Ayush Recruitment 2021 | కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా ఖాళీలను భర్తీ చేసేందుకు దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఈ జాబ్ నోటిఫికేషన్ (Job Notification) వివరాలు తెలుసుకోండి.
కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. సెంట్రల్ ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ యూనిట్ (CPMU) కోసం కాంట్రాక్ట్ పద్ధతిలో పలు ఖాళీలను భర్తీ
చేస్తోంది. మొత్తం 7 ఖాళీలున్నాయి. సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్, జూనియర్
ప్రోగ్రామ్ మేనేజర్, ప్రోగ్రామ్ మేనేజర్, డేటా అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్
స్టాఫ్ లాంటి పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు ప్రస్తుతం
దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 నవంబర్ 10 చివరి
తేదీ. అభ్యర్థులు ఆఫ్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేయాలి. అంటే అభ్యర్థులు
దరఖాస్తుల్ని పోస్టులో పంపాల్సి ఉంటుంది. ఈ జాబ్ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, విద్యార్హతలు, ఇతర వివరాలు తెలుసుకోండి.
Ayush Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...
మొత్తం ఖాళీలు | 7 | విద్యార్హతలు | వేతనం |
సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ (టెక్నికల్) | 1 | ఆయుర్వేద, సిద్ధ, యునానీ, హోమియోపతిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ | రూ.75,000 |
జూనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ (టెక్నికల్) | 2 | ఆయుర్వేద, సిద్ధ, యునానీ, హోమియోపతిలో గ్రాడ్యుయేషన్ | రూ.50,000 |
ప్రోగ్రామ్ మేనేజర్ (అడ్మినిస్ట్రేటీవ్) | 2 | ఎంబీఏ (హెచ్ఆర్, ఫారిన్ ట్రేడ్, టూరిజం, ఇంటర్నేషనల్ బిజినెస్) | రూ.50,000 |
డేటా అసిస్టెంట్ | 1 | కంప్యూటర్ అప్లికేషన్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ | రూ.20,000 |
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) | 1 | 10+2 లేదా తత్సమా అర్హత | రూ.16,000 |
Gemini Internet
Ayush Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 నవంబర్ 10 సాయంత్రం 5.30 గంటలుకాంట్రాక్ట్ గడువు- 2022 మార్చి 31 వరకు
విద్యార్హతలు- సంబంధిత సబ్జెక్ట్‌లో డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ కావాలి.
అనుభవం- రాష్ట్ర ప్రభుత్వాలు, రీసెర్చ్ కౌన్సిల్, ప్రభుత్వరంగ సంస్థల్లో మూడేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి.
వయస్సు- 50 ఏళ్ల లోపు
ఎంపిక విధానం- రాతపరీక్ష లేదా ఇంటర్వ్యూ
ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫామ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Ayush Recruitment 2021: అప్లై చేయండి ఇలా
Step 1- అభ్యర్థులు ఆయుష్ మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేయాలి.Step 2- అభ్యర్థి తన వివరాలతో అప్లికేషన్ ఫామ్ పూర్తి చేయాలి.
Step 3- దరఖాస్తు ఫామ్‌కు అవసరమైన డాక్యుమెంట్స్ జత చేయాలి.
Step 4- అప్లికేషన్‌ను నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు పంపాలి.
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
Assistant Advisor (SK),
Champion Services Sector Scheme,
Room No. 8, AYUSH Bhawan,
B Block, GPO Complex,
INA, New Delhi – 110023.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి