26, అక్టోబర్ 2021, మంగళవారం

Daily Updates 26-10-2021






























Gemini Internet

డాక్టర్ వై ఎస్ ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ గురించిన సమాచారం | Dr.YSR Architecture and Fine Arts University Info.



Dr YSR Architecture And Fine Arts University Offer Animation Course - Sakshi

మనసులోని భావాలకు దృశ్యరూపం ఇచ్చే అరుదైన కోర్సు బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ఆర్ట్స్‌లోని యానిమేషన్‌ కోర్సు. పెద్ద నగరాలకే పరిమితమైన ఈ కోర్సు డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ఆర్ట్స్‌ విశ్వవిద్యాలయంలో అందుబాటులోకి వచ్చింది. 100 శాతం ఉపాధి, ఉద్యోగ అవకాశాలున్న ఈ కోర్సు ప్రత్యేకతలపై కథనం.  

సాక్షి,కడప(వైవీయూ): కడప నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి స్పెషలైజ్డ్‌ యూనివర్సిటీ డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ఆర్ట్స్‌ విశ్వవిద్యాలయం. వందశాతం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉండే కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా పెద్ద నగరాలకే పరిమితమైన యానిమేషన్‌ కోర్సును బీఎఫ్‌ఏ యానిమేషన్‌ కోర్సుగా కడప విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం, భవిష్యత్‌ అవసరాలను తీర్చేవిధంగా తీర్చిదిద్దిన ఈ కోర్సు పూర్తి చేయడం ద్వారా సొంతగా, వివిధ సంస్థల్లో పనిచేసి పేరుప్రఖ్యాతులు, ఆకర్షణీయమైన వేతనాలు పొందవచ్చును. 

అర్హత : ఇంటర్మీడియట్‌లో ఏదైనా కోర్సు పూర్తిచేసిన ఇందులో చేరడానికి అర్హులు. ఆర్ట్‌ అండ్‌ డిజైన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌–2021 ద్వారా ప్రవేశాలు పొందచ్చు. నాలుగు సంవత్సరాల ఈ కోర్సుకు గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఓపెన్‌ ఇంటర్‌ ఉత్తీర్ణులైన వారు కూడా అర్హులే. కోర్సులో ప్రవేశం పొందిన వారికి వివిధ రకాల సాంకేతికతను వినియోగించి ప్రస్తుత మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దుతారు. 

అవకాశాల వెల్లువ.. 

ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు వివిధ సంస్థల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభిస్తాయన్నది నిపుణుల మాట. చదువకుంటూ వివిధ సంస్థల్లో ఫ్రీలాన్స్‌గా కూడా ఉద్యోగం చేసుకునే సౌకర్యం ఉంది. ఆన్‌లైన్‌ ద్వారా గ్రాఫిక్స్, విఎఫ్‌ఎక్స్, ఫిల్మ్‌మేకింగ్, గేమ్‌ డిజైనింగ్‌ ప్రోగ్రామింగ్‌ చేసే అవకాశాలు లభిస్తాయి.  ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు యానిమేషన్, గేమ్‌ డిజైనింగ్, కార్టూన్, టీవీఛానల్స్, బుక్‌ మేగజైన్స్, వెబ్‌ మాధ్యమాల్లో అపారంగా అవకాశాలు ఉన్నాయి.

2డీ, 3డీ యానిమేటర్‌లుగాను, లైటింగ్, రిగ్గింగ్‌ ఆర్టిస్ట్‌గాను, కేరక్టర్‌ డిజైనర్‌గాను, స్క్రిప్ట్‌ రైటర్, వీడియో, ఆడియో ఎడిటర్‌గా, పోస్ట్‌ ప్రొడక్షన్‌లో వీఎఫ్‌ఎక్స్‌ ఆర్టిస్ట్, డిజైనర్‌గా, గ్రాఫిక్‌ డిజైనర్, టాయ్‌ యానిమేటర్, స్టోరీబోర్డు ఆర్టిస్టుగా, ఇలస్ట్రేటర్‌గా, టైటిల్‌ డిజైనర్, కంపోస్టర్, విజువల్‌ డెవలపర్, ఫ్లాష్‌న్యూస్‌మేకర్స్, ప్రొడక్షన్‌ డిజైనర్, లేఅవుట్‌ ఆర్టిస్ట్, 3డీ మోడులర్, కీ ప్రైమ్‌ యానిమేటర్, ఇమేజ్‌ ఎడిటర్‌గా, ఫోరెన్సిక్‌ యానిమేటర్‌ వంటి వివిధ రకాల ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. MPC స్ట్రీమ్‌లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన లేదా డిప్లొమా ఉన్న వారికి EAPCET ద్వారా ప్రవేశాలు ఉంటాయి. ఈ సంస్థలో మొత్తం 60 సీట్లు అందుబాటులో ఉన్నాయి, వీటిలో 15 మేనేజ్‌మెంట్ కోటా కింద ఉన్నాయి. విద్యార్థులు యూనివర్సిటీ వెబ్‌సైట్, drysrafu.ac.in సందర్శించడం ద్వారా మరింత తెలుసుకోవచ్చు.


Gemini Internet

విద్యా ఉద్యోగ సమాచారం | Education and Jobs Info.

Gemini Internet


Ananthapuramu | Kurnool | Cuddappah | Chittoor District Classifieds 26-10-2021

Gemini Internet







25, అక్టోబర్ 2021, సోమవారం

Engineering Students: ఇంజినీరింగ్​ విద్యార్థులకు గుడ్​న్యూస్​.. ప్రతి నెలా రూ. 7500 స్టైపెండ్​ పొందే అవకాశం.. 31 అక్టోబర్ 2021 లోపు దరఖాస్తు చేసుకోవాలి.



Engineering Students: ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) ఇంటర్న్‌షిప్(Internship) 2021కింద ఇంజినీరింగ్​ విద్యార్థులకు తీపికబురు అందించింది. ఉజ్జ్వలా కెమికల్ అండ్ ఫెర్టిలైజర్‌ (Ujjawala Chemical and Fertilizers) లో 100 లాబరేటరీ ఇంటర్న్​ల భర్తీకి నోటిఫికేషన్ (Notification)​ విడుదల చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) ఇంటర్న్‌షిప్(Internship) 2021కింద ఇంజినీరింగ్​ విద్యార్థులకు తీపికబురు అందించింది. ఉజ్జ్వలా కెమికల్ అండ్ ఫెర్టిలైజర్‌ (Ujjawala Chemical and Fertilizers) లో 100 లాబరేటరీ ఇంటర్న్​ల భర్తీకి నోటిఫికేషన్ (Notification)​ విడుదల చేసింది. ఎంపికైన వారికి ఉజ్జ్వలా కెమికల్ అండ్ ఫెర్టిలైజర్‌లో 6 నెలల ల్యాబరేటరీ ఇంటర్న్​గా అవకాశం కల్పిస్తారు. ఇందులో మొత్తం 100 ల్యాబొరేటరీ ఇంటర్న్ స్థానాలకు ఖాళీలుండగా ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెలా రూ. 7500 స్టైపెండ్​ అందజేస్తారు. ఉజ్జ్వల కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్ (Ujjawala Chemical and Fertilizers) అనేది ఒక విశ్వసనీయమైన తయారీదారీ, సరఫరాదారీ సంస్థ. ఇది జీవ ఎరువులు, సూక్ష్మ పోషకాల ఎరువులమొదలగు ఎరువుల వ్యాపారం నిర్వహిస్తోంది.

ఈ ఇంటర్న్‌షిప్ చేయడం ద్వారా అభ్యర్థులు నిజజీవిత వర్క్ ఎక్స్పీరియన్స్ పొందొచ్చు. అంతేకాదు, నిపుణులతో పని చేస్తూ అనేక కొత్తవిషయాలు తెలుసుకోవచ్చు. ఫీల్డ్ లో ప్రయోగాలు కూడా చేయొచ్చు. మొత్తం ఆరు నెలల కాలం పాటు అందుబాటులో ఉండే ఈ ఇంటర్న్​షిప్​కు సెకండ్ లేదా థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్ విద్యార్థులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విద్యార్థులు సంబంధిత స్కిల్స్ తో పాటు అనుభవం కలిగి ఉండాలి.

Gemini Internet

ఎంపికైన విద్యార్థులు ఉజ్జ్వల కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్ సంస్థలో చేయాల్సిన పని
1. ఎరువులు, పురుగుమందులను విశ్లేషించాలి.
2. సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్స్, ఎక్స్పెరిమెంట్స్ నిర్వహించాలి. అలాగే వీటికి సపోర్ట్ చేయాలి.
3. నియంత్రిత ప్రయోగాలను ప్లాన్ చేయాలి. ట్రయల్స్ చేపట్టాలి. ఈ ప్రయోగాలను ఏర్పాటు చేయాలి.
4. డేటాను రికార్డ్ చేయాలి. అలాగే విశ్లేషించాలి.
5. పరికరాలను శుభ్రపరచాలి, పరీక్షించాలి, కాలిబ్రేట్(calibrate) చేయాలి. పరికరాల శుభ్రంగా ఉన్నాయో లేదో పరీక్షించాలి.
6. సంబంధిత సైంటిఫిక్ అండ్ టెక్నికల్ నాలెడ్జ్ పెంచుకోవాలి.
7. వనరులను ఆర్డర్ చేయాలి.. అలాగే వాటిని మెయింటైన్ చేయాలి.
ఎఐసీటీఈ ఇంటర్న్‌షిప్ 2021కి దరఖాస్తు చేసుకోండిలా
ఆసక్తిగల విద్యార్థులు https://internship.aicte-india.org అధికారిక వెబ్‌సైట్‌లో 31 అక్టోబర్ 2021 లోపు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుదారులు మొదటగా వారు చదువుతున్న యూనివర్సిటీపేరు, విద్యార్థి ఐడీ, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్లతో తులిప్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. తరువాత ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి వారి ఈమెయిల్ ఐడీ, పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి.

Scholarship Programmes: విద్యార్థులకు అలర్ట్.. నవంబర్ లో అప్లై చేసుకోవాల్సిన స్కాల‌ర్‌షిప్ ల వివరాలివే.. తెలుసుకోండి

ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు(Students) అండగా నిలించేందుకు అనేక సంస్థలు స్కాలర్ షిప్ లు (Scholarship) అందించి చదువుకోవడానికి ప్రోత్సహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నవంబర్ నెలలో దరఖాస్తు చేసుకోవాల్సిన స్కాలర్ షిప్ ల వివరాలు..

Gemini Internet

కరోనా (Corona) కారణంగా అనేక మంది ఆర్థికంగా చితికిపోయారు. అనేక మంది ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయి వీధిన పడ్డారు. చాలా మంది చిరు వ్యాపారులు లాక్ డౌన్ల (Lock Down) కారణంగా దెబ్బతిన్నారు. దీంతో అలాంటి వర్గాల ప్రజలు వారి పిల్లల చదువులకు(Education) ఖర్చు చేసేందుకు చేతిలో డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు. మరి కొందరు విద్యార్థులు (Students) కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వంతో పాటు పలు ప్రముఖ సంస్థలు అందించే స్కాలర్ షిప్ (Scholarship) లను సద్వినియోగం చేసుకుంటే ఫీజుల చెల్లింపు భారం తగ్గుతుంది. ఈ నేపథ్యంలో నవంబర్ నెలలో అప్లై చేసుకోవాల్సిన పలు స్కాలర్ షిప్ ల వివరాలు ఇలా ఉన్నాయి.

1. STFC India Meritorious Scholarship Programme 2021: 
శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ(STFC) లిమిటెడ్ పేద వర్గాలకు చెందిన విద్యార్థులకు అండగా నిలిచేందుకు స్కాలర్ షిప్ ప్రోగ్రామ్ ను ప్రకటించింది. ఆర్థికంగా వెనుకబడిన కమర్షియల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ల పిల్లలకు ఈ స్కాలర్ షిప్ ను అందించనున్నారు. టెన్త్, ఇంటర్ తర్వాత ప్రొఫెషనల్ కోర్సులు చదివే విద్యార్థులకు ఈ స్కాలర్ షిప్ అందించనున్నారు.
అర్హత: డిప్లొమా/ఐటీఐ/పాలిటెక్నిక్ కోర్సులు లేదా -గ్రాడ్యుయేషన్/ఇంజనీరింగ్ కోర్సుల్లో నమోదు చేసుకున్న విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ కు అప్లై చేసుకోవచ్చు. అయితే దరఖాస్తు చేసుకునే విద్యార్థులు టెన్త్, ఇంటర్ కోర్సుల్లో 60 శాతం మార్కులను సాధించి ఉండాలి.
-అభ్యర్థులు తప్పనిసరిగా కమర్షియల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ కుటుంబానికి చెందిన వారై ఉండాలి. వారి కుటుంబ ఆదాయం ఏడాదికి రూ. 4 లక్షల లోపు ఉండాలి. ఈ స్కాలర్ షిప్ కోసం విద్యార్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేదీ: 15-11-2021
అప్లికేషన్ లింక్: www.b4s.in/it/SIMD4

స్కాలర్ షిప్: ఈ స్కాలర్ షిప్ కింద ఎంపికైన విద్యార్థులు ఐటీఐ/పాలిటెక్నిక్/డిప్లొమా కోర్సులకు గాను ఏడాదికి రూ. 15 వేలు, గ్రాడ్యుయేషన్/ఇంజనీరింగ్ కోర్సులకు ఏడాదికి రూ. 35 వేల చొప్పున స్కారల్ షిప్ ను పొందుతారు.
Scholarship : అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోండి.. విద్యార్థుల‌కు బెస్ట్ స్కాల‌ర్‌షిప్ ప్రొగ్రాంలు

2. IIT Roorkee Chemistry Department Post Doctoral Fellowship (PDF) 2021:
ఐఐటీ రూర్కీ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ PhD చేసిన అభ్యర్థులకు స్కాలర్ షిప్ ను ప్రకటించింది. ఎంపికైన అభ్యర్థులు ‘Chemical Proteomic Approach to Identify Snrall Molecule Covalent inhibitors to Target Protein-Protein Interactions in BCI-2 Proteitrs’ ప్రాజెక్టుపై పని చేయాల్సి ఉంటుంది.
-కెమిస్ట్రీ (కెమికల్ బయాలజీ)/ బయోటెక్నాలజీ/ బయోకెమిస్ట్రీలో పీహెచ్‌డీ పట్టా పొందిన మరియు ఇటీవల తమ థీసిస్‌ను సమర్పించిన అభ్యర్థులు ఈ స్కాలర్ షిప్ కు అప్లై చేసుకోవచ్చు.
స్కాలర్ షిప్ మొత్తం: ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 60 వేల చొప్పున స్కాలర్ షిప్ అందించనున్నారు.
చివరి తేదీ: అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు నవంబర్ 6వ తేదీలోగా ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Application mode: అభ్యర్థులు ఆన్లైన్, ఆఫ్లైన్ విధానంలో అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఆఫ్ లైన్ అప్లికేషన్లను The Head Department of chemistry, India Institute of Technology Roorkee Roorkee- 247667 Uttarakhand, India చిరునామాకు పంపించాల్సి ఉంటుంది. లేదా venkatesh.v@cy.iitr.ac.in మెయిల్ కు పంపించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్ లింక్: https://www.iitr.ac.in/administration/uploads/File/ch/2021/adv07102021.pdf

3. Ericsson Empowering Girl Scholarship Programme 2021:
ఎరిక్సన్ సంస్థ ప్రతిభ కలిగిన బాలికలకు చేయూత అందించేందుకు ఈ స్కాలర్ షిప్ ను తీసుకువచ్చింది. ఇంజనీరింగ్ సెకండియర్(IT/CS) చదివే అభ్యర్థులు ఈ స్కాలర్ షిప్ కు అప్లై చేసుకోవచ్చు. లేదా ఎంబీఏ చేసే వారు కూడా అప్లై చేసుకోవచ్చు.
అర్హత: ఐటీ/కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఇంజనీరింగ్ సెకండియర్ చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ కు అప్లై చేసుకోవచ్చు. ఎంబీఏ చదువుతున్న వారు కూడ ఈ స్కాలర్ షిప్ కు దరఖాస్తు చేసుకోవచ్చు.
-ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థుల వార్షిక ఆదాయం ఏడాదికి రూ. 6 లక్షల లోపు ఉండాలి.

స్కాలర్ షిప్: ఈ స్కాలర్ షిప్ కు ఎంపికైన వారికి ఏడాదికి రూ. 75 వేల స్కాలర్ షిప్ అందించనున్నారు.
దరఖాస్తుకు చివరి తేదీ: 30-11-2021
అప్లికేషన్ డైరెక్ట్ లింక్: www.b4s.in/it/EEGS2


 

India Post Jobs: ఉద్యోగాల భర్తీకి ఇండియా పోస్ట్ నోటిఫికేషన్... హైదరాబాద్‌లో ఖాళీలు. డిసెంబర్ 15 చివరి తేదీ


India Post Jobs: ఉద్యోగాల భర్తీకి ఇండియా పోస్ట్ నోటిఫికేషన్... హైదరాబాద్‌లో ఖాళీలు

India Post Recruitment 2021 | డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్‌కి చెందిన సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పోస్టల్ టెక్నాలజీ (CEPT) పలు పోస్టుల భర్తీకి దరఖాస్

నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగాల భర్తీకి ఇండియా పోస్ట్ జాబ్ నోటిఫికేషన్ (Job Notification) రిలీజ్ చేసింది. సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పోస్టల్ టెక్నాలజీ (CEPT) సంస్థలో పలు కేటగిరీల్లో టెక్నికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. హైదరాబాద్‌తో పాటు మైసూరు, చెన్నై, బెంగళూరులో ఉన్న సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పోస్టల్ టెక్నాలజీ యూనిట్లలో ఈ పోస్టులున్నాయి. మొత్తం 29 పోస్టుల్ని ప్రకటించింది ఇండియా పోస్ట్. అసిస్టెంట్ మేనేజర్, టెక్నికల్ సూపర్‌వైజర్ లాంటి పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 2021 డిసెంబర్ 15 చివరి తేదీ. ఈ పోస్టుల్ని డిప్యుటేషన్ ద్వారా ఎంపిక చేస్తోంది ఇండియా పోస్ట్. ఈ పోస్టులకు దరఖాస్తు చేసేముందు అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి. ఈ జాబ్ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.

India Post Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...

మొత్తం ఖాళీలు29విద్యార్హతలు
అసిస్టెంట్ మేనేజర్23గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ పాస్ కావాలి. కంప్యూటర్ సైన్స్‌లో ఒక ఏడాది డిప్లొమా ఉండాలి.
టెక్నికల్ సూపర్‌వైజర్6గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ పాస్ కావాలి. కంప్యూటర్ సైన్స్‌లో ఒక ఏడాది డిప్లొమా ఉండాలి.

Gemini Internet

India Post Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు

దరఖాస్తు ప్రారంభం- 2021 అక్టోబర్ 16
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 డిసెంబర్ 15
అనుభవం- అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, సబార్డినేట్ ఆఫీసుల్లో కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ టెస్టింగ్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేసిన రెండేళ్ల అనుభవం తప్పనిసరి. టెక్నికల్ సూపర్‌వైజర్ పోస్టుకు ఏడాది అనుభవం తప్పనిసరి.
వయస్సు- 56 ఏళ్ల లోపు
ఎంపిక విధానం- డిప్యూటేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.
వేతనం- రూ.9,300 బేసిక్ వేతనంతో మొత్తం రూ.34,800 వేతనం లభిస్తుంది.
ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

India Post Recruitment 2021: దరఖాస్తు చేయండి ఇలా

Step 1- అభ్యర్థులు ముందుగా https://ccc.cept.gov.in/technicalposts/ లింక్ ఓపెన్ చేయాలి.
Step 2- హోమ్ పేజీలో Register పైన క్లిక్ చేయాలి.
Step 3- రిజిస్ట్రేషన్ ఫామ్‌లో పేరు, ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్, పాస్‌వర్డ్ లాంటివి ఎంటర్ చేయాలి.
Step 4- రిజిస్ట్రేషన్ సక్సెస్ అయిన తర్వాత https://ccc.cept.gov.in/technicalposts/ మరోసారి ఓపెన్ చేయాలి.
Step 5- మీ రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడీకి వచ్చిన వివరాలతో లాగిన్ కావాలి.
Step 6- విద్యార్హతలు, ఇతర వివరాలతో దరఖాస్తు ఫామ్ పూర్తి చేయాలి.
Step 7- ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.
Step 8- Preview పైన క్లిక్ చేసి అప్లికేషన్ వివరాలు చెక్ చేసుకోవాలి.
Step 9- Submit పైన క్లిక్ చేసి దరఖాస్తు పామ్ సబ్మిట్ చేయాలి.
Step 10- అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసి భద్రపర్చుకోవాలి.

 

 

Indian Navy Sailor Recruitment 2022: టెన్త్ పాసైన వారికి శుభవార్త.. ఇండియన్ నేవీలో 300 ఉద్యోగాలు.. నవంబర్ 2 ఆఖరి తేదీ

పదో తరగతి పాసైన అభ్యర్థులకు ఇండియన్ నేవీ (Indian Navy) శుభవార్త చెప్పింది. టెన్త్ అర్హతతో పలు ఉద్యోగాలను భర్తీకి నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇండియన్ నేవీ (Indian Navy) లో చేరాలనుకుంటున్నారా? అయితే, మీకో గుడ్ న్యూస్. ఇండియన్ నేవీలో సెయిలర్ మెట్రిక్ రిక్రూట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 300 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ (Application Process) అక్టోబర్ 29న ప్రారంభమైంది. దరఖాస్తులకు ఈ నవంబర్ 2ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అభ్యర్థులు ఆన్లైన్ (Online) విధానంలో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అధికారిక వెబ్ సైట్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్లో తెలిపిన వివరాల ప్రకారం దరఖాస్తు చేసుకున్న వారిలో 1500 మందిని రాత పరీక్ష (Written Test), ఫిజికల్ ఫిట్ నెస్ టెస్ట్(PFT), మెడికల్ స్టాండర్డ్స్ కోసం షార్ట్ లిస్ట్ చేస్తారు. అన్ని రౌండ్లలో అర్హత సాధించిన అభ్యర్థులకు INS Chilkaలో 12 వారాల పాటు శిక్షణ ఉంటుంది.

విద్యార్హతల వివరాలు: గుర్తింపు పొందిన బోర్డుల నుంచి 10వ తరగతి పాసైన అభ్యర్థులు ఆయా ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
వయో పరిమితి: ఏప్రిల్ 1, 2002 నుంచి సెప్టెంబర్ 30, 2025 మధ్యలో జన్మించిన అభ్యర్థులు ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Gemini Internet

ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
Step 1: అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.
Step 2: అనంతరం Candidate Login ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 3: ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ను నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

Step 4: అనంతరం రిజిస్టర్ చేసుకున్న ఈ మెయిల్ ఐడీ ద్వారా లాగిన్ అవ్వాలి. తర్వాత ‘Current Opportunities’ సెక్షన్ లోకి వెళ్లాలి.
Step 5: అప్లికేషన్ ఫామ్ ను పూర్తిగా నింపి కావాల్సిన డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయాలి.
Step 6: నమోదు చేసిన వివరాలను ఓ సారి సరి చూసుకుని సబ్మిట్ పై క్లిక్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ ప్రింట్ కాపీని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరుచుకోవాలి.

ఎంపిక ప్రక్రియ:
అభ్యర్థులకు మొదట రాత పరీక్ష నిర్వహిస్తారు. అనంతరం ఫిజికల్ ఫిట్ నెస్ టెస్ట్ ఉంటుంది. సైన్స్, మాథ్స్, జనరల్ నాలెడ్జ్ కు సంబంధించిన ప్రశ్నలు ఇందులో ఉంటాయి. హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ప్రశ్నపత్రం ఉంటుంది. రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అదే రోజు ఫిజికల్ ఫిట్ నెస్ టెస్ట్ కు హాజరుకావాల్సి ఉంటుంది.

వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు ట్రైనింగ్ సమయంలో నెలకు రూ.14,600 ఉపకార వేతనం ఉంటుంది. ట్రైనింగ్ పూర్తయిన అనంతరం రూ. 21,700 నుంచి రూ. 69,100 వరకు వేతనం ఉంటుంది.

పుట్టపర్తి సాయి ఆరామం లో పేదవారికి ఉచిత వివాహాలు జరుపబడును. వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇందుకు పెళ్లి కొడుకు వయసు 21
పెండ్లి కూతురు వయస్సు 18 పైన ఉండాలి
పెళ్లి కొడుకు కావలసిన వస్తువులు  తలంబ్రాల  బట్టలు. కాలి మెట్లు .చెప్పులు ఉచితంగా ఇవ్వబడును.
పెళ్లికూతురు కు బట్టలు , గాజులు తాళిబొట్టు,  గిన్ని బొట్టు ,కాలి మెట్టెలు అలాగే చెప్పులు ఉచితంగా ఇవ్వబడును.
వీళ్ళ ఇద్దరికీ వంట సామాన్లు కూడా ఉచితంగ ఇవ్వబడును.
కావున
మీరు సంప్రదించవలసిన నెంబర్లు, 9441074156
దాసరి శ్రీనివాసులు. బుక్కపట్నం.
9346711109
గోకులం వెంకటేష్.
మీరు 17.11.21 సాయంత్రం  సాయి ఆరామం  గణేష్ సర్కిల్ ఎనుముల పల్లి దగ్గరకు రావలెను.
18.11.21 తారీకున ఉదయం సాయి ఆరామం నందు  పెళ్లిళ్లు జరుపబడును.

ప్రభుత్వ ఉద్యోగాలు NHM Andhra Pradesh లో 3393 మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ ఖాళీలు

భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోని National Health Mission, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా తమ ఆధ్వర్యంలో ఒక సంవత్సరం పాటు ఒప్పంద ప్రాటిపదికన కింది పోస్టుల భర్తీకి దరక్ఖస్తులు కోరుతున్నారు.

మొత్తం ఖాళీలుః 3393

మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లు జిల్లాల వారీగా ఖాళీలు

1. శ్రీకాకుళం, విజయనగరం మరియు విశాఖపట్నం జిల్లాలలో 633 పోస్టులు

2. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి మరియు కృష్ణా జిల్లాలలో 1003 పోస్టులు

3. గుంటూరు, ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాలలో 786 పోస్టులు

4. చిత్తూరు, కడప, అనంతపురం మరియు కర్నూలు జిల్లాలలో 971 పోస్టులు

అర్హతః AP Nursing Council గుర్తింపు పొందిన విద్యసంస్థ నుంచి B.Sc, Nursing ఉత్తీర్ణత, B.Sc Nursing లో కమ్యూనిటీ హెల్త్ సర్టిఫికేట్ ప్రోగ్రాం పూర్తి చేయాలి

వయసుః 35 ఏళ్ళ లోపు, BC/SC/ST అభ్యర్థులకు 40 ఏళ్ళవరక్కు వయోపరిమితి కలదు

ఆన్ లైన్ ద్వారా దరఖాస్తుకు చివరి తేది 06-11-2021 అప్లికేషన్ల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్  నెట్, హిందూపురం 9640006015, హిందూపురం.

Guidelines, Notification మరియు offline application కొరకు లింక్ ను క్లిక్ చేయండి

Online application కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Official Website కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

అప్లికేషన్ కొరకు తీసుకురావలసినవిః Photograph, Income Certificate, Caste Certificate, 10th Class Marks Memo, Intermediate Marks Memo, 4th Class to 10th Class Study Certificates, B Sc Nursing Certificates (1st year 2nd year and also if you have 3rd and 4th year Marks Memos) B.Sc. Nursing Certificate with Provisional, Aadhaar and Cell Phone Number for OTP.

విద్యా ఉద్యోగ సమాచారం | Education and Jobs Info

Gemini Internet


Ananthapuramu | Chittoor | Cuddappah | Kurnool District Classifieds 25-10-2021








Gemini Internet

24, అక్టోబర్ 2021, ఆదివారం

Payments: నెట్ అవసరం లేదు..యాప్‌‌తో పనిలేదు..స్మార్ట్ ఫోన్ అక్కరలేదు..మీ బ్యాంక్ ఎకౌంట్ నుంచి డబ్బు పంపించేయండిలా..

మనం ఇప్పుడు డబ్బులు చేతిలో పట్టుకుని బజారుకు వెళ్ళడం చాలావరకూ తగ్గిపోయింది. యూపీఐ పేమెంట్ విధానంలో చాలా సింపుల్ గా మనం ఇప్పుడు డబ్బును ఎవరికైనా పంపించలన్నా.. ఏదైనా వస్తువును కొనాలన్నా సులభంగా కానిచ్చేస్తున్నాము

Payments without internet: మనం ఇప్పుడు డబ్బులు చేతిలో పట్టుకుని బజారుకు వెళ్ళడం చాలావరకూ తగ్గిపోయింది. యూపీఐ పేమెంట్ విధానంలో చాలా సింపుల్ గా మనం ఇప్పుడు డబ్బును ఎవరికైనా పంపించలన్నా.. ఏదైనా వస్తువును కొనాలన్నా సులభంగా కానిచ్చేస్తున్నాము. అయితే, ఇప్పటివరకూ మనకు యూపీ ఐ ట్రాన్సాక్షన్ చేయాలంటే ఇంటర్నెట్ ఉండాలని తెలుసు. అదీ కాకుండా స్మార్ట్ ఫోన్ లో యూపీఐ యాప్ (పేటీఎం లేదా జీ పే వంటివి)కూడా ఉండాల్సిందే. కానీ..ఇవేవీ అవసరం లేకుండానే.. అంటే స్మార్ట్ ఫోన్.. ఇంటర్నెట్.. యూపీఐ యాప్ కూడా లేకుండా మన బ్యాంక్ ఎకౌంట్ నుంచి డబ్బు పంపించవచ్చు. అదేవిధంగా ఏదైనా వస్తువునూ కొనుగోలు చేసేయవచ్చు. దీనికోసం ఏ రకమైన కోడ్ స్కాన్ కూడా చేయనవసరం లేదు. మీ దగ్గర సాధారణ ఫోన్ ఉన్నా కూడా మీరు ఫోన్ ద్వారా పేమెంట్స్ చేసేయగలుగుతారు. ఇంటర్నెట్ లేకుండా చెల్లింపు ప్రక్రియ గురించి ఈ రోజు మీకోసం ఇక్కడ వివరంగా చెబుతున్నాం..

1. ఇంటర్నెట్ లేకుండా UPI చెల్లింపు చేయడానికి, ముందుగా మీరు మీ ఫోన్ డయలర్ వద్దకు వెళ్లి *99# అని టైప్ చేసి కాల్ బటన్ నొక్కండి.

2. ఇప్పుడు మీ స్క్రీన్‌పై సెండ్ మనీ, రిసీవ్ మనీ, చెక్ బ్యాలెన్స్, మై ప్రొఫైల్, పెండింగ్ అభ్యర్థనలు, లావాదేవీలు మరియు యూపీఐ (UPI) పిన్ వంటి ఆప్షన్‌లతో పాప్ అప్ మెనూ కనిపిస్తుంది. మీరు మీ అవసరానికి అనుగుణంగా ఏదైనా ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. దానికి సంబంధించిన నంబర్‌ను నమోదు చేసి పంపవచ్చు.

Upi Payment

3. మీరు యూపీఐ ద్వారా ఎవరికైనా డబ్బు పంపాలనుకుంటే, Send Money తో ఆప్షన్‌ని ఎంచుకోండి. ఇప్పుడు ఒక కొత్త పాప్ -అప్ మెను మీ ముందు కనిపిస్తుంది, దీనిలో మొబైల్ నంబర్, UPI ID.. IFSC ఖాతా నంబర్ వంటి ఏ మాధ్యమం ద్వారా మీరు డబ్బు పంపాలనుకుంటున్నారో వరుసగా ఆప్షన్స్ కనిపిస్తాయి.

Payment Without App

4. మీరు మొబైల్ నంబర్ నుండి డబ్బు పంపాలనుకుంటే, ఆ ఎంపికను ఎంచుకుని, ఆపై మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి.

Payments Without Net

అప్పుడు మీరు పంపాలనుకుంటున్న మొత్తాన్ని టైప్ చేసి పంపండి. లావాదేవీని పూర్తి చేయడానికి UPI పిన్‌ని నమోదు చేయండి. ఈ విధంగా మీరు ఇంటర్నెట్ లేకుండా ఎవరికైనా సులభంగా డబ్బు పంపవచ్చు.

 

Ananthapuramu | Chittoor | Kurnool | Cuddappah District Classifieds 24-10-2021










Gemini Internet