1, ఆగస్టు 2024, గురువారం

AP Open School Admissions: ఏపీ ఓపెన్‌ స్కూల్‌ అడ్మిషన్లు.. SSC, ఇంటర్ ప్రవేశాలకు ఆగస్టు 27వరకు గడువు

AP Open School Admissions: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఓపెన్ స్కూల్‌లో ప‌దో త‌ర‌గ‌తి, ఇంటర్మీడియ‌ట్ అడ్మిష‌న్ నోటిఫికేష‌న్‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ విడుద‌ల చేసింది.

 ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఓపెన్ స్కూల్‌లో ప‌దో త‌ర‌గ‌తి, ఇంటర్మీడియ‌ట్ అడ్మిష‌న్ నోటిఫికేష‌న్‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ విడుద‌ల చేసింది. ద‌ర‌ఖాస్తు దాఖ‌ల‌కు చేసేందుకు ఆగ‌స్టు 27 వ‌ర‌కు గ‌డువును నిర్ణ‌యించింది. రూ.200 అప‌రాధ రుసుముతో సెప్టెంబ‌ర్ 4 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్న‌ట్లు ఏపీ ఓపెన్ స్కూల్స్ డైరెక్ట‌ర్ కే. నాగేశ్వ‌ర‌రావు తెలిపారు. ఆన్‌లైన్‌లోనే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. అధికారిక వెబ్‌సైట్ https://apopenschool.ap.gov.in/ లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.


ప‌దో త‌ర‌గ‌తి రిజిస్ట్రేష‌న్ ఫీజు రూ.100 చెల్లించాలి. అడ్మిష‌న్ ఫీజుః జ‌న‌ర‌ల్ కేట‌గిరీ పురుషుల‌కు రూ.1,300 ఉంటుంది. మ‌హిళ‌లు, ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మైన‌ర్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండ‌ర్స్‌, ఎక్స్‌స‌ర్వీస్ మెన్‌ల‌కు రూ.900 ఉంటుంది. ప‌రీక్ష ఫీజుః ప్ర‌తి స‌బ్జెక్టుకు రూ.100 ఉంటుంది. దివ్యాంగు విద్యార్థులుకు ప‌రీక్ష ఫీజు రాయితీ ఉంటుంది.

వ‌యో ప‌రిమితిః 2024 ఆగ‌స్టు 31 నాటికి 14 ఏళ్లు నిండి ఉండాలి. గ‌రిష్ఠ వ‌యో ప‌రిమితి లేదు. రాయ‌డం, చ‌ద‌వ‌డం వంటి ప‌రిజ్ఞానం క‌లిగి ఉండి, ఎటువంటి విద్యార్హ‌త లేన‌ప్ప‌టికీ ఓపెన్ స్కూల్‌లో ప‌దో త‌ర‌గ‌తి చేయొచ్చు.

బోధ‌నా మాధ్యమంః తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ, ఒరియా మాధ్యామాల్లో ఒక దాన్ని ఎంపిక చేసుకోవ‌చ్చు.

స‌బ్జెక్టుల ఎంపికః ఐదు స‌బ్జెక్టులు ఎంపిక చేసుకోవాలి. అవ‌స‌రాన్ని బ‌ట్టీ అద‌న‌పు స‌బ్జెక్టుల‌ను కూడా తీసుకోవ‌చ్చు. ఆరో స‌బ్జెక్టుగా ప్ర‌వేశ స‌మ‌యంలోనే ఎంపిక చేసుకోవ‌చ్చు.

కోర్సు కాల వ్య‌వ‌ధిః ఏడాది. అయితే ప్ర‌వేశం పొందిన తరువాత ఐదేళ్ల‌లో తొమ్మిది సార్లు మాత్ర‌మే ప‌రీక్ష‌లు రాసే అవ‌కాశం ఉంటుంది. అంటే ఐదేళ్ల‌లోపు ఉత్తీర్ణ‌త సాధించాల్సి ఉంటుంది.

ఇంట‌ర్మీడియ‌ట్‌
రిజిస్ట్రేష‌న్‌ రూ.200 చెల్లించాలి. అడ్మిష‌న్ ఫీజుః జ‌న‌ర‌ల్ కేట‌గిరీ పురుషుల‌కు రూ.1,400 ఉంటుంది. మ‌హిళ‌లు, ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మైన‌ర్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండ‌ర్స్‌, ఎక్స్‌స‌ర్వీస్ మెన్‌ల‌కు రూ.1,100 ఉంటుంది. ప‌రీక్ష ఫీజుః ప్ర‌తి స‌బ్జెక్టుకు రూ.150 ఉంటుంది. ప్రాక్టిక‌ల్స్ ఉండే స‌బ్జెక్టుల‌కు అద‌నంగా రూ.100 ఉంటుంది. దివ్యాంగు విద్యార్థులుకు ప‌రీక్ష ఫీజు రాయితీ ఉంటుంది.

అర్హ‌తః ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త సాధించాలి.

వ‌యో ప‌రిమితిః 2024 ఆగ‌స్టు 31 నాటికి 15 ఏళ్లు నిండి ఉండాలి. గ‌రిష్ఠ వ‌యో ప‌రిమితి లేదు.

బోధ‌నా మాధ్యమంః తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ మాధ్యామాల్లో ఒక దాన్ని ఎంపిక చేసుకోవ‌చ్చు.

స‌బ్జెక్టుల ఎంపికః ఇంగ్లీష్ త‌ప్ప‌ని స‌రి. సైన్స్ గ్రూప్ ఎంపిక చేసుకునేవారు ప‌దో త‌ర‌గ‌తిలో గ‌ణితం, జ‌న‌ర‌ల్ స‌బ్జెక్టుల‌ను చ‌ద‌వాలి. గ్రూపుల లిస్టు నుండి ఏవైన ఐదు స‌బ్జెక్టులు ఎంపిక చేసుకోవ‌చ్చు. అవ‌స‌రాన్ని బ‌ట్టీ అద‌న‌పు స‌బ్జెక్టుల‌ను కూడా తీసుకోవ‌చ్చు. ఆరో స‌బ్జెక్టుగా ప్ర‌వేశ స‌మ‌యంలోనే ఎంపిక చేసుకోవ‌చ్చు.

కోర్సు కాల వ్య‌వ‌ధిః రెండేళ్లు ఉంటుంది. అయితే ప్ర‌వేశం పొందిన తరువాత ఐదేళ్ల‌లో తొమ్మిది సార్లు మాత్ర‌మే ప‌రీక్ష‌లు రాసే అవ‌కాశం ఉంటుంది. అంటే ఐదేళ్ల‌లోపు ఉత్తీర్ణ‌త సాధించాల్సి ఉంటుంది.


-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

కామెంట్‌లు లేవు: