యూపీఎస్సీ లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల :
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక మంచి నోటిఫికేషన్ ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ ) తాజాగా విడుదల చేసినది.
ఈ ఉద్యోగాలకు అర్హతలు ఉన్న ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభం తేదీ | డిసెంబర్ 13,2020 |
దరఖాస్తుకు చివరి తేదీ | డిసెంబర్ 31,2020 |
విభాగాల వారీగా ఖాళీలు :
అసిస్టెంట్ లీగల్ అడ్వైసర్స్ | 2 |
మెడికల్ ఫిజిసిస్ట్ | 4 |
పబ్లిక్ ప్రాసిక్యూటర్ | 10 |
అసిస్టెంట్ ఇంజనీర్ | 18 |
మొత్తం ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 34 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
విభాగాల వారీగా అర్హతలు :
అసిస్టెంట్ లీగల్ అడ్వైసర్స్ :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి లా బాచిలర్ డిగ్రీ కోర్సును పూర్తి చేయవలెను. మరియు మాస్టర్ డిగ్రీ కోర్సును పూర్తి చేయవలెను. సంబంధిత విభాగాలలో ఒక సంవత్సరం నుండి మూడు సంవత్సరాల అనుభవం అవసరం.
మెడికల్ ఫిజిసిస్ట్ :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే అభ్యర్థులు ఫిజిక్స్ విభాగంలో పీజీ డిగ్రీ కోర్సును మరియు రేడియోలాజికల్ /మెడికల్ ఫిజిక్స్ లో ఎంఎస్సీ కోర్సులను పూర్తి చేయవలెను. సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు లా డిగ్రీ కోర్సును పూర్తి చేసి, కంప్యూటర్, ఇంటర్నెట్, వర్డ్ ప్రాసెసింగ్ లో బేసిక్ నాలెడ్జ్ ను కలిగి ఉండవలెను.
అసిస్టెంట్ ఇంజనీర్ :
ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు దరఖాస్తు చేయాలంటే ఎలక్ట్రికల్ సబ్జెక్టు లో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ప్రకటనలో పొందుపరిచారు.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
జనరల్ మరియు ఓబీసీ కేటగిరి అభ్యర్థులు 25 రూపాయలు ను దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.మిగిలిన కేటగిరి అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
ఎంపిక విధానం :
వ్రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ విధానాల ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.
జీతం :
విభాగాలను అనుసరించి అభ్యర్థులకు జీతములు లభించనున్నాయి. సుమారుగా 40,000 రూపాయలు నుండి 2,00,000 రూపాయలు వరకూ జీతములు లభించనున్నాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి