IB: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 995 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులు | IB: 995 Assistant Central Intelligence Officer Posts in Intelligence Bureau
IB: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 995 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులు
ఖాళీల వివరాలు:
* అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-2/ ఎగ్జిక్యూటివ్: 995 పోస్టులు (యూఆర్- 377, ఈడబ్ల్యూఎస్- 129, ఓబీసీ- 222, ఎస్సీ- 134, ఎస్టీ- 133)
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ లేదా తత్సమానం.
వయోపరిమితి: 15-12-2023 నాటికి 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.44,900-1,42,400.
ఎంపిక ప్రక్రియ: టైర్-1 రాత పరీక్ష, టైర్-2 పరీక్ష, టైర్-3/ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం: టైర్-1 రాత పరీక్ష ఆబ్జెక్టివ్, టైర్-2 పరీక్ష డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. టైర్-1 పరీక్షలో కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, రీజనింగ్/ లాజికల్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్ అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు. 100 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి ఒక గంట. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. టైర్-2 పరీక్షలో ఎస్సే, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్, ప్రెసిస్ రైటింగ్ ఉంటుంది. 50 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి ఒక గంట. 100 మార్కులతో టైర్-3/ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అనంతపురం, చీరాల, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్.
దరఖాస్తు రుసుము: రూ.550.
ముఖ్యమైన తేదీలు...
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తు ప్రారంభం: 25.11.2023.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15.12.2023.
దరఖాస్తు రుసుము చెల్లింపు చివరి తేదీ: 19.12.2023.
కామెంట్‌లు