2, నవంబర్ 2021, మంగళవారం

AP EAPCET: ఇంజనీరింగ్, ఫార్మసీలో సీట్లు వివరాలు

ఏపీఈఏపీ సెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశానికి వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ ఈ రోజు (నవంబర్‌ 2న) ప్రారంభం అయింది. 

Gemini Internet

వెబ్ కౌన్సెలింగ్కు కాలేజీల్లోని కోర్సులవారీగా సీట్ల సంఖ్యను ప్రభుత్వం నవంబర్ 1న ఖరారు చేసింది. ఈ మేరకు వేర్వేరు జీవోలను ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్చంద్ర విడుదల చేశారు. తొలిసారిగా యూనివర్సిటీల కాలేజీలు, ప్రైవేటు అన్ ఎయిడెడ్ కాలేజీలతో పాటు ప్రైవేటు యూనివర్సిటీల్లోని 35 శాతం సీట్లు కూడా కనీ్వనర్ కోటా కింద భర్తీ చేస్తున్నారు. 2021–22 విద్యా సంవత్సరంలో తొలి విడత కౌన్సెలింగ్కు 1,45,421 ఇంజనీరింగ్, ఫార్మసీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో అత్యధికం కంప్యూటర్ సైన్సు విభాగంలో ఉన్నాయి. ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ (ఈసీఈ), మెకానికల్, కెమికల్, సివిల్ వంటి కోర్ సబ్జెక్టులకు సంబంధించినవి ఉన్నాయి. ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సులకు సంబంధించి మొత్తం 435 కాలేజీలు ఈసారి కౌన్సెలింగ్లో ఉన్నాయి.

నవంబర్ 2 నుంచి వెబ్ ఆప్షన్లు

వెబ్ ఆప్షన్ల ప్రక్రియ నవంబర్ 2 నుంచి ప్రారంభం కానుంది. నవంబర్ 5వ తేదీ వరకు ఆప్షన్లను నమోదు చేయవచ్చు. నవంబర్ 6వ తేదీన మార్పులు చేసుకోవచ్చు. నవంబర్ 10వ తేదీన తొలి విడత సీట్లు కేటాయిస్తారు. సీట్లు పొందిన విద్యార్ధులు ఆన్ లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడంతో పాటు సంబంధిత కాలేజీల్లో నవంబర్ 15వ తేదీలోపు చేరాలి. అదే రోజు నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.

యూనివర్సిటీ కాలేజీల్లోని ఇంజనీరింగ్‌ సీట్లు

5,901

ప్రైవేటు కాలేజీల్లోని ఇంజనీరింగ్‌ సీట్లు

1,24,577

ప్రైవేటు వర్సిటీల్లో ఇంజనీరింగ్‌ సీట్లు

2,118

యూనివర్సిటీ కాలేజీల్లో ఫార్మసీ సీట్లు

600

ప్రైవేటు కాలేజీల్లోని ఫార్మసీ సీట్లు

12,225

 

కామెంట్‌లు లేవు: