16, డిసెంబర్ 2020, బుధవారం

Anantapur District Classifieds

 

SSC Stenographer 2019 Admit Card for December 2020 Exam

 

Some Useful Important Links

Download Admit Card (CR Region)

Click Here

Download Admit Card (NR Region)

Click Here

Download Admit Card (MPR Region)

Click Here

Download Admit Card (Other Region)

Click Here

Download Exam Notice

Click Here

Login to Change Exam District

Click Here

Download Notice for Change Exam District

Click Here

Download Exam Notice

Click Here

Apply Online

Click Here

How to Registration (Video Hindi)

Click Here

Download Syllabus

Click Here

Download Notification

Click Here

Official Website

Click Here

ఇంటర్ ఫీజులు రద్దు

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు శుభవార్త.

ఏపీ లో ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో విద్యార్థుల తల్లీ తండ్రుల ఆర్థిక స్థితి గతులను దృష్టిలో పెట్టుకుని ఇంటర్మీడియట్ కళాశాలల్లో ప్రస్తుతం ఉన్న పలు రకాల రుసుములను రద్దు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయం తీసుకుంది.

ఏపీ ఇంటర్ బోర్డు రద్దు చేసిన పలు రుసుముల వివరాలు :

గ్రూప్ మార్పు (మొదటి సంవత్సరం )1000
గ్రూప్ మార్పు (రెండవ సంవత్సరం )1000
రీ – అడ్మిషన్స్1000
టీ సీ సర్టిఫికెట్స్1000
సెకండ్ లాంగ్వేజ్ మార్పు800
మీడియం మార్పు600

 

రూ.60,000/- నుండి రూ.1,80,000/- వేతనం తో ఉద్యోగాలు | ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (ఎలక్ట్రికల్)


ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (ఎలక్ట్రికల్)

POWERGRID


 
సంఖ్య :-
అర్హతలుB.E./ B.Tech/ B.Sc (Engg)
విడుదల తేదీ:15-01-2021
ముగింపు తేదీ:15-02-2021
వేతనం:రూ.60,000-/ – రూ.1,80,000/-
ఉద్యోగ స్థలం:భారతదేశం
 

మరింత సమాచారం:

వయసు పరిమితి :-
28 సంవత్సరాలు.
--------------------------------------------------------
అప్లికేషన్ రుసుము :-
ఎలాంటి రుసుము.
--------------------------------------------------------
ఎంపిక ప్రక్రియ :-
1.ఇంటర్వ్యూ.
2.బృంద చర్చ.
---------------------------------------------------------
How to Apply :-
అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
---------------------------------------------------------
Website :-
https://www.powergridindia.com
---------------------------------------------------------
Notification :-
https://www.powergridindia.com/job-opportunities-0
---------------------------------------------------------
దయచేసి మీ స్నేహితుడికి ఈ సమాచారాన్ని భాగస్వామ్యం చేయండి.
---------------------------------------------------------








TTD News

డిసెంబరు 16 నుండి టిటిడి అనుబంధ ఆల‌యాల్లో ధనుర్మాస కార్య‌క్ర‌మాలు

టిటిడి అనుబంధ ఆల‌యాల్లో డిసెంబరు 16వ తేదీ బుధ‌వారం నుంచి ధనుర్మాస కార్య‌క్ర‌మాలు  ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఆయా ఆలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆలయంలో..

తిరుచానూరులోని శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆలయంలో డిసెంబరు 16 నుంచి జనవరి 15వ తేదీ వరకు ధనుర్మాస ప్రత్యేక కార్యక్రమాలు జరుగనున్నాయి. ప్రతిరోజూ తెల్లవారుజామున 6 నుండి 7 గంట‌ల వ‌ర‌కు భ‌క్తుల‌కు ధ‌నుర్మాస ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు.

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో..

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో బుధ‌వారం ఉదయం 6.04 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభమవుతాయి. ఉద‌యం 7 గంట‌ల‌కు భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు. ఈ సందర్భంగా నెల రోజులపాటు ఉదయం 5.30 నుంచి 6.30 గంటల వరకు భక్తులకు ధనుర్మాస దర్శనం కల్పిస్తారు. ఉదయం సుప్రభాతం బదులు తిరుప్పావై పారాయణం చేస్తారు.

అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరాలయంలో..

తిరుపతి సమీపంలోని అప్పలాయగుంటలో గల శ్రీ ప్రసన్న వేంకటేశ్వరాలయంలో డిసెంబరు 16 నుంచి జనవరి 15వ తేదీ వరకు ధనుర్మాస ప్రత్యేక కార్యక్రమాలు జరుగనున్నాయి. ప్రతిరోజూ తెల్లవారుజామున సుప్రభాతం బదులు తిరుప్పావై పారాయణం చేస్తారు. 

శ్రీ‌నివాస మంగాపురంలోని శ్రీ క‌ల్యాణ వేంకటేశ్వరాలయంలో..

శ్రీ‌నివాస మంగాపురంలోని శ్రీ క‌ల్యాణ వేంకటేశ్వరాలయంలో డిసెంబరు 16 నుంచి జనవరి 15వ తేదీ వరకు ధనుర్మాస ప్రత్యేక కార్యక్రమాలు జరుగనున్నాయి. ప్రతిరోజూ తెల్లవారుజామున 3 నుండి 4 గంట‌ల వ‌ర‌కు ధ‌నుర్మాస కైంక‌ర్యాలు, ఉదయం 5.30 నుండి 6 గంట‌ల వ‌ర‌కు ధ‌నుర్మాస ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు.

ఒంటిమిట్ట‌లోని శ్రీ కోదండ‌రామాల‌యంలో..

వైఎస్ఆర్ క‌డ‌ప జిల్లా ఒంటిమిట్ట‌లోని శ్రీ కోదండ‌రామాల‌యంలో డిసెంబరు 16 నుంచి జనవరి 13వ తేదీ వరకు ధనుర్మాస ప్రత్యేక కార్యక్రమాలు జరుగనున్నాయి. ప్రతిరోజూ తెల్లవారుజామున తిరుప్పావై నివేదిస్తారు. 

దేవుని క‌డ‌ప‌లోని శ్రీ ల‌క్ష్మీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో..

వైఎస్ఆర్ క‌డ‌ప జిల్లా దేవుని క‌డ‌ప‌లోని శ్రీ ల‌క్ష్మీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో డిసెంబరు 16 నుంచి జనవరి 13వ తేదీ వరకు ధనుర్మాస ప్రత్యేక కార్యక్రమాలు జరుగనున్నాయి.

 ప్రతిరోజూ తెల్లవారుజామున తిరుప్పావై నివేదిస్తారు. డిసెంబ‌రు 15 నుండి జ‌న‌వ‌రి 3వ తేదీ వ‌రకు అధ్య‌య‌నోత్స‌వాలు నిర్వ‌హిస్తారు.

జ‌మ్మ‌ల‌మ‌డుగులోని శ్రీ న‌ర‌పుర వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో..

వైఎస్ఆర్ క‌డ‌ప జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగులోని శ్రీ న‌ర‌పుర వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో డిసెంబరు 16 నుంచి జనవరి 13వ తేదీ వరకు ధనుర్మాస ప్రత్యేక కార్యక్రమాలు జరుగనున్నాయి.

★ *తి.తి.దేవస్థానం సమాచారం* ★ *ధనుర్మాస వ్రతం - ఫలితము*



🌹👉 శ్రీ వారి ఆలయంలో సుప్రభాతం 
              స్థానంలో తిరుప్పావై.

 💠 తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం ఒక్కటి.

👉 ఈ నేపథ్యంలో స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు.

🌹 *ధనుర్మాసానికి విశేష ప్రాధాన్యం.* 🌹 
        
 ◆ °పురాణాల ప్రకారం ధనుర్మాసంలో దేవతలు  సూర్యోదయానికి ఒకటిన్నర గంట ముందుగా నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో శ్రీమహావిష్ణువును ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. కావున ఈ మాసానికి సౌరమానంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.

🌹 *దైవ ప్రార్థ‌న‌కు అనుకూలం°* 🌹
          
 ◆ తాను అన్ని మాసాల్లో ఉత్తమమైన మార్గశిర మాసం లాంటివాడినని శ్రీమహావిష్ణువు స్వయంగా చెప్పిన‌ట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. 

◆ ధనుర్మాసాన్ని శూన్యమాసం అని కూడా పిలుస్తారు. ఈ మాసంలో భగవంతునికి సంబంధించిన కార్యక్రమాలు తప్ప ఇతర కార్యక్రమాలు సాధారణంగా చేయరు. పూర్తిగా దైవంపైనే శ్రద్ధ వహించి ప్రార్థించాలన్నదే ఇందులో అంతరార్థం.

🌹 *ధనుర్మాస పూజ వెయ్యేళ్ల ఫలం°*🌹
         
 ■ కలియుగంలో శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీవేంకటేశ్వరుని ధనుర్మాసంలో ఒకరోజు పూజించినా వెయ్యేళ్ల పూజాఫలం దక్కుతుంది. పూర్వీకుల వారసత్వాన్ని కొనసాగిస్తూ భక్తులు ఈ మాసంలో బ్రహ్మ ముహూర్తంలో ధనుర్మాస పూజలు చేస్తారు.

🌹 *ఆండాళ్‌ తిరుప్పావై పారాయణం*🌹
          
◆  12 మంది ఆళ్వార్లలో శ్రీ ఆండాళ్‌(గోదాదేవి) ఒకరు.
ఈమెను నాచియార్‌ అని కూడా పిలుస్తారు. 
శ్రీవేంకటేశ్వరస్వామివారిని స్తుతిస్తూ ఆండాళ్‌ రచించిన 30 పాశురాలను కలిపి తిరుప్పావై అంటారు. ఆళ్వార్‌ దివ్యప్రబంధంలో తిరుప్పావై ఒక భాగం. తమిళ సాహిత్యంలో దీనికి విశేష ప్రాచుర్యం ఉంది.

◆ శ్రీవారి ఆలయంలో నెల రోజులపాటు జరిగే తిరుప్పావై పారాయణంలో రోజుకు ఒకటి వంతున అర్చకులు నివేదిస్తారు. ఈ సందర్భంలో సాధారణంగా భోగశ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణస్వామివారికి ఏకాంతసేవ నిర్వహిస్తారు. ఈ తిరుప్పావై పఠనం పూర్తిగా ఏకాంతంగా జరుగుతుంది.

     🌹 *ధనుర్మాస వ్రతం ...* 🌹
      
■ శ్రీ గోదాదేవి ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి చూపారు. ఈ వ్రతాన్ని ఆచరిస్తే సుఖసంతోషాలు ఒనగూరుతాయని తెలియజేశారు. సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించేందుకు మధ్యగల కాలాన్ని ధనుర్మాసం అంటారు. పాపకర్మలను నశింపచేసి మోక్షసాధనకోసం చేసే వ్రతాలు, పూజలు, ఇతర ధార్మిక కార్యక్రమాలకు ఈ మాసం అనువైనదిగా భావిస్తారు.
       🌹 *" ధన్యవాదాలు "* 🌹
🔔 *తిరుమల తిరుపతి దేవస్థానం టెలిగ్రామ్ ఛానల్ మరెన్నో భక్తి సమాచారం 👇 లింక్ తో పొందవచ్చు.*
          

Job | No Exam only interview with GATE Score

గేట్ స్కోర్ ఆధారంగా దేశంలోని పబ్లిక్ సెక్టార్ యూనిట్ (పీఎస్‌యూ)ల్లో కొలువునూ సొంతం చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్, ట్రైనీ ఇంజనీర్స్ వంటి ఎంట్రీ లెవల్ ఉద్యోగాలు ఖాయం చేసుకోవచ్చు. గేట్-2018 స్కోర్‌తో ఆయా ఉద్యోగాల భర్తీకి పలు పీఎస్‌యూలు ప్రకటనలు విడుదల చేస్తున్న నేపథ్యంలో.. ఆయా ప్రభుత్వ రంగ సంస్థల ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది? ఎంత స్కోర్ సాధిస్తే ఇంటర్వ్యూ కాల్ ఆశించొచ్చు? గేట్‌కు వెయిటేజీ, పలు పీఎస్‌యూలు విడుదల చేసిన నోటిఫికేషన్ల వివరాలు తెలుసుకుందాం...రూ.లక్షల్లో వార్షిక వేతనంతో ఉద్యోగం.. 30 ఏళ్లకుపైగా సుస్థిర కెరీర్.. ఒక్కసారి కుదురుకుంటే ఉజ్వల భవిష్యత్ ఖాయం! పీఎస్‌యూలలో ఉద్యోగం అంటే.. యువతలో నెలకొన్న క్రేజ్ ఇది. అందుకే.. ఏటా గేట్‌కు దరఖాస్తు చేసే అభ్యర్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కారణం.. గత నాలుగేళ్లుగా గేట్ స్కోర్ ఆధారంగా పీఎస్‌యూలు నియామకాలు చేపడుతుండటమే! గేట్ స్కోర్‌తో పీఎస్‌యూ నియామకాలు చేపట్టే ట్రెండ్ 2012లో ప్రారంభమైంది. ఈ ఏడాది కూడా లక్షల మంది అభ్యర్థులు గేట్ 2018కు దరఖాస్తు చేసుకుంటున్నారు, పీఎస్‌యూ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు.
 
ఎంత స్కోర్ చేయాలి!
 గేట్ పరీక్షలో 65 ప్రశ్నలకు వంద మార్కులు కేటాయించారు. వాటిని వేయి స్కోర్‌కు స్కేలింగ్ జరుగుతుంది. పీఎస్‌యూలు మలిదశలో నిర్వహించే జీడీ/గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూలకు ఎంపికవ్వాలంటే.. ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు గేట్ స్కోర్ 750 సాధించాల్సి ఉంటుంది. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు గేట్ స్కోర్ 500  వరకు సాధిస్తే.. తదుపరి దశకు కాల్ లెటర్ అందుకునే అవకాశముంది.  
 
వెయిటేజీ ఆధారంగా తుది జాబితా...
గేట్ స్కోర్ ఆధారంగా పీఎస్‌యూలు జరిపే మలిదశ  రెండంచెల ఎంపిక ప్రక్రియలో.. అభ్యర్థులు  గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. మరికొన్ని సంస్థలు గ్రూప్ డిస్కషన్‌తోపాటు గ్రూప్ టాస్క్ అనే మరో ప్రత్యేక ఎంపిక ప్రక్రియను సైతం నిర్వహిస్తుండటం విశేషం. పీఎస్‌యూలు.. తుది జాబితాను ఖరారు చేసేందుకు ప్రధానంగా మూడు అంశాలకు వెయిటేజీ ఇస్తున్నాయి. అవి.. గేట్ స్కోర్, గ్రూప్ డిస్కషన్/గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూ. మొత్తం వంద మార్కులకు గణించే వెయిటేజీలో.. అధిక శాతం పీఎస్‌యూలు గేట్‌స్కోర్‌కు 75శాతం వెయిటేజీ; మలిదశలో నిర్వహించే గ్రూప్ డిస్కషన్/గ్రూప్ టాస్క్‌లకు గరిష్టంగా పది శాతం; ఇంటర్వ్యూకు పదిహేను శాతం చొప్పున వెయిటేజీ కల్పిస్తున్నాయి. మరికొన్ని పీఎస్‌యూలు గేట్ స్కోర్‌కు 60 శాతం నుంచి 65 శాతం వెయిటేజీ ఇస్తూ.. మిగతా మొత్తాన్ని జీడీ/పీఐలకు కేటాయిస్తున్నాయి. అభ్యర్థులు ఆయా దశల్లో చూపిన ప్రతిభ ఆధారంగా.. వారు పొందిన వెయిటేజీని లెక్కిస్తారు. వెయిటేజీలో మంచి మార్కులు సొంతం చేసుకున్న వారు తుది జాబితాలో నిలిచి నియామకాలు ఖరారు చేసుకుంటారు. 
 
గ్రూప్ డిస్కషన్ ఇలా...
 గ్రూప్ డిస్కషన్ పరంగా ఐదు నుంచి పది మంది అభ్యర్థులను ఒక బృందంగా ఏర్పరచి వారికి ఏదైనా ఒక అంశం ఇచ్చి చర్చించమని అడుగుతారు. ఈ ప్రక్రియ మొత్తం అరగంట నుంచి గంట వ్యవధిలో ఉంటుంది. ఒక్కో అభ్యర్థికి సగటున అయిదు నిమిషాలు సమయం లభించే అవకాశముంది. ఈ సమయంలోనే అభ్యర్థులు సదరు అంశంపై తమ అభిప్రాయాలు తెలియజేయడం.. బృందంలోని ఇతర సభ్యులు పేర్కొన్న అభిప్రాయాలపైనా స్పందించడం.. అంతిమంగా తమ నిర్ణయం లేదా అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేయడం వంటివి చేయాల్సి ఉంటుంది.
 
గ్రూప్ టాస్క్ : 
ఇటీవల కాలంలో కొన్ని ప్రముఖ పీఎస్‌యూలు అనుసరిస్తున్న మరో విధానం.. గ్రూప్ టాస్క్. ఇందులో ఏదైనా ఒక రియల్ టైం ప్రాబ్లమ్‌ను ఇచ్చి.. అభ్యర్థులు ఒక బృందంగా దానికి పరిష్కారం చూపమని  అడుగుతున్నారు. ఇవి.. సదరు అభ్యర్థుల అకడమిక్ డొమైన్‌కు సంబంధించిన సమస్యలై ఉంటున్నాయి.
 
ఇంటర్వ్యూ.. పర్సనల్ + టెక్నికల్ : 
మలిదశలోని ఇంటర్వ్యూల్లో పీఎస్‌యూలు అభ్యర్థులను రెండు కోణాల్లో పరీక్షిస్తాయి. అవి వ్యక్తిగత నేపథ్యం, టెక్నికల్ నాలెడ్జ్. సాంకేతిక నైపుణ్యం పరంగా బీటెక్‌లో చేసిన ప్రాజెక్ట్ వర్క్స్, మినీ ప్రాజెక్ట్స్, ఇంటర్న్‌షిప్స్ వంటి వాటిపై ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులకు ఆసక్తి ఉన్న సబ్జెక్ట్? అందుకు కారణాలు? దానిద్వారా భవిష్యత్తులో సాధించాలనుకుంటున్న లక్ష్యాలు? అందుకు సదరు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎలా ఉపయోగపడుతుంది? వంటి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. 
 
గేట్ దరఖాస్తు సమయంలోనే...
ఇప్పటికే కొన్ని పీఎస్‌యూలు నోటిఫికేషన్లు విడుదల చేశాయి. మరికొన్ని అదే బాటలో నడుస్తున్నాయి. ఔత్సాహిక అభ్యర్థులు గేట్ అడ్మిట్ కార్డ్ ఆధారంగా వాటికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గేట్ దరఖాస్తు సమయంలోనే అభ్యర్థులు తమకు పీఎస్‌యూ ఉద్యోగాలకు ఆసక్తి ఉందో? లేదో? తెలియజేయాల్సి ఉంటుంది.  పీఎస్‌యూల్లో జాబ్‌కు ఆసక్తి ఉందని పేర్కొన్న అభ్యర్థుల స్కోర్‌ను మాత్రమే మలిదశ ఎంపిక ప్రక్రియ(గ్రూప్ డిస్కషన్/గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూ)కు పరిగణనలోకి తీసుకుంటాయి. వారికే ఇంటర్వ్యూ కాల్ పంపిస్తాయి. కాబట్టి గేట్ అప్లికేషన్ సమయంలోనే పీఎస్‌యూ ఔత్సాహిక అభ్యర్థులు సంబంధిత కాలమ్‌ను పూర్తి చేయడం తప్పనిసరి. అలాగే పీఎస్‌యూ కొలువు కోరుకునే వారు గేట్ ప్రిపరేషన్‌తోపాటు సమాంతరంగా పీఎస్‌యూల ఎంపిక ప్రక్రియపైనా స్పష్టత ఏర్పరచుకోవాలి. పీఎస్‌యూ నోటిఫికేషన్లు సాధారణంగా సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో విడుదలవుతాయి. మరికొన్ని పీఎస్‌యూలు  జనవరి, ఫిబ్రవరి నెలల్లోనూ నోటిఫికేషన్లు విడుదల చేస్తాయి. 
 
గేట్ 2018 వివరాలు...
 గేట్ దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 05, 2017.
 గేట్-2018 పరీక్ష తేదీలు: 2018, ఫిబ్రవరి 3, 4, 10, 11
 పరీక్ష వ్యవధి: 3 గంటలు.
 పరీక్ష ఫలితాలు: మార్చి 17, 2018.
 పూర్తి వివరాలు  వెబ్‌సైట్‌లో చూడొచ్చు
 వెబ్‌సైట్: https://gate.iitg.ac.in
 
గేట్-2018.. పీఎస్‌యూ నోటిఫికేషన్లు :
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీ
అర్హత: బీటెక్(మెకానికల్)లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత లేదా ఇంటిగ్రేటెడ్ ఎంటెక్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఎస్‌సీ, ఎస్టీ అభ్యర్థులు 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుంది.
గరిష్ట వయోపరిమితి: జనరల్ కేటగిరీ అభ్యర్థులకు జనవరి 1, 2018 నాటికి 25ఏళ్లు. ఎస్‌సీ, ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు సడలింపు. 
ఎంపిక విధానం: గేట్‌లో మెకానికల్ పేపర్‌లో పొందిన స్కోర్ ఆధారంగా దరఖాస్తులను షార్ట్‌లిస్ట్ చేసి జీడీ, పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
- ఎంపికైన వారిని తొలి ఏడాది మేనేజ్‌మెంట్ ట్రైనీ హోదాలో నియమిస్తారు. ఈ సమయంలో  ఏడాదికి దాదాపు రూ. 14 లక్షల వేతనం లభిస్తుంది.
ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: జనవరి 5, 2018 నుంచి ఫిబ్రవరి 2, 2018
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: www.bharatpetroleum.com
 
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్
 ఓఎన్‌జీసీగా సుపరిచితమైన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ గేట్-2018 స్కోర్ ఆధారంగా మెకానికల్, సివిల్, పెట్రోలియం, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్, కెమికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాల్లో గ్రాడ్యుయేట్ ట్రైనీ పేరుతో నియామకాలు చేపడుతుంది.
వీటికి నోటిఫికేషన్ 2018 మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో వెలువడుతుంది. అభ్యర్థులు ఆయా విభాగాల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించడంతోపాటు గేట్ స్కోర్ తప్పనిసరి.
గరిష్ట వయోపరిమితి: జనరల్ కేటగిరీ అభ్యర్థులు జనవరి 1, 2018 నాటికి 30 ఏళ్లలోపు వయసుండాలి. ఎస్‌సీ, ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: గేట్ స్కోర్, అకడమిక్ అర్హతల ఆధారంగా అభ్యర్థులకు పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. గేట్ స్కోర్‌కు 60 శాతం వెయిటేజీ, అకడమిక్ అర్హతలకు 25 మార్కుల వెయిటేజీ, ఇంటర్వ్యూకు 15 మార్కుల వెయిటేజీ ఇచ్చి తుది జాబితా రూపొందిస్తారు. ఎంపికైన వారికి 24,900-50,500 శ్రేణిలో వేతన స్కేల్ ఇస్తారు.
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్www.ongcindia.com
 
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
ఈ సంస్థ కూడా గేట్ స్కోర్ ఆధారంగా ఎలక్ట్రికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీల భర్తీకి షెడ్యూల్ విడుదల చేసింది. దీని ప్రకారం- జనవరి 4, 2018న నోటిఫికేషన్ వెలువడుతుంది. సంబంధిత బ్రాంచ్‌లతో బీటెక్‌లో 65 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు గేట్ స్కోర్ తప్పనిసరి. ఔత్సాహిక అభ్యర్థులు సంస్థ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థుల అర్హతలకు అనుగుణంగా షార్ట్‌లిస్ట్ రూపొందిస్తారు. వీరికి గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి తుది జాబితా రూపొందిస్తారు. గేట్ స్కోర్‌కు 85 శాతం; గ్రూప్ డిస్కషన్‌లో ప్రతిభకు మూడు శాతం; పర్సనల్ ఇంటర్వ్యూలో ప్రదర్శన స్థాయికి 12 శాతం వెయిటేజీ ఇస్తారు.
గరిష్ట వయోపరిమితి: జనరల్ కేటగిరీ అభ్యర్థులు డిసెంబర్ 31, 2017 నాటికి 28 ఏళ్లలోపు ఉండాలి. ఎస్‌సీ, ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు మినహాయింపు లభిస్తుంది.
ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: జనవరి 5, 2018 నుంచి జనవరి 31, 2018 వరకు
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: www.powergridindia.com
 
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్
ఈ సంస్థ మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కెమికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగాల్లో గేట్ స్కోర్ ఆధారంగా ఇంజనీరింగ్ ట్రైనీ పోస్ట్‌లకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది. ఔత్సాహిక అభ్యర్థులు గేట్ స్కోర్‌తోపాటు సంబంధిత బ్రాంచ్‌లలో 60 శాతం(ఎస్‌సీ, ఎస్టీ, పీడబ్ల్యుడీ అభ్యర్థులు 50 శాతం) మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. గరిష్ట వయోపరిమితి: జనరల్ కేటగిరీ అభ్యర్థులు జూన్ 30, 2018 నాటికి 25 ఏళ్లలోపు ఉండాలి. ఎస్‌సీ, ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, పీడబ్ల్యుడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు లభిస్తుంది. వచ్చిన దరఖాస్తులు, అభ్యర్థులు పొందిన గేట్ స్కోర్, బీటెక్ ఉత్తీర్ణత శాతం ఆధారంగా షార్ట్‌లిస్ట్ రూపొందిస్తారు. వీరికి మలి దశలో గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అందులోనూ విజయం సాధించి తుది జాబితాలో నిలిచిన అభ్యర్థులకు ఆయా విభాగాల్లో ట్రైనీ ఇంజనీర్స్‌గా నియమిస్తారు. ఏడాదిపాటు శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో దాదాపు. రూ. 10.8 లక్షల వార్షిక వేతన లభిస్తుంది.
ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: జనవరి 12, 2018 నుంచి ఫిబ్రవరి 12, 2018 వరకు.
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్www.hindustanpetroleum.com
 
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్... ఎలక్ట్రికల్, మెకానికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, కెమికల్ విభాగాల్లో గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఇంజనీర్ పోస్ట్‌ల భర్తీకి సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది. సంబంధిత బ్రాంచ్‌లతో బీటెక్‌లో 65 శాతం మార్కులతో(ఎస్‌సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు 55శాతం) ఉత్తీర్ణత సాధించాలి. గేట్ స్కోర్ తప్పనిసరి. ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అకడమిక్ అర్హతలు, గేట్ స్కోర్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. వీరికి గ్రూప్ డిస్కషన్ లేదా గ్రూప్ టాస్క్ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఎంపికైన వారికి తొలుత ఏడాదిపాటు శిక్షణ ఇస్తారు.
గరిష్ట వయో పరిమితి: జనరల్ కేటగిరీ అభ్యర్థులకు జూన్ 30, 2018 నాటికి 26 ఏళ్లుగా నిర్ణయించింది. ఎస్‌సీ, ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల సడలింపు ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: జనవరి 5, 2018 నుంచి ఫిబ్రవరి 11, 2018 వరకు.
 పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్www.iocl.com
 
 నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్
 ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, మైనింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగాల్లో ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్ట్‌ల భర్తీ షెడ్యూల్ విడుదల చేసింది. బీటెక్‌లో సంబంధిత బ్రాంచ్‌లలో 65 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
గరిష్ట వయోపరిమితి: జనరల్ కేటగిరీ అభ్యర్థులు జనవరి 31, 2018 నాటికి 27 ఏళ్లలోపు ఉండాలి. ఎస్‌సీ, ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు సడలింపు లభిస్తుంది. అకడమిక్ అర్హతలు, గేట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి ఎన్‌టీపీసీ మరో విడతలో ఆన్‌లైన్ విధానంలో ఆప్టిట్యూడ్ టెస్ట్‌ను నిర్వహిస్తుంది. అందులోనూ ఉత్తీర్ణత సాధించిన వారికి గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. గేట్ స్కోర్‌కు 85 శాతం వెయిటేజీ, గ్రూప్ డిస్కషన్‌కు 5శాతం వెయిటేజీ, పర్సనల్ ఇంటర్వ్యూకు 5శాతం వెయిటేజీ ఇచ్చి తుదిజాబితా రూపొందిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు రూ. 24,900-50,500 శ్రేణిలో వేతన స్కేల్ అమలు చేస్తారు. ఔత్సాహిక అభ్యర్థులు జనవరి 10, 2018 నుంచి జనవరి 31, 2018 వరకు ఎన్‌టీపీసీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: www.ntpccareers.net
 
 గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్
 గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్.. గేట్‌స్కోర్ ఆధారంగా సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగాల్లో గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ పోస్ట్‌ల భర్తీకి జనవరి, 2018లో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఔత్సాహిక అభ్యర్థులు సంబంధిత బ్రాంచ్‌లలో 65 శాతం(ఎస్‌సీ, ఎస్టీ, పీడబ్ల్యుడీ అభ్యర్థులు 60 శాతం) మార్కులతో ఉత్తీర్ణత తప్పనిసరి. గరిష్ట వయోపరిమితి: జనవరి 20, 2018 నాటికి జనరల్ కేటగిరీ అభ్యర్థులు 28ఏళ్లలోపు వయసుండాలి. ఎస్‌సీ, ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు మినహాయింపు ఉంటుంది. అకడమిక్ అర్హతలు, గేట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి వారికి గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. తుది జాబితాలో నిలిచిన అభ్యర్థులను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా నియమిస్తారు. ఏడాది పాటు శిక్షణ ఉంటుంది. ప్రారంభ వేతన శ్రేణి 24,900-50,500గా ఉంటుంది.
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్www.gailonline.com
 
వైజాగ్ స్టీల్ కార్పొరేషన్
వైజాగ్ స్టీల్ కార్పొరేషన్ సంస్థ మెకానికల్, మెటలర్జీ, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో గేట్ స్కోర్ ఆధారంగా మేనేజ్‌మెంట్ ట్రైనీ (టెక్నికల్) పోస్ట్‌ల భర్తీ చేపట్టనుంది. దీనికి సంబంధించి నోటిషికేష్ ఫిబ్రవరి 2018లో వెలువడనుంది. గేట్-2018 స్కోర్‌తోపాటు సంబంధిత బ్రాంచ్‌లలో బీటెక్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత తప్పనిసరి. షార్ట్ లిస్ట్‌లో నిలిచిన అభ్యర్థులకు గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి తుది జాబితా రూపొందిస్తారు. ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు జూనియర్ మేనేజర్ హోదాలో శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో అభ్యర్థులకు రూ.7.6 లక్షల వార్షిక వేతనం లభిస్తుంది.
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: www.vizagsteel.com
 
మజ్‌గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్
మజ్‌గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్... మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగాల్లో గేట్ స్కోర్ ఆధారంగా గ్రాడ్యుయేట్ ఇంజనీర్లను భర్తీ చేయనుంది. అభ్యర్థులు గేట్ స్కోర్‌తోపాటు 60 శాతం మార్కులతో సంబంధిత బ్రాంచ్‌లతో బీటెక్ ఉత్తీర్ణత సాధించాలి. గరిష్ట వయోపరిమితి: ఫిబ్రవరి 7, 2018 నాటికి జనరల్ కేటగిరీ అభ్యర్థులు 27 ఏళ్లలోపు వయసుండాలి. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు అయిదేళ్ల సడలింపు ఉంటుంది. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి తుది జాబితా రూపొందిస్తారు. ఎంపికైన అభ్యర్థులు ఏడాదిపాటు శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో రూ.7.19 లక్షల వార్షిక వేతనం లభిస్తుంది.
ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: జనవరి 8, 2018 నుంచి ఫిబ్రవరి 7, 2018 వరకు.
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్www.mazdock.com

15, డిసెంబర్ 2020, మంగళవారం

NTPC పరీక్షపై నార్మలైజషన్ లో నూతన మార్పులపై బిగ్ అప్డేట్

రైల్వే బోర్డు ఎన్టీపీసీ పరీక్షల నార్మలైజషన్ విధానంలో ముఖ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి.

డిసెంబర్ 28,2020 నుండి మొదలు కాబోతున్న రైల్వే ఎన్టీపీసీ పరీక్షలకు ఈ నూతన నార్మలైజషన్ విధానం అమలు కాబోతుంది.

గతంలో ఈ నార్మలైజషన్ విధానంలో  భారతీయ రైల్వే పరీక్షలకు నిర్వహించిన  పరీక్షల షిఫ్ట్ లు అన్నిటిని పరిగణన లోనికి తీసుకునేవారు.

తాజాగా ఇప్పుడు మారిన నూతన నార్మలైజషన్ నిబంధనల ప్రకారం రైల్వే పరీక్షలకు నిర్వహిస్తున్న షిఫ్ట్ లు అన్నిటిలో ఏ షిఫ్ట్ లో అయితే అభ్యర్థులకు ఎక్కువగా మార్కులు వస్తున్నాయో గమనించి ఆ షిఫ్ట్ ను మాత్రమే పరిగణన లోనికి తీసుకోనున్నారు.

ఇరు తెలుగు రాష్ట్రాలలో రైల్వే ఎన్టీపీసీ 2020 పరీక్షలు రాస్తున్న అభ్యర్థులుకు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని రైల్వే   పరీక్షల ప్రేపరషన్ ను కొనసాగిస్తే మంచి ఫలితాలను సాధించడానికి అవకాశం ఉంటుంది.

Normalization Notification

AAI Junior Executive and Manager Airports Authority of India Online Form 2020

 

Some Useful Important Links

Apply Online

Click Here

Download Notification

Click Here

Official Website

Click Here

Join Indian Coast Guard Assistant Commandant SRD 02/2021 Online Form 2020

 

Some Useful Important Links

Apply Online

Link Activate on 21/12/2020

Download Notification

Click Here

Official Website

Click Here

UPSC EPFO Change Exam District 2020

 

Some Useful Important Links

For Change Exam District

Click Here

Download Notice for Change Exam District

Click Here

Apply Online

Click Here

Download Notification

Click Here

Official Website

Click Here

GATE Entrance Exam 2021 Update

గేట్ ప్రవేశ పరీక్ష – 2021 పై ముఖ్యమైన అప్డేట్ :

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో గేట్ ప్రవేశ పరీక్ష 2021 కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ముఖ్య గమనిక.


2021 వ సంవత్సరం లో ఫిబ్రవరి నెలలో జరగబోయే ఈ గేట్ ప్రవేశ  పరీక్షలకు అభ్యర్థులు ఎంపిక చేసుకున్న పరీక్ష కేంద్రాల సిటీ లను మార్చుకోవడానికీ గడువు డిసెంబర్ 15,2020 వ తేది తో ముగియనుంది.

ఇరు తెలుగు రాష్ట్రాల్లో గేట్ ప్రవేశ పరీక్ష 2021 కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ క్రింది లింక్ ద్వారా తమ పరీక్ష కేంద్రం సిటీ ను మార్చుకోవచ్చు.

Website

UPSC Jobs Recruitment in Telugu || యూపీఎస్సీలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ

 

యూపీఎస్సీ లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల :

కేంద్ర ప్రభుత్వ శాఖల్లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక మంచి నోటిఫికేషన్ ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ ) తాజాగా విడుదల చేసినది.

ఈ ఉద్యోగాలకు అర్హతలు ఉన్న ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభం తేదీడిసెంబర్ 13,2020
దరఖాస్తుకు చివరి తేదీడిసెంబర్ 31,2020

విభాగాల వారీగా ఖాళీలు :

అసిస్టెంట్ లీగల్ అడ్వైసర్స్2
మెడికల్ ఫిజిసిస్ట్4
పబ్లిక్ ప్రాసిక్యూటర్10
అసిస్టెంట్ ఇంజనీర్18

మొత్తం ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 34 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

విభాగాల వారీగా అర్హతలు :

అసిస్టెంట్ లీగల్ అడ్వైసర్స్ :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి లా బాచిలర్ డిగ్రీ కోర్సును పూర్తి చేయవలెను. మరియు మాస్టర్ డిగ్రీ కోర్సును పూర్తి చేయవలెను. సంబంధిత విభాగాలలో ఒక సంవత్సరం నుండి మూడు సంవత్సరాల అనుభవం అవసరం.

మెడికల్ ఫిజిసిస్ట్ :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే అభ్యర్థులు ఫిజిక్స్ విభాగంలో పీజీ డిగ్రీ కోర్సును మరియు రేడియోలాజికల్ /మెడికల్ ఫిజిక్స్ లో ఎంఎస్సీ కోర్సులను పూర్తి చేయవలెను. సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం.

పబ్లిక్ ప్రాసిక్యూటర్ :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు లా డిగ్రీ కోర్సును పూర్తి చేసి, కంప్యూటర్, ఇంటర్నెట్, వర్డ్ ప్రాసెసింగ్ లో బేసిక్ నాలెడ్జ్ ను కలిగి ఉండవలెను.

అసిస్టెంట్ ఇంజనీర్ :

ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు దరఖాస్తు చేయాలంటే ఎలక్ట్రికల్ సబ్జెక్టు లో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ప్రకటనలో పొందుపరిచారు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు :

జనరల్ మరియు ఓబీసీ కేటగిరి అభ్యర్థులు 25 రూపాయలు ను దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.మిగిలిన కేటగిరి అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

వ్రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ విధానాల ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

జీతం :

విభాగాలను అనుసరించి అభ్యర్థులకు జీతములు లభించనున్నాయి. సుమారుగా 40,000 రూపాయలు నుండి 2,00,000 రూపాయలు వరకూ జీతములు లభించనున్నాయి.

Website

Notification

 

ECIL Jobs Recruitment 2020 Telugu || పరీక్ష లేదు కేవలం ఇంటర్వ్యూల ECIL లో ఉద్యోగాలు

 

ECIL లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల :

భారతీయ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL), హైదరాబాద్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న మేనేజర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అయినది.

ఎటువంటి వ్రాతపరీక్షలు లేకుండా భర్తీ చేసే ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజెన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ECIL Jobs Recruitment 2020 Telugu

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభం తేదీడిసెంబర్ 13, 2020
దరఖాస్తుకు చివరి తేదీడిసెంబర్ 31,2020

విభాగాల వారీగా ఖాళీలు :

సీనియర్ డిప్యూటీ మేనేజర్(టెక్నికల్ )4
సీనియర్ డిప్యూటీ మేనేజర్ (హెచ్. ఆర్ )1
డిప్యూటీ జనరల్ మేనేజర్ (కార్పొరేట్ పర్చేస్)1
డిప్యూటీ జనరల్ మేనేజర్ (హెచ్. ఆర్ )2
డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్ )1
డిప్యూటీ జనరల్ మేనేజర్ (కార్పొరేట్ పర్చేస్ )1
సీనియర్ మేనేజర్ (ఫైనాన్స్ )2
సీనియర్ మేనేజర్ (లా )1
పర్సనల్ ఆఫీసర్1
అకౌంట్ ఆఫీసర్1

మొత్తం ఉద్యోగాలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 15 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు విభాగాల వారీగా ఉద్యోగాలను అనుసరించి హెచ్. ఆర్ /ఐ. ఆర్ /పీ. ఎం /లా /మాస్ కమ్యూనికేషన్ /జర్నలిజం విభాగంలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ / పీజీ కోర్సులను పూర్తి చేయాలి. ఎంబిఏ /సీఏ/ఐసీడబ్ల్యూఏ /సీఎంఏ కోర్సులను పూర్తి చేయాలి. మరియు అనుభవం అవసరం.

వయసు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 60 సంవత్సరాలకు మించరాదు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ / ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు :

ఓబీసీ మరియు జనరల్ కేటగిరీ అభ్యర్థులు 500 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను. మిగిలిన కేటగిరి అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహణ ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు విభాగాలను అనుసరించి 29,100 రూపాయలు నుండి 2,09,200 రూపాయలు వరకూ జీతం అందనుంది.

సంప్రదించవలసిన చిరునామా :

ECIL

ECIL POST,

HYDERABAD – 500062.

ఈమెయిల్ :

hrrect@ecil.co.in

Website

Notification