122 పరీక్షా కేంద్రాల్లో 60 వేల మంది విద్యార్థులు 🌻మచిలీపట్నం టౌన్, ఫిబ్రవరి 13 : ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈనెల 15వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్ అధికారులు రంగం సిద్ధం చేశారు. జనరల్ ప్రాక్టికల్ పరీక్షలు విజయవాడ డివిజన్‌లో 103, కృష్ణా డివిజన్‌లో 83 కేంద్రాల్లో జరగనున్నాయి. ఒకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలు విజయవాడ డివిజన్‌లో 6, కృష్ణా రూరల్ పరిధిలో 30 కేంద్రాల్లో జరగనున్నాయి. విజయవాడ డివిజన్ పరిధిలో 20,147 మంది ఎంపీసీ, 23,091 మంది బైపీసీ విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. విజయవాడ డివిజన్ పరిధిలో ఫస్టియర్‌లో 376, సెకండియర్‌లో 399 మంది ఒకేషనల్ విద్యార్థులు హాజరవుతున్నారు. కృష్ణా డివిజన్‌లో ఎంపీసీ 9735, బైపీసీ 4016 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఒకేషనల్ విద్యార్థులు విజయవాడ డివిజన్ పరిధిలో ఫస్టియర్ 1427, సెకండియర్ 1370 మంది హాజరవుతున్నారు. ♦️.థియరీ పరీక్షలకు 60,147 మంది ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని 430 కళాశాలలకు చెందిన 60,147 మంది విద్యార్థులు థియరీ పరీక్షలకు హాజరుకానున్నారు. మార్చి 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ పరీక్షలకు 430 కళాశాల...
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యానం 3.00 గంటల నుండి సాయంత్రం 9.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు