18, జనవరి 2022, మంగళవారం

RRB NTPC CBT-2: ఆర్​ఆర్​బీ ఎన్​టీపీసీ సీబీటీ–2 పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఎగ్జామ్​​, సిలబస్, కటాఫ్​ మార్కులు గురించి సమాచారం

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (Railway Recruitment Board) ఎన్​టీపీసీ(NTPC) సీబీటీ–1 ఫలితాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. సీబీటీ–1 పరీక్షను దాదాపు 7 లక్షల మంది క్లియర్​ చేశారు. వీరంతా సీబీటీ–2 పరీక్ష కోసం ప్రిపేరవుతున్నారు. సీబీటీ-1 పరీక్ష 2020 డిసెంబర్ 28 నుంచి 2021 జూలై 31 మధ్య వరకు మొత్తం ఏడు దశల్లో జరిగింది. తాజాగా బోర్డు జారీ చేసిన నోటీసు ప్రకారం, రెండో దశ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT–2) ఫిబ్రవరి 14 నుంచి 18 వరకు జరగనుంది. అంటే కేవలం నెల రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ తక్కువ సమయంలో సీబీటీ–2కు ఎలా ప్రిపేర్ (Prepare) అవ్వాలి..? ప్రశ్నల సరళి ఎలా ఉంటుంది? సిలబస్​ ఏంటి? అనే విషయాలను తెలుసుకుందాం.

Gemini Internet

ఆర్​ఆర్​బీ ఎన్​టీపీసీ CBT 2 పరీక్ష 90 నిమిషాల వ్యవధి కలిగి ఉంటుంది. దీనిలో జనరల్ అవేర్​నెస్​, మ్యాథమేటిక్స్​, జనరల్ ఇంటలిజెన్స్​ అండ్​ రీజనింగ్​ విభాగాల నుంచి 120 ప్రశ్నలొస్తాయి. మ్యాథ్స్, జనరల్ ఇంటెలిజెన్స్‌ అండ్​ రీజనింగ్​ నుంచి 35 ప్రశ్నలు చొప్పున, జనరల్​ అవేర్​నెస్​ నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు. ప్రతి తప్పు సమాధానానికి మూడింట ఒక వంతు మార్కు కోత విధిస్తారు.

ఆర్​ఆర్​ఆబీ ఎన్​టీపీసీ సీబీటీ–2 సిలబస్

మ్యాథమెటిక్స్​..

నంబర్​ సిస్టమ్​, డెసిమల్స్, ఫంక్షన్లు, LCM, HCF, రేషియో అండ్​ ప్రపోర్షన్​, పర్సంటేజ్​, టైమ్​ అండ్​ వర్క్​, టైమ్​ అండ్​ డిస్టన్స్​, సింపుల్​ అండ్​ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్​ లాస్​, ఎలిమెంటరీ ఆల్​జీబ్రా, జామెట్రీ అండ్​ ట్రిగనామెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్​ నుంచి ప్రశ్నలొస్తాయి.

జనరల్ ఇంటెలిజెన్స్ అండ్​ రీజనింగ్..

అనాలజీస్​, నంబర్స్​, ఆల్ఫాబెటికల్ సిరీస్​, కోడింగ్​ అండ్​ డీకోడింగ్​, మ్యాథమెటికల్ ఆపరేషన్లు, సిమిలారిటీస్​ అండ్​ డిఫరెన్సస్​, రిలేషన్​షిప్స్​, అనలిటికల్​ రీజనింగ్​, సిలోజిజం, జంబ్లింగ్, వెన్ డయాగ్రమ్స్​, పజిల్, డేటా సఫిషియన్సీ, స్టేట్​మెంట్ కన్​క్లూజన్​, స్టేట్​మెంట్ కోర్సెస్​ ఆఫ్​ యాక్షన్​, డెసిజన్​ మేకింగ్​, మ్యాప్స్​, గ్రాఫ్​ ఇంటర్​ప్రిటేషన్​ మొదలైనవి.

జనరల్ అవేర్​నెస్​..

జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రస్తుత సంఘటనలు, ఆటలు, క్రీడలు, భారతదేశ కళ, సంస్కృతి, భారతీయ సాహిత్యం, స్మారక చిహ్నాలు, భారతదేశంలోని ప్రదేశాలు, జనరల్ సైన్స్ మరియు లైఫ్ సైన్స్ (10వ తరగతి వరకు), భారతదేశ చరిత్ర, స్వాతంత్య్ర పోరాటం, భారత్​తో పాటు ప్రపంచ సామాజిక ఆర్థిక భౌగోళిక శాస్త్రం, భారత రాజకీయాలు, పాలన- రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ, ఐక్యరాజ్య సమితి, ఇతర ముఖ్యమైన ప్రపంచ సంస్థలు, అంతరిక్ష, అణు కార్యక్రమాలతో సహా సాధారణ శాస్త్ర, సాంకేతిక పరిణామాలు, భారతదేశం, ప్రపంచానికి సంబంధించిన పర్యావరణ సమస్యలు, ప్రాథమిక అంశాలు కంప్యూటర్లు, కంప్యూటర్ అప్లికేషన్‌లు, సాధారణ సంక్షిప్తాలు, భారతదేశంలో రవాణా వ్యవస్థలు, భారత ఆర్థిక వ్యవస్థ, భారతదేశంతో పాటు ప్రపంచంలోని ప్రసిద్ధ వ్యక్తులు, ప్రధాన ప్రభుత్వ కార్యక్రమాలు, భారతదేశంలోని వృక్షజాలం, జంతుజాలం, భారతదేశంలోని ముఖ్యమైన ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు మొదలైనవి.

సీబీటీ–2 కటాఫ్​ మార్కులు..

సీబీటీ–2లో ఉత్తీర్ణత సాధించడానికి, అభ్యర్థులకు కనీస అర్హత మార్కుల సాధించాలి. అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీ, EWS అభ్యర్థులు కనీసం 40 శాతం మార్కులు సాధించాలి. ఓబీసీ (నాన్ క్రీమీ లేయర్) అభ్యర్థులకు కనీసం 30 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు కనీసం 30 శాతం మార్కులు సాధించాలి. సీబీటీ–‘లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు టైపింగ్ స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. సీబీటీ–2, టైపింగ్​ టెస్ట్ మార్కుల ఆధారంగా ఫైనల్​ సెలక్షన్ ఉంటుంది.

 

 

RBI Recruitment 2022: ఉద్యోగాల భర్తీకి ఆర్‌బీఐ జాబ్ నోటిఫికేషన్.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. లీగల్ ఆఫీసర్, మేనేజర్, క్యూరేటర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 14 ఖాళీలున్నాయి. ఆర్‌బీఐ హెడ్‌క్వార్టర్స్‌తో పాటు కోల్‌కతాలోని ఆర్‌బీఐ మ్యూజియంలో ఈ పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2022 ఫిబ్రవరి 4 చివరి తేదీ. ఇవి ఫుల్ టైమ్ కాంట్రాక్ట్ పోస్టులు. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేయాలి. ఆఫ్‌లైన్ దరఖాస్తుల్ని స్వీకరించరు. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.

RBI Recruitment 2022: ఖాళీల వివరాలు ఇవే...



మొత్తం ఖాళీలు14విద్యార్హతలువయస్సు
లీగల్ ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బీ2గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లా కనీసం 50 శాతం మార్కులతో పాస్ కావాలి.21 నుంచి 32 ఏళ్లు
మేనేజర్ (టెక్నికల్-సివిల్)6సివిల్ ఇంజనీరింగ్ లేదా తత్సమాన సబ్జెక్ట్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ కనీసం 60 శాతం మార్కులతో పాస్ కావాలి.21 నుంచి 35 ఏళ్లు
మేనేజర్ (టెక్నికల్-ఎలక్ట్రికల్)3ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో బీటెక్ లేదా బీఈ కనీసం 60 శాతం మార్కులతో పాస్ కావాలి.21 నుంచి 35 ఏళ్లు
లైబ్రరీ ప్రొఫెషనల్స్ (అసిస్టెంట్ లైబ్రేరియన్) ఇన్ గ్రేడ్ ఏ1బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్, కామర్స్, సైన్స్‌తో పాటు మాస్టర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ లేదా లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ పాస్ కావాలి.21 నుంచి 30 ఏళ్లు
ఆర్కిటెక్ట్ ఇన్ గ్రేడ్ ఏ1ఆర్కిటెక్చర్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ కనీసం 60 శాతం మార్కులతో పాస్ కావాలి.21 నుంచి 30 ఏళ్లు

Gemini Internet

దరఖాస్తు ప్రారంభం- 2022 జనవరి 15

దరఖాస్తుకు చివరి తేదీ- 2022 ఫిబ్రవరి 4 సాయంత్రం 6 గంటలు

పరీక్ష తేదీ- 2022 మార్చి 6

విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.

దరఖాస్తు ఫీజు- జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.600, ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులకు రూ.100 ఫీజు చెల్లించాలి.

ఎంపిక విధానం- ఇంటర్వ్యూ

ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

RBI Recruitment 2022: అప్లై చేయండి ఇలా...

Step 1- అభ్యర్థులు ఆర్‌బీఐ కెరీర్స్ వెబ్‌సైట్ https://opportunities.rbi.org.in/ ఓపెన్ చేయాలి.

Step 2- Current Vacancies సెక్షన్‌లో లీగల్ ఆఫీసర్, మేనేజర్, క్యూరేటర్ ఉద్యోగాల నోటిఫికేషన్ క్లిక్ చేయాలి.

Step 3- నియమనిబంధనలన్నీ చదివిన తర్వాత Online Application Form పైన క్లిక్ చేయాలి.

Step 4- కొత్త వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది.

Step 5- అందులో Click here for New Registration పైన క్లిక్ చేయాలి.

Step 6- మొత్తం 6 దశల్లో దరఖాస్తు ప్రక్రియ ఉంటుంది.

Step 7- మొదటి దశలో పేరు, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ లాంటి వివరాలు ఎంటర్ చేయాలి.

Step 8- రెండో దశలో ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.

Step 9- మూడో దశలో విద్యార్హతలు, ఇతర వివరాలు ఎంటర్ చేయాలి.

Step 10- నాలుగో దశలో అప్లికేషన్ ప్రివ్యూ చూసి వివరాలన్నీ సరిచూసుకోవాలి.

Step 11- ఐదో దశలో ఇతర సర్టిఫికెట్స్ అప్‌లోడ్ చేయాలి.

Step 12- ఆరో దశలో ఫీజు పేమెంట్ చేసి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి.

 

NIRDPR Recruitment 2022: హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు

కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన స్వయంప్రతిపత్తిగల సంస్థ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్ (NIRD&PR) ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. రీసెర్చ్ అసోసియేట్, డేటా అనలిస్ట్, ప్రాజెక్ట్ అసోసియేట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఖాళీల సంఖ్య వెల్లడించలేదు. హైదరాబాద్‌తోపాటు గువాహతిలో ఈ పోస్టులు ఉన్నాయి. ఇవి ఒక ఏడాది గడువు ఉన్న కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2022 జనవరి 26 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు దరఖాస్తు లింక్స్ ఉన్నాయి. ఖాళీల వివరాలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.

NIRDPR Recruitment 2022: ఖాళీల వివరాలు ఇవే...

 పోస్టు పేరు విద్యార్హతలు వయస్సు అనుభవంవేతనం
 డేటా అనలిస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ 40 ఏళ్లు 2 నుంచి 5 ఏళ్లు నెలకు రూ.40,000
 ఆఫీస్ అసిస్టెంట్ పదో తరగతి 40 ఏళ్లు 5 ఏళ్లు నెలకు రూ.16,000
 వుమెన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్ కో-ఆర్డినేటర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ 50 ఏళ్లు 5 నుంచి 8 ఏళ్లు నెలకు రూ.90,000
 ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ 40 ఏళ్లు 2 ఏళ్లు నెలకు రూ.30,000
 ఫైనాన్స్ అసోసియేట్ డిగ్రీ 40 ఏళ్లు 3 ఏళ్లు నెలకు రూ.30,000
 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పదో తరగతి 30 ఏళ్లు 2 ఏళ్లు నెలకు రూ.12,000
 రీసెర్చ్ అసోసియేట్ డాక్టోరల్ 40 ఏళ్లు 2 ఏళ్లు నెలకు రూ.40,000
 ట్రైనింగ్ మేనేజర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ 45 ఏళ్లు 2 ఏళ్లు నెలకు రూ.30,000
 రీసెర్చ్ అసోసియేట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ 30 ఏళ్లు 2 ఏళ్లు నెలకు రూ.22,000
 మేనేజర్ (టెక్నికల్) పోస్ట్ గ్రాడ్యుయేషన్ 35 ఏళ్లు 3 ఏళ్లు నెలకు రూ.50,000
 ట్రైనింగ్ మేనేజర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ 35 ఏళ్లు 2 ఏళ్లు నెలకు రూ.45,000

దరఖాస్తుకు చివరి తేదీ- 2022 జనవరి 26 సాయంత్రం 6.30 గంటలు

విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.

ఎంపిక ప్రక్రియ- ఇంటర్వ్యూ

కాంట్రాక్ట్ గడువు- 2022 ఫిబ్రవరి నుంచి 2023 మార్చి వరకు

ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

16, జనవరి 2022, ఆదివారం

TTD Update 🕉 *జ‌న‌వ‌రి 16న శ్రీ‌వారి ఆల‌యంలో ఏకాంతంగా పార్వేటు ఉత్సవం* 🕉 *జ‌న‌వ‌రి 17న ఏకాంతంగా శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి*

🕉 *జ‌న‌వ‌రి 16న శ్రీ‌వారి ఆల‌యంలో ఏకాంతంగా పార్వేటు ఉత్సవం*
🕉 *జ‌న‌వ‌రి 17న ఏకాంతంగా శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి*
        ➖〰️〰️〰️〰️〰️〰️➖
🕉 TTD News ™ తిరుమల:
కోవిడ్ -19 వ్యాప్తి నేప‌థ్యంలో జ‌న‌వ‌రి 16వ తేదీ ఆదివారం శ్రీ‌వారి ఆల‌యంలో ఏకాంతంలో పార్వేటు ఉత్సవం నిర్వహించనున్నారు.

◆ శ్రీ‌వారి పార్వేటు ఉత్సవం సాంప్రదాయక వార్షిక ఉత్సవం. ఈ ఉత్స‌వాన్ని ప్రతి సంవత్సరం కనుమ రోజున జరుపుకుంటారు. ఈ ఉత్సవంలో శ్రీ మలయప్ప స్వామి అడవులకు వెళ్లి తన భక్తులను రక్షించడానికి క్రూర మృగాలను వేటాడతారు.

👉కనీ కోవిడ్ ప్రభావం కారణంగా, గత సంవత్సరం కల్యాణోత్సవ మండపం లోపల వనాన్ని పునర్నిర్మించి ఈ ఉత్సవాన్ని నిర్వహించారు.

కోవిడ్ కేసులు ఇంకా ప్రబలంగా ఉన్నందున, ఈ సంవత్సరం కూడా గ‌త ఏడాది నిర్వ‌హించిన విధంగానే ఏకాంతంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది.

🕉 *జ‌న‌వ‌రి 17న ఏకాంతంగా శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి*

అదేవిధంగా జనవరి 17న తిరుమలలో నిర్వహించే శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటిని ఏకాంతంలో నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది. భక్తులు ఈ విషయాన్ని గమనించ‌గ‌ల‌రు.
 *Dept.Of PRO TTD*

Gemini Internet

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ప్రిపరేషన్ గురించి తెలుసుకోండి Know about APPSC Preparation

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ).. ఒకేసారి ఏడు వందలకు పైగా పోస్ట్‌లతో నోటిఫికేషన్‌లు వెలువరించడంతో.. ఉద్యోగార్థులకు సంక్రాంతి పండగ ముందే వచ్చినట్లయింది. గత కొంత కాలంగా క్రమం తప్పకుండా పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్‌లను విడుదల చేస్తున్న ఏపీపీఎస్సీ.. తాజాగా మరో రెండు నోటిఫికేషన్లతో అభ్యర్థుల ముందుకొచ్చింది. రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్ట్‌లు, దేవాదాయ శాఖలో ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌–3 పోస్ట్‌లకు.. ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో..ఏపీపీఎస్సీ తాజా నోటిఫికేషన్లు, అర్హతలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

  • రెండు శాఖల్లో కలిపి 730 పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్‌
  • రూ.16,400–రూ.48,870 శ్రేణిలో ప్రారంభ వేతనం
  • రాత పరీక్షలో మెరిట్‌ ఆధారంగా ఎంపిక
  • దరఖాస్తుల సంఖ్య ఆధారంగా స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహించే అవకాశం
  • సిలబస్‌పై సంపూర్ణ అవగాహనతో విజయం సాధించొచ్చు

ఏపీపీఎస్సీ ఇటీవల 730 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌లు విడుదల చేసింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు.. అభ్యర్థులు ఇప్పటి నుంచే కృషి చేయాలి. ఇందుకోసం ఆయా నోటిఫికేషన్లలో పేర్కొన్న సిలబస్‌కు అనుగుణంగా ప్రిపరేషన్‌ సాగిస్తే.. విజయావకాశాలు మెరుగుపరచుకోవచ్చు అంటున్నారు నిపుణులు.

రెండు శాఖలు, 730 పోస్ట్‌లు

  • ఏపీపీఎస్సీ రెండు శాఖల్లో మొత్తం 730 పోస్ట్‌లను భర్తీ చేయనుంది. అవి..
  • ఏపీ రెవెన్యూ శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ అసిస్టెంట్‌ పోస్టులు–670.
  • దేవాదాయ శాఖలో ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌–3–పోస్టులు– 60.
  • అభ్యర్థులు ఈ రెండు నోటిఫికేషన్లకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
  • బ్యాచిలర్‌ డిగ్రీ అర్హతగా పేర్కొన్న ఈ రెండు రకాల పోస్ట్‌ల భర్తీకి ఏపీపీఎస్సీ వేర్వేరుగా ఎంపిక ప్రక్రియ నిర్వహించనుంది.

రాత పరీక్షలో మెరిట్‌

ఏపీపీఎస్సీ నిర్వహించే రాత పరీక్షలో మెరిట్‌ ఆధారంగానే ఈ పోస్టుల భర్తీ చేపడతారు. ఈ రెండు పోస్ట్‌లకు సంబంధించిన రాత పరీక్షలో ఒక పేపర్‌ జనరల్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ ఉంటుంది. రెండో పేపర్‌ మాత్రం జూనియర్‌ అసిస్టెంట్స్‌ పోస్ట్‌లకు,ఎండోమెంట్‌ ఆఫీసర్‌ పోస్ట్‌లకు వేర్వేరుగా ఉంటుంది. దీంతో..బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులు సమయ పాలన, నిర్దిష్ట వ్యూహంతో..ప్రిపరేషన్‌ సాగిస్తే.. ఒకే సమయంలో రెండు పరీక్షలకు సన్నద్ధమై.. రెండు పోస్ట్‌లకు పోటీ పడే అవకాశం ఉంది.

దరఖాస్తుల సంఖ్య ఆధారంగా

  • ఒక్కో పోస్ట్‌కు దరఖాస్తుల సంఖ్య 200 దాటితే.. ముందుగా స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. స్క్రీనింగ్‌ టెస్ట్‌లో ప్రతిభ చూపిన వారిని తదుపరి దశలో మెయిన్‌ పరీక్ష నిర్వహిస్తామని స్పష్టం చేసింది. 
  • ఒక్కో పోస్ట్‌కు నిర్దిష్ట నిష్పత్తిలో మెయిన్‌ పరీక్షకు అభ్యర్థులను ఎంపిక చేస్తామని పేర్కొంది. మెయిన్‌ పరీక్షలో పొందిన మెరిట్‌ ఆధారంగా మెరిట్‌ జాబితా రూపొందించి నియామకాలు ఖరారు చేయనున్నారు.

స్క్రీనింగ్‌ టెస్ట్‌లు ఇలా

  • రెవెన్యూ శాఖలోని జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ అసిస్టెంట్, దేవాదాయ శాఖలోని ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పోస్ట్‌లకు సంబంధించి స్క్రీనింగ్‌ పరీక్ష విధానాలు..
  • జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ అసిస్టెంట్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌: ఈ పరీక్ష రెండు విభాగాలుగా రెండు సబ్జెక్ట్‌లలో 150 మార్కులకు జరగనుంది.
    విభాగం సబ్జెక్ట్‌ ప్రశ్నలు మార్కులు సమయం
    జీఎస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ 100 100 100ని
    బి జనరల్‌ ఇంగ్లిష్‌ అండ్‌ జనరల్‌ తెలుగు 50 50 50ని

ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌–3 స్క్రీనింగ్‌ టెస్ట్‌:

  • ఈ పరీక్ష కూడా రెండు విభాగాలుగా 150 మార్కులకు జరుగనుంది. వివరాలు..
    విభాగం సబ్జెక్ట్‌ ప్రశ్నలు మార్కులు సమయం
    జీఎస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ 50 50 50 ని
    బి హిందూ తత్వం దేవాలయ వ్యవస్థ 100 100 100 ని
  • రెండు పోస్ట్‌లకు నిర్వహించే స్క్రీనింగ్‌ పరీక్ష పూర్తిగా పెన్‌ పేపర్‌ విధానంలోనే ఉంటుంది. అభ్యర్థులు ఓఎంఆర్‌ షీట్‌పై సమాధానాలు నింపాలి.
  • నెగిటివ్‌ మార్కుల విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి సదరు ప్రశ్నకు కేటాయించిన మార్కుల నుంచి 1/3 మార్కులు తగ్గిస్తారు. 
  • రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లోని జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ అసిస్టెంట్‌ పోస్ట్‌లకు నిర్వహించే పార్ట్‌–బి పేపర్‌లో.. జనరల్‌ ఇంగ్లిష్‌ నుంచి 25 ప్రశ్నలు, జనరల్‌ తెలుగు నుంచి 25 ప్రశ్నలు అడుగుతారు.

మెయిన్‌ పరీక్ష

స్క్రీనింగ్‌ టెస్ట్‌లో నిర్దేశిత కటాఫ్‌ మార్కులు పొందిన వారికి తదుపరి దశలో మెయిన్‌ పరీక్ష నిర్వహిస్తారు. ఇది కంప్యూటర్‌ బేస్డ్‌(ఆన్‌లైన్‌) టెస్ట్‌గా ఉంటుంది.

  • జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ అసిస్టెంట్‌ మెయిన్‌: ఈ పరీక్ష రెండు పేపర్లుగా మొత్తం 300 మార్కులకు జరగనుంది. పూర్తిగా ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నలు ఉంటాయి. వివరాలు..
    పేపర్‌ సబ్జెక్ట్‌ ప్రశ్నలు మార్కులు
    పేపర్‌–1 జీఎస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ 150 150
    పేపర్‌–2 జనరల్‌ ఇంగ్లిష్‌ అండ్‌ జనరల్‌ తెలుగు 150 150
  • పేపర్‌–2లో జనరల్‌ ఇంగ్లిష్‌ నుంచి 75 ప్రశ్నలు, జనరల్‌ తెలుగు నుంచి 75 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి పేపర్‌కు పరీక్ష సమయం రెండున్నర గంటలు. 
  • ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌–3 (ఎండోమెంట్‌ సబ్‌ సర్వీస్‌) మెయిన్‌: ఈ పరీక్ష కూడా రెండు పేపర్లుగా 300 మార్కులకు జరగనుంది. వివరాలు..
    పేపర్‌ సబ్జెక్ట్‌ ప్రశ్నలు మార్కులు
    పేపర్‌–1 జీఎస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ 150 150
    పేపర్‌–2 హిందూ తత్వం దేవాలయ వ్యవస్థ 150 150
  • ఈ పరీక్ష కూడా పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలోనే ఉంటుంది.
  • ప్రతి పేపర్‌కు పరీక్ష సమయం రెండున్నర గంటలు.

ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌–3 (ఏపీ ఎండోమెంట్స్‌ సబ్‌ సర్వీస్‌)

  • మొత్తం పోస్టుల సంఖ్య: 60
  • వేతన శ్రేణి: రూ.16,400 – రూ.49,870
  • అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి
  • వయో పరిమితి: జూలై 1, 2021 నాటికి 18–42 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో అయిదేళ్ల సడలింపు లభిస్తుంది.
  • దరఖాస్తులకు చివరి తేదీ: 19.01.2022
  • వెబ్‌సైట్‌: https://psc.ap.gov.in

జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ అసిస్టెంట్‌(రెవెన్యూ శాఖ) (గ్రూప్‌–4 సర్వీసెస్‌)

  • మొత్తం పోస్టుల సంఖ్య: 670
  • ప్రారంభ వేతన శ్రేణి: రూ.16,400 –రూ.49,870.
  • అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. తుది ఎంపికకు షార్ట్‌లిస్ట్‌ అయిన అభ్యర్థులు కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌లోనూ ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
  • వయో పరిమితి: జూలై 1, 2021 నాటికి 18–42 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ,ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో అయిదేళ్ల సడలింపు లభిస్తుంది. 
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తులకు చివరి తేది: 19.01.2022
  • వెబ్‌సైట్‌: https://psc.ap.gov.in

నిర్దిష్ట ప్రణాళికతో.. విజయం దిశగా

  • రెండు శాఖల్లోని పోస్టులకు కూడా స్క్రీనింగ్‌ టెస్ట్‌లో పేర్కొన్న సబ్జెక్ట్‌లనే మెయిన్‌ పరీక్షలోనూ పేర్కొన్నారు. 
  • స్క్రీనింగ్, మెయిన్‌లకు ఒకే సిలబస్‌ అంశాలను పేపర్లుగా నిర్దేశించినా.. మెయిన్‌లో అడిగే ప్రశ్నలు లోతుగా ఉండే అవకాశం ఉంది. 
  • కాబట్టి మొదటి నుంచే మెయిన్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రిపరేషన్‌ సాగించాలి. తద్వారా స్క్రీనింగ్‌ టెస్ట్‌లో సులభంగా విజయం సాధించి మెయిన్‌కు అర్హత పొందొచ్చు.
  • అభ్యర్థులు ప్రిపరేషన్‌కు ముందే ఆయా సబ్జెక్ట్‌ల సిలబస్‌లను ఆమూలాగ్రం పరిశీలించాలి. స్క్రీనింగ్, మెయిన్‌ పరీక్షల సిలబస్‌ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించాలి.
  • భిన్నంగా ఉన్న అంశాలను ప్రత్యేకంగా నోట్‌ చేసుకొని.. వాటి ప్రిపరేషన్‌కు ప్రత్యేక సమయం కేటాయించాలి. 
  • దేవాదాయ శాఖలోని ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పోస్ట్‌లకు స్క్రీనింగ్, మెయిన్‌లో ఉన్న హిందూతత్వం, దేవాలయ వ్యవస్థ పేపర్‌కు సంబంధించి ప్రత్యేకంగా అధ్యయనం కొనసాగించాలి. 
  • పురాణాలు, ఇతిహాసాలు, వేద సంస్కృతి, కళలు, ఉపనిషత్తులు, కుటుంబ వ్యవస్థ, దేవాలయాలకు వచ్చే ఆదాయ మార్గాలు, ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ విధులు, ఎండోమెంట్‌ భూములకు సంబంధించిన చట్టాలు, భూ రికార్డులపై అవగాహన పెంచుకోవాలి.
  • జనరల్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీకి సంబంధించి.. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం ఉన్న అంశాలు; భారతదేశ, ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర, ఆర్థికాభివృద్ధి ,ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం, పునర్విభజన సమస్యల గురించి అధ్యయనం చేయాలి.
  • ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, లక్షిత వర్గాలు, లబ్ధిదారులు, బడ్జెట్‌ కేటాయింపుల గురించి తెలుసుకోవాలి.
  • మెంటల్‌ ఎబిలిటీ విభాగంలో.. రాణించేందుకు టాబ్యులేషన్, డేటా సమీకరణ, డేటా విశ్లేషణలపై అవగాహన పెంచుకోవాలి.
  • రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లోని జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ అసిస్టెంట్‌ పోస్ట్‌లకు పేర్కొన్న జనరల్‌ ఇంగ్లిష్, జనరల్‌ తెలుగు పేపర్‌ కోసం ఈ రెండు భాషలకు సంబంధించి బేసిక్‌ గ్రామర్‌ అంశాలు, యాంటానిమ్స్, సినానిమ్స్, ఫ్రేజెస్‌లపై పట్టు సాధించాలి.

ఒకే సమయంలో రెండు పోస్ట్‌లకు

ఏపీపీఎస్సీ తాజా నోటిఫికేషన్‌లను పరిశీలిస్తే.. ఒకే సమయంలో రెండు శాఖల్లోని పోస్ట్‌లకు సన్నద్ధమయ్యే అవకాశం ఉంది. రెండు శాఖల్లోని పోస్ట్‌లకు జనరల్‌ స్టడీస్, మెంటల్‌ ఎబిలిటీ పేపర్‌ ఉంది. ఈ పేపర్‌కు ఉమ్మడి ప్రిపరేషన్‌ సాగిస్తూ.. రెండో పేపర్‌కు ప్రత్యేక సమయం కేటాయించుకోవాలి. ఫలితంగా ఒకే సమయంలో రెండు పరీక్షలకు సన్నద్ధత లభిస్తుంది. ఇలా సిలబస్‌ పరిశీలన నుంచి ప్రిపరేషన్‌ వరకు ప్రత్యేక వ్యూహంతో.. అడుగులు వేస్తే విజయం సొంతం చేసుకునే అవకాశం ఉంది.

Gemini Internet

Vivo Scholarship: విద్యార్థులకు వివో శుభవార్త.. స్కాలర్‌షిప్‌తో పాటు ఉచితంగా స్మార్ట్ ఫోన్.

కరోనా (Corona) నేపథ్యంలో పేద విద్యార్థులకు చేయూతను అందించేందుకు అనేక కార్పొరేట్ సంస్థలు ముందుకు వస్తున్నాయి. విద్యార్థులకు స్కాలర్ షిప్ (Scholarship)లు అందిస్తూ వారి పై చదువులకు ప్రోత్సహిస్తున్నాయి. తాజాగా ప్రముఖ మొబైల్ తయారీదారు వివో (Vivo) విద్యార్థులకు శుభవార్త చెప్పింది. 11 క్లాస్ విద్యార్థులకు స్కాలర్ షిప్ అందించనున్నట్లు ప్రకటించింది. ప్రముఖ విద్యాసారథి (Vidyasarathi) సంస్థతో కలిసి ఈ స్కాలర్ షిప్ లు అందించడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. మెరిట్ ఆధారంగా విద్యార్థులకు స్కాలర్ షిప్ లు అందించనున్నట్లు తెలిపింది. విద్యార్థులు వారి కలలను, ఉన్నత లక్ష్యాలను సాకారం చేసుకోవడానికి ఈ స్కాలర్ షిప్ లను అందిస్తున్నట్లు వివో తెలిపింది. ఈ స్కాలర్ షిప్ తో పాటు విద్యార్థులకు వారి ఆన్లైన్ విద్యకు సహకరించేందుకు వివో స్మార్ట్ ఫోన్ ను కూడా అందించనున్నట్లు వివో తెలిపింది.

స్కాలర్ షిప్ అర్హతలు:

అభ్యర్థులు 80 శాతం మార్కులతో టెన్త్ పాసై ఉండాలి. అయితే 4 లక్షల వార్షికాదాయం కన్నా తక్కువ ఉన్న వారికే ఈ స్కాలర్ షిప్ అందించనున్నట్లు వివో తెలిపింది. అభ్యర్థులు జనవరి 13 నుంచి ఫిబ్రవరి 13 వరకు ఈ స్కాలర్ షిప్ కు అప్లై చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు.

Click here for official tweet

Image

Gemini Internet

అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే సమయంలో ఆధార్ వివరాలు, ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, పాస్ బుక్ కాపీ, టెన్త్ మార్క్స్ షీట్, ఆదాయ సర్టిఫికేట్, ఈ విద్యాసంవత్సరం ఫీజు రసీదు. బోనఫైడ్ సర్టిఫికేట్ .jpeg, .png కాపీలను వెంట తీసుకురావాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఇతర వివరాలకు vidyasaarathi@nsdl.co.in మెయిల్ చిరునామాను సంప్రదించవచ్చు. 022-40904484 నంబర్ ను సైతం సంప్రదించవచ్చు.

Visit Gemini Internet, Hindupur for Scholarships

-విద్యార్థులు ఈ లింక్ పై క్లిక్ చేసి ఈ స్కాలర్ షిప్ కు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

-స్కాలర్ షిప్ కు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి.

స్కాలర్ షిప్ వివరాలు: ఈ స్కాలర్ షిప్ కు ఎంపికైన వారికి రూ.1500తో పాటు, నూతన వివో స్మార్ట్ ఫోన్ కూడా అందిస్తారు.

 

15, జనవరి 2022, శనివారం

PF Transfer: రెండు, మూడు ఉద్యోగాలు మారారా..? పీఎఫ్‌ బదిలీ గురించి ముఖ్యమైన వివరాలు తెలుసుకోండి.

PF Transfer: మీరు తక్కువ సమయంలో రెండు, మూడు ఉద్యోగాలు మారారా.. మీ పీఎఫ్ అకౌంట్స్‌ అన్ని పెండింగ్‌లో ఉండిపోయాయా..? సాధారణంగా ఉద్యోగాలు మారినప్పుడు అందరికి ఈ భయం ఉంటుంది. కానీ ఇప్పుడు అటువంటి ఇబ్బంది ఏది ఉండదు. అన్ని కొత్త కంపెనీకి బదిలీ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో సులభంగా చేసుకోవచ్చు. ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) తన ఖాతాదారుల సౌలభ్యం కోసం నిరంతరం చర్యలు తీసుకుంటోంది. EPFO చాలా సేవలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. దీని కోసం మీరు EPFO ​​వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.

యూనివర్సల్ అకౌంట్ నంబర్ లేదా UAN ప్రారంభించినప్పటి నుంచి PF బ్యాలెన్స్‌ని ఆన్‌లైన్‌లో బదిలీ చేసే ప్రక్రియ సులభమైంది. UANతో, డబ్బు వేర్వేరు ఖాతాలలో ఉన్నప్పటికీ, ఉద్యోగి అన్ని ఖాతాలు ఒకే చోట ఉంటాయి. కాబట్టి, మీరు మీ UANని మీ ప్రస్తుత యజమానులకి షేర్ చేయడం ద్వారా నిధులన్ని ఒక్కచోటికి బదిలీ చేసుకోవచ్చు. ఇది కాకుండా, EPFO ​​2020లో కోవిడ్-19 మహమ్మారి మధ్య తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఆన్‌లైన్‌లో మీ PF బ్యాలెన్స్‌ను బదిలీ చేయడానికి ఆరు సులభమైన దశలను సూచించింది.

1. ఉద్యోగి EPFO ​​https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ యూనిఫైడ్ పోర్టల్‌కి వారి UAN నంబర్, పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ కావాలి.

2. మీరు లాగిన్ అయినప్పుడు ఆన్‌లైన్ సేవల కింద అందుబాటులో ఉండే ‘సభ్యుడు – EPF ఖాతా (బదిలీ అభ్యర్థన)’పై క్లిక్ చేయాలి.

3.మీరు ప్రస్తుతం ఉద్యోగం కోసం వ్యక్తిగత సమాచారాన్నిధృవీకరించాలి.

4. మునుపటి ఉద్యోగానికి సంబంధించిన PF ఖాతాకు సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి మీరు దిగువన ఉన్న ‘వివరాలను పొందండి’పై క్లిక్ చేయాలి.

5. DSC లభ్యత ఆధారంగా క్లెయిమ్ ఫారమ్‌ను ధృవీకరించడం కోసం, మీరు మీ మునుపటి యజమాని లేదా ప్రస్తుత యజమానిని ఎంచుకోవడానికి ఎంపికలను పొందుతారు. మీరు యజమానులలో ఎవరినైనా ఎంచుకోవచ్చు.

6. మీరు UAN నమోదిత మొబైల్ నంబర్‌కు ‘OTP పొందండి’ దానిని నమోదు చేసి ఓకె బటన్‌పై క్లిక్ చేయాలి.

7. పైన పేర్కొన్న ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత యజమాని ఏకీకృత పోర్టల్, యజమాని ఇంటర్‌ఫేస్‌ను యాక్సెస్ చేయడం ద్వారా మీ EPF బదిలీ అభ్యర్థనను డిజిటల్‌గా ఆమోదిస్తారు. మీరు ఫారమ్ 13ని నింపాల్సి ఉంటుంది. PDF ఫార్మాట్‌లో ఉండే బదిలీ క్లెయిమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ విధంగా పని సలువుగా చేసుకోవచ్చు.

Gemini Internet

Epfo : ఈఫీఎఫ్‌వో అకౌంట్ హోల్డర్స్‌కు గుడ్ న్యూస్

Epfo : కేంద్రం ఈపీఎఫ్‌వో అకౌంట్ హోల్డర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. మెడికల్ ఖర్చుల భారాన్ని తగ్గించుకునేలా వైద్య ప్రయోజనాల కోసం ఈపీఎఫ్ వో సభ్యులు తమ అకౌంట్ నుంచి లక్ష రూపాయల వరకు పీఎఫ్ విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పించింది. ఈ విషయాన్ని ఈపీఎఫ్ వో సంస్థ అధికారికంగా తెలిపింది.ఈపీఎఫ్‌వో అకౌంట్ హోల్డర్స్.. తమ అకౌంట్ నుంచి లక్ష రూపాయల వరకు పీఎఫ్ విత్ డ్రా చేసుకునే ఫెసిలిటీని ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం లేకుండానే ఈపీఎఫ్‌వో కల్పించింది. ఖాతాదారులు ఈ ఫెసిలిటీతో లక్ష రూపాయల వరకు విత్ డ్రా చేసుకోవచ్చు.

అయితే, డాక్యుమెంట్స్ సమర్పించాల్సిన అవసరం లేదు. కానీ, కొన్ని నిబంధనలకు లోబడి మాత్రమే వారు పీఎఫ్ విత్ డ్రా చేసుకోవాల్సి ఉంటుంది.పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకునే క్రమంలో వారు కంపల్సరీగా ఈ నిబంధనలను ఫాలో కావాల్సి ఉంటుంది. మెడికల్ ఎమర్జెన్సీ అనగా వైద్య సదుపాయాల కోసమే ఈ మనీని విత్ డ్రా చేసుకుంటున్న క్రమంలోనే వ్యక్తి తప్పనిసరిగా సదరు వ్యక్తి తప్పనిసరిగా ప్రభుత్వ ఆస్పత్రి లేదా సీజీహెచ్‌ఎస్‌ ప్యానెల్ హాస్పిటల్‌లోనే చేరాలి. ఒకవేళ ప్రైవేటు ఆస్పత్రిలో చేరితే కనుక చేరే ముందనే డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు.

Gemini Internet

Epfo : ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం లేకుండానే..

ఇందుకుగాను ముందు రోజు పీఎఫ్ ఆఫీస్ లో అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. అలా అప్లికేషన్ చేసుకున్న మరుసటి రోజే మనీ అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ అవుతుంది. నెక్స్ట్ డే మనీ ట్రాన్స్ ఫర్ అవుతుంది తప్ప అదే రోజు అయితే ట్రాన్స్ ఫర్ కాదు. ఈ అమౌంట్ సదరు వ్యక్తి పర్సనల్ అకౌంట్ లేదంటే ఆస్పత్రి బ్యాంకు అకౌంట్‌కు ట్రాన్స్ ఫర్ అవుతుంది. అయితే, ఈ పనులను మీరు ఈపీఎఫ్ ఇండియా వెబ్ సైట్ ద్వారా చేసుకోవచ్చు. వెబ్ పోర్టల్ లో ఆన్ లైన్ సేవల ఆధారంగా మీరు ఈ పని చేయొచ్చు. అలా మీరు మీ పీఎఫ్ మనీని క్లెయిమ్ చేసుకోవచ్చు.

 

NVS Recruitment 2022: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. నవోదయ విద్యాలయంలో 1900 పైగా నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..

Navodaya Vidyalaya Recruitment 2022: నవోదయ విద్యాలయ సమితి (NVS) 1900 పైగా నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి భారతీయ పౌరుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో (JNV) అసిస్టెంట్ కమిషనర్ (గ్రూప్-A), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, మహిళా స్టాఫ్ నర్స్, స్టెనోగ్రాఫర్ (గ్రూప్ C), అనేక ఇతర ఖాళీలను రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా భర్తీ చేస్తున్నారు.

నవోదయ విద్యాలయ రిక్రూట్‌మెంట్: పోస్ట్‌లు, ఖాళీల వివరాలు

అసిస్టెంట్ కమిషనర్- 5 పోస్టులు, అసిస్టెంట్ కమిషనర్ (అడ్మిన్)-2 పోస్టులు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్-10 పోస్టులు, ఆడిట్ అసిస్టెంట్- 11 పోస్టులు, జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్- 4 పోస్టులు, జూనియర్ ఇంజనీర్ (సివిల్)-1 పోస్టు, స్టెనోగ్రాఫర్లు- 22 పోస్టులు, కంప్యూటర్ ఆపరేటర్- 4 పోస్టులు, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్- 630 పోస్టులు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్-23 పోస్టులు, మహిళా స్టాఫ్ నర్సు- 82 పోస్టులు, క్యాటరింగ్ అసిస్టెంట్- 87 పోస్టులు, ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్- 273 పోస్టులు, ల్యాబ్ అటెండెంట్- 142 పోస్టులు, 6292 పోస్టులు పోస్ట్‌లు  

అర్హత: వివిధ పోస్టులకు అవసరమైన కనీస విద్యార్హతను నిర్ణయించింది. సంబంధిత విభాగాల్లో మాస్టర్స్ డిగ్రీ, డిప్లొమా, మెట్రిక్యులేషన్ ఉండాలి. 

వయోపరిమితి: వివిధ పోస్టులకు గరిష్ట వయోపరిమితి 45, 40,35, 30, 27 సంవత్సరాలుగా నిర్ణయించారు. 

ఎలా దరఖాస్తు చేయాలి: ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడం జనవరి 12, 2022 నుండి అధికారిక వెబ్‌సైట్  ద్వారా ప్రారంభించబడింది. ఇది ఫిబ్రవరి 10, 2022న ముగుస్తుంది. 

దరఖాస్తు రుసుము: వివిధ పోస్టులకు దరఖాస్తు రుసుము రూ. 1500 మరియు రూ. 750 మధ్య ఉంటుంది. 

ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) మరియు ఇంటర్వ్యూలో వారి పనితీరు ఆధారంగా అభ్యర్థులు షార్ట్‌లిస్ట్ చేయబడతారు. CBT తాత్కాలికంగా మార్చి 9, 2022, మార్చి 11, 2022 మధ్య నిర్వహించబడుతుంది. 

నవోదయ విద్యాలయ రిక్రూట్‌మెంట్ 2022 వివరణాత్మక ప్రకటన కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Gemini Internet

13, జనవరి 2022, గురువారం

ఆదాయపు పన్నులో మార్పులు? స్టాండర్డ్ డిడక్షన్ 35% వరకు పెంపు!

ఒక వ్యక్తి లేదా సంస్థ ఆదాయంపై విధించిన పన్ను, వారి ఆదాయ లేదా లాభాలను బట్టి మారుతుంది. చట్ట ప్రకారం వ్యక్తులు లేదా సంస్థలు ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయాలి. ఇందులో స్టాండర్డ్ డిడక్షన్ మినహాయింపు ఉంటుంది. ఆదాయపు పన్ను ప్రకారం మినహాయించడం లేదా వ్యక్తి పెట్టిన పెట్టుబడి స్టాండర్డ్ డిడక్షన్. స్టాండర్డ్ డిడక్షన్ అనేది స్థిర మినహాయింపు సంస్థతో ఉన్న స్థానంతో సంబంధం లేకుండా వేతనం నుండి తీయడం జరుగుతుంది. 
 
స్థిర డబ్బు వార్షిక వేతనం నుండి తీసివేయబడుతుంది. తద్వారా పన్ను విధించదగిన ఆదాయాన్ని తగ్గిస్తుంది. అప్పుడు చెల్లించే పన్ను మొత్తం తగ్గుతుంది. శాలరైడ్ లేదా పెన్షన్‌దారు స్టాండర్డ్ డిడక్షన్ పొందవచ్చు. 
 
స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి పెంపుః- స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి పెంపు రాబోయే బడ్జెట్‌లో వేతనం పొందే పన్ను చెల్లింపుదారులు, పెన్షనర్లకు అందుబాటులో ఉన్న స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని 30 శాతం నుండి 35 శాతం పెంచనున్నట్లు ప్రభుత్వం ఆలోచిస్తోందని తెలుస్తోంది. అయితే పరిమిత ఆర్థిక హెడ్ రూమ్ ఇచ్చిన ఆదాయపు పన్ను స్లాబ్స్ మారకుండా ఉండవచ్చునని అధికారులు తెలిపారు. 
 
ప్రస్తుతం స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి రూ.50,000గా ఉంది. అయితే దీనిని పెంచాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. 
 
వ్యక్తిగత పన్నులపై పరిశ్రమ నుండి పలు సూచనలు ఉన్నాయి. ఈ సంవత్సరం ఒక సాధారణ డిమాండ్ స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి పెంచడం. ముఖ్యంగా కరోనా కారణంగా వైద్య ఖర్చులు పెరిగాయని, పెరిగిన ధరలను పరిగణలోకి తీసుకోవాలని ఆర్థికమంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులు చెబుతున్నారు. ఈ పెంపు 30 శాతం నుండి 35 శాతం పెంచాలనే ప్రతిపాదన ఉంది. 
 
2019లో రూ.50,000కు పెంపుః- 2019లో రూ.50,000కు పెంపు 2018లో స్టాండర్డ్ డిడక్షన్ రూ.40,000గా ఉంది. గతంలో దీని పరిమితిని 2019లో రూ.50,000కు పెంచారు. ఇప్పుడు మరోసారి దీనిని పెంచాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే తాజా పన్ను వసూళ్ల పరిస్థితిని బట్టి ప్రతిపాదన తుది ఆమోదానికి లోబడి ఉంటుందని చెబుతున్నారు. కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్న పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి స్టాండర్డ్ డిడక్షన్ మినహాయింపు అందుబాటులో లేదు. 
 
స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిః- స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి ప్రతి సంవత్సరం స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పునఃపరిశీలించడాన్ని ప్రభుత్వం ఒక క్రమ పద్ధతిలో చేయాలని బిగ్ ఫోర్ అకౌంటింగ్ సంస్థ డెలాయిట్ భాగస్వామి సుధాకర్ సేతురామ అన్నారు. పెరిగిన ద్రవ్యోల్భణం, వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా ఖర్చులు పెరిగాయని, ఇందుకు అనుగుణంగా కనీసం 25 శాతం వరకు పెంచాలన్నారు. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నారు.

Gemini Internet

మీరు ఈ విషయాలలో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి తప్పించుకోవచ్చు..! కానీ ఇవి చాలామందికి తెలియదు..

Tax Savings: ఆదాయం పన్ను జీతం నుంచి కట్‌ అవుతుంది. అయితే పన్ను ఆదా చేయడానికి చాలా ఎంపికలు ఉన్నాయి. సాధారణంగా పన్ను ఆదా చేయాలంటే ఉత్తమ మార్గం 80Cలో పెట్టుబడి పెట్టడం. ఎందుకంటే దీని కింద రూ.1.5 లక్షల వరకు పన్ను సేవ్‌ అవుతుంది. అందుకే ప్రజలు చాలా మంది ఎల్‌ఐసి పాలసీలలో పెట్టుబడి పెడుతారు. ఎందుకంటే ఇది మంచి రాబడిని ఇస్తుంది పన్ను కూడా ఆదా చేస్తుంది. పోస్టాఫీసులో పథకాలలో కూడా పన్ను మినహాయింపు ఉంటుంది. కానీ కొన్నిసార్లు చిన్న చిన్న పొరపాట్ల వల్ల మీకు లభించే రాయితీ మిస్ చేసుకుంటారు. అలాంటి వాటి గురించి తెలుసుకుందాం.

ఎలక్ట్రిక్ వాహనంపై తగ్గింపు

ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ ఫుల్ స్వింగ్‌లో ఉంది. కానీ ఎలక్ట్రిక్ వాహనాలు చాలా ఖరీదైనవి. కారు లోన్‌తో సహా చాలా విషయాలు అవసరం కావొచ్చు. అయితే ఎలక్ట్రిక్ వాహనంలో సెక్షన్ 80EEB కింద రూ. 1.50 లక్షల వరకు మినహాయింపు లభిస్తుంది. ఇది కాకుండా HRA పొందని వ్యక్తులు సెక్షన్ 80GG కింద అద్దె మినహాయింపు పొందవచ్చు. అంటే నెలకు 5 వేలు ఏటా 60,000 రూపాయలు తగ్గుతుంది. మరోవైపు, ప్రతిరోజూ చాలా కుటుంబాలు తమ పిల్లల కోసం విద్యా రుణాన్ని తీసుకుంటాయి. ఇది చాలా ఖరీదైనది కానీ మినహాయింపు గురించి వారికి తెలియదు. సెక్షన్ 80E కింద విద్యా రుణంపై మినహాయింపు లభిస్తుంది.

వికలాంగులకు మినహాయింపు

అదే సమయంలో వికలాంగులు సెక్షన్ 80U కింద మినహాయింపు పొందుతారు. వాస్తవ పరిస్థితిని బట్టి రూ.75 వేల నుంచి 1.50 లక్షల వరకు మినహాయింపు దొరకుతుంది. ఇది కాకుండా చాలా మంది మొదటి ఇల్లు కొనే సమయంలో డబ్బు ఆదా చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ రెండో ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు అలా చేయరు. అయితే రెండో గృహ రుణ వడ్డీపై కూడా పన్ను మినహాయింపు ఉంటుంది. దీనిలో మొత్తం పరిమితి రూ. 2 లక్షల వరకు ఉంటుంది.

విదేశాల నుంచి వచ్చే డబ్బుపై

బహుమతిపై ఎటువంటి పన్ను విధించరు. అదే విధంగా విదేశాల నుంచి వచ్చిన డబ్బును బహుమతిగా పరిగణించడంలో తప్పులేదు. కానీ 2.5 లక్షలకు పైగా రాబడి వస్తే దానిపై పన్ను విధిస్తారు.

 

Gemini Internet

RRB NTPC రిజల్ట్‌ డేట్‌ ప్రకటన.. CBT-2 షెడ్యూల్ కూడా తెలుసుకోండి..

RRB NTPC Result 2021: RRB NTPC పరీక్ష రాసిన అభ్యర్థులకు ముఖ్యమైన సమాచారం. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ NTPC CBT 1 పరీక్ష ఫలితాల తేదీని ప్రకటించింది. దీనికి సంబంధించి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు అలహాబాద్ అధికారిక వెబ్‌సైట్ rrbald.gov.in లో నోటీసు జారీ చేసింది. RRB NTPC ఫలితం 2021 తో పాటు CBT 2 పరీక్ష తేదీ కూడా ప్రకటించింది. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, పరీక్ష తేదీలు మారే అవకాశం ఉంది. RRB (రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్) జారీ చేసిన నోటీసు ప్రకారం.. రైల్వే నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ అంటే NTPC CBT 1 పరీక్ష ఫలితాలు 15 జనవరి 2022 రోజున ప్రకటిస్తారని తెలిపింది. మీరు మీ ఫలితాలను ఇలా తెలుసుకోండి.

RRB NTPC CBT 1 ఫలితం 2021 డిక్లరేషన్ తర్వాత మీరు మీ సంబంధిత RRB ప్రాంతీయ వెబ్‌సైట్‌ను సందర్శించాలి. ఉదాహరణకు RRB అలహాబాద్ కోసం rrbald.gov.in ఆ వెబ్‌సైట్ హోమ్ పేజీలో మీరు RRB NTPC ఫలితం 2021 (CBT 1) లింక్‌ని పొందుతారు. దానిపై క్లిక్ చేయండి. PDF ఫార్మాట్‌లో ఫలితం మీ మొబైల్ / కంప్యూటర్ స్క్రీన్‌లో కనిపిస్తుంది. పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులందరికీ రోల్ నంబర్లు ఇస్తారు.

 RRB NTPC CTB 2 పరీక్ష ఎప్పుడు? CBT 1 పరీక్షలో విజయం సాధించిన అభ్యర్థులు RRB NTPC CBT 2 పరీక్షకు హాజరవుతారు. ఈ పరీక్ష 14 ఫిబ్రవరి నుంచి 18 ఫిబ్రవరి 2022 వరకు నిర్వహిస్తారు. అయితే కోవిడ్-19 మహమ్మారి కారణంగా అప్పటి వరకు ఉన్న పరిస్థితి, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం తేదీలను మార్చవచ్చు. మీరు మరిన్ని వివరాలకు RRB వెబ్‌సైట్‌ని పరిశీలిస్తూ ఉండండి. NTPC CBT 1 పరీక్షను RRB 28 డిసెంబర్ 2020 నుంచి 31 జూలై 2021 వరకు మొత్తం 7 వేర్వేరు దశల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే.

11, జనవరి 2022, మంగళవారం

Wildlife Institute of India Recruitment: డబ్ల్యూఐఐలో 98 ప్రాజెక్ట్‌ పర్సనల్‌ పోస్టులు.. నెలకు రూ.42 వేల వ‌ర‌కు వేతనం

డెహ్రాడూన్‌లోని వైల్డ్‌లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(డబ్ల్యూఐఐ).. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ పర్సనల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 98

పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ ఫెలో, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్, ప్రాజెక్ట్‌ అసోసియేట్, వెటర్నరీ ఆఫీసర్, అసిస్టెంట్‌ ట్రెయినింగ్‌ కోఆర్డినేటర్‌.

అర్హత: పోస్టుల్ని అనుసరించి కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు: పోస్టుల్ని అనుసరించి 30 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ. 20,000 నుంచి రూ.42,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: స్క్రీనింగ్‌ ద్వారా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసినవారిని ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది రిజిస్ట్రార్, వైల్డ్‌లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, చంద్రబాని, పోస్ట్‌ ఆఫీస్‌ –మొహిబీవాలా, డెహ్రాడూన్, 248002, ఉత్తరాఖండ్‌ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 25.01.2022

వెబ్‌సైట్‌: https://www.wii.gov.in/

 

Gemini Internet

Prasarbharati Recruitment: ప్రసారభారతి, న్యూఢిల్లీలో సీనియర్‌ ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. నెలకు రూ.55 వేల వ‌ర‌కు వేతనం

న్యూఢిల్లీలోని ప్రసార భారతి సెక్రటేరియట్‌ కార్యాలయం ఒప్పంద ప్రాతిపదికన సీనియర్‌ ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 06
అర్హత: గ్రాడ్యుయేషన్‌/తత్సమాన ఉత్తీర్ణతతో పాటు జర్నలిజం/మాస్‌ కమ్యూనికేషన్‌/ఎలక్ట్రానిక్‌ మీడియాలో డిగ్రీ/డిప్లొమా చేసి ఉండాలి.సంబంధిత పనిలో అనుభవంతో పాటు ఇం గ్లిష్, హిందీ భాషల్లో ప్రొఫిషియన్సీ ఉండాలి.
వయసు: 50 ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం: నెలకు రూ.50,000 నుంచి 55,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: టెస్ట్‌/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 20.01.2022

వెబ్‌సైట్‌: https://prasarbharati.gov.in

 

Gemini Internet

Income Tax New AIS for all your financial transactions ఇక ఆర్థిక లావాదేవీల పై కొత్తగా అమల్లోకి ఏఐఎస్‌

ఆదాయపన్ను శాఖ (ఐటీ విభాగం) పన్ను చెల్లింపుదారులకు సంబంధించి ‘వార్షిక సమాచార నివేదిక పత్రం’ (ఏఐఎస్‌)ను అమల్లోకి తీసుకొచ్చింది. ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక ఆర్థిక సంవత్సరంలో నిర్వహించిన ముఖ్యమైన అన్ని ఆర్థిక లావాదేవీల సమాచారం ఇందులో పొందుపరిచి ఉంటుంది. ఇలా మొత్తం 46 రకాల ఆర్థిక లావాదేవీల వివరాలు నమోదవుతాయి. ‘‘ఏఐఎస్‌ అనేది సమాచార నివేదిక. వివిధ మార్గాల నుంచి వచ్చిన ఆదాయం వివరాలు ఉంటాయి.

ఆ ఆదాయం నుంచి పన్ను (టీడీఎస్‌)ను వసూలు చేశారా? లేదా అన్న దానితో సంబంధం ఉండదు. ఏ పెట్టుబడి చేసినా వివరాలు ఇందులో ఉంటాయి’’ అని ఐటీఆర్‌ ఫైలింగ్‌ వెబ్‌సైట్‌ స్పష్టం చేస్తోంది. కనుక పన్ను చెల్లింపుదారులు ముఖ్యమైన ఆర్థిక లావాదేవీల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి. ఫలానా లావాదేవీ వివరాలు ఐటీ శాఖకు తెలియదని అనుకోవద్దు. తర్వాత నోటీసు వస్తే సంజాయిషీ ఇచ్చుకునేందుకు కంగారుపడాల్సి రావచ్చు. ఏఐఎస్‌లో నమోదయ్యే ఆర్థిక లావాదేవీల వివరాలు చూద్దాం..

ఏఐఎస్‌ అంటే..?

పలు సంస్థలు (ప్రభుత్వ, ప్రైవేటు) పాన్‌ నంబర్‌ ఆధారంగా నమోదైన లావాదేవీల వివరాలను ఆదాయపన్ను శాఖకు నివేదించాల్సి ఉంటుంది. ఆ వివరాలతో కూడిన వార్షిక సమాచార పత్రమే ఇది. ఏఐఎస్‌ అన్నది సంక్షిప్త నామం. ప్రస్తుతం అమల్లో ఉన్న ఫామ్‌ 26ఏఎస్‌లో టీడీఎస్‌/టీసీఎస్, సంబంధిత ఆర్థిక సంవత్సరంలో పన్ను చెల్లింపుదారు స్వయంగా చేసిన చెల్లింపులు, ఆదాయపన్ను శాఖ నుంచి వచ్చిన రిఫండ్‌ వివరాలు ఉంటున్నాయి.

దీన్ని మరింత విస్తరించి పన్ను చెల్లింపుదారునకు సంబంధించిన సమగ్ర ఆర్థిక వివరాల సమాచారాన్ని పొందుపరిచే పత్రమే ఏఐఎస్‌. ఫామ్‌ 26ఏఎస్‌ స్థానంలో దీన్ని అమల్లోకి తీసుకురావాలన్నది ఆదాయపన్ను శాఖ ప్రణాళిక. సమగ్ర సమాచారం అందుబాటులో ఉండడం వల్ల పన్ను చెల్లింపుదారులకు రిటర్నులు దాఖలు సౌలభ్యంగా ఉంటుందని భావిస్తోంది. అదే సమయంలో పన్ను ఎగవేతలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. పైన చెప్పుకున్నట్టు ఏఐఎస్‌లో అన్ని వివరాలు కచ్చితంగా నమోదవుతాయా? అన్న ప్రశ్న రావచ్చు. కచ్చితంగా నమోదు కావాలనేమీ లేదు. ఆర్థిక లావాదేవీల వార్షిక నివేదికను నిబంధనలకు అనుగుణంగా ఆయా సంస్థలు ఏటా ఆదాయపన్ను శాఖకు ఫైల్‌ చేయాలి.

బ్యాంకులు, రిజిస్ట్రార్‌ కార్యాలయాలు, ప్రాంతీయ రవాణా కార్యాలయాలు (వాహన కొనుగోళ్ల సమాచారం), ఫారీన్‌ ఎక్ఛ్సేంజ్‌ డీలర్లు, స్టాక్‌ ఎక్ఛ్సేంజ్‌లు,  ఫండ్స్, షేర్లు, డిబెంచర్లను జారీ చేసే కంపెనీలు, ఆర్‌బీఐ, పన్నును వసూలు చేసే వ్యక్తులు అందరూ ఈ వివరాలను ఐటీశాఖకు అందించాల్సి ఉంటుందని ముంబైకి చెందిన ట్యాక్స్‌ నిపుణుడుజైన్‌ తెలిపారు. అలా చేసినప్పుడే ఆ వివరాలు పన్ను చెల్లింపుదారుల ఏఐఎస్‌లో నమోదవుతాయి. అందుకే రిటర్నులు వేసే ముందు ఏఐఎస్‌ను ఒక్కసారి చూసుకున్న తర్వాతే ముందుకు వెళ్లాలని జైన్‌ సూచించారు. అప్పుడే పన్ను చెల్లింపుదారులు రిటర్నుల్లో పేర్కొనే సమాచారానికి, ఐఏఎస్‌లోని వివరాలకు సరిపోలకపోవడం అనే సమస్య ఎదురుకాదన్నారు. పాన్‌–ఆధార్‌ అనుసంధానం అమల్లోకి రావడం తెలిసిందే. కనుక పాన్, ఆధార్‌ ఆధారితంగా ఏ లావాదేవీ నిర్వహించినా దానిని ఐటీ శాఖ ట్రాక్‌ చేయగలదు.

► విదేశీ కరెన్సీ కొనుగోళ్లు

ఈక్విటీ షేర్లు, డెట్‌ సాధనాలు, రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడుల కోసం విదేశీ కరెన్సీని కొనుగోలు చేస్తే ఆ వివరాలు తెలుస్తాయి. విదేశాల్లో బ్యాంకు ఖాతా తెరిచినా ఏఐఎస్‌లో చేరిపోతుంది.   

► విదేశీ ప్రయాణం

విదేశాల్లో వైద్య చికిత్స, విదేశీ విద్య కోసం లేదా విదేశీ పర్యటనలకు డాలర్లను కొనుగోలు చేసి ఉంటే ఆ వివరాలు ఏఐఎస్‌లో నమోదవుతాయి. విదేశీ పర్యటనకు టూరిజం ప్యాకేజీ తీసుకున్నా లేదా విదేశీ ప్రయాణానికి సంబంధించి చెల్లింపులు చేసినా ఆ వివరాలను ట్రావెల్‌ ఏజెన్సీలు  ఐటీ శాఖకు కచ్చితంగా తెలియజేస్తాయి.

 
► స్థిరాస్తి కొనుగోళ్లు/విక్రయాలు

రూ.50 లక్షలకు మించి ఇల్లు విక్రయించిన సందర్భాల్లో కొనుగోలుదారు పన్నును మినహాయించి ఫామ్‌ ‘16బీ’ని విక్రయదారుకు జారీ చేస్తారు. కొనుగోలుదారు ఈ సమాచారంతో ఫామ్‌ 26క్యూబీని ఆదాయపన్ను శాఖకు దాఖలు చేయాల్సి ఉంటుంది. అలాగే, ఇల్లు, భూముల విక్రయం రూపంలో ఆదాయం అందుకుంటే, దానిపై అమలు చేసిన టీడీఎస్‌ వివరాలు ఆదాయపన్ను శాఖకు      తెలుస్తాయి.    

► ప్లాంట్‌/మెషినరీలపై అద్దె

ప్లాంట్, మెషినరీపై అద్దె అదా యం తీసుకుంటూ, ఆ మొత్తంపై 2 శాతం టీడీఎస్‌ను అమలు చేస్తే ఆ సమాచారం ఏఐఎస్‌కు వెళుతుంది.  

లాటరీ ఆదాయం

లాటరీ/క్రాస్‌వర్డ్‌ గెలుచుకుని ప్రైజ్‌మనీ పొందితే, దానిపై టీడీఎస్‌ అమలు చేస్తే ఆ వివరాలను ఫామ్‌ 16ఏ రూపంలో చెల్లించిన సంస్థ ఆదాయపన్ను శాఖకు తెలియజేస్తుంది. గుర్రపు పందేలు గెలుచుకున్న సందర్భాల్లో టీడీఎస్‌ మినహాయించినా ఏఐఎస్‌లో నమోదవుతుంది.  

బీమా కమీషన్‌

బీమా ఏజెంట్‌గా చేస్తూ, బీమా సంస్థ నుంచి కమీషన్‌ పొందితే ఆ వివరాలు ఏఐఎస్‌లో ప్రతిఫలిస్తాయి. ఎందుకంటే కమీషన్‌పై టీడీఎస్‌ అమలవుతుంది.

వ్యాపార ఆదాయం

వ్యాపారం రూపంలో ఆదాయం, వ్యయాలూ ఏఐఎస్‌లో నమోదవుతాయి. వ్యాపారానికి సంబంధించే కమీషన్‌ లేదా బ్రోకరేజీ, వృత్తిపరమైన, సాంకేతిక ఫీజులు కూడా ఇందులో ఉంటాయి.  

► లాటరీ టికెట్లపై కమీషన్‌
లాటరీ టికెట్ల విక్రయ రూపంలో అందుకునే కమీషన్‌ వివరాలు ఐటీ శాఖకు తెలు స్తాయి.
 
► క్రీడల రూపంలో ఆదాయం
క్రీడాకారులు, క్రీడా అసోసియేషన్లు అందుకునే ఆదాయం ఏఐఎస్‌లో నమోదవుతుంది.  

► వాహన కొనుగోలు, విక్రయం

రూ.10 లక్షలకు మించి విలువైన వాహనాలను కొనుగోలు చేసినా, విక్రయించినా ఆ సందర్భంలో కొనుగోలుదారులు విక్రయదారులకు ఒక శాతం టీడీఎస్‌ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, వాహన కొనుగోలుకు రూ.2లక్షలకు మించి నగదు చెల్లింపులు చేసినా కానీ, టీడీఎస్‌ అమలవుతుంది. ఈ వివరాలే పాన్‌ నంబర్‌ ఆధారంగా వారి ఏఐఎస్‌లో నమోదవుతాయి.

 
► ఆఫ్‌ మార్కెట్‌ లావాదేవీలు

షేర్లు, సెక్యూరిటీలను ఆఫ్‌ మా ర్కెట్‌ (వ్యక్తి నుంచి వ్యక్తికి మధ్య) ద్వారా క్రయ, విక్రయాలు చేస్తే ఆ వివరాలు రిజిస్ట్రార్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్‌ ఏజెంట్ల ద్వారా ఐటీ శాఖకు చేరతాయి. దాంతో సంబంధిత వ్యక్తుల ఏఐఎస్‌లో నమోదవుతాయి.

► విదేశాల నుంచి జమలు/చెల్లింపులు

రాయల్టీ లేదా సాంకేతిక సేవల రూపంలో రాయల్టీ లేదా ఫీజులను స్థానికేతరులు (ప్రవాసులు/నాన్‌ రెసిడెంట్‌) అందుకుంటే ఆ వివరాలు ఏఐఎస్‌లో రికార్డు అవుతాయి. విదేశాలకు పంపించే, విదేశాల నుంచి స్వీకరించే చెల్లింపుల వివరాలు కూడా ఇందులోకి చేరతాయి. ప్రవాసులు ఎవరైనా భారతీయ కంపెనీ నుంచి వడ్డీ ఆదాయం అందుకున్నా, ఈ మొత్తంపై టీడీఎస్‌ అమలైనా ఏఐఎస్‌లో నమోదవుతుంది. గ్లోబల్‌ డిపాజిటరీ రిసిప్ట్‌ల (జీడీఆర్‌) రూపంలో ఆదాయం లభించినా ఏఐఎస్‌లో కనిపిస్తుంది.  

► ప్రభుత్వ సెక్యూరిటీలు

ప్రభుత్వ బాండ్లు, సెక్యూరిటీల రూపంలో అందుకునే వడ్డీ పన్ను చెల్లింపుదారు ఆదాయంలో కలుస్తుంది. ఈ వివరాలు సైతం ఏఐఎస్‌లో చేరతాయి. ఒకవేళ దీనిపై టీడీఎస్‌ అమలు చేస్తే ఫామ్‌ 16ఏను జారీ చేస్తారు.  

► ఇతర చెల్లింపులు

జీవిత బీమా ప్రీమియం, హోటల్‌ చెల్లింపులు, క్రెడిట్‌ కార్డు లావాదేవీలు తదితర సమాచారం కూడా  ఆదాయపన్ను శాఖకు వెళుతుంది.  

► వేతనం

సంస్థ నుంచి మీకు చెల్లించిన వేతనం, అందులోనుంచి పన్నును ఏమైనా వసూలు చేసి ఉంటే (టీడీఎస్‌) ఆ వివరాలు ఏఐఎస్‌లో నమోదవుతాయి. సంస్థ టాన్, ఉద్యోగి పాన్‌ వివరాలు కూడా ఉంటాయి. ఏఐఎస్‌లో పేర్కొనే మొత్తాన్ని స్థూల వేతనంగా అర్థం చేసుకోవాలి. ఇందులో అలవెన్స్‌లు కూడా కలిసే ఉంటాయి. పన్ను చెల్లింపుదారు రిటర్నులు దాఖలు చేయడం ద్వారా మినహాయింపులు, తగ్గింపు ప్రయోజనాలను పొందొచ్చు.   

► అద్దె చెల్లింపులు

కిరాయిదారు మీకు చెల్లించుకున్న అద్దె వివరాలే కాదు.. మీరు కిరాయికి ఉంటూ చేసే అద్దె చెల్లింపుల వివరాలు సైతం ఏఐఎస్‌లోకి చేరతాయి. అయితే, టీడీఎస్‌ అమలు చేసినప్పుడే. రూ.50,000 అంతకుమించి నెలవారీ అద్దె చెల్లిస్తే 5 శాతం టీడీఎస్‌ తగ్గించి ఇవ్వాల్సి ఉంటుంది. అటువంటి సందర్భాల్లో వివరాలు వార్షిక  సమాచార నివేదిక  (ఏఐఎస్‌)లో నమోదవుతాయి.  ఆయా అంశాల పట్ల అవగాహనతో వ్యవహరించడం అవసరం

► అద్దె ఆదాయం

మీ ఇంట్లో అద్దెకు ఉండే కిరాయిదారుకి మీ పాన్‌ నంబర్‌ ఇచ్చారంటే.. మీ అద్దె ఆదాయం వివరాలు ఏఐఎస్‌లో చేరిపోతాయి. సదరు కిరాయిదారు మీ పాన్‌ నంబర్‌ను పనిచేస్తున్న సంస్థకు ఇచ్చి పన్ను మినహాయింపు కోరొచ్చు. దాంతో మీ పాన్, అద్దె వివరాలు అక్కడి నుంచి ఐటీ విభాగానికి చేరతాయి. ప్రతి నెలా రూ.50,000, అంతకు మించి అద్దె ఆదాయం స్వీకరించిన సందర్భంలో..  భూమి, భవనం, మెషినరీ రూపంలో ఆదాయం అందుకుంటే ఆ వివరాలు నమోదవుతాయి. ఎందుకంటే ఈ ఆదాయంపై 10 శాతం టీడీఎస్‌ను అమలు చేయాలని ఆదాయపన్ను చట్టం నిర్ధేశిస్తోంది.

► అకౌంట్‌ బ్యాలన్స్‌

సేవింగ్స్‌ ఖాతా లేదా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు కాకుండా ఇతర ఏ ఖాతాను తెరిచినా అది ఏఐఎస్‌లో ప్రతిఫలిస్తుంది. అంతేకాదు ఆర్థిక సంవత్సరం చివర్లో రూ.50,000కు మించి బ్యాలన్స్‌ ఉన్న బ్యాంకు ఖాతాల వివరాలు కూడా ఉంటాయి.  

► డిపాజిట్లు/  ఉపసంహరణలు

బ్యాంకు ఖాతాల్లో (కరెంటు, సేవింగ్స్‌ తదితర) చేసిన నగదు జమల వివరాలు ఏఐఎస్‌లో కనిపిస్తాయి. నగదు డిపాజిట్ల వివరాలను పాన్‌ నంబర్‌ ఆధారంగా బ్యాంకులు, కోపరేటివ్‌ బ్యాంకులు, పోస్టాఫీసులు, ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలు ఫామ్‌61ఏ రూపంలో ఐటీ శాఖకు తెలియజేయాల్సి ఉంటుంది.  

► క్రెడిట్‌/డెబిట్‌కార్డ్‌
ఆర్థిక సంవత్సరంలో క్రెడిట్‌/డెబిట్‌ కార్డు మంజూరు చేసి ఉంటే ఆ వివరాలు నమోదవుతాయి.  

► డివిడెండ్‌

ఈక్విటీ షేర్లు,  ఫండ్స్‌ నుంచి పొందిన డివిడెండ్‌ వివరాలు ఉంటాయి. కంపెనీలు, మ్యూచువల్‌ ఫండ్స్‌ మీకు పంపిణీ చేసిన డివిడెండ్‌పై టీడీఎస్‌ వసూలు చేసి ఉంటే అది కూడా కనిపిస్తుంది.

► సేవింగ్స్‌ బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ

సేవింగ్స్‌ ఖాతా డిపాజిట్లపై జమ చేసిన వడ్డీ వివరాలు కూడా నమోదవుతాయి. ఒక ఏడాదిలో వడ్డీ ఆదాయం రూ.10,000 వరకు ఉంటే సెక్షన్‌ 80టీటీఏ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. సీనియర్‌ సిటిజన్లు (60ఏళ్లకుపైన) అయితే టీటీబీ కింద రూ.50,000 ఆదాయంపై పన్ను లేకుండా చూసుకోవచ్చు.

► టైమ్‌ డిపాజిట్లు
టైమ్‌ డిపాజిట్లలో చేసిన పెట్టుబడుల వివరాలు ఏఐఎస్‌లో నమోదవుతాయి.
► ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ ఆదాయం

ఫిక్స్‌డ్, రికరింగ్‌ డిపాజిట్ల రూపం లో పన్ను చెల్లింపుదారు అందుకున్న ఆదాయం వివరాలు ప్రతిఫలిస్తాయి. వీటిపై టీడీఎస్‌ అమలు చేస్తే ఆ వివరాలు సైతం కనిపిస్తాయి.

 
► సెక్యూరిటీలు, ఫండ్స్‌ కొనుగోళ్లు

షేర్లు, బాండ్లు, ఫండ్స్‌ యూనిట్లలో చేసే పెట్టుబడుల సమాచారా న్ని ఆయా సంస్థలు ఐటీ శాఖకు  రిపోర్ట్‌ చేస్తాయి.

► ఇతర వనరుల ద్వారా వడ్డీ

సేవింగ్స్‌ ఖాతా, టర్మ్‌/ఫిక్స్‌డ్, రికరింగ్‌ డిపాజిట్లు కాకుండా ఇతర రూపాల్లో వడ్డీ ఆదాయం మీకు అందితే.. మీకు వడ్డీ చెల్లించిన సంస్థల నుంచి ఆదాయపన్ను శాఖకు సమాచారం వెళుతుంది.

► నగదు చెల్లింపులు

బ్యాంకు డ్రాఫ్ట్‌లు లేదా పేఆర్డర్లు లేదా పేచెక్‌లను కొనుగోలు చేసినా, వస్తు, సేవలకు నగదు రూపంలో చెల్లింపులు చేసినా ఏఐఎస్‌లో కనిపిస్తాయి. చట్టం కింద ఈ నగదు చెల్లింపుల లావాదేవీ వివరాలను తెలియజేయడాన్ని తప్పనిసరి చేశారు.  

► పీఎఫ్‌ సొమ్ము ఉపసంహరించినా..

ప్రావిడెంట్‌ ఫండ్‌ ఖాతా నుంచి బ్యాలన్స్‌ను ఉపసంహరించుకుంటే  కూడా ఏఐఎస్‌లో నమోదవుతాయి. ఐదేళ్ల పనికాలం పూర్తి కాకుండానే రూ.50,000కు మించి ఉపసంహరించుకుంటే టీడీఎస్‌ వసూలు చేస్తారన్నది గుర్తుంచుకోవాలి. ఐదేళ్లు నిండిన తర్వాత పన్ను ఉండదు.  

► జీవిత బీమా

జీవిత బీమా పాలసీ రూపంలో లభించే ఆదాయానికి (మెచ్యూరిటీ తర్వాత/లేదా మరణ పరిహారం) ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్‌ 10(10డి) కింద పన్ను మినహాయింపు ఉంటుంది. కొన్ని షరతులను పాటించినప్పుడే ఈ వెసులుబాటు. లేదంటే ఈ మొత్తం నుంచి టీడీఎస్‌ కోసేస్తారు. జీవిత బీమా పాలసీల నుంచి అందుకునే మొత్తం ఏఐఎస్‌లో నమోదవుతుంది.

► ఎన్‌ఎస్‌సీ ఉపసంహరణలు

నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ (ఎన్‌ఎస్‌సీ) నుంచి పెట్టుబడిని వెన క్కి తీసుకుంటే  నమోదవుతాయి.  

► పన్ను రిఫండ్‌పై వడ్డీ

ఆదాయపన్ను రిఫండ్‌ జాప్యం అయితే ప్రతీ నెలా 0.5 శాతం చొప్పున ఆ మొత్తంపై వడ్డీని పన్ను చెల్లింపుదారులకు ఐటీ చెల్లిస్తుంది. ఈ వివరాలు కూడా కనిపిస్తాయి. రిటర్నుల్లో ‘ఇన్‌కమ్‌ ఫ్రమ్‌ అదర్‌ సోర్సెస్‌’ విభాగంలో ఆదాయంగా దీన్ని పేర్కొనాలి.

Gemini Internet

10, జనవరి 2022, సోమవారం

Army Public School Recruitment 2022: ఆర్మీ పబ్లిక్ స్కూల్స్‌లో 8,000 పైగా టీచర్ పోస్టులు.

ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారికి గుడ్ న్యూస్. ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ (AWES) జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 137 ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో 8,000 పైగా పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ప్రైమరీ ట్రైన్డ్ టీచర్ (TGT), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT), పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT) లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. అయితే ఏఏ స్కూళ్లల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయన్న విషయాన్ని వెల్లడించలేదు. ఎగ్జామ్ పూర్తైన తర్వాత స్కూళ్ల వారీగా వేర్వేరు నోటిఫికేషన్స్ విడుదలవుతాయి. క్వాలిఫై అయిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది

ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో 8,000 పైగా పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్ కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. ఈ పోస్టులకు అప్లై చేయడానికి 2022 జనవరి 28 చివరి తేదీ. అభ్యర్థులకు 2022 ఫిబ్రవరి 19, 20 తేదీల్లో ఎగ్జామ్ ఉంటుంది. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.

Army Public School Recruitment 2022: భర్తీ చేసే పోస్టులు

భర్తీ చేసే పోస్టువిద్యార్హతలు
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT)సంబంధిత సబ్జెక్ట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కనీసం 50 శాతం మార్కులతో పాస్ కావడంతో పాటు బ్యాచిలర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ పాస్ కావాలి.
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT)సంబంధిత సబ్జెక్ట్‌లో గ్రాడ్యుయేషన్‌ కనీసం 50 శాతం మార్కులతో పాస్ కావడంతో పాటు బ్యాచిలర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ పాస్ కావాలి.
ప్రైమరీ ట్రైన్డ్ టీచర్ (TGT)సంబంధిత సబ్జెక్ట్‌లో గ్రాడ్యుయేషన్ కనీసం 50 శాతం మార్కులతో పాస్ కావడంతో పాటు రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా బ్యాచిలర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ పాస్ కావాలి.

Army Public School Recruitment 2022: గుర్తుంచుకోవాల్సిన అంశాలు

దరఖాస్తు ప్రారంభం- 2022 జనవరి 7
దరఖాస్తుకు చివరి తేదీ- 2022 జనవరి 28
పరీక్ష తేదీ- 2022 ఫిబ్రవరి 19, 20
ఫలితాల విడుదల- 2022 ఫిబ్రవరి 28
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.
వయస్సు- ఫ్రెషర్‌కు 40 ఏళ్ల లోపు, అనుభవజ్ఞులకు 57 ఏళ్ల లోపు.
ఎంపిక విధానం- ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ
ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Gemini Internet

8, జనవరి 2022, శనివారం

BMRC Recruitment 2021: బెంగళూరు మెట్రో రైల్ లో జాబ్స్.. దరఖాస్తుకు మరికొన్ని రోజులే ఛాన్స్.. ఇలా అప్లై చేయండి

బెంగళూరు మెట్రో రైల్ లో జాబ్స్.. దరఖాస్తుకు మరికొన్ని రోజులే ఛాన్స్.. ఇలా అప్లై చేయండి

నిరుద్యోగులకు బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేషన్ (BMRC) పలు ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు జనవరి 17లోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.

బెగంళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRC) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ తాజాగా నోటిఫికేషన్ (Job Notification) జారీ చేసింది. సెక్షన్ ఇంజనీర్స్ తో పాటు పలు ఇతర ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో (Notification) పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేసుకోవడానికి జనవరి 17ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఎంపికైన అభ్యర్థులు మూడేళ్ల పాటు కాంట్రాక్ట్ విధానంలో పని చేయాల్సి ఉంటుంది.

పోస్టుల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి..

పోస్టుఖాళీలు
చీఫ్ ఇంజనీర్1
అడిషనల్ చీఫ్ ఇంజనీర్/డిప్యూటీ చీఫ్ ఇంజనీర్2
డిప్యూటీ జనరల్ మేనేజర్(Arch)1
ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ డిజైన్2
మేనేజర్(Arch)1
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, డిజైన్2
అసిస్టెంట్. ఇంజనీర్-డిజైన్3
సెక్షన్ ఇంజనీర్5
మొత్తం17

అర్హతల వివరాలు..
చీఫ్ ఇంజనీర్: సివిల్ ఇంజనీరింగ్ లో బీఈ/బీటెక్ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ లో పీజీ చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది.
అడిషనల్ చీఫ్ ఇంజనీర్/డిప్యూటీ చీఫ్ ఇంజనీర్: సివిల్ ఇంజనీరింగ్ లో బీఈ/బీటెక్ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
డిప్యూటీ జీఎం: Arch లేదా ప్లానింగ్ లో డిగ్రీ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
ఎగ్జిగ్యూటివ్ ఇంజనీర్ డిజైన్: సివిల్ ఇంజనీరింగ్ లో బీఈ/బీటెక్ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.

మేనేజర్(Arch): బీ.ఆర్క్ లేదా అందుకు సమానమైన విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
డిప్యూటీ మేనేజర్ (Arch): బీ.ఆర్క్ లేదా అందుకు సమానమైన విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, డిజైన్: సివిల్ ఇంజనీరింగ్ లో బీటెక్ లేదా అందుకు సమానమైన విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
సెక్షన్ ఇంజనీర్(Arch): ఆర్కిటెక్చర్ లో డిగ్రీ/డిప్లొమా చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
సెక్షన్ ఇంజనీర్(డిజైన్): సివిల్ ఇంజనీరింగ్ లో బీఈ/బీటెక్ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
వేతనాల వివరాలు: ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి రూ. 40 వేల నుంచి రూ. 1.65 లక్షల వరకు వేతనం ఉంటుందని నోటిఫికేషన్లో తెలిపారు. వేర్వేరు ఉద్యోగాలకు వేర్వేరుగా వేతనం ఉంటుంది.
ఎలా అప్లై చేయాలంటే..
Step 1: అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మొదటగా ఈ లింక్ ద్వారా అధికారిక వెబ్ సైట్ ఓపెన్ చేయాలి.
Step 2:  అనంతరం హోం పేజీలో Career ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 3: కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ నోటిఫికేషన్ వివరాల పక్కన Click here to Apply Online అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
Step 4: తర్వాత కావాల్సిన వివరాలను నమోదు చేసి అప్లికేషన్ ఫామ్ ను నింపాలి. తర్వాత ఆఫామ్ ను ప్రింట్ తీసుకోవాలి.
Step 5: అప్లికేషన్ ఫామ్ కు కావాల్సిన ధ్రువపత్రాలను జత చేసి General Manager (HR), Bangalore Metro Rail Corporation Limited, III Floor, BMTC Complex, K.H. Road, Shanthinagar, Bengaluru 560027 చిరునామాకు గడువులోగా చేరేలా పంపించాలి.

7, జనవరి 2022, శుక్రవారం

CSIR UGC NET అభ్యర్థులకు గమనిక.. కరెక్షన్ విండో ఓపెన్ చేసిన NTA.. జనవరి 9న మార్పులకు అవకాశం.

CSIR UGC NET 2022: CSIR UGC NET జూన్ 2021కి అప్లై చేసుకున్న అభ్యర్థులు ఏవైనా తప్పులుంటే సరిచేసుకోవడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కరెక్షన్ విండోను ఓపెన్ చేసింది. అభ్యర్థులు తమ ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌లో సవరణలు చేసుకోవచ్చు. ఇందుకోసం అధికారిక వెబ్‌సైట్ csirnet.nta.nic.in ని సందర్శించి తప్పులు సరిదిద్దుకోవచ్చు. అభ్యర్థులందరికి జనవరి 9, 2022న మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 11:50 గంటల వరకు మార్పులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. NTA జారీ చేసిన నోటీసు ప్రకారం.. జనవరి 9, 11:50 pm తర్వాత ఎటువంటి మార్పులకు అవకాశం ఉండదు. NTA ఇచ్చిన సమయంలో మార్పులు చేసిన తర్వాత అభ్యర్థులు ఏవైనా అదనపు ఛార్జీలు (వర్తిస్తే) చెల్లించాల్సి వస్తే క్రెడిట్/డెబిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/UPI లేదా Paytm వాలెట్ ద్వారా చెల్లించవచ్చు.

జనవరి 29, ఫిబ్రవరి 5, ఫిబ్రవరి 6 తేదీల్లో పరీక్ష

ఈ పరీక్షల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి జనవరి 8, 2021న లేదా అంతకు ముందు ఫీజు చెల్లించిన అభ్యర్థులకు మాత్రమే అడ్మిట్‌ కార్డు వస్తుంది. జనవరి 29, ఫిబ్రవరి 5, ఫిబ్రవరి 6, 2022న NTA పరీక్ష జరుగుతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఐదు సబ్జెక్టులపై అభ్యర్థులకు పరీక్ష ఉంటుంది. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) నిర్దేశించిన అర్హత ప్రమాణాలకు లోబడి భారతీయ విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF), లెక్చర్‌షిప్ (LS)/అసిస్టెంట్ ప్రొఫెసర్‌లకు అర్హత ప్రమాణాలను నిర్ణయించడానికి CSIR UGC NET నిర్వహిస్తారు.

18, డిసెంబర్ 2021, శనివారం

తిరుమల శ్రీవారి ఉదయాస్తమాన సేవ శ్రీవారి సేవలో అత్యంత ఖరీదైన టికెట్టు | ధర కోటి యాభై లక్షలు


■ ఆ సేవకు ఎందుకు అంత డిమాండ్..?
■ ఇంతకీ ఏంటి ఆ సేవలు ?

పూర్తి వివరాలు మీకోసమే....!
              👇👇👇
*🙏ఉదయాస్తమాన సేవ🙏*.    
         తిరుమలలో ఆ సేవ టికెట్ల ధర కోటిన్నర...?
ఎందుకు అంత డిమాండ్...?

👉 సకల లోకాధిపతి దేవత సార్వభౌముడు శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం ఈ కలియుగం లో ముక్తి మార్గం అనేది చాలా మంది భక్తుల నమ్మకం.

★ ఆ డిమాండ్ కి తగ్గట్టే ఉదయాస్తమాను సేవ టికెట్ల ధరల కోటిన్నర రూపాయలుగా టీటీడీ నిర్ణయించింది.

🕉 కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే ఉదయాస్తమాన సేవా టికెట్ల ధరను టీటీడీ నిర్ణయించింది.

🟢  సధారణ రోజుల్లో ఉదయాస్తమాన సేవా టికెట్ కోటి రూపాయలు కాగా శుక్రవారం రోజున 1.5 కోట్లుగా టీటీడీ నిర్ణయించింది.

 🕉 పరస్తుతం తిరుమల తిరుపతి
దేవస్థానం దగ్గర 531  ఉదయాస్తమాన సేవా టికెట్లు అందుబాటులో ఉన్నాయి.

🕉 ఈ టికెట్‌తో దాదాపు 25 ఏళ్ల పాటు ఆర్జిత సేవలో పాల్గొనే అవకాశాన్ని భక్తులు పొందుతారు.

◆ ఏడాదికి ఒక్కరోజు ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు ఆరుగురు భక్తులు పాల్గొనే సౌలభ్యాన్ని కల్పిస్తారు.

🟢 "ఉదయాస్తమాన సేవా"
 టికెట్ల కేటాయింపుతో టీటీడీకి దాదాపు 600 కోట్ల పైగా ఆదాయం వస్తుంది.

◆ ఉదయాస్తమాన సేవా టికెట్ల కేటాయింపుతో లభించే మొత్తాన్ని చిన్నపిల్లల ఆస్పత్రి అభివృద్ధికి కేటాయించాలని టీటీడీ పాలకమండలి ఇప్పటికే నిర్ణయించింది.

◆ సకల లోకాధిపతి దేవత సార్వభౌముడు శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం ఈ కలియుగం లో ముక్తి మార్గం అనేది చాలా మంది భక్తుల నమ్మకం.

◆ °అందుకే సేవ ఎంత ఖరీదైనా భక్తులు వెనుకాడరు.
టికెట్ల ధరలు ఎంతైనా భారీగా డిమాండ్ ఉంటుంది..

🕉 అసలు ఉదయాస్తమాన సేవలు అంటే ఏంటి.. ?
🕉 ఏఏ సేవలు అందుబాటులో ఉంటాయి.
🕉 వటికి ఎందుకంత డిమాండు.?

👉 పురాణ పురుషోత్తముడైన వేంకటేశ్వర స్వామి వారికి తిరుమల లో ఉదయము నుండి రాత్రి వరకు జరిగే ఆర్జిత సేవలను ఉదయాస్తమాన సేవ అంటారు.

 🕉 శ్రీవారి ఆర్జిత సేవలు ఇవే...!

1. సుప్రభాత సేవ
2. తోమాల సేవ
3. కొలువు
4. అష్ట దళ పాద పద్మారాధన (సువర్ణ పుష్ప అర్చన)
5. అభిషేకం
6. వస్త్రాలంకార సేవ
7. కల్యాణోత్సవం
8. రథోత్సవం
9. తిరుప్పావడ
10. సహస్ర దీపాలంకరణ సేవ
11. ఏకాంత సేవ.

ఈ సేవలు ఎలా చేస్తారు.. ప్రత్యేకతలు ఏంటి..?

🕉 1. సుప్రభాత సేవ:
తర తరాలుగా హైందవ ఆధ్యాత్మిక చైతన్యాన్ని జాగృతం చేస్తున్న మహత్తర శ్రీ వేంకటేశ్వరస్తవం ఈసుప్రభాతం.

👉 ఇందులో..
● ఇరువది తొమ్మిది శ్లోకాలు గల సుప్రభాతాన్ని,
● పదకొండు శ్లోకాలున్న స్తోత్రాన్ని,
● పదహారు శ్లోకాలున్న ప్రపత్తి ని,
● పదునాలుగు శ్లోకాలున్న మంగళ శాసనాన్ని,

 👉 15వ శతాబ్దములో  మహాముని శిశ్యులైన ప్రతివాద భయంకర అన్నన్ స్వామి రచించారు.

★ ఈ దివ్య గానం ఎక్కడ విన్న మనస్సు తిరుమల క్షేత్రాన్ని చేరుకుంటుంది.
★ శ్రీ వారి సుప్రభాతం అనే ఈ మేలు కొలుపు సేవలో పాల్గొంటే మన మనస్సు మేల్కొని శ్రీ వారి సేవ కు అంకితమవుతుంది.

🕉 2. తోమాల సేవ:
          పుష్పాలంకార ప్రియుడైన శ్రీనివాసుని దివ్య మంగళ మూర్తి కి అనేక పుష్ప మాలికలతో, తులసి మాలలతో చేసే అలంకారమే తోమాల సేవ.

👉 ఈ సేవ లో పాల్గొన్న వారి మనస్సు అనే పుష్పం శ్రీ వారి పదాల చెంత చేరి జన్మ ధన్య మవుతుంది.

🕉 3. కొలువు:
         తిరుమల లో బంగారు వాకిలికి ఆనుకొని వున్న గది ని స్నపన మండపం అంటారు.

  ఇక్కడే శ్రీ వారికి ప్రతి రోజు ఆస్థానం జరుగు తుంది.
సన్నిధి లో వున్న కొలువు - శ్రీనివాస మూర్తి ని,
ఛత్ర చామరాది మర్యాదలతో, మంగళ వాద్య పురస్సరంగా స్నపన మండపంలో  ఉంచిన బంగారు సింహాసనం పై వేంచేపు చేస్తారు.

◆ ఆ తరువాత స్వామి కి కొలువు నిర్వహించబడుతుంది.
◆ అనంతరం ఆలయ అర్చకులు పంచాంగ శ్రవణాన్ని స్వామి వారికి విన్న విస్తారు.

◆ అలాగే ఆలయ ట్రెజరీ స్వామి వారి యొక్క లావాదేవీలను (ఆదాయ వ్యయాలను) స్వామి వారికి విన్న విస్తారు.
👉 °ఈ సేవ ను చూసి తరించిన వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగి స్వామి వారి అనుగ్రహం కలుగు తుంది.

🕉 4.అష్ట దళ పాద పద్మారాధన:
    (సువర్ణ పుష్ప అర్చన)
తిరుమల క్షేత్రం లో ప్రతి నిత్యం వెయ్యి నూట ఎనిమిది (1108) సువర్ణ పుష్పాలతో,
 సహస్ర నామాలతో స్వర్ణాలంకార భూషితుడయిన శ్రీ
వారికి ఈ అర్చన సేవ జరుగు తుంది.

◆ శ్రీ వారి అర్చనలో భక్తులు మనస్సు ఏకాగ్రతను పొంది,
శ్రీ వారి పాదాల మీద కేంద్రీకరింపబడి,
ఆధ్యాత్మిక ఆనందం మరియు లక్ష్మి కటాక్షం కలుగుతుంది.

🕉 5. అభిషేకం:
           శ్రీ వారి అభిషేకాన్ని దర్శిస్తే చాలు భక్తులు శారీరక, మానసిక రుగ్మతలు తొలగి ఆయురారోగ్యములు కలుగుతాయి.

🕉 6. వస్త్రాలంకరణ సేవ:
        అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి శ్రీనివాసునకు సర్వాంగ సుందరంగా, నయనానంద కరంగా పట్టు వస్త్రాలను
అలంకరించడమే వస్త్రాలంకరణ సేవ.

🕉 7. కల్యాణోత్సవం:
        శ్రీ దేవి, భూదేవి సమేతుడైన శ్రీ మలయప్ప స్వామి వారికి ప్రతి రోజూ నిత్యం కల్యాణోత్సవం జరుగుతుంది.
★ 15వ శతాబ్దములొ  తాళ్ళపాక వంశస్థులచే ఈ కల్యాణోత్సవం ఆరంభిచబడినట్లు శాసనాల వల్ల తెలుస్తుంది.
👉 సర్వ జనులు క్షేమ, స్థైర్య,
ధైర్యాదులతో ఉండాలంటే
 ★ మహా సంకల్పం తో శ్రీ వారికీ కల్యాణోత్సవం చేయటం పరిపాటి.
👉 ఈ నిత్య కళ్యాణం వల్లనే శ్రీ వారిని కల్యాణ చక్రవర్తి అని,
తిరుమల క్షేత్రం నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా విరాజిల్లు తున్నది.

🕉 8. రథోత్సవం:
         "రథస్థం కేశవం దృష్ట్యా పునర్జన్మన విద్యతే..|"
◆ సకల లోకాధిపతి అయినటువంటి శ్రీ వేంకటేశ్వర స్వామి ని రథోత్సవం లో దర్శించు భాగ్యం వలన మరి యొక్క జన్మ ఉండదు అని ఆగమ శాస్త్రం చెబుతుంది.

🕉 9. తిరుప్పవాడ:
       ప్రతి గురువారం శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి రెండవ అర్చన అనంతరం జరిగే నివేదనను తిరుప్పావడ సేవ అంటారు.
తిరుప్పావడ సేవ లో
పాల్గొన్న భక్తులకు నిత్యం అన్నం సమృద్ది గా కలుగుతుంది.
పాడి పంటలు వృద్ధి చెందుతాయి.

🕉 10.సహస్ర దీపాలంకరణ సేవ:
       ఉభయ దేవేరులతో కూడిన మలయప్ప స్వామి వారు, సర్వాలంకార భూషితుడై వైభవోత్సవ మండపం నుండి కొలువు మండపానికి
విచ్చేస్తారు.
◆ అప్పటికే దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న సహస్ర దీపాల మధ్య వున్న ఊయలలో స్వామి వారు ఉభయ దేవేరుల సమేతంగా
ఆశీనులై, భక్తులకు దర్శనమిస్తారు.
👉 ఆ సమయం లో వేద పండితులు వేద మంత్రాలతో స్వామి వారిని కీర్తిస్తారు. నాద స్వర విద్వాంసులు
సుస్వరంగా నాదస్వరాన్ని విని పిస్తారు. అనంతరం గాయకులు అన్నమాచార్యుల సంకీర్తనలతో, పురందర దాసు కీర్తనలతో శ్రీ వారికి
స్వరార్చన చేస్తారు.

◆ వేద, నాద, గానాలను ఆలకిస్తూ, మలయప్ప స్వామి మెల్ల మెల్లగా ఉయ్యాల తూగుతూ భక్తులకు దర్శనమిస్తారు.
👉 °ఈ సేవ లో దేవ దేవున్ని  దర్శించిన భక్తునకు సత్సంతానం కలుగుతుంది.

🕉 11.ఏకాంత సేవ:
       తిరుమల శ్రీ వారి ఆలయం లో చివరగా జరిగే సేవ ఏకాంత సేవ.
👉 ఈ సేవ లో స్వామి వారు బంగారు పట్టె మంచం లో శయన మూర్తి గా దర్శన మిస్తారు.
◆ శ్రీ వారి పరమ భక్తురాలయిన మాతృ శ్రీ వెంగమాంబ ముత్యాల హారతి ని స్వామి వారికి సమర్పిస్తారు.
🟢 అన్నమా చార్యుల
వారి జోల పాట ను పాడి ఆరోజు సేవలను ముగిస్తారు.

14, డిసెంబర్ 2021, మంగళవారం

Income Tax Notice: ఇన్‌కమ్ టాక్స్ నుంచి నోటీసు వచ్చిందా ?.. అప్పుడేం చేయాలి ?.. పూర్తి వివరాలు

ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్, ఐటీ రిటర్న్స్, ఫైలింగ్, జేఎస్​ఓఎన్​ ఆఫ్​లైన్​ యుటిలిటీ, కామన్​ ఆఫ్​లైన్​ యుటిలిటీ  శాఖ నుండి నోటీసు రావాలని ఎవరూ కోరుకోరు. అక్కడి నుంచి నోటీసులు రావొద్దనే ప్రతి ఒక్కరూ భావిస్తుంటారు. కానీ మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఒక్కోసారి ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ నుంచి ఇబ్బందులు వచ్చిపడుతుంటాయి. 

Gemini Internet

ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేసేటప్పుడు మీ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ఒక చిన్న పొరపాటు మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు. దీని కారణంగా ఆ శాఖ నుంచి మీకు నోటీసులు కూడా రావొచ్చు. అయితే ఈ రకంగా నోటీసులు పొందిన వాళ్లు www.incometaxindiaefiling.gov.in వెబ్‌సైట్‌ ద్వారా సమాధానం ఇచ్చే అవకాశం కూడా ఉంది.

సాధారణంగా ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేసేటప్పుడు పన్ను ఆదా చేయడానికి వ్యక్తులు తప్పుడు సమాచారం ఇస్తారు. ఎక్కువ నష్టాన్ని చూపుతారు. అటువంటి పరిస్థితిలో తప్పుడు సమాచారాన్ని నింపినట్లు అనుమానించబడిన వ్యక్తులకు శాఖ నోటీసులు పంపే అవకాశం ఉంటుంది.

ఇక్కడ వచ్చే సాధారణ నోటీసులు కోసం సెక్షన్ 139(9) ప్రకారం ఐటీఆర్‌లో ఏదైనా సమాచారం లేకపోయినా లేక ఐటీఆర్ ఫారమ్‌లో ఇచ్చిన సమాచారం ఐటీ డిపార్ట్‌మెంట్ డేటాతో సరిపోలకపోతే అది తప్పుడు సమాచారంగా పరిగణించబడుతుంది.

ఈ పరిస్థితిలో పన్ను చెల్లింపుదారులు దీనికి 15 రోజుల్లోగా స్పందించాలి. అలా చేయడంలో విఫలమైతే వారి ఐటీఆర్ తిరస్కరించబడుతుంది. డిపార్ట్‌మెంట్ అడిగిన ప్రశ్నకు వివరంగా సమాధానం ఇవ్వాలి. దీని వల్ల వారికి మీ సమస్యను అర్థం చేసుకోవడంలో ఇబ్బంది ఉండదు.

అదనపు పన్ను చెల్లించినప్పుడు, వాపసును పన్ను చెల్లింపుదారుకు నివేదించినప్పుడు లేదా అసలు పన్ను కంటే తక్కువ చెల్లించినప్పుడు పన్ను బాధ్యతల గురించి శాఖ పన్ను చెల్లింపుదారులకు తెలియజేస్తుంది. ఇందుకోసం 143(1) కింద ఒక సమాచార నోటీసు పంపుతుంది.

ఫారమ్ 16, ఫారమ్ 16A ITR, TDS సర్టిఫికేట్‌లో ఆదాయం, మినహాయింపు లేదా మినహాయింపు మధ్య ఎటువంటి సంబంధం లేనప్పుడు సెక్షన్ 143(1)(a) ప్రకారం సమాచార నోటీసు పంపిస్తారు.

ITRపై పన్ను చెల్లింపుదారు నుండి అసెస్సింగ్ అధికారికి ఏదైనా అదనపు సమాచారం అవసరమైనప్పుడు సెక్షన్ 142(1) కింద నోటీసు ఇవ్వబడుతుంది. పన్నుచెల్లింపుదారుడు ఏ సంవత్సరంలో అయినా ITR ఫైల్ చేయకపోయినా, దానిని పంపవచ్చు.

కానీ మునుపటి సంవత్సరాల ఆధారంగా, అసెస్సింగ్ అధికారి ITRని ఫైల్ చేయాలని డిమాండ్ చేస్తారు. సెక్షన్ 142(1) కింద నోటీసుకు స్పందించకపోతే రూ. 10,000 జరిమానా లేదా చట్టపరమైన చర్య తీసుకోవచ్చు.

జరిమానా, జరిమానా లేదా పన్ను డిమాండ్ చేసినప్పుడు సెక్షన్ 156 కింద IT శాఖ డిమాండ్ నోటీసును పంపుతుంది. నోటీసు అందుకున్న 30 రోజులలోపు మీరు బకాయి మొత్తాన్ని చెల్లించాలి.

ఎవరైనా ITRలో ఆదాయం చాలా తక్కువగా ఉందని లేదా నష్టం ఎక్కువగా నివేదించబడిందని గుర్తించినప్పుడు ఆదాయపు పన్ను శాఖ సెక్షన్ 143(2) కింద స్క్రూటినీ ఆర్డర్ ఇస్తుంది. ఇది దర్యాప్తు కోసం ఇచ్చే ఆర్డర్.