ఓపెన్ డిగ్రీ(Open Degree) విధానంలో వృత్తి విద్యా కోర్సులు చేయాలనుకునే వారికి శుభవార్త. దేశంలోనే ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్(NIOS) ఒకేషనల్, D.El.Ed కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్(Notifications) విడుదల చేసింది.
Gemini Internet
ఓపెన్ డిగ్రీ(Open Degree) విధానంలో వృత్తి విద్యా కోర్సులు(Vocational Courses) చేయాలనుకునే వారికి శుభవార్త. దేశంలోనే ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్(NIOS)
ఒకేషనల్, D.El.Ed కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్(Admissions
Notification) విడుదల చేసింది. 2021 ఏడాదికి సంబంధించి నేటి నుంచి
దరఖాస్తులు(Applications) ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు
అక్టోబర్-నవంబర్ సెషన్ పరీక్షల(Exams) కోసం నవంబర్ 20లోపు www.nios.ac.in
వెబ్సైట్ ద్వారా దరఖాస్తు(Applications) చేసుకోవాల్సి ఉంటుంది. అయితే
రూ.100 ఆలస్య రుసుముతో నవంబర్ 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ. 1500
ఆలస్య రుసుము చెల్లించి నవంబర్ 30 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం
ఉంటుంది. ఈ పరీక్షలను(Exams) 2021 డిసెంబర్‌లో లేదా 2022 జనవరిలో నిర్వహిస్తారు.
ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి?
Step 1: NIOS కోర్సుల కోసం అభ్యర్థులు www.nios.ac.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
Step 2: హోమ్‌పేజీలో, ‘‘రిజిస్ట్రేషన్ ఫర్ ఒకేషనల్, D.El.Ed కోర్సులు’ అనే లింక్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి.
Step 3: మీ ఈ–మెయిల్ ఐడి, పాస్‌వర్డ్ వంటి మీ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఆపై మీ అకౌంట్లోకి లాగిన్ అవ్వండి.
Step 4: మీరు దరఖాస్తు చేయాలనుకుంటున్న కోర్సులను ఎంచుకోండి. అవసరమైన అన్ని వివరాలను పూరించండి.
Step 5: అవసరమైన అన్ని డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి. ఆ తర్వాత ఫీజు చెల్లించండి. అంతే, మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.
Step 6: భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ఫారమ్ కాపీని డౌన్‌లోడ్ చేసుకోండి.
వర్చువల్ విధానంలో విద్యాబోధన..
నేషనల్
ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్ఐఓఎస్) ఒకేషనల్, D.El.Ed
కోర్సుకు సంబంధించిన అక్టోబర్ -నవంబర్ సెషన్ పరీక్షలు డిసెంబర్ 2021 లేదా
జనవరి 2022లో జరగనున్నాయి. ఈ పరీక్ష తేదీలపై త్వరలోనే క్లారిటీ రానుంది.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ఇటీవలే వర్చువల్
స్కూల్‌ను ప్రారంభించింది. వర్చువల్ లైవ్ క్లాస్ రూమ్‌లు, వర్చువల్
ల్యాబ్ ద్వారా విద్యా బోధన ఉంటుందని స్పష్టం చేసింది. ఈ అధునాతన డిజిటల్
లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ దేశంలోనే మొదటిదని విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర
ప్రధాన్ పేర్కొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి