అయోధ్య రాముడికి 2,500 కిలోల భారీ గంట
అయోధ్య రాముడి కోసం 2,500 కిలోల భారీ గంటను సిద్ధం చేసి విరాళంగా ఇచ్చేందుకు సిద్ధమైంది ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఓ కుటుంబం. ఇందు కోసం రూ.25 లక్షలు వెచ్చిస్తున్నట్లు ఇటావా జిల్లాకు చెందిన గంటలు తయారు చేసే మిత్తల్ కుటుంబం పేర్కొంది. మోగించినపుడు ఓంకార శబ్దం రావడం దీని ప్రత్యేకత అని తెలిపారు. ఈ గంటను జింక్, రాగి, సీసం, తగరం, నికెల్, వెండి, బంగారం వంటి 8 లోహాలతో తయారు చేశామని చెప్పారు. దీని తయారీలో 250 మంది కార్మికులు పాల్గొన్నారని.. సుమారు మూడు నెలలు పట్టిందని నిర్వాహకులు వెల్లడించారు.
లోహపు వ్యర్థాలతో రామాలయం!
మధ్యప్రదేశ్లోని ఇందౌర్ లోహపు వ్యర్థాలతో అయోధ్య రామమందిరాన్ని నిర్మించారు కొందరు శిల్పకారులు. వివిధ రాష్ట్రాలకు చెందిన 20 మంది మూడు నెలల పాటు శ్రమించి.. ఇనుప స్తంభాలు, లోహపు వ్యర్థాలతో రామమందిర నమూనాను తయారు చేశారు. ఈ మందిరాన్ని 27 అడుగుల ఎత్తు, 40 అడుగుల వెడల్పుతో తీర్చిదిద్దారు. మొత్తం 20 టన్నుల ఇనుమును వాడినట్లు శిల్పకారులు తెలిపారు.
అయ్యప్ప భక్తుల కోసం 'అయ్యన్' యాప్
• అందుబాటులోకి తెచ్చిన కేరళ అటవీ శాఖ శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం కేరళ అటవీ శాఖ 'అయ్యన్' యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్అయ్యప్ప భక్తులు పలు సేవలను పొందవచ్చు. ఆన్లైన్, ఆఫ్లైన్ విధానంలో పనిచేసేలా దీన్ని పొందించారు. గూగుల్ ప్లేస్టోర్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంటుంది. శబరిమల ఆలయానికి వెళ్లే మార్గంలో సేవా కేంద్రాలు, హెల్త్ ఎమర్జెన్సీ వసతి సౌకర్యాలు, ఏనుగులు సంచరించే ప్రాంతాలు, ఫైర్ ఫోర్స్ పోలీస్ ఎయిడ్ పోస్ట్లు, తాగునీటి కేంద్రాల వివరాలను యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. అటవీ ఈ దాడి మార్గంలో నడిచి వెళ్తున్నప్పుడు ఏనుగులు, వన్యమృగాలు చేసినట్లయితే.. ఈ యాప్ను ఉపయోగించి వెంటనే అధికారుల సాయం పొందొచ్చని కేరళ అటవీ శాఖ అధికారులు తెలిపారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి