1, జనవరి 2021, శుక్రవారం

ANGRAU Update

🔳4న వ్యవసాయ పీజీ కోర్సుల కౌన్సెలింగ్‌

గుంటూరు (జిల్లాపరిషత్తు), న్యూస్‌టుడే: ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 2020-21 విద్యాసంవత్సరంలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు చివరి కౌన్సెలింగ్‌ను జనవరి 4న ఉదయం 9 గంటలకు ఏర్పాటుచేసినట్లు వర్సిటీ రిజిస్ట్రార్‌ టి.గిరిధరకృష్ణ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. గుంటూరుకు సమీప ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లాంఫాం ఆడిటోరియంలో జరిగే కౌన్సెలింగ్‌కు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చిన అభ్యర్థులతోపాటు ఆయా కోర్సులను మార్చుకోవాలని భావించిన వారు కూడా హాజరుకావాలని సూచించారు. అభ్యర్థులు ప్రవేశాలు పొందిన వెంటనే ప్రవేశరుసుం రూ.35 వేలు చెల్లించాలన్నారు.


కామెంట్‌లు లేవు: