RBI Recruitment 2022: ఉద్యోగాల భర్తీకి ఆర్‌బీఐ జాబ్ నోటిఫికేషన్.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. లీగల్ ఆఫీసర్, మేనేజర్, క్యూరేటర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 14 ఖాళీలున్నాయి. ఆర్‌బీఐ
హెడ్‌క్వార్టర్స్‌తో పాటు కోల్‌కతాలోని ఆర్‌బీఐ మ్యూజియంలో ఈ
పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై
చేయడానికి 2022 ఫిబ్రవరి 4 చివరి తేదీ. ఇవి ఫుల్ టైమ్ కాంట్రాక్ట్
పోస్టులు. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేయాలి.
ఆఫ్‌లైన్ దరఖాస్తుల్ని స్వీకరించరు. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.
RBI Recruitment 2022: ఖాళీల వివరాలు ఇవే...
మొత్తం ఖాళీలు | 14 | విద్యార్హతలు | వయస్సు |
లీగల్ ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బీ | 2 | గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లా కనీసం 50 శాతం మార్కులతో పాస్ కావాలి. | 21 నుంచి 32 ఏళ్లు |
మేనేజర్ (టెక్నికల్-సివిల్) | 6 | సివిల్ ఇంజనీరింగ్ లేదా తత్సమాన సబ్జెక్ట్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ కనీసం 60 శాతం మార్కులతో పాస్ కావాలి. | 21 నుంచి 35 ఏళ్లు |
మేనేజర్ (టెక్నికల్-ఎలక్ట్రికల్) | 3 | ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో బీటెక్ లేదా బీఈ కనీసం 60 శాతం మార్కులతో పాస్ కావాలి. | 21 నుంచి 35 ఏళ్లు |
లైబ్రరీ ప్రొఫెషనల్స్ (అసిస్టెంట్ లైబ్రేరియన్) ఇన్ గ్రేడ్ ఏ | 1 | బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్, కామర్స్, సైన్స్‌తో పాటు మాస్టర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ లేదా లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ పాస్ కావాలి. | 21 నుంచి 30 ఏళ్లు |
ఆర్కిటెక్ట్ ఇన్ గ్రేడ్ ఏ | 1 | ఆర్కిటెక్చర్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ కనీసం 60 శాతం మార్కులతో పాస్ కావాలి. | 21 నుంచి 30 ఏళ్లు |
Gemini Internet
దరఖాస్తు ప్రారంభం- 2022 జనవరి 15
దరఖాస్తుకు చివరి తేదీ- 2022 ఫిబ్రవరి 4 సాయంత్రం 6 గంటలు
పరీక్ష తేదీ- 2022 మార్చి 6
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.
దరఖాస్తు ఫీజు- జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.600, ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులకు రూ.100 ఫీజు చెల్లించాలి.
ఎంపిక విధానం- ఇంటర్వ్యూ
ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
RBI Recruitment 2022: అప్లై చేయండి ఇలా...
Step 1- అభ్యర్థులు ఆర్‌బీఐ కెరీర్స్ వెబ్‌సైట్ https://opportunities.rbi.org.in/ ఓపెన్ చేయాలి.
Step 2- Current Vacancies సెక్షన్‌లో లీగల్ ఆఫీసర్, మేనేజర్, క్యూరేటర్ ఉద్యోగాల నోటిఫికేషన్ క్లిక్ చేయాలి.
Step 3- నియమనిబంధనలన్నీ చదివిన తర్వాత Online Application Form పైన క్లిక్ చేయాలి.
Step 4- కొత్త వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది.
Step 5- అందులో Click here for New Registration పైన క్లిక్ చేయాలి.
Step 6- మొత్తం 6 దశల్లో దరఖాస్తు ప్రక్రియ ఉంటుంది.
Step 7- మొదటి దశలో పేరు, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ లాంటి వివరాలు ఎంటర్ చేయాలి.
Step 8- రెండో దశలో ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.
Step 9- మూడో దశలో విద్యార్హతలు, ఇతర వివరాలు ఎంటర్ చేయాలి.
Step 10- నాలుగో దశలో అప్లికేషన్ ప్రివ్యూ చూసి వివరాలన్నీ సరిచూసుకోవాలి.
Step 11- ఐదో దశలో ఇతర సర్టిఫికెట్స్ అప్‌లోడ్ చేయాలి.
Step 12- ఆరో దశలో ఫీజు పేమెంట్ చేసి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి.
కామెంట్‌లు