11, డిసెంబర్ 2021, శనివారం

TTD: టీటీడీ పాలకమండలి సంచలన నిర్ణయం.. తెరపైకి మూడో ఘాట్ రోడ్డు.. వైకుంఠ ఏకాదశికి గుడ్ న్యూస్



TTD Key Decesions:  తిరుమల తిరుపతి దేవస్తానం (Tirumala Tirupati Devastnam) పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉండడంతో.. వారి అందరికి ఎలాంటి సమస్య రాకుండా ఉండేందుకు .. 10 రోజులు పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తాం అని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి (YV Subbareddy) అన్నారు. జనవరి 13 న వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమవుతుందని తెలిపారు.. రాష్ట్రంలో కోవిడ్ నిభందనలు (Kovid Rules) సడలిస్తే.. పండుగ తరువాత సర్వదర్శనం పెంపు, ఆర్జిత సేవలకు భక్తులను అనుమతిస్తామన్నారు. మొత్తం 11 మంది చిన్నపిల్లలుకు విజయవంతంగా గుండె శస్త్ర చికిత్స నిర్వహించారు. చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణం కోసం విరాళాలు అందించిన భక్తులుకు ఉదయాస్తమాన సేవకు అనుమతించేలా అవకాశం కల్పిస్తాం అన్నారు. 500 ఉదయాస్తమాన సేవా టిక్కేట్లు ప్రస్తుతం ఖాళీగా వున్న వాటిని భక్తులుకు కేటాయిస్తామని.. బోర్డ్ సభ్యులు కూడా కోంత మంది విరాళాలు అందించేందుకు అంగీకరించారు అని తెలిపారు.

అలాగే వివాదాస్పదంగా మారిన హనుమంతుడి జన్మస్థలమైనా అంజనాద్రి ప్రాంతాని అభివృద్ధి చేస్తామన్నారు. నాదనీరాజనం మండపం దగ్గర శాశ్వత ప్రాతిపాదికన మండపాన్ని నిర్మిస్తామన్నారు. భక్తులు సౌకర్యార్థం అన్నమయ్య నడకమార్గాని.. మూడో రోడ్డు గా అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. హిందు దర్మప్రచారంలో భాగంగా ప్రతి జిల్లాలో కార్యక్రమాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నమన్నారు. వర్షం కారణంగా అన్నమయ్య ప్రాజెక్ట్ వద్ద కోట్టుకుపోయిన ఆలయాలను తిరిగి పున: నిర్మిస్తామన్నారు. ఐటి విభాగాన్ని పటిష్టవంతంగా నిర్వహించేందుకు ఉద్యోగ నియామకాలు చేస్తాం. 2.6 కోట్ల రూపాయల వ్యయంతో నూతన పరకామణి మండపంలో యంత్రాలు కొనుగోలు చేసామన్నారు. శ్రీశైలం ఆలయ గోపురానికి బంగారు తాపడం పనులు చేస్తామన్నారు. తాళ్లపత్ర కందిరీగలను పరిరక్షించడానికి ఎస్వీ వేద విద్యాలయంలో మ్యాన్ స్ర్కిప్ట్ విభాగాని ఏర్పాటు చేస్తామన్నారు.

వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా వెనుకబడిన ప్రాంతాలకు చెందిన భక్తులకు ఉచితంగా దర్శనభాగ్యాం కల్పిస్తామన్నారు. భక్తులుకు శ్రీవేంకటేశ్వర నామ కోటి పుస్తకాలను అందిస్తామన్నారు. కళ్యాణకట్ట క్షురకులుకు ఇచ్చే పీస్ రేటును 11 నుంచి 15 రూపాయలకు పెంచామన్నారు. 3 కోట్ల రూపాయల వ్యయంతో వసతి గదుల్లో గీజర్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఎఫ్ఎంస్ కార్మికుల సమస్యను పరిష్కరించేందుకు ఉన్నతాధికారులతో కమిటీ వేశాం. కార్మికుల సమస్యను పరిష్కరించేందుకు టీటీడీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. సీఎం హామీ మేరకు టీటీడీలో పనిచేసే కార్మికులను ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్‌లో కలిపాం. కాంట్రాక్టర్ కింద పని చేసే కార్మికులను ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ లో కలపలేం. ఇప్పటి దాకా టీటీడీకి ప్రత్యేకమైన ఐటీ వింగ్ లేదు. టీటీడీ ఐటీ వింగ్ కోసం అర్హత కలిగిన ఉద్యోగులతో ప్రత్యేక టీటీడీ ఐటీ వింగ్ ఏర్పాటు చేస్తాం' అని చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

 

 

కామెంట్‌లు లేవు: