అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
22, అక్టోబర్ 2021, శుక్రవారం
21, అక్టోబర్ 2021, గురువారం
Federal Bank: మీరు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారా..? అయితే మీకో గుడ్ న్యూస్.. ఏడాదికి రూ.5.70 లక్షలు సంపాదించే ఛాన్స్..!
Federal Bank: మీరు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారా? బ్యాంకులో ఇంటర్న్‌షిప్ ద్వారా వర్క్ ఎక్స్పీరియన్స్ పొందాలనేది మీ కలా? అయితే మీకు ఫెడరల్ బ్యాంకు (Federal Bank) ఓ గుడ్ న్యూస్ చెప్పింది.
మీరు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారా? బ్యాంకులో
ఇంటర్న్‌షిప్ ద్వారా వర్క్ ఎక్స్పీరియన్స్ పొందాలనేది మీ కలా? అయితే మీకు
ఫెడరల్ బ్యాంకు (Federal Bank) ఓ గుడ్ న్యూస్ చెప్పింది. గ్రాడ్యుయేట్ల
కోసం తాజాగా రెండేళ్ల ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ తీసుకువచ్చినట్లు
ప్రకటించింది. ప్రస్తుతం విద్యార్థుల నుంచి దరఖాస్తులను
ఆహ్వానిస్తున్నామని ఫెడరల్ బ్యాంకు తెలిపింది. ఈ ఇంటర్న్‌షిప్
ప్రోగ్రామ్‌ను విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులు ఫెడరల్ బ్యాంక్
మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (MAHE) నుంచి పీజీ డిప్లొమా
అందుకోవచ్చు. అంతేకాదు, సంవత్సరానికి రూ. 5.70 లక్షల వరకు ఆదాయం
సంపాదించవచ్చు.
ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొనాలనే ఆసక్తి గల అభ్యర్థులు
అక్టోబర్ 23 లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ ఆప్టిట్యూడ్ పరీక్షను
నవంబర్ 7న నిర్వహిస్తారు. ఫెడరల్ బ్యాంకు ఈ కోర్సును ‘ఫెడరల్ ఇంటర్న్‌షిప్
ప్రోగ్రామ్ (ఎఫ్ఐపీ)’ పేరుతో.. మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్
(ఎంఏజీఈ) తో కలిసి నిర్వహిస్తుంది.
* ఇంటర్న్‌షిప్ నేర్పించే అంశాలు ఏంటి?
అలాగే ఈ ప్రోగ్రామ్‌ను విజయవంతంగా పూర్తయిన చేసిన ఇంటర్న్‌కు మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (MAHE) నుంచి బ్యాంకింగ్ లో పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రదానం చేస్తారు. ఈ ప్రోగ్రామ్‌ను విజయవంతంగా పూర్తి చేసిన తరువాత ఇంటర్న్ విద్యార్థులను ఫెడరల్ బ్యాంక్‌లో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా తీసుకునే (absorption) అవకాశం ఉంది.
* ఫెడరల్ బ్యాంక్ ఇంటర్న్‌షిప్ అర్హతలు
ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేయాలనుకుంటున్న అభ్యర్థులు 10వ తరగతి, 12వ తరగతి, గ్రాడ్యుయేషన్ కోర్స్ లో కనీసం 60% లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 01.10.2021 నాటికి 27 ఏళ్లు మించకూడదు. ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, గోవా, హర్యానా, గుజరాత్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ లేదా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనవచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు https://www.federalbank.co.in/federal-internship-program లింకు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
తిరుమల శ్రీవారి భక్తులకు తీపి కబురు.
నవంబరు నుంచి తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల సంఖ్య పెంచనున్నట్లు టీటీడీ తెలిపింది. సర్వదర్శనం 10వేలు, ప్రత్యేక ప్రవేశ దర్శన (రూ.300) టికెట్లు 12వేలు జారీ చేయనున్నట్లు ప్రకటన విడుదల చేసింది. నవంబరు నెలకు ప్రత్యేక సర్వదర్శన టికెట్ల విడుదల షెడ్యూల్ ఖరారు చేసింది. ఈ నెల 22న ఉదయం 9 గంటలకు ప్రత్యేక దర్శన టికెట్లు.. 23న ఉదయం 10వేల సర్వదర్శన టికెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది.
శ్రీవారి దర్శనానికి సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, టైంస్లాట్ సర్వదర్శన టోకెన్లను ‘గోవింద’ యాప్‌లో కాకుండా టీటీడీ వెబ్సైట్లోనే బుక్ చేసుకోవాలని టీటీడీ తెలిపింది. రూ.300 టోకెన్లు, సర్వ దర్శనం టోకెన్లు శుక్ర, శనివారాల్లో విడుదల కానుండటంతో భక్తులు ఎదురు చూస్తున్నారు. ఒకవేళ రూ.300 టోకెన్లు దొరక్కపోయినా సర్వ దర్శనం టోకెన్లు తీసుకోవాలని భావిస్తున్నారు.
మరోవైపు తిరుమల వెళ్లే భక్తులను టీటీడీ అలర్ట్ చేసింది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ కొత్త నిబంధనలను అమలులోకి తీసుకు వచ్చింది. ఇకపై శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయిన సర్టిఫికెట్, మూడు రోజుల ముందు కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ తేవాలి. కొవిడ్ నియంత్రణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయానికి భక్తులు సహకరించాలని కోరారు.
APPSC Jobs Recruitment 2021: అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలకు అర్హతలు..ఎంపికైతే ప్రారంభ జీతమే..రూ.31,460–రూ.84,970
నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలో ఏఈ (అసిస్టెంట్ ఇంజనీర్) స్థాయి ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది.
దీనిద్వారా పలు శాఖల్లో 190 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది. డిప్లొమా, బీటెక్ ఉత్తీర్ణులు ఏఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగానే చక్కటి ప్రభుత్వ కొలువు సొంతం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో.. ఏపీపీఎస్సీ తాజాగా విడుదల చేసిన అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ) నోటిఫికేషన్ వివరాలు, ఎంపిక విధానం, ప్రిపరేషన్ గైడెన్స్..
మొత్తం పోస్టులు : 190
తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్లో..
ఏపీపీఎస్సీ తాజాగా విడుదల చేసిన ఏఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం తొమ్మిది
విభాగాల్లో 190 పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు. ఈ 190 పోస్ట్‌లలో 155 తాజా
పోస్ట్‌లు కాగా, 35 పోస్ట్‌లను క్యారీ ఫార్వర్డ్ పోస్ట్‌లు(గత
నోటిఫికేషన్లో భర్తీ కానివి)గా పేర్కొన్నారు.
ఎంపికైతే వేతన శ్రేణి: రూ.31,460–రూ.84,970 లభిస్తుంది.
అర్హతలు ఇవే..:
ఏపీ సబార్డినేట్ సర్వీస్ పరిధిలోని ఈ ఏఈ పోస్ట్‌లకు దరఖాస్తు
చేసుకునేందుకు డిప్లొమా, బీఈ/బీటెక్ అభ్యర్థులు అర్హులు. దరఖాస్తు
చేసుకుంటున్న పోస్ట్‌ను అనుసరించి ఆయా బ్రాంచ్‌తో బీఈ/బీటెక్ లేదా
డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి :
జూలై 1,2021 నాటికి 18–42 ఏళ్ల మధ్యలో ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ
అభ్యర్థులకు నిబంధనలకు అనుగుణంగా గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.
ఎంపిక విధానం :
రాత పరీక్షలో అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ)
పోస్టులను భర్తీ చేస్తారు. రాత పరీక్షలో పొందిన మార్కులు, దరఖాస్తు
చేసుకున్న పోస్ట్‌లు, అందుబాటులో ఉన్న ఖాళీలు, రిజర్వేషన్లు తదితర అంశాలను
పరిగణనలోకి తీసుకొని.. తుది విజేతల జాబితా విడుదల చేసి.. నియామకాలు ఖరారు
చేస్తారు.
ముఖ్యమైన సమాచారం:
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు తేదీలు: అక్టోబర్ 21–నవంబర్ 11,2021
దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరి తేదీ: నవంబర్ 10, 2021
పూర్తి వివరాలకు వెబ్సైట్: https://psc.ap.gov.in
తిరుమల దర్శనం RTC ప్రకటన
ఏ.పి.ఎస్. ఆర్.టి.సి బస్సులలో తిరుపతి వెళ్ళు ప్రయాణికులు ఛార్జీతోపాటు 300 రూపాయలు అదనంగా చెల్లించి బస్సులోనే శీఘ్ర దర్శనం టికెట్ పొందవచ్చును.
ప్రతి రోజు ఉదయం 11. 00 గంటలకు మరియు సాయంత్రం 4.00 గంటలకు ఈ శీఘ్ర దర్శనం ఏర్పాటు కలదు. తిరుమల బస్సు స్టేషన్ చేరుకున్న తర్వాత శీఘ్ర దర్శనం చేసుకొనుటకు ప్రయాణికులకు RTC సూపర్ వైజర్లు సహాయం చేసెదరు. కావున తిరుపతి వెళ్ళు ప్రయాణికులు ముందుగా RTC బస్సులలో శీఘ్ర దర్శనం టికెట్ పొందే అవకాశాన్ని వినియోగించుకోవలసినదిగా కోరడమైనది. APSRTC ప్రతి రోజు తిరుపతికి 650 బస్సులు నడుపుతున్నది. ప్రతి డిపో నుండి తిరుపతికి బస్సు సౌకర్యం కలదు. బెంగుళూరు, చెన్నై, కంచి, వెల్లూరు, పాండిచ్చేరి, హైదరాబాద్ మొదలైన నగరాల నుండి దైవ దర్శనం కొరకు వచ్చు ప్రయాణికులకు ఇది చాలా మంచి సౌకర్యం.
*చివరిగా ఒక మనవి :--*
ఈ పోస్టు చూసిన ప్రతి ఒక్కరూ షేర్ చేయడం మరవద్దు. మీకు అవసరం లేకపోవచ్చు,కానీ మరొకరికి అవసరమవుతుంది అందుకే దయచేసి షేర్ చేయం డి (సేకరణ)
20, అక్టోబర్ 2021, బుధవారం
HDFC Scholarship : రూ.75,000 స్కాలర్షిప్ పొందే అవకాశం.. దరఖాస్తు వివరాలు
కరోనా మహమ్మారి (Covid-19 pandemic) కారణంగా దెబ్బతిన్న కుటుంబాల విద్యార్థులకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చేయూతనందిస్తోంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పరివర్తన్ కోవిడ్ క్రైసిస్ సపోర్ట్ స్కాలర్షిప్ పేరుతో విద్యార్థులకు రూ.75,000 అందించనుంది. కరోనా కారణంగా చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్న వారికి ఇది చక్కని అవకాశం. ఈ స్కాలర్షిప్ దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 31, 2021 వరకు అవకాశం ఉంది
కరోనా మహమ్మారి (Covid-19 pandemic)కారణంగా
వేలాది మంది పిల్లలు నిరాశ్రయులయ్యారు. తల్లిదండ్రులను కోల్పోయిన వారి
చదువు, భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. అటువంటి పిల్లలకు హెచ్డీఎఫ్సీ చేయూత
నందిస్తోంది. వారికి కోసం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank)
పరివర్తన్ కోవిడ్ క్రైసిస్ సపోర్ట్ స్కాలర్షిప్ను ప్రవేశ
పెట్టింది. కరోనా కారణంగా తల్లి లేదా తండ్రిని కోల్పోయిన వారు.
జీవనోపాధి కోల్పోయిన కుటంబ విద్యార్థలుకు ఈ స్కాలర్షిప్(Scholarship)
ను అందించనున్నారు. ఈ కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఒకసారి ఆర్థిక
సాయం రూపంలో రూ.15,000 నుంచి రూ.75,000 వరకు హెచ్డీఎఫ్సీ అందిస్తోంది. ఈ
స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 31, 2021 వరకు
అవకాశం ఉంది.
స్కాలర్షిప్ వివరాలు..
- 1 నుంచి 5 తరగతులకు రూ. 15,000
- 6 నుంచి 8 తరగతులకు రూ.25,000
- డిప్లమా కోర్సులకు రూ. 20,000
- గ్రాడ్యుయేషన్ కోర్సులు (బీకామ్, బీఎస్సీ, బీఏ, బీసీఏ తదితర) - రూ.30,000
- పోస్టు గ్రాడ్యుయేషన్ (ఎంకామ్, ఎంఏ తదితర) - రూ.35,000
- ప్రొఫెషనల్ (బీటెక్, ఎంబీబీఎస్, ఎల్ఎల్బీ, బీఆర్కె, నర్సింగ్ ) రూ. 50,000
- పోస్టు గ్రాడ్యుయేషన్ ( ఎంటెక్, ఎంబీఏ) కోర్సులు - రూ. 55,000 నుంచి రూ. 75,000
విద్యార్థుల తమ చదువుకు ట్యూషన్ ఫీజు, ఇంటర్నెట్ సదుపాయం కోసం, ఆన్లైన్ లర్నింగ్, స్టేషనరీల కోసం వినియోగించుకోవచ్చని హెచ్డీఎఫ్సీ (HDFC) పేర్కొంది. ఈ స్కాలర్షిప్ విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొంది.
స్కాలర్షిప్ కోసం అందించాల్సి డాక్యుమెంట్స్
- 2019-2020 చదివిన కోర్సుకు సంబంధించి డాక్యుమెంట్స్ (Documents) అంతే కాకుండా 2018-2019 సంవత్సరానికి సంబంధించిన కోర్సు వివరాలు కూడా సమర్పించవచ్చు. ప్రస్తుతం సంవత్సరం చదివేందుకు అవసరమైన రసీదు వివరాలు అడ్మిషన్ సమాచారం అందించాలి.
- ఆధార్ (Aadhar)/ ఓటర్ / పాన్ కార్డు / డ్రైవింగ్ లైసెన్స్ (Driving License) ఏదో ఒకటి సమర్పించాలి.
- తల్లిదండ్రుల్లో ఎవరు మృతి చెందారో వారి డెత్ సర్టిఫికెట్. అంతే కాకుండా జీవనోపాధి కోల్పోయిన ధ్రువీకరణ పత్రం సర్పించాలి.
- దరఖాస్తు దారు లేదా తల్లిదండ్రి బ్యాంక్ ఖాతా అందించాలి.
దరఖాస్తు చేసే విధానం..
Step 1 : ఈ స్కాలర్షిప్కు కేవలం ఆన్లైన్ (Online) ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి.
Step 2 : ముందుగా https://www.buddy4study.com/scholarships వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలి.
Step 3 : రిజిస్ట్రేషన్ (Registration) పూర్తి చేసిన తరువాత హెచ్డీఎఫ్సీ పరివర్తన్ కోవిడ్ కోర్సుల లింక్‌లోకి వెళ్లాలి.
Step 4 : హెచ్డీఎఫ్సీ పరివర్తన్ కోవిడ్ కోర్సు లింక్
https://www.buddy4study.com/page/hdfc-bank-parivartans-covid-crisis-support-scholarship-program
Step 5 : దరఖాస్తు ఫాం పూర్తిగా నింపాలి.
Step 6 : స్టార్ట్ బటన్ నొక్కడం ద్వారా అప్లికేషన్ ఫాం (Application Form) లో అడిగిన వివరాలు అందించాలి.
Step 7 : అవసరమైన డాక్యుమెంట్లు పూర్తిగా అందించాలి.
Step 7 : దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 31, 2021 వరకు అవకాశం ఉంది.
AIIMS Recruitment 2021 : ఎయిమ్స్ బీబీ నగర్లో 68 ఉద్యోగాలు.. పరీక్ష లేకుండానే ఎంపిక
ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్
ఆఫ్ మెడికల్ సైన్సెస్(All India Institute of Medical Sciences),
బీబీనగర్ లో పలు ఉద్యోగా భర్తీకి నోటిఫికేషన్ (Notification)
విడుదలైంది. దీని ద్వారా నాన్ అకడామిక్ విభాగంలో 68 పోస్టులను భర్తీ
చేయనున్నారు. దరఖాస్తుకు నవంబర్ 9, 2021 వరకు
ఎయిమ్స్ బీబీనగర్
ఆల్
ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(All India Institute of
Medical Sciences), బీబీనగర్ లో పలు ఉద్యోగా భర్తీకి నోటిఫికేషన్
(Notification) విడుదలైంది. దీని ద్వారా నాన్ అకడామిక్ విభాగంలో 68
పోస్టుల సమాచారం.. అర్హతలు
పోస్టు పేరు | అర్హతలు | ఖాళీలు |
సీనియర్ రెసిడెంట్లు | గుర్తింపు పొందిన యూనివర్సిటీలో మైక్రోబయోలజీ, ఫార్మకాలజీ, రేడియాలజీ, ఆప్తమాలజీ తదితర విభాగాల్లో ఎండీ/ఎంఎస్/ డీఎం/ఎంసీహెచ్ /డీఎన్బీ మెడికల్ విభాగాల్లో పోస్టు గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి. దరఖాస్తుదారు వయసు 45 ఏళ్లు మించి ఉండకూడదు. | 38 |
జూనియర్ రెసిడెంట్లు | గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఎంబీబీఎస్ పూర్తి చేసి ఉండాలి. అంతే కాకుండా ఎంసీఐ లేదా రాష్ట్రలో గుర్తింపు పొంది ఉండాలి. | 25 |
ఎంపిక విధానం..
- పోస్టుల కన్నా దరఖాస్తు మూడు రెట్లు ఎక్కువ వస్తే రాత పరీక్ష (Written Test) నిర్వహిస్తారు.
- తక్కువ అప్లికేషన్లు వస్తే మెరిట్ (Merit) ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు.
- షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూ (Interview) చేసి తుది ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం..
Step 1 : దరఖాస్తు విధానం పూర్తిగా ఆన్లైన్ (Online) ద్వారా ఉంటుంది.
Step 2 : ముందుగా అధికారిక వెబ్సైట్ https://aiimsbibinagar.edu.in/seniorresident.html ను సందర్శించాలి.
Step 3 : సీనియర్ రెసిడెంట్లు.. జూనియర్ రెసిడెంట్లకు వేర్వేరుగా నోటిఫికేషన్లు ఉన్నాయి వాటిని చదవాలి. (నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి)
Step 4 : నోటిఫికేషన్‌ను చివరన అప్లికేషన్ ఫాం (Application Form) ను డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ నింపాలి.
Step 5 : అనంతరం అప్లికేషన్‌ను స్కాన్ చేసి అవసరమై దరఖాస్తులను మెయిల్ (Mail) ద్వారా పంపాలి.
Step 6 : దరఖాస్తు చేయాల్సిన మెయిల్ ace.aiimsbbnagar@gmail.com
Step 7 : దరఖాస్తుకు నవంబర్ 9, 2021 వరకు అవకాశం ఉంది.
Andhra Pradesh Jobs: అనంతరపురం ఏపీఎస్హెచ్సీఎల్లో ఉద్యోగాలు.. అర్హతలు ఇవే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (Andhra Pradesh State Housing Corporation Limited) లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Notification) విడుదల అయ్యింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 30, 2021 వరకు అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి
చెందిన ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (Andhra Pradesh State
Housing Corporation Limited) లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Notification) విడుదల అయ్యింది. నోటిఫికేషన్ ద్వారా ఐటీ మేనేజర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలను భర్తీ
చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు పూర్తిగా ఆఫ్‌లైన్ విధానంలో
ఉంటుంది. దరఖాస్తు చేసుకోనే వారి గరిష్ట వయసు సెప్టెంబర్ 30,
2021నాటికి 42 ఏళ్లుమించి ఉండకూడదు. దరఖాస్తుకు అక్టోబర్ 30, 2021
వరకు అవకాశం ఉంది. అభ్యర్థులను రాత పరీక్ష (Written Test) ద్వారా
ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం, నోటిఫికేషన్ వివరాల కోసం అధికారికి
వెబ్సైట్ https://ananthapuramu.ap.gov.in/notice_category/recruitment/ ను సందర్శించాల్సి ఉంటుంది.
పోస్టుల వివరాలు.. అర్హతలు
పోస్టు పేరు | అర్హతలు | ఖాళీలు | జీతం |
ఐటీ మేనేజర్ | గుర్తింపు పొందిన యూనివర్సిటీలో బీటెక్ లేదా ఎంసీఏ చేసి ఉండాలి. సంబంధిత రంగంలో పని అనుభవం తప్పనిసరి | 01 | రూ.25,000 |
డేటా ఎంట్రీ ఆపరేటర్ | గుర్తింపు పొందిన యూనివర్సిటీలో పీజీడీసీ/ బీకాం కంప్యూటర్స్ / ఎంసీఏ/ బీటెక్ / బీఎస్సీ కంప్యూటర్స్ చేసి ఉండాలి. | 05 | రూ.15,000 |
ఎంపిక విధానం..
- దరఖాస్తు చేసుకొన్న వారిని పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
- ఈ పరీక్షను అనంతరపురంలోని నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ వారు నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం..
Step 1 : దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆఫ్‌లైన్ పద్ధతిలో ఉంటుంది.
Step 2 : ముందుగా అధికారిక వెబ్సైట్ https://ananthapuramu.ap.gov.in/notice_category/recruitment/ ను సందర్శించాలి.
Step 3 : అనంతరం నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి అర్హత ఉన్న పోస్టులకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. (నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి)
Step 4 : నోటిఫికేషన్ చివరన అప్లికేషన్ ఫాం (Application Form) ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి.
Step 5 : అప్లికేషన్ ఫాం పూర్తిగా నింపి దరఖాస్తుకు అవసరం అయిన డాక్యుమెంట్లను పొందుపరిచి పోస్ట్ పంపాలి.
- దరఖాస్తకు కావాల్సిన సర్టిఫికెట్లు
- పదోతరగతి సర్టిఫికెట్ ( 10th Certificate), డిగ్రీ తత్సమ అర్హత సర్టిఫికెట్
- స్టడీ అండ్ కాస్ట్ సర్టిఫికెట్
- అవసరమైన విభాగాలకు అనుభవం ధ్రువీకరణ పత్రం
Step 6 : దరఖాస్తు పంపాల్సి చిరునామా
ప్రాజెక్టు డైరెక్టర్,
ఏపీహెచ్‌సీఎల్, డీఆర్డీఏ కాంపౌండ్,
అనంతపురం
Step 7 : దరఖాస్తుకు చేసుకోవడానికి అక్టోబర్ 30, 2021 వరకు అవకాశం ఉంది.
FCI Recruitment 2021 : ఎనిమిదో తరగతి విద్యార్హతతో 380 ఉద్యోగాలు.. జీతం రూ. 23,000
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (Food Corporation of India) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Notification) విడుదల చేసింది. ఐదు, ఎనిమిదో తరగతి విద్యార్హతతో 380 వాచ్మెన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల దరఖాస్తుకు నవంబర్ 19, 2021 వరకు అవకాశం ఉంది.
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (Food Corporation of India) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Notification) విడుదల
చేసింది. ఐదు, ఎనిమిదో తరగతి విద్యార్హతతో 380 వాచ్మెన్ పోస్టులను
భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల దరఖాస్తు పూర్తిగా ఆన్లైన్ (Online)
పద్ధతిలో ఉంటుంది. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు
చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. ఈ
పోస్టుల దరఖాస్తుకు నవంబర్ 19, 2021 వరకు అవకాశం ఉంది. పోస్టులకు
ఎంపికైన అభ్యర్థికి నెలకు రూ.23,000 నుంచి రూ. 64,000 జీతం
చెల్లిస్తారు. దరఖాస్తు చేసుకొనే వారు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి
ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://fci.gov.in/ లేదా https://www.recruitmentfci.in/ వెబ్సైట్లలో తెలుసుకోవచ్చు.
ముఖ్యమైన సమాచారం..
పోస్టు పేరు | ఖాళీలు | అర్హతలు | వయసు | జీతం |
వాచ్మెన్ | 380 | ఐదు, ఎనిమిదవ తరగతి చదివి ఉండాలి | సెప్టెంబర్ 1, 2021 నాటికి 25 ఏళ్లు నిండకూడదు | రూ.23,000 నుంచి రూ.64,000 |
- దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థికి రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
- రాత పరీక్ష 120 మార్కుల మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి.
- పరీక్ష ఇంగ్లీష్, హిందీ, పంజాబీలో నిర్వహిస్తారు.
- పరీక్షలో ఎటువంటి నెగెటీవ్ మార్కింగ్ లేదు.
- మెరిట్ ద్వారా ఎంపికైన వారిని పోస్టులోకి తీసుకొంటారు.
దరఖాస్తు విధానం..
Step 1 : దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లో ఉంటుంది.
Step 2 : ముందుగా అధికారిక వెబ్సైట్ https://www.recruitmentfci.in/ ను సందర్శించాలి.
Step 3 : వెబ్సైట్ల Category IV Recruitment లింక్‌లోకి వెళ్లాలి.
Step 4 : అనంతరం నోటిఫికేషన్ చదవాలి. (నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి)
Step 5 : అర్హతలు అన్ని చూసుకొన్న తరువాత దరఖాస్తు చేసుకోవడానికి https://fciharyana-watch-ward.in/login లింక్‌లోకి వెళ్లాలి.
Step 6 : అనంతరం కుడివైపు పైన Register Here క్లిక్ చేసి దరఖాస్తు విధానాన్ని ప్రారంభించాలి.
Step 7 : క్లిక్ చేసిన తరువాత ఇన్స్ట్రక్షన్లు వస్తాయి. చదవాలి.
Step 8 : ఇన్స్ట్రక్షన్ చదవిన తరువాత కింద చెక్ బాక్స్ టిక్ చేసి Apply Now లోకి వెళ్లాలి.
Step 9 : పేరు, ఫోటో ఐడీ, ఈమెయిల్, మొబైల్ నంబర్ ఇచ్చి అనంతరం విద్యార్హతలు ఇవ్వాలి.
Step 10 : రిజిస్ట్రేషన్ పూర్తియిన తరువాత రూ.250 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
Step 11 : దరఖాస్తు పూర్తయిన తరువాత ప్రింట్ తీసుకొని దాచుకోవాలి.
Step 12 : ఈ పోస్టుల దరఖాస్తుకు నవంబర్ 19, 2021 వరకు అవకాశం ఉంది.
Amazon Recruitment 2021 : అమెజాన్‌లో ఉద్యోగాలు.. అప్లికేషన్ ప్రాసెస్, పరీక్ష విధానం వివరాలు
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ పలు పోస్టుల భర్తీ ప్రక్రియను ఇప్పటికే మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో సెల్లర్ సపోర్టు అసోసియేట్ (Seller Support Associate) పోస్టులు దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ పోస్టులకు ఎంపికైన వారిని వర్క్ ఫ్రం హోం (Work From Home) ఇవ్వనున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోండి.
అమెజాన్ (Amazon)నిరుద్యోగులకు
శుభవార్త తెలిపింది. పలు వర్క్ ఫ్రం హోం (Work From Home) ఉద్యోగాలకు
దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ప్రకటించింది. సెల్లర్ సపోర్టు అసోసియేట్
(Seller Support Associate) పోస్టులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం
కల్పించింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థి ఏదైన డిగ్రీ చేసి ఉంటే చాలు. పూర్తి
ముఖ్య సమాచారం..
పోస్టు పేరు | సెల్లర్ సపోర్టు అసోసియేట్ (Seller Support Associate) |
జీతం | సీటీసీ - సంవత్సరానికి రూ. 2,75,000 నుంచి రూ.4,00,000 |
విద్యార్హత | ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి |
అప్లికేషన్ లింక్ | https://amazonvirtualhiring.hirepro.in |
- ఇంగ్లీష్ లో మంచి భాషా నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్ (Communication Skills) ఉండాలి.
- 24/7 షిఫ్ట్ లు పని చేసేందుకు సిద్ధంగా ఉండాలి.
- వర్క్ ఫ్రం హోంకు అవసరమైన ఇంటర్నెట్ ఫెసిలిటీ బాధ్యత ఉద్యోగిదే.
- వారానికి 5 పని దినాలు, రెండు రోజులు సెలవులు (Holydays) ఇంటర్నెట్, బ్రౌజర్లను సమర్థవంతంగా వినియోగించుకొనే సామర్థ్యం ఉండాలి.
- ఉద్యోగి హైదరాబాద్ లో సంస్థకు అందుబాటులో ఉండాలి.
దరఖాస్తు విధానం.. ఎంపిక ప్రక్రియ
Step 1 : ముందుగా అభ్యర్థి అధికారిక వెబ్ సైట్ https://amazonvirtualhiring.hirepro.in ను సందర్శించాలి. (అప్లికేషన్ కోసం క్లిక్ చేయండి)
Step 2 : అనంతరం మీ పూర్తి వివరాలను అందించాలి.
Step 3 : మీరు దరఖాస్తు చేసుకొన్నట్టు ధ్రువీకరిస్తూ మెయిల్ వస్తుంది.
Step 4 : అనంతరం మీ దరఖాస్తును పరిశీలించి ఆన్లైన్ పరీక్ష (Online Exam)కు ఆహ్వానిస్తూ మెయిల్ వస్తుంది.
Step 5 : మెయిల్ వచ్చిన అభ్యర్థికి ఆన్ లైన్ లో పరీక్ష నిర్వహిస్తారు.
Step 6 : అభ్యర్థి కచ్చింతా మంచి ఇంటర్నెట్ సదుపాయం కలిగి ఉండాలి.
Step 6 : మీ ఇంగ్లీష్ (English) సామర్థ్యం పై ఎక్కువగా ప్రశ్నలు అడుతారు.
Step 7 : రెండు లేదా మూడు రౌండ్లు పరీక్ష నిర్వహిస్తారు.
Step 8 : ఎంపికైన అభ్యర్థిని ఇంటర్వ్యూకి ఆహ్వానిస్తారు.
Aadhaar Hackathon 2021: ఆధార్ హ్యాకథాన్‌ను నిర్వహించనున్న UIDAI... రూ.3,00,000 గెలుచుకోవచ్చు
Aadhaar Hackathon 2021 | యూఐడీఏఐ మొదటి ఆధార్ హ్యాకథాన్ నిర్వహిస్తోంది. ఈ హ్యాకథాన్‌లో పాల్గొన్నవారు రూ.3,00,000 వరకు ప్రైజ్ మనీ (Prize Money) గెలుచుకోవచ్చు. ఈ హ్యాకథాన్ థీమ్, పూర్తి వివరాలు తెలుసుకోండి.
ఆధార్ కార్డులను జారీ చేసే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) తొలిసారిగా హ్యాకథాన్ (ఎక్కువ మంది ప్రజలు ఏదైనా కంప్యూటర్ కార్యకలాపంలో పాల్గొనడం) ను నిర్వహించనుంది. 'ఆధార్ హ్యాకథాన్ 2021' (Aadhaar Hackathon) పేరుతో యువ ఆవిష్కర్తలను లక్ష్యంగా చేసుకొని వివిధ ఇంజినీరింగ్ ఇనిస్టిట్యూట్లకు చెందిన యువతను ఇందులో భాగం చేయనుంది. ఇది ఆధార్ టీమ్ తొలిసారిగా నిర్వహిస్తున్న కార్యక్రమం. అక్టోబరు 28 అర్ధరాత్రి నుంచి అక్టోబరు 31 వరకు ఈ హ్యాకథాన్ ను నిర్వహిస్తామని ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.ఆధార్ హ్యాకథాన్ 2021 థీమ్
నమోదు, నవీకరణ (Enrolment and Update) అనే రెండు అంశాలపై ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రెండు థీమ్స్ ఉన్నాయి. 'ఎన్రోల్మెంట్ అండ్ అప్డేట్' మొదటి థీమ్‌ను యూఐడీఏఐ ఎంచుకుంది. ఇది నివాసితులు వారి చిరునామాను అప్డేట్ చేస్తున్నప్పుడు ఎదుర్కొంటున్న కొన్ని నిజ జీవిత సవాళ్లను కవర్ చేస్తుంది.
థీమ్ కింద ఆధార్ నంబర్ లేదా ఎలాంటి డెమోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయకుండా గుర్తింపును నిరూపించడానికి యూఐడీఏఐ వినూత్న పరిష్కారాలను కోరుతుంది. అలాగే నూతనంగా ప్రారంభించిన ఫేస్ అథెంటికేషన్ అయిన.. APIకి సంబంధించిన అంశాలు సైతం ఇందులో భాగంగా ఉన్నాయి.నివాసితులు వారి అవసరాలను పరిష్కరించుకోవడానికి ఇప్పటికే ఉన్నవాటితో పాటు నూతనంగా వచ్చిన ఏపీఐలో కొన్నింటిని పాపులర్ చేయాలనే లక్ష్యంతో UIDAI పనిచేస్తుంది. అధునాతన సాంకేతిక పరిష్కారాల ద్వారా ఈ సవాళ్లను అధిగమించడానికి ఈ సంస్థ ఇంజనీరింగ్ కళాశాలల యువతను కార్యక్రమంలో భాగం చేస్తోంది.
ఆధార్ హ్యాకథాన్ 2021 విజేతలు ప్రైజ్ మనీ
ప్రతి థీమ్ విజేతలకు ప్రైజ్ మనీతో పాటు ఇతర లాభదాయకమైన ప్రయోజనాలను UIDAI అందించనుంది. కొన్ని రివార్డులను కూడా ప్రకటించనుంది. ప్రతీ థీమ్‌లో మొదటి బహుమతి రూ.3,00,000, రెండో బహుమతి రూ.2,00,000, మూడో బహుమతి కింద రెండు టీమ్స్‌కు రూ.1,00,000 చొప్పున ప్రైజ్ మనీ ఇవ్వనుంది యూఐడీఏఐ.ఎలా నమోదు చేసుకోవాలి
ఆధార్
హ్యాకథాన్ 2021 కోసం ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్
ఫారంలు https://hackathon.uidai.gov.in/ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి.
ఆసక్తి గలవారు వెబ్సైట్ ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చని UIDAI
ప్రకటించింది.
-
AP KGBV Non-Teaching Recruitment 2024 Notification కేజీబీవీల్లో 729 బోధనేతర పోస్టులు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్ట...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...