3, నవంబర్ 2021, బుధవారం

IOCL Recruitment 2021: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 1968 పోస్టులు

Gemini Internet

IOCL Recruitment 2021 | ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) పలు రిఫైనరీల్లో 1968 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. జాబ్ నోటిఫికేషన్ (Job Notification) వివరాలు తెలుసుకోండి.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) పలు ఖాళీల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న రిఫైనరీల్లో అప్రెంటీస్ పోస్టుల్ని (Apprentice Posts) భర్తీ చేస్తోంది. మొత్తం 1968 ఖాళీలు ఉన్నాయి. ఫిట్టర్, మెకానికల్, డేటాఎంట్రీ ఆపరేటర్, అకౌంటెంట్ లాంటి పోస్టులున్నాయి. సంబంధిత ట్రేడ్లో ఐటీఐ, డిప్లొమా లాంటి కోర్సులు పూర్తి చేసినవారు పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. పోస్టులకు ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 నవంబర్ 12 చివరి తేదీ. పోస్టులకు రాతపరీక్ష ద్వారా ఎంపిక చేయనుంది ఐఓసీఎల్. నవంబర్ 21 రాతపరీక్ష ఉంటుంది. ఖాళీల వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.

IOCL Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...

 

 మొత్తం ఖాళీలు

 1968

 విద్యార్హతలు

 ట్రేడ్ అప్రెంటీస్ (అటెండెంట్ ఆపరేటర్)

 488

మూడేళ్ల బీఎస్సీ (ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ) పాస్ కావాలి.

 ట్రేడ్ అప్రెంటీస్ (ఫిట్టర్)

 205

ఫిట్టర్ ట్రేడ్లో ఐటీఐ

 ట్రేడ్ అప్రెంటీస్ (కెమికల్)

 362

మూడేళ్ల బీఎస్సీ (ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ)

 ట్రేడ్ అప్రెంటీస్ (బాయిలర్, మెకానికల్)

 80

మూడేళ్ల డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్, రిఫైనరీ అండ్ పెట్రో కెమికల్ ఇంజనీరింగ్

 ట్రేడ్ అప్రెంటీస్ (మెకానికల్)

 236

మూడేళ్ల డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్

 ట్రేడ్ అప్రెంటీస్ (ఇన్స్ట్రుమెంటేషన్)

 117

మూడేళ్ల డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెటేషన్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్

 ట్రేడ్ అప్రెంటీస్ (సెక్రెటేరియల్ అసిస్టెంట్)

 69

బీఏ, బీఎస్సీ, బీకామ్

 ట్రేడ్ అప్రెంటీస్ (అకౌంటెంట్)

 32

బీకామ్

 ట్రేడ్ అప్రెంటీస్ (డేటా ఎంట్రీ ఆపరేటర్)

 53

12 తరగతి లేదా ఇంటర్మీడియట్

ట్రేడ్ అప్రెంటీస్ (డేటా ఎంట్రీ ఆపరేటర్, స్కిల్ సర్టిఫికెట్ హోల్డర్)

 41

12 తరగతి లేదా ఇంటర్మీడియట్తో పాటు డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్లో స్కిల్ సర్టిఫికెట్ ఉండాలి

 ట్రేడ్ అప్రెంటీస్ (ఎలక్ట్రికల్)

 285

మూడేళ్ల డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్

IOCL Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన తేదీలు 

దరఖాస్తు ప్రారంభం- 2021 అక్టోబర్ 22  

దరఖాస్తుకు చివరి తేదీ- 2021 నవంబర్ 12
అడ్మిట్ కార్డుల డౌన్లోడ్- 2021 నవంబర్ 16 నుంచి 20
రాతపరీక్ష- 2021 నవంబర్ 21
రాతపరీక్ష ఫలితాల విడుదల- 2021 డిసెంబర్ 4
డాక్యుమెంట్ వెరిఫికేషన్- 2021 డిసెంబర్ 13 నుంచి 20

IOCL Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు

విద్యార్హతలు- సంబంధిత ట్రేడ్లో ఐటీఐ పాస్ కావాలి.
వయస్సు- 2021 అక్టోబర్ 31 నాటికి 18 నుంచి 24 ఏళ్లు
జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

IOCL Recruitment 2021: అప్లై చేయండి ఇలా

Step 1- అభ్యర్థులు ముందుగా https://iocl.com/apprenticeships వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
Step 2- Click here to Apply Online
పైన క్లిక్ చేయాలి.
Step 3-
కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
Step 4-
అందులో అభ్యర్థులు ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్తో రిజిస్ట్రేషన్ చేయాలి.
Step 5-
ఫోటో, సంతకం అప్లోడ్ చేయాలి.
Step 6-
అభ్యర్థి పూర్తి వివరాలు ఎంటర్ చేయాలి.
Step 7-
దరఖాస్తు ఫామ్ సబ్మిట్ చేసి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసి భద్రపర్చుకోవాలి.

 

కామెంట్‌లు లేవు: