26, నవంబర్ 2023, ఆదివారం

1వ తేదీ నుంచి రైళ్ల రద్దు | హిందూపురం అర్బన్ | Cancellation of trains from 1st Hindupuram Urban

1 నుంచి రైళ్ల రద్దు 
హిందూపురం అర్బన్, నవంబరు  25: 
పుట్టపర్తి వద్ద ఉన్న టన్నెల్ మరమ్మతుల కారణంగా పలు రైళ్లను డిసెంబరు ఒకటో తేదీ నుంచి దాదాపు రెండు నెలలపాటు రద్దు చేస్తున్నామని సౌత్ వెస్ట్రన్ రైల్వే అధికారులు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కొన్ని రైళ్లను దారి మళ్లిస్తున్నామని తెలిపారు. ప్రయాణికులు గమనించి సహకరించాలని వారు కోరారు. హిందూపురం-గుంతకల్లు డెమో రైలు, కాచిగూడ-యలహం, లక్నో-యశ్వంతపురం, జబల్పూర్-యశ్వంతపురం, కోర్బాయశ్వంతపురం, కొంగో ఎక్సప్రెస్, దీన్ దయాల్-యశ్వంతపురం ఎక్స్ప్రెస్, సత్యసాయి ప్రశాంతి నిలయం సికింద్రాబాద్, ధర్మవరం - బెంగళూరు ప్యాసింజర్, సత్యసాయి ప్రశాంతి నిలయం-మచిలీపట్నం, గుంతకల్లు-హిందూపురం తదితర రైళ్లను రద్దు చేస్తున్నామని ప్రకటనలో పేర్కొన్నారు.
 

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు లేవు: