IB: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 995 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులు | IB: 995 Assistant Central Intelligence Officer Posts in Intelligence Bureau
IB: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 995 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులు న్యూదిల్లీలోని భారత ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్‌కు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో- దేశవ్యాప్తంగా ఐబీ పరిధిలోని సబ్సిడియరీ ఇంటెలిజెన్స్ బ్యూరోల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత గల అభ్యర్థులు డిసెంబర్ 15వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఖాళీల వివరాలు: * అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-2/ ఎగ్జిక్యూటివ్: 995 పోస్టులు (యూఆర్- 377, ఈడబ్ల్యూఎస్- 129, ఓబీసీ- 222, ఎస్సీ- 134, ఎస్టీ- 133) అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ లేదా తత్సమానం. వయోపరిమితి: 15-12-2023 నాటికి 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి. పే స్కేల్: నెలకు రూ.44,900-1,42,400. ఎంపిక ప్రక్రియ: టైర్-1 రాత పరీక్ష, టైర్-2 పరీక్ష, టైర్-3/ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫిక...