డాక్టర్ కావాలంటే ఎంబీబీఎస్, బీడీఎస్ చదవాలి. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆయుష్ కోర్సులు చేసినా డాక్టర్ అయిపోవచ్చు. వీటికీ నీట్ ద్వారానే ప్రవేశాలు లభిస్తాయి. ఆయుష్ విభాగాలైన ఆయుర్వేదం, యునానీ, హోమియో, నేచురోపతి, సిద్ధ వైద్యాలు ఇప్పుడు అలోపతికి దీటుగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ప్రతి ఒక్కదానికీ ప్రత్యేకమైన విధానం ఉంది. అందరికీ ఆరోగ్యమే ప్రధాన లక్ష్యం. ఇంటర్మీడియట్‌ను బైపీసీ గ్రూప్‌తో పూర్తిచేసిన అభ్యర్థులు తమ ఆసక్తికి అనుగుణంగా ఈ కోర్సులనూ ఎంచుకోవచ్చు. వైద్యవిద్య వైపు సాగే లక్ష్యంతోనే చాలామంది ఇంటర్మీడియట్‌లో బైపీసీ గ్రూప్ తీసుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ, గౌరవం, ఆదాయం ఉన్నవాటిల్లో వైద్యవృత్తి ప్రధానమైనది. అందుకే వైద్యవిద్యకు పోటీ ఎక్కువ. వ్యయమూ అధికమే. ఇంటర్మీడియట్‌లో చేరినప్పటి నుంచే ప్రవేశ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని తీవ్రంగా పరిశ్రమిస్తుంటారు. వైద్యవిద్యలో ప్రధానమైన కోర్సులు ఎంబీబీఎస్, బీడీఎస్. ఎక్కువమంది వీటిపైనే దృష్టిపెడతారు. కానీ ఆధునిక వైద్యంతో పోటీపడుతూ ఎన్నో ఇతర వైద్య కోర్సులూ అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు వాటినీ పరిశ...
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యానం 3.00 గంటల నుండి సాయంత్రం 9.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు