23, జులై 2021, శుక్రవారం

TTD Jobs in Telugu | తిరుమల తిరుపతి దేవస్థానం లో ప్రభుత్వ ఉద్యోగాలు | ఆఫ్ లైన్ దరఖాస్తులకు చివరి తేది : జూలై 31, 2021

ప్రసిద్ధ పుణ్య క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంనకు చెందిన BIRRD ట్రస్ట్ హాస్పిటల్ లో ఖాళీగా ఉన్న మెడికల్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.


ఎటువంటి పరీక్షలు మరియు ఇంటర్వ్యూ లు లేకుండా, కేవలం విద్యా అర్హతల  మార్కుల ఆధారంగా భర్తీ చేసే ఏ ఒప్పంద ప్రాతిపదిక ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు టీటీడి దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్న BIRRD ట్రస్ట్ హాస్పిటల్ లో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.

మంచి స్థాయిలో జీతములు లభించే ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతం తదితర ముఖ్యమైన విషయాలను గురించి ఇపుడు తెలుసుకుందాం.

ముఖ్యమైన తేదీలు :

ఆఫ్ లైన్ దరఖాస్తులకు చివరి తేది  :  జూలై 31, 2021

విభాగాల వారీగా ఖాళీలు   :

మెడికల్ ఆఫీసర్స్      -     3

అర్హతలు :

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎంబీబీఎస్ కోర్సులను పూర్తి చేయవలెను.

వయసు :

42 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎస్సీ /ఎస్టీ /ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు దివ్యాంగులకు 10సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు కలదు.

ఎలా అప్లై చేసుకోవాలి..?

ఆఫ్ లైన్ విధానంలో ఈ పోస్టులకు అప్లై చేసుకోవలెను.

ఆన్లైన్ వెబ్సైటు లో ఉన్న అప్లికేషన్ ఫారం ను నింపి, తదుపరి సంబంధిత విద్యార్హత సర్టిఫికెట్స్ ను జతపరిచి ఈ క్రింది అడ్రస్ కు నిర్ణిత గడువు తేదీలోగా పంపవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

ఎంబీబీఎస్ కోర్సులో సాధించిన  మార్కులు, సర్వీస్ చేసిన ఏరియాల ఆధారంగా ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తారు.

ఈ పోస్టుల భర్తీలో ఎటువంటి ఇంటర్వ్యూ మార్కులు లేవు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.

జీతం :

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు ప్రారంభ జీతంగా 35,000 రూపాయలు లభించనున్నాయి.

దరఖాస్తులు పంపవల్సిన అడ్రస్ :

To The Director (FAC) ,

BIRRD Trust Hospital,

TTD, Tirupati - 517501.

Website

Notification

కామెంట్‌లు లేవు: