హిందూపురం పట్టణ | విద్యా | ఉద్యోగ సమాచారం 19-05-2020

లాక్ డౌన్ కారణంగా హిందూపురంలో నిన్నటి రోజు ఉదయం సుమారుగా రెండు వందల మంది యుపి వాసులను వారి స్వస్థలాలకు చేర్చేందుకు విశ్వహిందూ పరిషత్ సభ్యులతో సహా చారు కీర్తి గారి అధ్యక్షతన స్వచ్ఛందంగా కార్యక్రమం నిర్వహించి వారికి అన్ని సౌకర్యాలతో వారి స్వస్థలాలకు పంపడం జరిగింది.

బీహార్ కు చెందిన 500మంది వలస కూలీలు నిన్నటి సాయంత్రం రైలులో వారి స్వస్థలమైన బీహార్ కు ప్రయాణమయ్యారు వారికి ప్రయాణంలో తినడానికి తనవంతుగా చపాతీలు ప్యాకెట్లను అక్కడి కాలనీ మహిళల సహాయంతో తయారు చేయించి శ్రీ సత్య సాయిబాబా సమితి సభ్యులకు అందించిన వైఎస్సార్సీపి నాయకులు మారుతి రెడ్డి. 

లాక్ డౌన్ మరియ ఇతర కారణాల వల్ల వాయిదా పడిన సి బి ఎస్ ఇ 10, 12వ తరగతి పరీక్షలు  జులై 1 వ తేదీ నుండి 15వ తేదీ వరకు జరుగుతాయి. 12వ తరగతికి విద్యార్థులకు జులై 1 న హోం సైన్స్, 2న హిందీ, 7న కంప్యూటర్ సైన్స్, 9న బిజినెస్ స్టడీస్, 10న బయో టెక్నాలజీ, 11న జియోగ్రఫీ, 13వ తేదీన సోషియాలజీ పరీక్షలుంటాయి.

డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఫిబ్రవరి/మార్చిలో నిర్వహించిన ఎం బీ బీ ఎస్ ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలను సోమవారం విడుదల చేసింది. మార్కుల రీటోటలింగ్ కోసం సబ్జెక్టుకు 2 వేల రూపాయలతో ఈ నెల 30 లోగా దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ మేజర్ భీమేశ్వర్ తెలిపారు.


వై ఎస్ ఆర్ వాహన మిత్ర పథకం ద్వారా, సొంతంగా ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ లున్న డ్రైవర్లకు ఆర్థిక సాయం జూన్ 4న సి ఎం వై ఎస్ జగన్ చేతుల మీదుగా ఆన్ లైన్ ద్వారా చెల్లింపులు చేయనున్నారు. ఈ ఏడాది మే 17 వరకు రవాణా శాఖలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ ల యజమానులే డ్రైవర్లు అయిన వారు ఈ పథకం కింద కొత్తగా దరఖాస్తులను ఈ నెల 18 నుండి 26వ తేదీలోగా గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో అందించాలి. జూన్1వ తేదీలోపు లబ్దిదారుల ఎంపిక పూర్తి చేస్తామన్నారు.

విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తూ మృతి చెందిన 108 అంబులెన్స్ డ్రైవర్ నవీన్ బాబు కుటుంబానికి 108 ఉద్యోగుల సంఘ సభ్యులు 5 లక్షల 75 వేల రూపాయల ఆర్థిక సాయం చేశారు.

మారిన 10వ తరగతి తెలుగు ప్రశ్న పత్రానికి ప్రిపరేషన్ అలాగే ప్రశ్నపత్రంలో ఉండే వివరాలను దిన పత్రికల ద్వారా సేకరించిన సమాచారాన్ని స్పీడ్ జాబ్  అలర్ట్స్ . బ్లాగ్ స్పాట్  . కామ్ లో చూడొచ్చు.

వ్రాత పరీక్ష ద్వారా స్వామి వివేకానంద నేషనల్ ఇన్ స్టిట్యూట్ లో ఉద్యోగాలు 
మొత్తం ఖాళీలు 9
దరఖాస్తుకు చివరి తేది జులై 7
విభాగాల  వారీగా
ఆడిట్ ఆఫీసర్ 1
స్టాఫ్ నర్స్5
మహిళా హాస్టల్ వార్డెన్  1
జూనియర్ అసిస్టెంట్ 2
అర్హత
ఆడిట్ ఆఫీసర్ - బి కాం తో పాటు అకౌంటింగ్ లో అనుభవం ఉండాలి
స్టాఫ్ నర్స్ - బి ఎస్సి నర్సింగ్ లేదా డిప్లొమా లో జనరల్ నర్సింగ్ మరియు స్టేట్ నర్సింగ్  కౌన్సిల్ లో మిడ్ వైఫరీగా రిజిస్టర్ అయి, అనుభవం ఉండాలి
మహిళా  హాస్టల్ వార్డెన్ - 1st క్లాస్ లేదా హైయర్ 2nd క్లాస్ లో గ్రాడ్యుయేట్ అయుండాలి
జూనియర్ అసిస్టెంట్ - గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి అనుభవం ఉండాలి.
వయసుః
ఆడిట్ ఆఫీసర్ 35
సిబ్బంది నర్స్ 30
మహిళా హాస్టల్ వార్డెన్  35 నుండి 40
జూనియర్ అసిస్టెంట్ 40
http://www.svnirtar.nic.in/


వ్రాత పరీక్శ ఇంటర్వ్యూ ఆధారంగా హెచ్‌పీసీఎల్ లోఉద్యోగాలు
విభాగాలు - ఇంజినీర్, ఫైనాన్, లీగల్
ఖాళీలు - 71
అర్హత -  ఉద్యోగాన్ని బట్టి ఇంజినీర్ కు డిగ్రీ లేదా బి టెక్, ఫైనాన్స్ కు సి ఎ లేదా ఎం బి ఎ లీగల్ కు పి జి లేదా లా
వయసు - 35
దరఖాస్తుకు చివరి తేది మే 31
https://hrrl.in/

ఆంధ్రప్రదేశ్ హై కోర్టులో ఉద్యోగాలు దరఖాస్తుకు చివరి తేది మే 26
మొత్తం ఖాళీలు 12
ఉద్యోగాలు - సిస్టమ్ ఆఫీసర్, సిస్టమ్ అసిస్స్టెంట్
విద్యార్హత - డిప్లొమా, ఐ టి ఐ, బి ఎస్సి, బి టెక్, సంబంధిత సబ్జెక్టుల్లో పి జి
hc.ap.gov.in



ఆన్ లైన్ అప్లికేషన్ సేవలు ఇంటి వద్దనుండే పొందండి ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | అప్లికేషన్ ఆన్ లైన్ ద్వారా చేయించాలనుకునే వారు మతో మాట్లాడి గూగుల్ పే/ఫోన్ పే ద్వారా గాని రూ.100/-లను 9640006015 కు చెల్లించి, సేవలను పొందచ్చు. దీని కోసం వ్యక్తి కి వాట్సాప్ ఛాటింగ్ ద్వారా మేము పంపే ప్రశ్నలకు సమాధానాలు పంపూతూ ఉంటే చాలు, అప్లికేషన్ ను సబ్మిట్ చేసే ముందు మేము పంపే స్ర్కీన్ షాట్ లను సరిచూసుకుని, అన్ని సరిపోయాయంటే అప్లికేషన్ ను ఫైనల్ సబ్మిట్ చేస్తాము.
అయితే నిర్ణీత అప్లికేషన్ ఫీజును చెల్లించుటకు మాత్రం మీ ATM ఉండాల్సిందే (మా వద్ద ATM లేదు) మా ఫోన్ నెంబరు 9640006015.




 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

AP KGBV Non-Teaching Recruitment 2024 Notification Overview కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్ కుక్ పోస్టులు 48, అసిస్టెంట్ కుక్ 263, నైట్ వాచ్మెన్ 95, పారిశుధ్య కార్మికులు 78, స్వీపర్లు 63 టైప్ 1, 2, 3 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నా మని తెలిపారు. టైప్-4 కేజీబీవీల్లో హెడ్కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, అటెండర్ 58 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.