9, జులై 2020, గురువారం

No Exam Tirupathi Jobs 2020 Telugu | తిరుపతి లో ఉద్యోగాల భర్తీ మిస్ కాకండి.

తిరుపతి లో వివిధ ఉద్యోగాల భర్తీ మిస్ కాకండి:

గవర్నమెంట్ అఫ్ ఆంధ్రప్రదేశ్, తిరుపతి, చిత్తూరు జిల్లా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు బేసిస్ పద్ధతి ద్వారా మరియు అవుట్ సోర్సింగ్ పద్ధతి ద్వారా నింపడం జరుగుతుంది. No Exam Tirupathi Jobs 2020 Telugu

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ15.7.2020

మొత్తం ఖాళీలు:

అన్ని విభాగాలలో కలిపి మొత్తం200

విభాగాల వారీగా ఖాళీలు:

స్టాఫ్ నర్స్172
ల్యాబ్ టెక్నీషియన్5
చైల్డ్ సైకోలాజిస్ట్1
రిసెప్షనిస్ట్ కమ్ క్లర్క్3
రేడియోలాజికల్ ఫిజిసిస్ట్2
ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్7

అర్హతలు:

1.స్టాఫ్ నర్స్

జనరల్ నర్సింగ్ లో ఇంటర్మీడియట్ తో పాటు డిప్లొమా చేసి ఉండాలి. నర్సింగ్ కౌన్సిల్ అఫ్ ఇండియా స్థాపించినటువంటి సంస్థ నుండి M.sc లేదా B.sc నర్సింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి  మరియు కంప్యూటర్ అవగాహ ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.

2.ల్యాబ్ టెక్నీషియన్

1.ఇంటర్ తరువాత ఒక సంవత్సరం L.T కోర్స్ చేసి ఉండాలి.(లేదా)

2. SSC తరువాత డిప్లొమా లో రెండు సంవత్సరం లు మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ చేసి ఉండాలి.(లేదా)

3. B.Sc విత్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ చేసి. (లేదా)

4. NIMS హైదరాబాద్ జారీ చేసినటువంటి MLT మరియు PG, డిప్లొమా విభాగం లో b.sc, b.zc, లైఫ్ సైన్స్ లో మొదటి స్థానం లో పాస్ అయి ఉండాలి (లేదా)

5. UGC చేత గుర్తించబడిన ఏదైనా విశ్వ విద్యాలయం నుండి క్లినికల్ బయో కెమిస్ట్రీ కోర్స్ లో PG, diploma చేసి ఉండాలి. (లేదా)

6. NIMS హైదరాబాద్ జారీ డిప్లొమా ఇన్ట్రాఫ్యూజన్ మెడికల్ టెక్నాలజీ కోర్స్ చేసి ఉండాలి. (లేదా)

7. ఒక సంవత్సరం క్లినికల్ శిక్షణతో MLT లో ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్స్ చేసి ఉండాలి. (మరియు)

8. పైన చెపిన అన్ని కోర్స్ లు కచ్చితంగా ap పారామెడికల్ బోర్డు లో నుండి రిజిస్టర్ అయి ఉండాలి.తప్పనిసరిగా కంప్యూటర్ పైన అవగాహనా ఉండాలి

3.చైల్డ్ సైకాలజిస్ట్

ఏదైనా విశ్వవిద్యాలయం నుండి సైకాలజీ పైన పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి.

4.రిసెప్షనిస్ట్ కమ్ క్లర్క్

ఏదైనా గ్రాడ్యుయేషన్ అలాగే కంప్యూటర్ అప్లికేషన్స్ పైన పిజి డిప్లొమా చేసి ఉండాలి.

5.రేడియోలాజికల్ ఫిజిసిస్ట్

1.ఖచ్చితంగా మొదటి స్థానం లో ఫిజిక్స్ విభాగం లో m.sc డిగ్రీ చేసి ఉండాలి.
2.బాబా అణు పరిశోధన కేంద్రం నుండి హాస్పిటల్ ఫిజిక్స్ మరియు రేడియోలాజికల్ ఫిజిక్స్ తో ఒక సంవత్సరం పోస్ట్ గ్రాడ్యుయేట్ శిక్షణ కోర్స్ లో ఉత్తీర్ణులై ఉండాలి.

6.ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్

Ssc పాస్ అయి ఉండాలి లేదా సమానమైన అర్హత ఉండాలి తప్పనిసరిగా ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ ఉండి ఉండాలి.

వయసు:

దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల యొక్క వయసు 42 సంవత్సరాలు నిండి ఉండకూడదు. Sc, st, bc వాళ్ళకి 5 సంవత్సరం లు ఏజ్ రిలాక్సేషన్ ఉంది.

జీతం:

అన్ని విభాగాలకు కలిపి జీతం నెలకి 14250 నుండి 49520 వరకు ఇవ్వడం జరుగుతుంది.

ఎలా ఎంపిక చేస్తారు:

అభ్యర్థుల యొక్క మెరిట్ ఆధారంగా మరియు రిజర్వేషన్ ని బట్టి చిత్తూరు జిల్లాకి చెందిన జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, హాస్పిటల్ సూపరింటెండెంట్, DM గారు అభ్యర్థుల ని ఎంపిక చేయడం జరుగుతుంది.

ఎలా అప్లై చేయాలి:

దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు వారి అధికారిక వెబ్సైటు www.svmctpt.edu.in లేదా www.chittoor.ap.gov.in లోకి వెళ్లి అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా నింపి పోస్ట్ ద్వారా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారి ఆఫీస్ కి పంపించాలి.

చేయవలసిన పని ఏమిటి:

చిత్తూరు జిల్లా లోని తిరుపతి గవర్నమెంట్ హాస్పిటల్ లో 6 విభాగాలకు చెందిన ఉద్యోగాల్లో మీకు వచ్చిన ఉద్యోగం చేయవలసి ఉంటుంది.

మరింత పూర్తి వివరాల కోసం కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ ని పూర్తిగా చదవండి.

Website

website 2

Notification 

కామెంట్‌లు లేవు: