హైదరాబాద్ లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వాక్ – ఇన్ – ఇంటర్వ్యూలు :
భారత కేంద్ర ప్రభుత్వ సంస్థ మరియు సైన్స్ & టెక్నాలజీ
మంత్రిత్వాశాఖలో బయో టెక్నాలజీ విభాగానికి చెందిన హైదరాబాద్ లోని నేషనల్
ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయో టెక్నాలజీ (NIAB) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల
భర్తీకి ఒక మంచి నోటిఫికేషన్ విడుదల అయినది.
ఎటువంటి పరీక్షలు లేకుండా కేవలం ఇంటర్వ్యూల ద్వారా భర్తీ
చేయబడే ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర
అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుకు చివరి తేది | జనవరి 4,2021 |
ఇంటర్వ్యూ నిర్వహణ తేది | జనవరి 5,2021 |
ఇంటర్వ్యూ నిర్వహణ వేదిక :
నేషనల్
ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయో టెక్నాలజీ, సర్వే నెంబర్ : 37,
జర్నలిస్ట్ కాలనీ ప్రక్కన, గౌలిదొడ్డి దగ్గర, గచ్చిబౌలి, హైదరాబాద్ –
500032.
విభాగాల వారీగా ఖాళీలు :
ప్రాజెక్ట్ అసోసియేట్ – II | 1 |
ప్రాజెక్ట్ అసోసియేట్ -I | 3 |
ఫీల్డ్ అసిస్టెంట్ | 4 |
అర్హతలు :
ప్రాజెక్ట్
అసోసియేట్ II ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బిజినెస్
అడ్మినిస్ట్రేషన్ లో పీజీ డిగ్రీ (ఎంబీఏ)/వెటర్నరీ సైన్స్ (ఎంవిఎస్సీ
)/ఎంఎస్సీ (లైఫ్ సైన్స్ /బయో టెక్నాలజీ /బయో కెమిస్ట్రీ /మైక్రో బయాలజీ)
కోర్సులను పూర్తి చేయవలెను. నెట్ పరీక్షలో అర్హత సాధించని అభ్యర్థులు కూడా
దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రాజెక్ట్ అసోసియేట్ I ఉద్యోగానికి దరఖాస్తు
చేసుకునే అభ్యర్థులు వెటర్నరీ సైన్స్ లో పోస్టు గ్రాడ్యుయేషన్ /ఎంవిఎస్సీ (
డిగ్రీ )/ ఎం. ఎస్సీ (లైఫ్ సైన్స్ /బయో టెక్నాలజీ /బయో కెమిస్ట్రీ /మైక్రో
బయాలజీ ) కోర్సులను పూర్తి చేయవలెను. నెట్ అర్హతను సాధించాలి.
ఫీల్డ్
అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్,
యానిమల్ హస్బెండరీ /వెటర్నరీ సైన్స్ లో డిప్లొమా /బీ. ఎస్సీ (అగ్రికల్చర్
/లైఫ్ సైన్స్ ) కోర్సులను పూర్తి చేయవలెను. సంబంధిత రంగాలలో అనుభవం అవసరం.
ఇంగ్లీష్, కన్నడ, హిందీ, తెలుగు మాట్లాడడం వచ్చిన వారికీ ప్రాధాన్యత
ఇస్తారు.
వయసు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు
చేసుకునే అభ్యర్థులకు 35 సంవత్సరాల వయసు ఉండవలెను.ఓబీసీ అభ్యర్థులకు
3సంవత్సరాలు, ఎస్సీ /ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయసు సడలింపు కలదు.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ విధానం ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
ఎంపిక విధానం :
ఆన్లైన్ ఇంటర్వ్యూ విధానం ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 30,000 రూపాయలు నుండి 55,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.
ఈమెయిల్ అడ్రస్ :
అభ్యర్థులు తమ దరఖాస్తు వివరాలను ఈ క్రింది ఈమెయిల్ అడ్రస్ కు చేయవలెను.
pankajsuman@niab.org.in
Website