అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
3, నవంబర్ 2021, బుధవారం
*TTD దర్శనం టిక్కెట్లు RTC ONLINE WEBSITE లో*
Career Guidance : నీట్ లో సీటు రాకున్నా.. ఇతర వైద్య వృత్తిలో ఇలా కొనసాగవచ్చు.
మెడిక్ కళాశాలలో ప్రవేశాల కోసం నీట్ పరీక్ష నిర్వహిస్తారు. ఈ ఏడాది నుంచి బీఎస్సీ నర్సింగ్(హానర్స్) కోర్సుకు నీట్ తప్పని సరి చేశారు. ఈ నేపథ్యంలో నీట్ పాస్ కాకున్నా.. వైద్య రంగంలో చేయడానికి మంచి కోర్సులు ఉన్నాయి. వాటికి మెరుగైన ఉపాధి అవకాశాలు కూడా లభిస్తున్నాయి.
Gemini Internet
మెడికల్ ఎంట్రెన్స్ పరీక్ష నీట్(National Entrance Exam)
పాస్ కాకుంటే మంచి కెరీర్ ఆగిపోయినట్టు కాదు. వైద్య రంగం (Medical
Field)లో ఎన్నో కోర్సులు మంచి కెరీర్ (Career)ను ఇస్తాయి. ఏటా పరీక్ష
రాసిన వారిలో 56 శాతం మంది మాత్రమే అర్హత సాధించారు. నీట్ (NEET)లో
క్వాలిఫై కాకపోయినా వైద్య విద్యనభ్యసించాలనే కోరిక కొందరిలో బలంగా
ఉంటుంది. అటువంటి వారు ప్రత్యామ్నాయ మెడికల్ కోర్సుల (Optional Medical
Courses) వైపు చూడవచ్చు. ఆ కోర్సుల గురించి తెలుసుకుందాం. ఈ కోర్సులకు ఇంటర్ (Inter)లో ఫిజిక్స్ (Physics), కెమిస్ట్రీ , బయోలజీ (Biology) చదివిన ఔత్సాహికులు వీటికి అర్హులు.
ఫార్మసీ..
ఫార్మసీ
కోర్సు చేయాలనుకొనే వారు బీఫార్మసీలో చేరాలి. చాలా కళాశాలల్లో
బీఫార్మసీకి సంబంధించి విభిన్న కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో
అడ్మిషన్ పొందడానికి TSEAMCET, MHTCET, PUCET, BITSAT, KCET ఎంట్రెన్స్
టెస్టులు రాయాలి. ఈ కోర్సులు చేసిన వారికి ఫార్మాసిస్ట్, డ్రగ్
ఇన్‌స్పెక్టర్, హెల్త్ ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగ అవకాశాలతో పాటు ఎన్నో
సంస్థల్లో ఈ కోర్సు చేసిన వారికి మంచి డిమాండ్ ఉంది.
ఫిజియోథెరపీ..
శరీర భాగాలకు సంబంధించిన కండరాల
కదలికలు, ఆరోగ్య సమస్యలను ఫిజియోథెరపీ ద్వారానే పరిష్కరిస్తారు.
ఇంటర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోలజీ విద్యార్థులు ఈ కోర్సుకు
అర్హులు. మార్కెట్ (Market)లో మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్న రంగాల్లో ఇది
ఒకటి. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ కోర్సు చేస్తే బాగుంటుంది.
సైకాలజీ..
మనిషి
మానసిక స్థితిగతులకు అధ్యయనం చేయడమే సైకాలజీ (మనస్తత్వశాస్త్రం).
సైకాలజీలో బ్యాచలర్ ఆఫ్ ఆర్ట్స్ (బీఏ) హానర్స్ చేయొచ్చు. ఇంటర్
(Inter)లో 50శాతం ఉత్తీర్ణత ఉన్నవారు ఈ కోర్సు చేసేందుకు అర్హులు. ఈ
కోర్సు చేసిన వారికి ఆస్పత్రుల్లో సైకాలజిస్ట్‌గా, స్కూల్‌లో పని
చేయొచ్చు. ప్రైవేటుగా క్లినిక్ నిర్వహించుకోవచ్చు.
పోషకాహార నిపుణుడు/డైటీషియన్..
ప్రస్తుతం
వైద్య రంగంలో పోషకాహార నిపుణుల అవసరం ఉంది. డైట్ కంట్రోలింగ్ (Diet
Controlling) , ఆరోగ్యవంతమైన జీవన శైలి అవర్చు కోవడానికి డైటీషియన్
అవసరం. బ్యాచలర్ ఆఫ్ సైన్స్ లో న్యూట్రిషియన్ అండ్ డైటీషియన్ కోర్సు
చేయొచ్చు. సర్టిఫైడ్ డైటీషియన్‌లకు అన్ని ఆస్పత్రుల్లో, క్లినిక్‌లతో
పాటు క్రీడారంగంలోనూ ఉపాధి అవకాశాలు ఉన్నాయి.
ఇవే కాకుండా ఇంటర్
పూర్తి చేసిన వారికి బీఎస్సీ జువాలజీ(జంతుశాస్త్రం), బీఎస్సీ బాటనీ,
వైద్య రంగానికి సంబంధించి బీఏ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. నీట్-2021
సెప్టెంబర్ 12,13 భాషల్లో నిర్వహించనున్నారు. గతంలో కంటే పరీక్షలో
అడికే ప్రశ్నల సంఖ్య 180 నుంచి 200 వరకు పెంచారు.. విద్యార్థులు 180
ప్రశ్నలు రాయాలి.. అదనంగా ఇచ్చిన ప్రశ్నలు ప్రత్నామ్నాయంగా
ఎంచుకోవచ్చు. ఈ ఏడాది నుంచి బీఎస్సీ నర్సింగ్(హానర్స్) కోర్సుకు నీట్
తప్పని సరి చేశారు.
NIOS Registration: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్‌లో ఒకేషనల్ కోర్సులు.. ఇలా దరఖాస్తు చేసుకోండి
ఓపెన్ డిగ్రీ(Open Degree) విధానంలో వృత్తి విద్యా కోర్సులు చేయాలనుకునే వారికి శుభవార్త. దేశంలోనే ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్(NIOS) ఒకేషనల్, D.El.Ed కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్(Notifications) విడుదల చేసింది.
Gemini Internet
ఓపెన్ డిగ్రీ(Open Degree) విధానంలో వృత్తి విద్యా కోర్సులు(Vocational Courses) చేయాలనుకునే వారికి శుభవార్త. దేశంలోనే ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్(NIOS)
ఒకేషనల్, D.El.Ed కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్(Admissions
Notification) విడుదల చేసింది. 2021 ఏడాదికి సంబంధించి నేటి నుంచి
దరఖాస్తులు(Applications) ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు
అక్టోబర్-నవంబర్ సెషన్ పరీక్షల(Exams) కోసం నవంబర్ 20లోపు www.nios.ac.in
వెబ్సైట్ ద్వారా దరఖాస్తు(Applications) చేసుకోవాల్సి ఉంటుంది. అయితే
రూ.100 ఆలస్య రుసుముతో నవంబర్ 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ. 1500
ఆలస్య రుసుము చెల్లించి నవంబర్ 30 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం
ఉంటుంది. ఈ పరీక్షలను(Exams) 2021 డిసెంబర్‌లో లేదా 2022 జనవరిలో నిర్వహిస్తారు.
ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి?
Step 1: NIOS కోర్సుల కోసం అభ్యర్థులు www.nios.ac.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
Step 2: హోమ్‌పేజీలో, ‘‘రిజిస్ట్రేషన్ ఫర్ ఒకేషనల్, D.El.Ed కోర్సులు’ అనే లింక్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి.
Step 3: మీ ఈ–మెయిల్ ఐడి, పాస్‌వర్డ్ వంటి మీ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఆపై మీ అకౌంట్లోకి లాగిన్ అవ్వండి.
Step 4: మీరు దరఖాస్తు చేయాలనుకుంటున్న కోర్సులను ఎంచుకోండి. అవసరమైన అన్ని వివరాలను పూరించండి.
Step 5: అవసరమైన అన్ని డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి. ఆ తర్వాత ఫీజు చెల్లించండి. అంతే, మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.
Step 6: భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ఫారమ్ కాపీని డౌన్‌లోడ్ చేసుకోండి.
వర్చువల్ విధానంలో విద్యాబోధన..
నేషనల్
ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్ఐఓఎస్) ఒకేషనల్, D.El.Ed
కోర్సుకు సంబంధించిన అక్టోబర్ -నవంబర్ సెషన్ పరీక్షలు డిసెంబర్ 2021 లేదా
జనవరి 2022లో జరగనున్నాయి. ఈ పరీక్ష తేదీలపై త్వరలోనే క్లారిటీ రానుంది.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ఇటీవలే వర్చువల్
స్కూల్‌ను ప్రారంభించింది. వర్చువల్ లైవ్ క్లాస్ రూమ్‌లు, వర్చువల్
ల్యాబ్ ద్వారా విద్యా బోధన ఉంటుందని స్పష్టం చేసింది. ఈ అధునాతన డిజిటల్
లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ దేశంలోనే మొదటిదని విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర
ప్రధాన్ పేర్కొన్నారు.
Post Office Scheme: పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్.. ఇందులో చేరి ఇన్వెస్ట్ చేస్తే రూ.14 లక్షల బెనిఫిట్.. పూర్తి వివరాలు..!
Post Office Scheme: వివిధ రకాల స్కీమ్‌ల ద్వారా అధిక రాబడి పొందేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోంది. ఇక బ్యాంకుల మాదిరిగానే..
Gemini Internet
Post Office Scheme: వివిధ రకాల స్కీమ్‌ల ద్వారా అధిక రాబడి పొందేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోంది. ఇక బ్యాంకుల మాదిరిగానే పోస్టాఫీసులలో రకరకాల స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. వాటిల్లో అత్యంత సురక్షితమైనవి పోస్టాఫీసులు అందించే పెట్టుబడి పథకాలు. ఈ స్కీమ్‌ల ద్వారా మంచి రాబడి పొందవచ్చు. పోస్టాఫీసు ప్రవేశపెట్టిన స్కీమ్‌లలో గ్రామ సుమంగళ్ గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్. దీనిని 1995లోనే ప్రవేశపెట్టారు. ఇందులో వివిధ రకాల పెట్టుబడి మొత్తంతో కూడిన ఆరు బీమా ఆప్షన్లు కూడా ఇందులో ఉన్నాయి. వీటిలో రోజూ రూ.95 పెట్టుబడితో 20 ఏళ్లలో రూ.14 లక్షలు పొందవచ్చు.
ఈ స్కీమ్‌లో రెండు ఆప్షన్లు..
ఈ స్కీమ్‌లో రెండు ఆప్షన్లు ఉన్నాయి. అంటే 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల కాలపరిమితితో అందుబాటులో ఉంది. 19-45 సంవత్సరాల వయసు ఉన్న వారు ఈ స్కీమ్‌లో చేరవచ్చు.15 ఏళ్ల పాటు పాలసీలో మనీ బ్యాక్ ఆప్షన్ ఉంది. పాలసీ తీసుకున్న తర్వాత 6 సంవత్సరాలు, 12 సంవత్సరాలు పూర్తయిన తర్వాత 20 శాతం మొత్తాన్ని పాలసీదారుడు తిరిగి పొందే అవకాశం ఉంటుంది. ఇక మిగిలిన 40 శాతం మొత్తాన్ని మెచురిటీపై బోనస్‌గా పెట్టుబడిదారులకు అందిస్తారు. అదే 20 సంవత్సరాల పాలసీ అయితే 20 శాతం చొప్పున 8వ సంవత్సరంలో, 12వ సంవత్సరంలో, 16వ సంవత్సరంలో చెల్లిస్తారు. మిగిలిన 40 శాతం మొత్తాన్ని మెచురిటీపై బోనస్‌గా అందజేస్తారు.
మరి రూ. 14 లక్షలు పొందటం ఎలా?
25 సంవత్సరాల వ్యక్తి రూ.7 లక్షల ఇన్సూరెన్స్ హామీ కోసం 20 సంవత్సరాలు పెట్టుబడి పెట్టారనుకుంటే.. వారు ప్రతి నెల రూ.2853 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇది రోజుకు సుమారు రూ.95గా ఉంటుంది. ఈ స్కీమ్ కింద 8వ సంవత్సరం, 12వ సంవత్సరం, 16వ సంవత్సరం పెట్టుబడిదారులకు 20 శాతం చొప్పున.. అంటే రూ.1.4 లక్షల చొప్పున తిరిగి చెల్లిస్తారు. చివరగా 20వ సంవత్సరంలో రూ.2.8 లక్షలు హామీపూరిత మొత్తంగా అందుతాయి.
బోనస్ రూపంలో..
ఈ స్కీమ్ కింద పెట్టుబడి పెట్టిన ప్రతి రూ.1000కి రూ.48 బోనస్‌గా చెల్లిస్తారు. అంటే రూ.7 లక్షలకు ప్రతి సంవత్సరం బోనస్ రూపంలో రూ.33,600 అందుతుంది. మొత్తం 20 సంవత్సరాలకు ఈ బోనస్ రూ.6.72 లక్షలు అవుతుంది. అంటే రూ.7 లక్షల హామీపూరిత మొత్తం, ఈ బోనస్ రూ.6.72 లక్షలు కలిస్తే 20 సంవత్సరాల కాలంలో పెట్టుబడిదారులు రూ.13.71 లక్షలు అందుకుంటారన్నమాట. ఇందులో రూ.4.2 లక్షలు మనీ బ్యాక్‌గా ముందే అవకాశం ఉంటుంది. ఇక చివరిలో బోనస్, మిగిలిన మొత్తం రూ.9.52 లక్షలు అందుకుంటారు. ఒకవేళ మెచ్యూరిటీకి ముందే పెట్టుబడిదారులు మరణిస్తే.. హామీపూరిత మొత్తంతో పాటు బోనస్ మొత్తాన్ని నామినీకి అందజేస్తారు. ఇలా పోస్టాఫీసులో ఇలాంటి స్కీమ్స్ ఎన్నో ఉన్నాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చు. అయితే ఇవి అవగాహన కోసం మాత్రమే. వివిధ నివేదికలు, వెబ్‌సైట్ల ఆధారంగా వివరాలు అందజేయడం జరుగుతుంది. ఈ స్కీమ్‌కు సంబంధించి పూర్తి వివరాలు కావాలంటే మీ సమీపంలో ఉన్న పోస్టాఫీసును సందర్శించి తెలుసుకోవచ్చు.
భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ | Tirumala Darshan Tickets Online Through Apsrtc
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి దృష్టా గత రెండేళ్ల కాలంపాటు తిరుమల
తిరుపతి దేవస్థానం శ్రీవారి దర్శనాలను రద్దుచేసిన విషయం తెలిసిందే. అనంతరం
భక్తుల కోసం దర్శనాలను పరిమితం చేసింది.. క్రమంగా భక్తుల సంఖ్యను పెంచుతూ
ఉచిత దర్శనాలు,వీఐపీ బ్రేక్, రూ.300 దర్శనాలు కరోనా నిభందన మేరకు అనుమతి
ఇస్తోంది. ఈ క్రమంలోనే రూ. 300ల స్పెషల్ దర్శన టికెట్లను విడుదల చేశారు.
Gemini Internet
అయితే పరిమిత సంఖ్యలో టికెట్లు విడుదల చేస్తుండడంతో.. చాలా తక్కువ సమయంలో టికెట్లు కొనుగోళ్లు జరుగుతున్నాయి. దీంతో దేశ విదేశాల్లోని వెంకన్న భక్తులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. అయితే ఇలా టికెట్ దొరకని వారి కోసం టీటీడీ, ఏపీఎస్ ఆర్టీసీ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ విధానం ద్వారా తిరుమల శ్రీవారిని దర్శించుకునే అవకాశాన్ని ఇటీవల టీటీడీ కల్పించింది .ఇందులో భాగంగా దేశంలోని పలు ప్రాంతాలు నుండి తిరుపతికి ఆర్టీసీ బస్సుల్లో వచ్చే ప్రయాణికులకు రోజుకు 1000 దైవ దర్శనం టికెట్లు అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఏపీఎస్‌ఆర్‌టీసీ ఆన్‌లైన్‌లో టికెట్స్
ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో తిరుమలకు దర్శనం కోసం వచ్చే భక్తులు www.apsrtconline.in వెబ్‌సైట్‌లో
ప్రయాణ చార్జీలు, జీఎస్టీతో పాటు రూ. 300 చెల్లించి శీఘ్ర దర్శనం
టికెట్‌ను పొందవచ్చు. ఇలా టికెట్ పొందిన వారికి ప్రతి రోజూ ఉదయం 11:00
గంటలకు, సాయంత్రం 4:00 గంటలకు తిరుమ శ్రీవారి దర్శనం కల్పిస్తారు. తిరుమల
బస్ స్టేషన్‌కు చేరుకున్న తర్వాత శ్రీవారి దర్శనం చేసుకోవడంలో ఆర్టీసీ
సూపర్ వైజర్లు సహాయం చేస్తారు. ఇదిలా ఉంటే ఏపీఎస్‌ఆర్‌టీసీ వివిధ ప్రాంతాల
నుంచి ప్రతి రోజు తిరుపతికి 650 బస్సులు నడిపిస్తోంది.
టీటీడీ అధికారులు ఆధ్మాత్మిక కోణంలో ఆలోచించి ఇచ్చిన దర్శన అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలి.విజయవాడ,గుంటూరు, బెంగుళూరు, చెన్నై, కంచి, వెల్లూరు, పాండిచ్చేరి, హైదరాబాద్ మొదలైన ప్రధాన నగరాల నుంచి తిరుమల దర్శనం కోసం వచ్చే భక్తులు ఆన్‌లైన్ విధానంలో టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఒరిజినల్ ఇడీ ప్రూఫ్,ఆర్టీసీ టికెట్స్ జిరాక్స్ కాఫీ,సాంప్రదాయ వస్త్ర దారణలో టీటీడీ నిభందనల మేరకు భక్తులను టీటీడీ అనుమతి ఇస్తోంది.
2, నవంబర్ 2021, మంగళవారం
NHAI Recruitment 2021: నేషనల్ హైవేస్ అథారిటీలో ఉద్యోగాలు | ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ 29-11-2021
NHAI Recruitment: ఎన్‌హెచ్‌ఏఐలో డిప్యూటీ మేనేజర్ పోస్టులు.. నెలకు రూ. లక్షన్నరకు పైగా జీతం పొందే అవకాశం..
NHAI Recruitment: నేషనల్ హైవేష్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా డిప్యూటీ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల భర్తీకిగాను..
NHAI Recruitment: నేషనల్ హైవేష్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా డిప్యూటీ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల భర్తీకిగాను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) దరఖాస్తుల ఆహ్వానిస్తోంది. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో మొత్తం 17 డిప్యూటీ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బ్యాచిలర్ ఇన్ కామర్స్/ సీఏ/ సర్టిఫైడ్ మేనేజ్‌మెంట్ అకౌంటెంట్/ మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినేషన్ (ఫైనాన్స్)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వీటితో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
* అభ్యర్థుల వయసు 35 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
* పరీక్ష పార్ట్ 1, పార్ట్ 2 లో భాగంగా 100 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు.
* జనరల్ అభ్యర్థ/లు రూ. 500, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థ/లు రూ. 300 ఫీజుగా చెల్లించాలి.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 56,100 నుంచి రూ. 1,77,500 వరకు చెల్లిస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు 29-11-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
---------------------------------------------------------------------------------
ఆయుష్ రిక్రూట్‌మెంట్ మంత్రిత్వ శాఖ 2021 సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్, డేటా అసిస్టెంట్, MTS & ఇతర - 7 పోస్ట్‌లు ayush.gov.in చివరి తేదీ 10-11-2021
Name of Organization Or Company Name :Ministry of Ayush
Total No of vacancies: – 7 Posts
Job Role Or Post Name:Senior Program Manager, Data Assistant, MTS & Other
Educational Qualification:10+2, Degree, PG (Relevant Discipline)
Who Can Apply:All India
Last Date:10-11-2021
Website: ayush.gov.in
Click here for Official Notification
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
📢📬 ఇండియా పోస్టల్ శాఖలో ఉద్యోగ అవకాశాలు! 🏤💼 ✅ పదో తరగతి పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఉందా? ✅ తక్కువ చదువుతో మంచి జీతంతో ఉద్యోగ...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...