Gemini Internet సర్టిఫికెట్ సమర్పించండిలా..
* ఎస్‌బీఐ పెన్షన్ సేవా పోర్టల్‌ను సందర్శించండి.
* లైఫ్ సర్టిఫికెట్ సమర్పించే ప్రక్రియను ప్రారంభించడానికి ‘వీడియో ఎల్‌సీ’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
* మీ ఎస్‌బీఐ పెన్షన్ ఖాతా నంబర్‌ను నమోదు చేయండి.
* అనంతరం మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయండి.
* నిబంధనలు, షరతులు చదివి అంగీకారం తెలిపి ‘స్టార్ట్ జర్నీ’పై క్లిక్ చేయండి.
* మీ ఒరిజినల్ పాన్ కార్డ్‌ను చేతిలో ఉంచుకుని ‘ఐ ఆమ్ రెడీ’పై క్లిక్‌చేయండి.
* వీడియో కాల్ ప్రారంభించడానికి మీరు అనుమతిచ్చిన తర్వాత ఎస్‌బీఐ అధికారి అందుబాటులోకి వచ్చి మీతో సంభాషిస్తారు.
* వీడియో కాల్‌లోకి
వచ్చిన ఎస్‌బీఐ అధికారి మీ స్క్రీన్‌పై ఉన్న నాలుగంకెల ధ్రువీకరణ కోడ్‌ను
చదవాలని అడుగుతారు. మీరు ఆ కోడ్‌ను చెప్పాల్సి ఉంటుంది.
* మీ పాన్ కార్డును
బ్యాంక్ అధికారికి చూపించి, దాన్ని ఫొటో తీసుకోవడానికి అనుమతివ్వాలి.
అనంతరం ఎస్‌బీఐ అధికారి మీ ఫొటోను తీసుకుంటారు.
* ఇంతటితో వీడియో లైఫ్ సర్టిఫికెట్ (వీఎల్‌సీ) ప్రక్రియ పూర్తవుతుంది.
* ఒకవేళ ఏ కారణంతోనైనా వీడియో లైఫ్ సర్టిఫికేట్ ప్రక్రియ తిరస్కరణకు గురైతే ఎస్సెమ్మెస్ ద్వారా ఆ విషయాన్ని బ్యాంకు మీకు తెలియజేస్తుంది. ప్రత్యామ్నాయంగా మీకు పెన్షన్ చెల్లించే బ్యాంక్ శాఖను సందర్శించి లైఫ్ సర్టిఫికెట్‌ను అందజేయొచ్చు.
ఈ క్రింది విధంగా వెబ్ సైట్ ప్రారంభమవుతుంది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి