ECIL లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల :
భారతీయ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL), హైదరాబాద్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న మేనేజర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అయినది.
ఎటువంటి వ్రాతపరీక్షలు లేకుండా భర్తీ చేసే ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజెన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ECIL Jobs Recruitment 2020 Telugu
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభం తేదీ | డిసెంబర్ 13, 2020 |
దరఖాస్తుకు చివరి తేదీ | డిసెంబర్ 31,2020 |
విభాగాల వారీగా ఖాళీలు :
సీనియర్ డిప్యూటీ మేనేజర్(టెక్నికల్ ) | 4 |
సీనియర్ డిప్యూటీ మేనేజర్ (హెచ్. ఆర్ ) | 1 |
డిప్యూటీ జనరల్ మేనేజర్ (కార్పొరేట్ పర్చేస్) | 1 |
డిప్యూటీ జనరల్ మేనేజర్ (హెచ్. ఆర్ ) | 2 |
డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్ ) | 1 |
డిప్యూటీ జనరల్ మేనేజర్ (కార్పొరేట్ పర్చేస్ ) | 1 |
సీనియర్ మేనేజర్ (ఫైనాన్స్ ) | 2 |
సీనియర్ మేనేజర్ (లా ) | 1 |
పర్సనల్ ఆఫీసర్ | 1 |
అకౌంట్ ఆఫీసర్ | 1 |
మొత్తం ఉద్యోగాలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 15 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు విభాగాల వారీగా ఉద్యోగాలను అనుసరించి హెచ్. ఆర్ /ఐ. ఆర్ /పీ. ఎం /లా /మాస్ కమ్యూనికేషన్ /జర్నలిజం విభాగంలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ / పీజీ కోర్సులను పూర్తి చేయాలి. ఎంబిఏ /సీఏ/ఐసీడబ్ల్యూఏ /సీఎంఏ కోర్సులను పూర్తి చేయాలి. మరియు అనుభవం అవసరం.
వయసు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 60 సంవత్సరాలకు మించరాదు.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ / ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
ఓబీసీ మరియు జనరల్ కేటగిరీ అభ్యర్థులు 500 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను. మిగిలిన కేటగిరి అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
ఎంపిక విధానం :
పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహణ ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు విభాగాలను అనుసరించి 29,100 రూపాయలు నుండి 2,09,200 రూపాయలు వరకూ జీతం అందనుంది.
సంప్రదించవలసిన చిరునామా :
ECIL
ECIL POST,
HYDERABAD – 500062.
ఈమెయిల్ :
hrrect@ecil.co.in
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి