నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (National Eligibility cum Entrance Test) 2021
క్వాలిఫై అయిన అభ్యర్థులు కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. నీట్
ఫలితాలను ప్రకటించి ఒక నెల దాటినా, కౌన్సెలింగ్ (Counselling), అడ్మిషన్
ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో లక్షలాది మంది విద్యార్థులు ఆందోళన
చెందుతున్నారు. అయితే నీట్ కౌన్సెలింగ్ ప్రారంభమయ్యేందుకు మరో నెల రోజుల
సమయం పడుతుందని చెబుతోంది మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (Medical Counselling
Committee). దీనికి సంబంధించి సంస్థ అధికారిక ప్రకటన వెల్లడించింది.
మెడికల్ కాలేజీ అడ్మిషన్ల (Admissions)కు సంబంధించి అధికారుల నుంచి
అధికారిక ప్రకటన వెలువడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
సుప్రీంకోర్టులో
కొనసాగుతున్న కేసు కారణంగా నీట్ కౌన్సెలింగ్ ఆలస్యమవుతోందని MCC
తెలియజేసింది. మెడికల్ అడ్మిషన్ల కోసం కొత్తగా ప్రవేశపెట్టిన EWS కోటాను
పొందేందుకు రూ.8 లక్షలు పరిమితిగా ఉంచడంపై సుప్రీంకోర్టు (Supreme Court) లో విచారణ జరుగుతోంది. ఈ కేసు తదుపరి విచారణ జనవరి 6న జరగనుంది.
Gemini Internet
ఆ తరువాతే ఈ అంశంపై సుప్రీంకోర్టు తీర్పు రానుంది. కాబట్టి తీర్పుకు ముందు కౌన్సెలింగ్ ప్రక్రియ (Counselling Process)ప్రారంభమయ్యే అవకాశం లేదు.
‘30.07.2021 నాటి ఆఫీస్ మెమోరాండం సుప్రీం కోర్టు విచారణ పరిధిలో ఉంది. తదుపరి ప్రొసీడింగ్స్ 2022 జనవరి 6న జరగనున్నాయి. NEET-UG- 2021 కౌన్సెలింగ్‌లో పాల్గొనాలనుకునే అభ్యర్థులకు సమాచారం కోసం ఈ ప్రకటన చేస్తున్నాం’ అని మెడికల్ కౌన్సిల్ కమిటీ పేర్కొంది.
కౌన్సెలింగ్ ఎందుకు ఆలస్యం అవుతోంది?
కేంద్ర
ప్రభుత్వం ఓబీసీ *(OBC) విద్యార్థులకు 27 శాతం, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు
10 శాతం రిజర్వేషన్లు కల్పించింది. ఇది UG, PG అడ్మిషన్స్ రెండింటికీ
వర్తిస్తుంది. EWS కేటగిరీ సీట్లు పొందేవారి కుటుంబ వార్షిక ఆదాయం రూ. 8
లక్షల కంటే తక్కువ ఉండాలనే నిబంధన ఉంది. అయితే ఈ పరిమితిని ఏ ప్రాతిపదికన
నిర్ణయించారని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని (Central Govt)
ప్రశ్నించింది. దీనిపై విచారణ జరుగుతోంది.
గత విచారణలో ఈ అంశంపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ.. EWS కోటా
నిబంధనలను పునఃసమీక్షించడానికి ప్రభుత్వం ఒక కమిటీని రూపొందిస్తుందని
చెప్పారు. ఈ కమిటీ నాలుగు వారాల్లో తాజా నిర్ణయం తీసుకుంటుందని మెహతా
సుప్రీంకోర్టుకు తెలిపారు. ఒకవేళ ఈ పరిమితిని మారిస్తే, కొత్తగా
ప్రవేశపెట్టిన EWS కోటా సీట్లు పొందేందుకు ఎక్కువ లేదా తక్కువ మంది విద్యార్థులు (Students)
అర్హులవుతారు. అందువల్ల అప్పటి వరకు యూజీ, పీజీ వైద్య కళాశాలల అడ్మిషన్లకు
కౌన్సెలింగ్ నిలిచిపోయింది. ఒకవేళ EWS కోటాను మారిస్తే, ఈ కేటగిరీ కింద
ప్రయోజనం పొందేందుకు అర్హులైన అభ్యర్థుల సంఖ్య పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. ఈ
నిర్ణయం వైద్య కళాశాల (Medical Colleges) ప్రవేశాల పై ప్రభావం చూపుతుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి