4, ఆగస్టు 2022, గురువారం

Bank Jobs: ఏదైనా డిగ్రీతో 6432 పోస్టులు

శవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్లు/మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌(ఐబీపీఎస్‌పీవో/ఎంటీ 2022) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా 6432 పోస్టులు భర్తీచేయనున్నారు.

మొత్తం పోస్టుల సంఖ్య: 6432
బ్యాంకుల వారీగా ఖాళీలు: బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా–535, కెనరా బ్యాంక్‌–2500, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌–500, పంజాబ్‌ సింద్‌ బ్యాంక్‌–253, యూకో బ్యాంక్‌ –550, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా–2094.
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు.
వయసు: 01.08.2022 నాటికి 20 నుంచి 30ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం

  • ప్రిలిమినరీ, మెయిన్‌ రాత పరీక్షలు, ఇంటర్వ్యూ ద్వారా ఎంపికచేస్తారు.
  • ప్రిలిమినరీ పరీక్ష 100ప్రశ్నలు–100 మార్కులకు ఉంటుంది. ఇంగ్లిష్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, రీజనింగ్‌ ఎబిలిటీ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. పరీక్షా సమయం 60 నిమిషాలు. హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో పరీక్ష జరుగుతుంది.
  • మెయిన్స్‌ పరీక్ష 155 ప్రశ్నలు–200 మార్కులకు ఉంటుంది. ఇందులో రీజనింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్, జనరల్‌/ఎకానమీ/బ్యాంకింగ్‌ అవేర్‌నెస్, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్, డేటా అనాలసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రిటేషన్‌ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఉంటాయి. పరీక్షా సమయం 180 నిమిషాలు. పరీక్ష ఇంగ్లిష్, హిందీ మా«ధ్యమాల్లో నిర్వహిస్తారు. ఇంగ్లిష్‌ భాషలో లెటర్‌ రైటింగ్, ఏదైనా అంశంపై వ్యాసం రాయాల్సి ఉంటుంది. దీనికి 25 మార్కులు ఉంటాయి. పరీక్షా సమయం 30 నిమిషాలు ఉంటుంది.

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 02.08.2022
  • ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 22.08.2022
  • ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ పరీక్ష: అక్టోబర్‌ 2022
  • ఆన్‌లైన్‌ మెయిన్‌ ఎగ్జామ్‌: నవంబర్‌ 2022
  • ఇంటర్వ్యూలు: జనవరి/ఫిబ్రవరి 2023
  • తుది నియామకాలు: ఏప్రిల్‌ 2023
  • వెబ్‌సైట్‌: https://www.ibps.in/

Gemini Internet

SSC Recruitment 2022: హిందీ ట్రాన్స్‌లేటర్‌ కొలువు.. ప్రారంభంలోనే 40వేలకుపైగా వేతనం

భారత ప్రభుత్వ పర్సనల్, పబ్లిక్‌ గ్రీవెన్సెస్, పెన్షన్‌ మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ).. వివిధ కేంద్ర మంత్రిత్వశాఖల్లో గ్రూప్‌ బి, నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతుంది.

పోస్టుల వివరాలు: జూనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్లు, జూనియర్‌ ట్రాన్స్‌లేటర్లు, సీనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్లు. 
విభాగాలు: సెంట్రల్‌ సెక్రటేరియట్‌ అఫీషియల్‌ లాంగ్వేజ్‌ సర్వీస్, రైల్వే బోర్డు, ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ హెడ్‌ క్వార్టర్స్, వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలు.
ఖాళీలు: ఖాళీలకు సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడించలేదు.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్‌ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ట్రాన్స్‌లేషన్‌లో డిప్లొమా /సర్టిఫికేట్‌ కోర్సు ఉండాలి. 
వయసు: 18–30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌ 
(సీబీఈ–కంప్యూటర్‌ బేస్డ్‌ ఎగ్జామినేషన్‌) విధానంలో రెండు పేపర్లుగా పరీక్షను నిర్వహిస్తారు. మొదటి పేపర్‌కంప్యూటర్‌ బేస్డ్‌ ఎగ్జామినేషన్‌. రెండో పేపర్‌ ట్రాన్స్‌లేషన్, ఎస్సే రైటింగ్‌గా ఉంటుంది. 

వేతనాలు: వివిధ మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేసే జూనియర్‌ ట్రాన్స్‌లేటర్‌/జూనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్లకు పే లెవల్‌–6 ప్రకారం –రూ.35,400–1,12,400 వరకు వేతనంగా లభిస్తుంది. అలాగే సీనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్లు పే లెవల్‌–7 ప్రకారం– రూ.44,900–1,42,400 వరకు వేతనంగా పొందవచ్చు.

ముఖ్యసమాచారం
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 04.08.2022
ఆన్‌లైన్‌ ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: 05.08.2022
సీబీఈ తేదీ: అక్టోబర్‌ 2022
వెబ్‌సైట్‌: https://ssc.nic.in

Gemini Internet

Local Jobs కోసం ఇక్కడ క్లిక్ చేయండి | మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని అలా కాకుండా డబ్బు కట్టమని ఎవరైనా అడిగితే పట్టించుకోకండి/కట్టకండి



 

Gemini Internet

3, ఆగస్టు 2022, బుధవారం

IBPS Jobs with any Degree full details in Telugu | తెలుగులో ఏదైనా డిగ్రీ పూర్తి వివరాలతో IBPS ఉద్యోగాలు


 

Gemini Internet

Agriculture Courses through AIEEA | ICAR AIEEA ద్వారా అగ్రికల్చర్ కోర్సులు | ICAR


 

Gemini Internet

Local Jobs కోసం ఇక్కడ క్లిక్ చేయండి | మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని అలా కాకుండా డబ్బు కట్టమని ఎవరైనా అడిగితే పట్టించుకోకండి/కట్టకండి




 

Gemini Internet

29, జులై 2022, శుక్రవారం

Teaching Jobs: సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్శిటీ, ఆంధ్రప్రదేశ్‌లో టీచింగ్‌ పోస్టులు | ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 23.08.2022 దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరితేది: 02.09.2022

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, విజయనగరంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయమైన సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్శిటీ ఆఫ్‌ ఏపీ.. వివిధ విభాగాల్లో టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 18
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్లు–03, అసోసియేట్‌ ప్రొఫెసర్లు–05, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు–10.
విభాగాలు: బయోటెక్నాలజీ, బోటనీ, బిజినెస్‌ మేనేజ్‌మెంట్, కెమిస్ట్రీ, కంప్యూటర్‌ సైన్స్, ఇంగ్లిష్, జియాలజీ, జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్, సోషియాలజీ, సోషల్‌ వర్క్, టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్, ట్రైబల్‌ స్టడీస్‌.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 55శాతం మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. నెట్‌/స్లెట్‌/సెట్‌ అర్హతతోపాటు టీచింగ్‌/పరిశోధన అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 23.08.2022
దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరితేది: 02.09.2022

వెబ్‌సైట్‌: https://www.ctuap.ac.in/

 

Gemini Internet

Local Jobs కోసం ఇక్కడ క్లిక్ చేయండి | మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని అలా కాకుండా డబ్బు కట్టమని ఎవరైనా అడిగితే పట్టించుకోకండి/కట్టకండి




 

Gemini Internet

24, జులై 2022, ఆదివారం

*IT రిటర్న్ లో--పొందగలిగే మినహాయింపులు*


1. సెక్షన్ 24 : కొత్త ఇల్లు కొనుగోలుకు తీసుకున్న గృహ రుణాలపై చెల్లించిన వడ్డీ క్లెయిమ్ చేయొచ్చు.

2. సెక్షన్ 80D : బీమాలేని సీనియర్ సిటిజన్ తల్లిదండ్రులకు మీరు మెడికల్ బిల్లులు చెల్లిస్తే రూ. 50,000 వరకు తగ్గింపును క్లెయిమ్ చేయొచ్చు.

3. సెక్షన్ 80D : ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్.. పర్సనల్, లైఫ్ పార్ట్‌నర్, డిపెండెంట్ చిల్డ్రన్ కోసం రూ. 5,000 వరకు క్లెయిమ్ చేయొచ్చు.

4. సెక్షన్ 80GG : యజమాని నుంచి హెచ్‌ఆర్‌ఏ పొందకుంటే మీ అద్దెకు రూ. 60,000 వరకు తగ్గింపును క్లెయిమ్ చేయొచ్చు.

5. సెక్షన్ 80DDB : నిర్దేశిత వ్యాధులతో బాధపడుతున్న డిపెండెంట్స్ చికిత్స కోసం రూ. 40,000 తగ్గింపును క్లెయిమ్ చేయొచ్చు.

6. సెక్షన్ 80U/80DD : వికలాంగ పన్ను చెల్లింపుదారులు U/s 80U, డిజేబుల్డ్ డిపెండెంట్స్ u/s 80DD ద్వారా రూ. 75,000 నుంచి రూ. 1,25,000 వరకు తగ్గింపును క్లెయిమ్ చేయొచ్చు.

7. సెక్షన్ 80C/CCD : నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)లో పెట్టుబడి పెట్టడం ద్వారా రూ. 1,50,000 u/s 80 C , రూ. 50,000 u/s 80CCD తగ్గింపును క్లెయిమ్ చేయొచ్చు.

8. సెక్షన్ 80C/ 24 : మీరు ఉమ్మడి గృహ రుణగ్రహీత అయితే హోమ్ లోన్ పన్ను ప్రయోజనాన్ని పొందవచ్చు. ఇందుకోసం ఒక్కొక్కరు ప్రిన్సిపల్ రీపేమెంట్ కోసం రూ. 1,50,000 u/s 80C,

వడ్డీ రీపేమెంట్ కోసం రూ. 2,00,000 u/s 24 క్లెయిమ్ చేయొచ్చు.
80EE క్రింద మరొక 50000 అదనంగా మినహాయింపు పొందవచ్చు.

9. హిందూ అవిభాజ్య కుటుంబం (HUF).. ఒక ప్రత్యేక సంస్థ అయినందున వివిధ విభాగాల కింద మినహాయింపులను క్లెయిమ్ చేయొచ్చు.

10. సెక్షన్ 80G : రిజిస్టర్డ్ ధార్మిక సంస్థలు లేదా ఎన్‌జీవోలకు చేసిన విరాళాల కోసం తగ్గింపులను క్లెయిమ్ చేయొచ్చు.

11. మీ మూలధన నష్టాలను మర్చిపోవద్దు. మూలధన లాభాలపై పన్నులు చెల్లిస్తున్నప్పుడు.. స్వల్పకాలిక లేదా దీర్ఘకాలికంగా, మీరు మీ నష్టాలను లాభాలకు వ్యతిరేకంగా సెట్ చేయొచ్చు.

ఈ సంవత్సరం మీ పన్నును ఆదా చేయడానికి లేదా వచ్చే ఏడాది పన్ను ఆదా కోసం ప్లాన్ చేసేందుకు ఈ తగ్గింపులను ఉపయోగించవచ్చు.

Gemini Internet

Local Jobs కోసం ఇక్కడ క్లిక్ చేయండి | మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని అలా కాకుండా డబ్బు కట్టమని ఎవరైనా అడిగితే పట్టించుకోకండి/కట్టకండి



 

Gemini Internet