించబడుతాయి. అనేక న్యాయ పరిధులలో, రచయిత మరణించిన రోజు నుండి 70 సంవత్సరాలు గడిస్తే పబ్లిక్ డొమైనులోకి వస్తాయని అర్థం. ఆ కాలం తరువాత, ఆ రచయితలు రాసిన రచనలు పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. దాంతో ప్రతి ఒక్కరూ ఎవరి అనుమతి లేకుండా వాటిని ఏ విధంగానైనా ఉపయోగించుకోవచ్చు. చట్టబద్ధంగా, ప్రతి సంవత్సరం జనవరి 1న ఆయా రచయితల రచనలు పబ్లిక్ డొమైనులోకి వస్తాయి.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🏀 *సంఘటనలు*
✴️630: ముహమ్మద్ మక్కాకు వెళ్ళి, దానిని రక్తం చిందించకుండా ఆక్రమించుకున్నాడు
✴️1651: స్కాట్లాండ్ రాజుగా రెండో చార్లెస్ నియామకం.
✴️1707: పోర్చుగల్ రాజుగా ఐదవ జార్జ్ నియమించబడ్డాడు.
✴️1804: హైతీలో ఫ్రెంచి పాలన అంతమైంది.
✴️1899: క్యూబా స్పెయిన్ నుండి స్వాతంత్ర్యం పొందింది
✴️1877: ఇంగ్లాండు రాణి విక్టోరియాని భారత దేశపు మహారాణిగా వెల్లడించారు
✴️1877: 1866 నాటి కరువులో పూటకు ఎనిమిది వేల మందికి గంజి ఇచ్చి వేలాదిమంది ప్రాణాలు కాపాడిన బుడ్డా వెంగళరెడ్డి గారికి సన్మాన సభ ఢిల్లీలో 1877 జనవరి 1వ తేదీన జరిగింది.
✴️1906: బ్రిటీషు వారు ఇండియాలో భారత ప్రామాణిక కాలమానం పాటించడం మెదలు పెట్టారు
✴️1925: అమెరికాకు చెందిన శాస్త్రవేత్త ఎడ్విన్ హబుల్, పాల పుంతకు బయట ఇతర నక్షత్ర పుంతల ఉన్నాయని వెల్లడించాడు.
✴️1923: రామ్‌గోపాల్ మలానీ, హైదరాబాదులో డి.బి.ఆర్.మిల్స్ వ్యవస్థాపకుడు.
✴️1939: బిల్ హెవ్లెట్, డేవిడ్ ప్యకార్డ్ కలిసి హెచ్.పి. స్థాపించారు
✴️1948: విభజన తరువాత భారత దేశం పాకిస్తానుకు 55కోట్ల రూపాయలను చెల్లించనన్నది
✴️1953: విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ స్థాపించబడింది.
✴️1956: సూడాన్ స్వాతంత్ర్యం పొందింది.
✴️1958: యూరోపియన్ కమ్యూనిటీ స్థాపించబడింది.
✴️1960: కామెరూన్ స్వాతంత్ర్యం పొందింది
✴️1971: అమెరికా టీవీలో ధూమపాన సంబంధిత అడ్వర్టైజెమెంట్లను బ్యాన్ చేసింది
✴️1972: మణిపూర్‌ రాష్ట్రం అవతరించింది.
✴️1973: ఫీల్డు మర్షల్ ఎస్.హెచ్.ఎఫ్.జె. మానెక్‌షా భారత దేశమునకు సైనిక ప్రధానాధికారిగా నియామకం.
✴️1978: ఎయిర్ ఇండియా ఫ్లైట్ 855, ముంబాయి సముద్ర తీరాన, అరేబియ సముద్రములోకి పడిపోయింది.
✴️1981: గ్రీసు రిపబ్లిక్ యూరోపియన్ కమ్యునిటీలో చేరినది.
✴️1984: బ్రూనై స్వాతంత్ర్యం పొందింది.
✴️1985: ఇంటర్నెట్ డొమైన్ నేమ్ సిస్టం ఏర్పాటుచేయబడింది.
✴️1986: సెన్సెక్స్, బోంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సిటివ్ ఇండెక్స్ అనే ఒక విలువ-భార సూచీ ప్రారంభించబడింది.
✴️1993: చెకొస్లోవేకియా చెక్, స్లోవక్ రెండు దేశాలుగా విడిపోయింది.
✴️1994: ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (నాఫ్తా) అమలులోకి వచ్చింది.
✴️1995: GATT స్థానంలో ప్రపంచ వాణిజ్య సంస్థ అమలులోకి వచ్చింది.
✴️1998: యూరోపియన్ కేంద్రీయ బ్యాంకు స్థాపించబడింది.
✴️1999: యూరో కరెన్సీ చెలామణిలోకి వచ్చింది.
✴️2002: ఐరోపా లోని 13 దేశాల్లో యూరో నాణేలు, నోట్లను చెలామణీ లోకి తెచ్చారు.
✴️2006: ఆరవ వేతన సంఘం (కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాల సవరణ కోసం వేసిన సంఘం) నివేదికలోని సిఫార్సులను, సవరించిన జీతాన్ని, కేంద్ర ప్రభుత్వం ఈ రోజునుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేసింది. భత్యాలను మాత్రం 1 సెప్టంబరు 2008 నుంచి చెల్లించింది.
✴️2007: ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిగా బాబ్ కి మూన్ పదవీబాధ్యతలు చేపట్టాడు.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🌐 *జననాలు*
❇️1766: మహారాజా చందు లాల్, హైదరాబాద్ రాజ్యానికి ప్రధానమంత్రిగా, పేష్కరుగా పలు హోదాల్లో పనిచేసిన రాజకీయవేత్త. (మ.1845)

❇️1840: బుడ్డా వెంగళరెడ్డి, 1866 కాలంలో సంభవించిన కరువు కాలంలో తన ఆస్తినంతా ధారపోసి ఎంతోమంది ప్రాణాల్ని కాపాడిన మహా దాత. (మ.1900)
❇️1892: మహదేవ్ దేశాయ్ భారత స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత. (మ.1942)
❇️1894: సత్యేంద్రనాథ్ బోస్, బెంగాలి గణిత శాస్త్రవేత్త.
❇️1905: లంక సుందరం, భారత పార్లమెంటు సభ్యులు, అంతర్జాతీయ న్యాయశాస్త్రంలో నిపుణులు.
❇️1909: చర్ల గణపతిశాస్త్రి, వేద పండితులు, గాంధేయవాది, ప్రాచీన గ్రంథాల అనువాదకులు. (మ.1996)
❇️1911: ఎల్లాప్రగడ సీతాకుమారి, కథా రచయిత్రి, స్వాతంత్ర్య సమరయోధురాలు.ఆమె ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ్యురాలు.
❇️1920: మహమ్మద్ రజబ్ అలీ, ఖమ్మం జిల్లా రాజకీయనాయకుడు. (మ.1997)
❇️1928: మంత్రి శ్రీనివాసరావు తెలంగాణ ప్రాంత రంగస్థల నటుడు, ఆంధ్ర విశ్వవిద్యాలయం రంగస్థల కళల శాఖ తొలి శాఖాధిపతి. (మ.1974)
❇️1928: అబ్దుల్ సత్తార్ ఈది, పాకిస్థాన్‌కు చెందిన సంఘసేవకుడు, దాత. (మ.2016)
❇️1929: ముకురాల రామారెడ్డి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, రచయిత. (మ.2003)
❇️1938: గణపతి తనికైమొని భారతీయ పాలినాలజిస్ట్. (మ.1986)
❇️1938: తిరుమల శ్రీనివాసాచార్య, గీతాలు, సాహిత్యవ్యాస సంకలనాలు, రుబాయీల రచయిత.
❇️1939: సత్యమూర్తి, వ్యంగ్య చిత్రకారుడు.
❇️1943: రఘునాథ్ అనంత్ మషేల్కర్, భారతీయ శాస్త్రవేత్త.
❇️1946: బాలు మహేంద్ర, దక్షిణ భారతీయ సుప్రసిద్ధ ఛాయాగ్రహకుడు, దర్శకుడు .
❇️1946: పప్పల చలపతిరావు, ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుండి 14వ లోక్‌సభకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు.
❇️1948: షేక్‌ బడేసాహెబ్‌ తెలుగు రచయిత.
❇️1951: అష్ఫక్ హుస్సేన్, ఉర్దూ కవి.
❇️1952: నానా పటేకర్, నటుడు.
❇️1954: శాంతా రంగస్వామి, భారత మహిళా క్రికెట్ క్రీడాకారిణి.
❇️1961: దుర్గాప్రసాద్ ఓజా, భౌతిక శాస్త్రవేత్త.
❇️1962: మారొజు వీరన్న, తెలంగాణ మహాసభను స్థాపకుడు, సి.పి.ఐ. (యం.యల్) జనశక్తి కార్యకర్త. (మ.1999)
❇️1963: అబ్దుల్‌ హకీం జానీ షేక్‌ బాలసాహితీవేత్త.
❇️1966: వద్దిపర్తి పద్మాకర్, పేరుపొందిన అవధాని, ఆధ్యాత్మిక ప్రవచనకారుడు.
❇️1971: కళాభవన్ మణి, భారతీయ సినిమా నటుడు, గాయకుడు. (మ.2016)
❇️1974: కట్టా శ్రీనివాసరావు, ఉపాధ్యాయుడు, కవి, కవిసంగమం పేరుతో పేస్ బుక్ కవిత్వ వేదికలో ప్రధాన భాగస్వామి.
❇️1975: సొనాలి బింద్రే, హిందీ నటి.
❇️1978: విద్యా బాలన్, హిందీ నటి.
❇️1978: పరమహంస శ్రీ నిత్యానందా.
❇️1979: డింకో సింగ్, 1998 ఆసియా క్రీడలలో బంగారుపతకం గెలుచుకున్న భారత బాక్సింగ్ క్రీడాకారుడు.
❇️1982: ఐశ్వర్య ధనుష్ భారతీయ సినీ దర్శకురాలు. భారతీయ నటుడు రజినీకాంత్ పెద్ద కుమార్తె.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
⚫️ *మరణాలు*
◾️1748: జొహాన్ బెర్నౌలీ, స్విట్జెర్లాండ్కు చెందిన గణిత శాస్త్రవేత్త.
◾️1775: అహమ్మద్ షా బహదూర్, 13వ మొఘల్ చక్రవర్తి. (జ.1725)
◾️1782: జొహాన్ క్రిస్టియన్ బాక్, జెర్మనీకు చెందిన సంగీత కళాకారుడు
◾️1894: హైన్రిచ్ రుడోల్ఫ్ హెర్ట్జ్, జెర్మనీకు చెందిన భౌతిక శాస్త్రవేత్త
◾️1940: పానుగంటి లక్ష్మీ నరసింహరావు, ప్రసిద్ధ తెలుగు సాహితీవేత్త, హాస్య, వ్యంగ్య, అధిక్షేప రచయిత, సాక్షి ఉపన్యాసాలను రచించి తెలుగు సాహిత్యానికి అనేక అమూల్యాభరణాలు అందించిన వారు. (జ.1865)
◾️1955: శాంతిస్వరూప్‌ భట్నాగర్‌, రసాయన శాస్త్రవేత్త. ఈయన పేరుమీదే శాంతిస్వరూప్ భట్నాగర్‌ అవార్డును ఏర్పాటు చేసారు.
◾️1964: శొంఠి వెంకట రామమూర్తి బహుముఖ ప్రజ్ఞాశాలి. గణితశాస్త్రవేత్త. (జ.1888)
◾️1968: వెంపటి సదాశివబ్రహ్మం, పేరుపొందిన చలనచిత్ర రచయిత
◾️1994: చాగంటి సోమయాజులు, తెలుగు రచయిత. (జ.1915)
◾️1995: యూగీన్ విగ్నెర్, హంగేరీకు చెందిన, నోబెల్ బహుమతి గెలుచుకున్న భౌతిక శాస్త్రవేత్త
◾️2001: ఆరుట్ల కమలాదేవి నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొన్న యోధురాలు. (జ.1920)
◾️2007: డూండీ, తెలుగు సినిమా నిర్మాత.
◾️2007: టిల్లీ అల్సెన్, అమెరికన్ రచయిత్రి (జ.1912)
◾️2008: ప్రతాప్ చంద్ర చుందెర్, భారతీయ క్యాబినెట్ మంత్రి.
◾️2009: కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ, నిరసన కవి. (జ.1947).🙏🏻
➖➖➖➖➖➖➖➖
*_To Stay Negative Against COVID-19_*
*Wear Mask*
*Keep Safe Distance*
*Wash Hands Frequently with Soap/Sanitizer*
➖➖➖➖➖➖➖➖

#TODAY_IN_HISTORY

@jobsupdategovernment

ANGRAU Update

🔳4న వ్యవసాయ పీజీ కోర్సుల కౌన్సెలింగ్‌

గుంటూరు (జిల్లాపరిషత్తు), న్యూస్‌టుడే: ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 2020-21 విద్యాసంవత్సరంలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు చివరి కౌన్సెలింగ్‌ను జనవరి 4న ఉదయం 9 గంటలకు ఏర్పాటుచేసినట్లు వర్సిటీ రిజిస్ట్రార్‌ టి.గిరిధరకృష్ణ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. గుంటూరుకు సమీప ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లాంఫాం ఆడిటోరియంలో జరిగే కౌన్సెలింగ్‌కు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చిన అభ్యర్థులతోపాటు ఆయా కోర్సులను మార్చుకోవాలని భావించిన వారు కూడా హాజరుకావాలని సూచించారు. అభ్యర్థులు ప్రవేశాలు పొందిన వెంటనే ప్రవేశరుసుం రూ.35 వేలు చెల్లించాలన్నారు.


*💁‍♀️అమ్మ ఒడి తరువాతే టీచర్లకు బదిలీ ఆర్డర్లు..*

🍁ఏలూరు ఎడ్యుకేషన్‌, డిసెంబరు 31 :

*🔰బదిలీ కోసం జిల్లాలో దరఖాస్తు చేసుకున్న టీచర్ల సంఖ్యపై స్పష్టత వచ్చింది. అన్ని కేటగీరిలకు చెందిన మొత్తం 5,699 మంది హెచ్‌ఎంలు, టీచర్లు దరఖాస్తు చేసుకోగా, బదిలీ స్థానాలను ఇచ్చిన వెబ్‌ ఆప్షన్ల ఫ్రీజింగ్‌ గురువారం ముగిసింది. అందుతున్న సమాచారం ప్రకారం సోమవారం లోగా బదిలీ స్థానాల కేటాయింపుపై తొలి జాబితా విడుదల కానుంది. టీచర్లు ఇచ్చిన వెబ్‌ ఆప్షన్లు, కేటాయించిన బదిలీ స్థానంపై ఏవైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకునేందుకు కొన్ని రోజుల వ్యవధి ఇస్తారు. అనంతరం తుది జాబితాను విడు దల చేసి, బదిలీ ఆర్డర్లను జారీ చేస్తారు. అమ్మ ఒడి ఆర్థిక సాయం విడుదలయ్యే జనవరి 9వ తేదీ తరువాత బదిలీ ఆర్డర్లు జారీ అయ్యే అవకాశం ఉంది. దీనిపై విద్యా శాఖ అధికారిక షెడ్యూల్‌ విడుదల చేయాల్సి ఉంది*.

*🍁సబ్జెక్టుల వారీగా బదిలీ దరఖాస్తులు ఇలా..*

*🔰మత్తం 5,699 మంది బదిలీలకు ధరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎంలు 114 మంది, గ్రేడు–2 హెచ్‌ఎంలు 152, ఎస్‌జీటీలు 2,986, స్కూల్‌ అసి స్టెంట్‌ ఉర్దూ 11, గణితం 551, గణితం (ఉర్దూ) 1, ఫిజికల్‌ సైన్స్‌ 386, బయోలాజికల్‌ సైన్స్‌ 332, సోషల్‌ స్టడీస్‌ 290, స్టోషల్‌ స్టడీస్‌ (ఉర్దూ)1, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ 62, తెలుగు 270, ఉర్దూ 2, హిందీ 153, సంస్కృతం 13, ఇంగ్లీషు 375 మంది దరఖాస్తు చేసుకున్నారు.*  


*3 నుంచి ఎల్‌పీసెట్‌ కౌన్సెలింగ్‌..*




🍁ఏలూరు విద్యా విభాగం, న్యూస్‌టుడే :

*🔹ఎల్‌పీసెట్‌-2020లో ఉత్తీర్ణులైన వారికి రెండో విడత కౌన్సెలింగ్‌ను జనవరి మూడు నుంచి నిర్వహించనున్నట్లు డీఈవో రేణుక ఒక ప్రకటనలో తెలిపారు. ఎల్‌పీసెట్‌ ఉతీర్ణులై https:///aplpcet.apcfss.in వెబ్‌సైట్‌లో ఐచ్ఛికాలను నమోదు చేసుకుని మొదటి విడత కౌన్సెలింగ్‌కు హాజరుకాని అభ్యర్థులు, ‘డైట్‌’ కళాశాలలో వెబ్‌ కౌన్సెలింగ్‌కు హాజరై కొన్ని ధ్రువపత్రాలు లేని కారణంగా ప్రవేశం పొందలేకపోయినవారు రెండో విడత కు హాజరు కావచ్చన్నారు*.

*🍁షడ్యూలు ఇలా..⤵️⤵️*

*🔰కన్సెలింగ్‌ వివరాలు తేదీలు..⤵️⤵️*

*🔹వబ్‌ ఐచ్ఛికాలను ఎంచుకునే అవకాశం 3 నుంచి 5 వరకు..*

*🔹సట్ల కేటాయింపు 6 నుంచి 7 వరకు..*

*🔹పరవేశాలకు కోసం ప్రొవిజనల్‌ పత్రాల జారీ 8..*

*🔹పరిశీలన, ప్రవేశాల తుది పత్రం జారీ 9 నుంచి 12 వరకు*

*🔹కళాశాలల ప్రారంభం 18..*


శ్రీ సాలగ్రామ వేంకటేశ్వరస్వామి ఆలయానికి ఆహ్వానం

మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు💐💐💐

జనవరి 1 వ తేదీ .,ఆంగ్ల నూతన సంవత్సరాది  సందర్భంగా తిరుచానూరు, యోగిమల్లవరం  
శ్రీ సాలగ్రామ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోండి. సకల శుభాలు పొందండి.

జనవరి 1వ తేదీ ఉదయం 5 నుంచి
రాత్రి వరకు స్వామివారి దర్శనం ఉంటుంది.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకల ఏర్పాట్లు పూర్తయ్యాయి.  

శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సాలగ్రామ అర్చన కుంకుమతో పాటు, ఫలం కొవిడ్ నేపథ్యంలో తీర్థం బాటిల్, ప్రసాదం ప్యాకెట్  ఇంటికి తీసుకువెళ్లేలా ప్రతి ఒక్కరికీ అందేలా ఆలయ ధర్మకర్త కుటుంబ సభ్యులు, శ్రీ సాలగ్రామ వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్వహణ భక్త బృందం వారు ఏర్పాట్లు చేశారు.

నిర్వహణ భక్త మండలి
శ్రీ సాలగ్రామ వేంకటేశ్వరస్వామి ఆలయం
యోగిమల్లవరం, తిరుచానూరు
..................................
🙏 ఓం నమో శ్రీ సాలగ్రామ వేంకటేశాయ

RRB NTPC Bits

 ..

1.స్వాచ్ భారత్ అభియాన్ 2014 అక్టోబర్ 2 న ప్రారంభించబడింది

OLED- సేంద్రీయ కాంతి-ఉద్గార డయోడ్ యొక్క పూర్తి రూపం

3. పర్యావరణ దినోత్సవం 2020 థీమ్? శీతోష్ణస్థితి చర్య

4. నోబెల్ బహుమతి ఎన్ని రంగాలలో ఇవ్వబడుతుంది? ఆరు

5.విటో శక్తి ఎన్ని దేశాల చేతిలో ఉంది- 5

6.ఆర్యభట్ ఉపగ్రహాన్ని ఏ సంవత్సరంలో ప్రయోగించారు? - 1975

7.బేటి బచావో, బేటి పధావో ఏ తేదీ -2015 న ప్రారంభమైంది

8. భారతదేశంలో పరిశుభ్రమైన నగరం- ఇండోర్

9. ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు- మార్క్ జుకర్‌బర్గ్

10. భారతదేశంలో కొత్త అణు రియాక్టర్? తారాపూర్ అటామిక్ పవర్ ప్లాంట్ -1

11. దేశంలో అడవుల శాతం? 21.67 శాతం

12.స్వర్నిమ్ చతుర్భుజ్ యోజనకు సంబంధించినది? -గోల్డెన్ చతుర్భుజ ప్రాజెక్టు

13.నాసా ఏ సంవత్సరంలో స్థాపించబడింది? 1958

14.కోస్టల్ స్టేట్స్?

15.ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫోర్స్? న్యూటన్

16.ఐస్రో ఏ సంవత్సరంలో స్థాపించబడింది? 1969

17. అత్యధిక అక్షరాస్యత రేటు ఏ రాష్ట్రానికి చెందినది? కేరళ

18.కాంగ్రెస్ ఆదివేషన్ జరిగింది? 28–31
 డిసెంబర్ 1885

19. ఒలింపిక్ 2021 టోక్యోలో జరగనుంది

20. భారతదేశంలో సరికొత్త అణు రియాక్టర్ ఏది? -తారాపూర్ అటామిక్ పవర్ ప్లాంట్ -1

21. గదర్ పార్టీ వ్యవస్థాపకుడు? -సోహన్ సింగ్ భక్నా

22. ఆంధ్రప్రదేశ్‌లో నాట్య రూపానికి పేరు పెట్టండి? - కుచిపూడి

23. అత్యధిక అక్షరాస్యత ఉన్న రాష్ట్రం ఏది? - కేరళ

24. కాంగ్రెస్ ఆదివేషన్ ఏ సంవత్సరంలో జరిగింది? - 28–31 డిసెంబర్ 1885

25. భారత్ రత్న ఎన్ని వర్గాలలో ఇవ్వబడింది? -51

26. రాజ్యసభలో ఎన్ని సీట్లు ఉన్నాయి? -250

27. మీథేన్ యొక్క రసాయన ఫార్ములా?

28. 1 వ కాంగ్రెస్ సెషన్ అధ్యక్షుడు? -వొమేష్ చుందర్ బోన్నర్జీ

29. సార్క్‌లో ఎంత మంది సభ్యులు ఉన్నారు? -8

SSC Stenographer Answer Key 2021 – CBE Tentative Key Released

SSC Stenographer Answer Key 2021 – CBE Tentative Key Released

Stenographer Grade C&D Exam 2019 – CBE Tentative Key Released

 Important Links 
CBE Tentative KeyKey | Objections
CBT Result Released Date Notice
Click here
CBT Admit Card & Application StatusClick Here
New CBT DateClick Here
Re Revised Exam DateClick here
Change of Exam CentreNotice | Link
Revised Exam Date IIClick here
Revised Exam DateClick here
Notice Regarding Exam DateClick here
Notice for Reschedule DateClick here
Apply OnlineClick here
Detailed NotificationClick here
Eligibility CriteriaClick here 
Selection ProcessClick here
Exam PatternClick here 
SyllabusClick here 
Starting Date Changed NoticeClick here
Short NoticeClick here
 Official WebsiteClick here

ఏపీలో 127 జాబ్స్‌.. జిల్లాల వారీగా ఖాళీల వివరాలు ఇవే

ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో మెడికల్‌ ఆఫీసర్ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. మూడు జిల్లాల్లో కలిపి 127 పోస్టులున్నాయి. వివరాల్లోకెళితే..

1. క‌ర్నూలు జిల్లాలో మెడిక‌ల్ ఆఫీస‌ర్లు
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ, క‌ర్నూలు జిల్లా వైద్య‌, ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమశాఖ‌ విభాగానికి చెందిన ప‌ట్ట‌ణ ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల్లో ప‌ని చేయ‌డానికి ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

  • మెడిక‌ల్ ఆఫీస‌ర్లు (ఎంబీబీఎస్‌)
  • మొత్తం ఖాళీలు: 40 (సంబంధిత విభాగం అవ‌స‌రానికి అనుగుణంగా ఖాళీలు త‌గ్గొచ్చు/ పెర‌గొచ్చు.)
  • అర్హ‌త‌: మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన క‌ళాశాల‌ల నుంచి ఎంబీబీఎస్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, 01.12.2020 లోపు ఇంటర్న్ షిప్ పూర్తి చేసి ఉండాలి.
  • విదేశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన అభ్య‌ర్థులు ఆంధ్రప్రదేశ్ స్టేట్ మెడికల్ కౌన్సిల్‌లో (శాశ్వత ప్రాతిపదికన) నమోదు చేసుకోవాలి.
  • వ‌య‌సు: 01.12.2020 నాటికి 42 ఏళ్లు మించ‌కూడ‌దు. ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం గ‌రిష్ఠ వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీల‌కు ఐదేళ్లు, ఎక్స్ స‌ర్వీస్‌మెన్‌కు మూడేళ్లు, పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు ప‌దేళ్ల స‌డ‌లింపు ఉంటుంది.
  • ద‌ర‌ఖాస్తు ఫీజు: ఓసీ/ జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థుకు-రూ.400/-, ఎస్సీ/ ఎస్టీ/ పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు- రూ.200
  • ఎంపిక విధానం:మొత్తం 100 మార్కుల‌కు ఉంటుంది. ఇందులో
  • 1) క్వాలిఫైయింగ్ ఎగ్జామ్‌లో పొందిన మార్కుల‌కు గాను 75% మార్కులు కేటాయిస్తారు.
  • 2) ఒప్పంద‌/ ఔట్ సోర్సింగ్ ప్రాతిప‌దిక‌న గ‌తంలో ప‌ని అనుభ‌వానికి 15% మార్కులు కేటాయిస్తారు.
  • 3) ఇంట‌ర్న్‌షిప్ పూర్తి చేసిన ఏడాదినుంచి ప్ర‌తి సంవ‌త్స‌రానికి 1మార్కు చొప్పున 10 మార్కులు కేటాయిస్తారు.
  • ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. మ‌రే ఇత‌ర ప‌ద్ధ‌తిలో ద‌ర‌ఖాస్తులు అంగీక‌రించ‌బ‌డ‌వు.

ముఖ్య‌మైన తేదీలు:
  • ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: డిసెంబర్‌ 16, 2020.
  • ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: డిసెంబర్‌ 22., 2020.
  • ఎంపికైన వారి తుది జాబితా వెల్ల‌డించే తేది: డిసెంబర్‌ 29, 2020.
  • నియామ‌క ప‌త్రాలు అంద‌జేసే తేది: డిసెంబర్‌ 30, 2020.
  • వెబ్‌సైట్‌: https://kurnool.ap.gov.in/




2. నెల్లూరు జిల్లాలో మెడిక‌ల్ ఆఫీస‌ర్లు
  • మొత్తం ఖాళీలు: 29
  • అర్హ‌త‌: ఏపీ మెడికల్ కౌన్సిల్ గుర్తింపు పొందిన క‌ళాశాల‌ల నుంచి ఎంబీబీఎస్ డిగ్రీ ఉత్తీర్ణ‌త.
  • విదేశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన అభ్య‌ర్థులు ఆంధ్రప్రదేశ్ స్టేట్ మెడికల్ కౌన్సిల్‌లో (శాశ్వత ప్రాతిపదికన) నమోదు చేసుకోవాలి.
  • వ‌య‌సు: 01.12.2020 నాటికి 42 ఏళ్లు మించ‌కూడ‌దు. ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం గ‌రిష్ఠ వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీల‌కు ఐదేళ్లు, ఎక్స్ స‌ర్వీస్‌మెన్‌కు మూడేళ్లు, పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు ప‌దేళ్ల స‌డ‌లింపు ఉంటుంది.
  • ద‌ర‌ఖాస్తు ఫీజు: ఓసీ/ జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థుకు-రూ.300/-.
  • ఎంపిక విధానం: మొత్తం 100 మార్కుల‌కు ఉంటుంది. ఇందులో
  • 1) క్వాలిఫైయింగ్ ఎగ్జామ్‌లో పొందిన మార్కుల‌కు గాను 75% మార్కులు కేటాయిస్తారు.
  • 2) ఒప్పంద‌/ ఔట్ సోర్సింగ్ ప్రాతిప‌దిక‌న గ‌తంలో ప‌ని అనుభ‌వానికి 15% మార్కులు కేటాయిస్తారు.
  • 3) ఇంట‌ర్న్‌షిప్ పూర్తి చేసిన ఏడాదినుంచి ప్ర‌తి సంవ‌త్స‌రానికి 1మార్కు చొప్పున 10 మార్కులు కేటాయిస్తారు.
  • ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. సంబంధిత ధ్రువ‌ప‌త్రాల‌ను జ‌త‌చేసి(గెజిటెడ్ ఆఫీస‌ర్ అట్ట‌స్టేష‌న్‌) రిజిస్ట‌ర్ పోస్టు ద్వారా/ నేరుగా వెళ్లి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.
  • చిరునామా: THE DISTRICT MEDICAL & HEALTH OFFICER, SANTHAPETA, NELLORE – 524 001.

ముఖ్య‌మైన తేదీలు:
  • ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: డిసెంబర్‌ 17, 2020.
  • ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: డిసెంబర్‌ 20, 2020.
  • ఎంపికైన వారి తుది జాబితా వెల్ల‌డించే తేది: డిసెంబర్‌ 29, 2020.
  • నియామ‌క ప‌త్రాలు అంద‌జేసే తేది: డిసెంబర్‌ 31, 2020.
  • వెబ్‌సైట్‌: https://spsnellore.ap.gov.in/





3. కృష్ణా జిల్లాలో మెడిక‌ల్ ఆఫీస‌ర్లు
  • మొత్తం ఖాళీలు: 58
  • అర్హ‌త‌: ఏపీ మెడికల్ కౌన్సిల్ గుర్తింపు పొందిన క‌ళాశాల‌ల నుంచి ఎంబీబీఎస్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, 01.12.2020 నాటికి ఇంటర్న్ షిప్ పూర్తి చేసి ఉండాలి.
  • విదేశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన అభ్య‌ర్థులు ఆంధ్రప్రదేశ్ స్టేట్ మెడికల్ కౌన్సిల్‌లో (శాశ్వత ప్రాతిపదికన) నమోదు చేసుకోవాలి.
  • వ‌య‌సు: 01.12.2020 నాటికి 42 ఏళ్లు మించ‌కూడ‌దు. ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం గ‌రిష్ఠ వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీల‌కు ఐదేళ్లు, ఎక్స్ స‌ర్వీస్‌మెన్‌కు మూడేళ్లు, పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు ప‌దేళ్ల స‌డ‌లింపు ఉంటుంది.
  • ద‌ర‌ఖాస్తు ఫీజు: ఓసీ/ జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థుకు-రూ.600/-, ఎస్సీ/ ఎస్టీ/ పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు ఫీజు లేదు.
  • ఎంపిక విధానం:మొత్తం 100 మార్కుల‌కు ఉంటుంది. ఇందులో
  • 1) క్వాలిఫైయింగ్ ఎగ్జామ్‌లో పొందిన మార్కుల‌కు గాను 75% మార్కులు కేటాయిస్తారు.
  • 2) ఒప్పంద‌/ ఔట్ సోర్సింగ్ ప్రాతిప‌దిక‌న గ‌తంలో ప‌ని అనుభ‌వానికి 15% మార్కులు కేటాయిస్తారు.
  • 3) ఇంట‌ర్న్‌షిప్ పూర్తి చేసిన ఏడాదినుంచి ప్ర‌తి సంవ‌త్స‌రానికి 1మార్కు చొప్పున 10 మార్కులు కేటాయిస్తారు.
  • ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. మ‌రే ఇత‌ర ప‌ద్ధ‌తిలో ద‌ర‌ఖాస్తులు అంగీక‌రించ‌బ‌డ‌వు.

ముఖ్య‌మైన తేదీలు:
  • ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: డిసెంబర్‌ 17, 2020.
  • ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: డిసెంబర్‌ 21, 2020.
  • ఎంపికైన వారి తుది జాబితా వెల్ల‌డించే తేది: డిసెంబర్‌ 29, 2020.
  • నియామ‌క ప‌త్రాలు అంద‌జేసే తేది: డిసెంబర్‌ 30, 2020.
  • వెబ్‌సైట్‌: https://krishna.ap.gov.in/





*Rice card print without any logins*


*Rice card print without any logins*

1. ఈ క్రింది లింకును copy చేసుకోండి
 
(https://epdsap.ap.gov.in/Qcode/Qcodesearch.jsp?card_id=**********)

2.Google Chrome app ఓపెన్ చేసి  new tab లో search box లో మీరు copy చేసిన లింకు ను paste చేయండి

3. లింకులో చివర ఉన్న (*********) star గుర్తులను తొలగించి Rice కార్డు నంబరు ఎంటర్ చేయండి (RC నెం,, ను copy, paste చేయరాదు)

4.RC నంబరు ఎంటర్ చేసిన తరువాత search బటన్ ని క్లిక్ చేయండి

*మీకు కావలసిన బియ్యం కార్డు మీకు కనిపిస్తోంది*

 గమనిక :-  ఈ లింకు ద్వారా పొందే బియ్యం కార్డు digital signature కానందున ఈ లింకు కేవలం బియ్యం కార్డును చెక్ చేసుకోవడం కోసం మాత్రమే ఉపయోగపడుతుంది. ఇది ఎలాంటి ప్రభుత్వ పరమైన ఆధారంగా పరిగణనలోకి రాదు.