ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో మెడికల్ ఆఫీసర్ల 
భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మూడు జిల్లాల్లో కలిపి 127 
పోస్టులున్నాయి. వివరాల్లోకెళితే..
1. కర్నూలు జిల్లాలో మెడికల్ ఆఫీసర్లు
ఆంధ్రప్రదేశ్
 ప్రభుత్వ, కర్నూలు జిల్లా వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ 
విభాగానికి చెందిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేయడానికి 
ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
- మెడికల్ ఆఫీసర్లు (ఎంబీబీఎస్)
 - మొత్తం ఖాళీలు: 40 (సంబంధిత విభాగం అవసరానికి అనుగుణంగా ఖాళీలు తగ్గొచ్చు/ పెరగొచ్చు.)
 - అర్హత: మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన కళాశాలల నుంచి ఎంబీబీఎస్ డిగ్రీ ఉత్తీర్ణత, 01.12.2020 లోపు ఇంటర్న్ షిప్ పూర్తి చేసి ఉండాలి.
 - విదేశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ స్టేట్ మెడికల్ కౌన్సిల్‌లో (శాశ్వత ప్రాతిపదికన) నమోదు చేసుకోవాలి.
 - వయసు: 01.12.2020 నాటికి 42 ఏళ్లు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్లు, ఎక్స్ సర్వీస్‌మెన్‌కు మూడేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
 - దరఖాస్తు ఫీజు: ఓసీ/ జనరల్ అభ్యర్థుకు-రూ.400/-, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు- రూ.200
 - ఎంపిక విధానం:మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ఇందులో
 - 1) క్వాలిఫైయింగ్ ఎగ్జామ్‌లో పొందిన మార్కులకు గాను 75% మార్కులు కేటాయిస్తారు.
 - 2) ఒప్పంద/ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన గతంలో పని అనుభవానికి 15% మార్కులు కేటాయిస్తారు.
 - 3) ఇంటర్న్‌షిప్ పూర్తి చేసిన ఏడాదినుంచి ప్రతి సంవత్సరానికి 1మార్కు చొప్పున 10 మార్కులు కేటాయిస్తారు.
 - దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మరే ఇతర పద్ధతిలో దరఖాస్తులు అంగీకరించబడవు.
 
ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: డిసెంబర్ 16, 2020.
 - దరఖాస్తుకు చివరి తేది: డిసెంబర్ 22., 2020.
 - ఎంపికైన వారి తుది జాబితా వెల్లడించే తేది: డిసెంబర్ 29, 2020.
 - నియామక పత్రాలు అందజేసే తేది: డిసెంబర్ 30, 2020.
 - వెబ్‌సైట్: https://kurnool.ap.gov.in/
 
2. నెల్లూరు జిల్లాలో మెడికల్ ఆఫీసర్లు
- మొత్తం ఖాళీలు: 29
 - అర్హత: ఏపీ మెడికల్ కౌన్సిల్ గుర్తింపు పొందిన కళాశాలల నుంచి ఎంబీబీఎస్ డిగ్రీ ఉత్తీర్ణత.
 - విదేశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ స్టేట్ మెడికల్ కౌన్సిల్‌లో (శాశ్వత ప్రాతిపదికన) నమోదు చేసుకోవాలి.
 - వయసు: 01.12.2020 నాటికి 42 ఏళ్లు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్లు, ఎక్స్ సర్వీస్‌మెన్‌కు మూడేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
 - దరఖాస్తు ఫీజు: ఓసీ/ జనరల్ అభ్యర్థుకు-రూ.300/-.
 - ఎంపిక విధానం: మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ఇందులో
 - 1) క్వాలిఫైయింగ్ ఎగ్జామ్‌లో పొందిన మార్కులకు గాను 75% మార్కులు కేటాయిస్తారు.
 - 2) ఒప్పంద/ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన గతంలో పని అనుభవానికి 15% మార్కులు కేటాయిస్తారు.
 - 3) ఇంటర్న్‌షిప్ పూర్తి చేసిన ఏడాదినుంచి ప్రతి సంవత్సరానికి 1మార్కు చొప్పున 10 మార్కులు కేటాయిస్తారు.
 - దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత ధ్రువపత్రాలను జతచేసి(గెజిటెడ్ ఆఫీసర్ అట్టస్టేషన్) రిజిస్టర్ పోస్టు ద్వారా/ నేరుగా వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు.
 - చిరునామా: THE DISTRICT MEDICAL & HEALTH OFFICER, SANTHAPETA, NELLORE – 524 001.
 
ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: డిసెంబర్ 17, 2020.
 - దరఖాస్తుకు చివరి తేది: డిసెంబర్ 20, 2020.
 - ఎంపికైన వారి తుది జాబితా వెల్లడించే తేది: డిసెంబర్ 29, 2020.
 - నియామక పత్రాలు అందజేసే తేది: డిసెంబర్ 31, 2020.
 - వెబ్‌సైట్: https://spsnellore.ap.gov.in/
 
3. కృష్ణా జిల్లాలో మెడికల్ ఆఫీసర్లు
- మొత్తం ఖాళీలు: 58
 - అర్హత: ఏపీ మెడికల్ కౌన్సిల్ గుర్తింపు పొందిన కళాశాలల నుంచి ఎంబీబీఎస్ డిగ్రీ ఉత్తీర్ణత, 01.12.2020 నాటికి ఇంటర్న్ షిప్ పూర్తి చేసి ఉండాలి.
 - విదేశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ స్టేట్ మెడికల్ కౌన్సిల్‌లో (శాశ్వత ప్రాతిపదికన) నమోదు చేసుకోవాలి.
 - వయసు: 01.12.2020 నాటికి 42 ఏళ్లు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్లు, ఎక్స్ సర్వీస్‌మెన్‌కు మూడేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
 - దరఖాస్తు ఫీజు: ఓసీ/ జనరల్ అభ్యర్థుకు-రూ.600/-, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
 - ఎంపిక విధానం:మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ఇందులో
 - 1) క్వాలిఫైయింగ్ ఎగ్జామ్‌లో పొందిన మార్కులకు గాను 75% మార్కులు కేటాయిస్తారు.
 - 2) ఒప్పంద/ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన గతంలో పని అనుభవానికి 15% మార్కులు కేటాయిస్తారు.
 - 3) ఇంటర్న్‌షిప్ పూర్తి చేసిన ఏడాదినుంచి ప్రతి సంవత్సరానికి 1మార్కు చొప్పున 10 మార్కులు కేటాయిస్తారు.
 - దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మరే ఇతర పద్ధతిలో దరఖాస్తులు అంగీకరించబడవు.
 
ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: డిసెంబర్ 17, 2020.
 - దరఖాస్తుకు చివరి తేది: డిసెంబర్ 21, 2020.
 - ఎంపికైన వారి తుది జాబితా వెల్లడించే తేది: డిసెంబర్ 29, 2020.
 - నియామక పత్రాలు అందజేసే తేది: డిసెంబర్ 30, 2020.
 - వెబ్‌సైట్: https://krishna.ap.gov.in/
 
కామెంట్‌లు