ఆంధ్రప్రదేశ్
రాష్ట్రానికి చెందిన సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్
ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ లో ఖాళీగా ఉన్న
ఎస్సీ, ఎస్టీ కేటగిరీ బ్యాక్
లాగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అయినది.
ఈ ప్రకటన ద్వారా సోషల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూట్స్
లో ఖాళీగా ఉన్న ప్రిన్సిపాల్, టీజీటీ
మరియు కేర్ టేకర్ ఉద్యోగాలను
జోన్ల వారీగా భర్తీ చేయనున్నారు.
ఎటువంటి
పరీక్షలు, ఇంటర్వ్యూలు లేకుండా భర్తీ చేసే ఈ
పోస్టులకు అర్హతలు గల ఏపీ రాష్ట్రానికి
చెందిన ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు
అందరూ అప్లై చేసుకోవచ్చు. AP Social Welfare Jobs 2021
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్
దరఖాస్తుకు చివరి తేది :
ఆగష్టు
16, 2021
విభాగాల వారీగా ఖాళీలు :
ప్రిన్సిపాల్
గ్రేడ్ - II
- 1
ట్రైన్డ్
గ్రాడ్యుయేట్ టీచర్ (TGT)
- 38 (SC17 + ST21)
కేర్
టేకర్ (వార్డెన్ )
- 7 (SC 4 + ST3)
మొత్తం ఉద్యోగాలు :
వివిధ
విభాగాలలో ఖాళీగా ఉన్న 46 పోస్టులను ఈ ప్రకటన ద్వారా
భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
గుర్తింపు
పొందిన యూనివర్సిటీ , బోర్డుల నుండి 55%మార్కులతో బీఈడి /60% మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కోర్స్ లను పూర్తి చేసిన
అభ్యర్థులు ప్రిన్సిపాల్ గ్రేడ్ -II ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
బీ.
ఎడ్ ఉత్తీర్ణత /55% మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కోర్సులను కంప్లీట్ చేసి, ఏపీ స్టేట్
నిర్వహించిన టెట్ పేపర్ -2 లో
అర్హత సాధించిన అభ్యర్థులు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
బీ.
ఎడ్ పాస్ /డిగ్రీ పాస్
అయిన అభ్యర్థులు అందరూ కేర్ టేకర్స్
/వార్డెన్స్ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవచ్చు.
మరియు
సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ప్రకటనలో
పొందుపరిచారు.
వయసు :
47 సంవత్సరాలు
వయసు కలిగిన ఎస్సీ / ఎస్టీ కేటగిరి లకు
చెందిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు
అప్లై చేసుకోవచ్చు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్
విధానంలో ఈ ఉద్యోగాలకు అప్లై
చేసుకోవలెను .
దరఖాస్తు ఫీజు :
500 రూపాయలును
దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.
ఎంపిక విధానం :
నిర్దేశిత
విద్యా అర్హతల పరీక్షల ఉత్తీర్ణత శాతం మరియు మెరిట్
ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను
ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ
పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు విభాగాలను అనుసరించి 21,230 రూపాయలు నుండి 93,780 రూపాయలు వరకూ జీతం అందనుంది.
Website
Notification