9, డిసెంబర్ 2021, గురువారం

Google Scholarship: గూగుల్ నుంచి రూ.74,000 స్కాలర్‌షిప్... దరఖాస్తుకు రేపే చివరి తేదీ

1. పరిచయం అక్కర్లేని సెర్చ్ ఇంజిన్, ఇంటర్నెట్ సేవల దిగ్గజ కంపెనీ అయిన గూగుల్ (Google) విద్యార్థినులకు స్కాలర్‌షిప్ ప్రకటించింది. 'జనరేషన్ గూగుల్ స్కాలర్‌షిప్' (Generation Google Scholarship) పేరుతో ఆర్థిక సహకారాన్ని ప్రకటించింది. కంప్యూటర్ సైన్స్‌లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినులు ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేయొచ్చు.

Gemini Internet

2. డిగ్రీ చదువుతున్న అమ్మాయిలు మాత్రమే ఈ స్కాలర్‌షిప్‌కు అప్లై చేయాలి. ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. విద్యార్థినులు 2021 డిసెంబర్ 10 లోగా అప్లై చేయాలి. ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైనవారికి 2022-23 విద్యాసంవత్సరానికి 1000 డాలర్లు అంటే సుమారు రూ.74,000 స్కాలర్‌షిప్ లభిస్తుంది.

3. ఈ స్కాలర్‌షిప్‌ను కంప్యూటర్ సైన్స్, టెక్నాలజీ లేదా సంబంధిత టెక్నికల్ ఫీల్డ్‌లో డిగ్రీ చదువుతున్న విద్యార్థినులకు మాత్రమే ప్రకటించింది గూగుల్. దరఖాస్తుదారులు నాయకత్వాన్ని ప్రదర్శించడంతో పాటు కంప్యూటర్ సైన్స్, టెక్నాలజీలో ప్రాతినిధ్యం లేని బృందాలను మెరుగుపర్చేందుకు తమ అభిరుచిని, ఆసక్తిని ప్రదర్శించాలి. (ప్రతీకాత్మక చిత్రం)

4. ఈ విద్యాసంవత్సరంలో అంటే 2021-2022 లో ఫుల్ టైమ్ బ్యాచిలర్స్ డిగ్రీ చదువుతున్నవారు మాత్రమే అప్లై చేయాలి. ఆసక్తి గల విద్యార్థినులు buildyourfuture.withgoogle.com వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత Scholarships+ ట్యాబ్ పైన క్లిక్ చేయాలి.

5. ఆ తర్వాత Generation Google Scholarship (Asia Pacific) ట్యాబ్ పైన క్లిక్ చేయాలి. నియమనిబంధనలు చదివిన తర్వాత APPLY NOW పైన క్లిక్ చేయాలి. తర్వాత గూగుల్ అకౌంట్ యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి. పేరు, ఇతర వివరాలు ఎంటర్ చేయాలి. ఆ తర్వాత విద్యార్థినికి సంబంధించిన మరిన్ని వివరాలు, కాంటాక్ట్ వివరాలు ఎంటర్ చేయాలి.

6. తర్వాతి సెక్షన్‌లో విద్యార్హతల వివరాలు ఎంటర్ చేయాలి. రెజ్యూమె, అకడమిక్ ట్రాన్స్‌స్క్రిప్ట్స్, ఎస్సే ప్రశ్నలకు సమాధానాలు అప్‌లోడ్ చేయాలి. దరఖాస్తుల్ని 2021 డిసెంబర్ 10 లోగా సబ్మిట్ చేయాలి. అప్లికేషన్స్ విజయవంతంగా సబ్మిట్ చేసిన తర్వాత గూగుల్ నుంచి మెయిల్ వస్తుంది. దరఖాస్తుల్ని పరిశీలించిన తర్వాత స్కాలర్‌షిప్‌కు కొందర్ని ఎంపిక చేస్తుంది గూగుల్.

7. వైవిధ్యం, సమానత్వం, విద్యాభ్యాసంలో పనితీరు లాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ స్కాలర్‌షిప్ ఇస్తామని గూగుల్ ప్రకటించింది. వారికి 1,000 డాలర్ల స్కాలర్‌షిప్ లభిస్తుంది. ఈ స్కాలర్‌షిప్‌కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే విద్యార్థినులు generationgoogle-apac@google.com మెయిల్ ఐడీలో సంప్రదించొచ్చు.

 

 

కామెంట్‌లు లేవు: