APPSC Group 1&2 Notification: 597 పోస్ట్‌లు.. సిలబస్‌పై పట్టు.. కొలువుకు మెట్టు
- త్వరలో గ్రూప్–1, 2 పోస్ట్‌ల భర్తీకి సన్నాహాలు
- రెండు కేటగిరీల్లో కలిపి మొత్తం 597 పోస్ట్‌లకు ఆమోదం
- డిగ్రీ ఉత్తీర్ణతతో గ్రూప్స్‌కు పోటీ పడే అర్హత
- విశ్లేషణాత్మక అధ్యయనంతోనే సక్సెస్‌కు మార్గం
గత నాలుగేళ్లుగా నిరంతరం ఏదో ఒక నోటిఫికేషన్‌తో ఉద్యోగార్థులను పలకరిస్తున్న ఏపీపీఎస్సీ.. తాజాగా గ్రూప్స్ అభ్యర్థులకు ఆనందం కలిగించే కబురు చెప్పింది. మరికొద్ది రోజుల్లోనే గ్రూప్–1, గ్రూప్–2 పోస్ట్‌ల భర్తీకి సన్నాహాలు ప్రారంభిస్తామని కమిషన్ వర్గాలు పేర్కొన్నాయి.
మొత్తం 597 పోస్ట్‌లు
ఏపీ ప్రభుత్వం ఆమోదించిన ప్రకారం–త్వరలో విడుదల చేయనున్న గ్రూప్–1,
గ్రూప్–2 నోటిఫికేషన్ల ద్వారా మొత్తం 597 పోస్ట్‌లు భర్తీ చేయనున్నారు.
గ్రూప్–1లో డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ, సీటీఓ తదితర 89 ఉన్నత స్థాయి
పోస్ట్‌లు.. గ్రూప్–2లో డిప్యూటీ తహశీల్దార్, ఎక్సైజ్ సబ్
ఇన్స్పెక్టర్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్–3 వంటి 508 పోస్ట్‌ల భర్తీకి
నోటిఫికేషన్ వెలువడనుంది.
సిలబస్‌పై అవగాహన
- మరికొద్ది రోజుల్లోనే ఏపీపీఎస్సీ గ్రూప్–1, గ్రూప్–2 నోటిఫికేషన్లు రావడం ఖాయమని స్పష్టమైంది. కాబట్టి ప్రిపరేషన్‌కు ఉపక్రమించే ముందు అభ్యర్థులు సిలబస్‌పై సంపూర్ణ అవగాహన ఏర్పరచుకోవాలి. తాము పోటీ పడదలచుకుంటున్న పరీక్షకు సంబంధించిన సిలబస్‌ను లోతుగా పరిశీలించాలి. గత ప్రశ్న పత్రాలను అధ్యయనం చేయాలి. ఆ తర్వాత ప్రిపరేషన్ ప్రణాళిక రూపొందించుకోవాలి.
- ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ విధానంలో నిర్వహించే గ్రూప్–1ను లక్ష్యంగా చేసుకునే అభ్యర్థులు మరింత పటిష్ట ప్రణాళికతో ముందుకు సాగాలి. ముందుగా ప్రిలిమ్స్, మెయిన్ సిలబస్‌ను పూర్తిగా అవగాహన చేసుకోవాలి. ఆ తర్వాత ఆయా అంశాలకు కల్పిస్తున్న వెయిటేజీని గమనించాలి. దీనికి అనుగుణంగా ప్రామాణిక పుస్తకాలను ఎంపిక చేసుకొని దీర్ఘకాలిక ప్రిపరేషన్ ప్రారంభించాలి.
మూడు దశల్లో గ్రూప్ 1
- గ్రూప్–1 ఎంపిక ప్రక్రియలో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఉంటాయి. ప్రిలిమ్స్ రెండు పేపర్లుగా ఉంటుంది. ప్రతి పేపర్లో 120 ప్రశ్నలు–120 మార్కులు చొప్పున మొత్తం 240 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ప్రతి పేపర్‌కు పరీక్ష సమయం రెండు గంటలు. ప్రిలిమ్స్‌లో అర్హత పొందిన వారిని మెయిన్‌కు అనుమతిస్తారు. మెయిన్ పరీక్ష పూర్తిగా డిస్క్రిప్టివ్ విధానంలో అయిదు పేపర్లుగా 750 మార్కులకు నిర్వహిస్తారు.మెయిన్‌లో పొందిన మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో చివరి దశ పర్సనల్ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూకు 75 మార్కులు ఉంటాయి. మెయిన్, ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
గ్రూప్ 2 ఇలా
గ్రూప్–2 పరీక్షను రెండు దశలుగా(స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ ఎగ్జామ్)
నిర్వహిస్తారు. పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష జరుగుతుంది. మొదటి
దశ స్క్రీనింగ్ టెస్ట్ 150 మార్కులకు ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్‌లో
అర్హత సాధించిన వారికి 1:50 నిష్పత్తిలో రెండో దశ మెయిన్ ఎగ్జామినేషన్‌కు
ఎంపిక చేస్తారు. మెయిన్‌లో ఒక్కో పేపర్‌కు 150 మార్కుల చొప్పున రెండు
పేపర్లు ఉంటాయి. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో బహుళైచ్ఛిక
ప్రశ్నలతో ఉంటుంది.
సమన్వయం అవసరం
- గ్రూప్–1, గ్రూప్–2 సిలబస్‌లో దాదాపు 80 శాతం ఉమ్మడి అంశాలే! కాబట్టి అభ్యర్థులు గ్రూప్–1 ఓరియెంటేషన్‌తో, డిస్క్రిప్టివ్ అప్రోచ్‌తో ప్రిపరేషన్ సాగిస్తే... గ్రూప్–2 సిలబస్‌పైనా పట్టు లభించే అవకాశం ఉంది. ఆయా టాపిక్‌లను చదివేటప్పుడు కోర్ సబ్జెక్ట్‌ను విస్తృతంగా అన్ని కోణాల్లో చదువుతూ.. సమకాలీన పరిణామాలతో సమన్వయం చేసుకోవాలి. తద్వారా ఏకకాలంలో గ్రూప్ 1, గ్రూప్ 2ల్లో రాణించేందుకు వీలవుతుంది.
విశ్లేషణాత్మక అధ్యయనం
గ్రూప్స్ అభ్యర్థులు విశ్లేషణాత్మక అధ్యయనానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
ప్రిలిమ్స్ నుంచే ఆయా అంశాలను విశ్లేషించుకుంటూ చదవాలి. సమకాలీన అంశాలపై
పూర్తి స్థాయి అవగాహన పెంచుకోవాలి. ముఖ్యమైన టాపిక్స్‌కు సంబంధించి
సినాప్సిస్, నేపథ్యం, ప్రభావం, ఫలితం, పర్యవసానాలు.. ఇలా అన్ని కోణాల్లో
పట్టు సాధించాలి. ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు..
ముఖ్యంగా నవరత్నాలు, లక్షిత వర్గాలు, బడ్జెట్ కేటాయింపులు తదితర వివరాలను
అవపోసన పట్టాలి. అదే విధంగా రాష్ట్ర స్థాయిలో అమలవుతున్న ఆర్థిక విధానాలు,
వాటిద్వారా జరుగుతున్న అభివృద్ధిపై దృష్టి సారించాలి. దీంతోపాటు జాతీయ
స్థాయిలో తాజా రాజ్యాంగ సవరణలు, నూతన జాతీయ విద్యా విధానం, ఇటీవల కాలంలో
కీలకమైన తీర్పుల గురించి అవగాహన పెంచుకోవాలి.
అప్లికేషన్ అప్రోచ్
గ్రూప్స్ అభ్యర్థులు ప్రతి అంశాన్ని చదివేటప్పుడు అన్వయ దృక్పథాన్ని
అలవర్చుకోవాలి. ముఖ్యంగా సమకాలీన అంశాలు సమ్మిళితంగా ఉండే ఎకానమీ, పాలిటీ,
జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇది ఎంతో ఉపయుక్తంగా నిలుస్తుంది. అదే
విధంగా చదివే సమయంలోనే రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. నిరంతరం తమ
సామర్థ్యాలను అంచనా వేసుకునేందుకు మోడల్ టెస్ట్స్‌కు హాజరు కావడం మేలు
చేస్తుంది.
ప్రీవియస్ పేపర్స్
గ్రూప్స్ అభ్యర్థులు ప్రిపరేషన్ ప్రారంభించే ముందు గత ప్రశ్న పత్రాలను
పరిశీలించాలి. గత ప్రశ్న పత్రాల ద్వారా పరీక్షలో సదరు అంశాలకు లభిస్తున్న
వెయిటేజీపై అవగాహన లభిస్తుంది. అంతేకాకుండా ప్రశ్నలు అడుగుతున్న తీరు
తెలుస్తుంది. ఆయా టాపిక్స్‌పై తమకున్న పట్టు, ఇంకా మెరుగుపరచుకోవాల్సిన
విషయాల్లోనూ స్పష్టత లభిస్తుంది.
సిలబస్‌పై పట్టు.. కొలువుకు మెట్టు
- చరిత్ర: రాష్ట్ర చరిత్ర, సంస్కృతికి సంబంధించిన అంశాలపై పట్టు సాధించాలి. ప్రాచీన చరిత్ర మొదలు ఆధునిక చరిత్ర వరకూ..ముఖ్యమైన అంశాలపై సంపూర్ణ అవగాహన అవసరం. జాతీయోద్యమంలో ఆంధ్రప్రదేశ్ పాత్ర గురించి అధ్యయనం చేయాలి. అదేవిధంగా భారత దేశ చరిత్రకు సంబంధించిన అంశాలపైనా అవగాహన పెంచుకోవాలి.
- భౌగోళిక శాస్త్రం: దీనికి సంబంధించి రాష్ట్రంలోని భౌగోళిక వనరులు, అడవులు, జీవ సంపద, వ్యవసాయ వనరుల గురించి తెలుసుకోవాలి. వీటిని తాజా పరిస్థితులతో అన్వయం చేసుకోవాలి. గత ఏడాది కాలంలో చేపట్టిన వ్యవసాయ, నీటి పారుదల ప్రాజెక్ట్‌లు.. వాటి ద్వారా లబ్ధి చేకూరే ప్రాంతాలు వంటి వాటిపై దృష్టి పెట్టాలి.
- పాలిటీ: రాజనీతి శాస్త్రం, రాజ్యాంగానికి సంబంధించి ప్రాథమిక అంశాలు, భావనలు మొదలు తాజా పరిణామాల(రాజ్యాంగ సవరణలు వాటి ప్రభావం) వరకూ అన్నింటినీ తెలుసుకోవాలి. గవర్నెన్స్, లా, ఎథిక్స్‌కు సంబంధించి సుపరిపాలన దిశగా చేపడుతున్న చర్యలు, పబ్లిక్ సర్వీస్‌లో పాటించాల్సిన విలువలు, ప్రజాసేవలో చూపించాల్సిన నిబద్ధత, అంకిత భావం వంటి విషయాలపైనా అవగాహన ఏర్పరచుకోవాలి. న్యాయపరమైన అంశాలపైనా పట్టు సాధించాలి. ప్రాథమిక హక్కులు, విధులు, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు.. వీటికి సంబంధించి న్యాయ వ్యవస్థకున్న అధికారాల గురించి తెలుసుకోవాలి. అదే విధంగా సివిల్, క్రిమినల్ లా, కార్మిక చట్టాలు, సైబర్ చట్టాలు, ట్యాక్స్ లాస్ గురించి అధ్యయనం చేయాలి.
- ఎకానమీ: మౌలిక భావనలు మొదలు తాజా వృద్ధి రేట్ల వరకూ.. గణాంక సహిత సమాచారం సేకరించుకుని పరీక్షకు సన్నద్ధం కావాలి. ఇటీవల కాలంలో చేపట్టిన ప్రధాన ఆర్థిక సంస్కరణలు, వాటిద్వారా లబ్ధి చేకూరే వర్గాలు; జాతీయ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా తాజాగా తీసుకొచ్చిన విధానాలపై పట్టు సాధించాలి. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లు, ఎకనామిక్ సర్వేలపై అవగాహన పొందాలి.
- సైన్స్ అండ్ టెక్నాలజీ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో అమలవుతున్న కొత్త విధానాలు, ప్రధాన సంస్థలు, రాష్ట్ర స్థాయిలో ఐసీటీ విధానాలు, ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్, డీఆర్డీఓ, ఇంధన వనరులు, విపత్తు నిర్వహణకు అనుసరిస్తున్న సాంకేతిక విధానాలు తదితర అంశాలపై పట్టు సాధించాలి. దీంతోపాటు పర్యావరణ సంబంధిత అంశాలపైనా దృష్టి సారించాలి. అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందాలు, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి జాతీయ, రాష్ట్ర స్థాయిలో అమలు చేస్తున్న చట్టాలు, విధానాలపై పట్టు సాధించాలి.
- సంక్షేమ పథకాలు: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, లక్షిత వర్గాలపైనా అవగాహన ఏర్పరచుకోవాలి. నవరత్నాలు.. వాటి పరిధిలో అమలు చేస్తున్న పథకాలు, లబ్ధిదారులు, కేటాయించిన నిధులు వంటి వాటిపై గణాంక సహిత సమాచారంతో సన్నద్ధమవ్వాలి.
పునర్విభజన చట్టం
గ్రూప్స్ అభ్యర్థులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన మరో కీలక అంశం..
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం–2014. జనరల్ స్టడీస్, ఎకానమీ, హిస్టరీ
పేపర్లు అన్నింటిలోనూ.. ఈ చట్టం నుంచి ప్రశ్నలు అడిగే అవకాశముంది. కాబట్టి
అభ్యర్థులు ఈ చట్టాన్ని ప్రత్యేక దృష్టితో చదవాలి. విభజన తర్వాత
ఎదురవుతున్న సవాళ్లు, సమస్యలు.. వాటి పరిష్కారానికి ప్రభుత్వం చేపడుతున్న
చర్యల గురించి అవగాహన పెంచుకోవాలి.
కరెంట్ అఫైర్స్.. లేదా సమకాలీన అంశాలు.. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఎంతో సుపరిచితమైన విభాగం! సివిల్స్, గ్రూప్1, గ్రూప్ 2, గ్రూప్ 3, పోలీస్, బ్యాంకింగ్ మొదలు గ్రూప్ 4 వరకూ.. అన్ని ఉద్యోగ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ కీలకంగా మారుతోంది. ఆయా పోటీ పరీక్షల్లో.. కోర్ అంశాల కలయికతో కరెంట్ అఫైర్స్ నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పోలీస్, గ్రూప్స్ పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే!! ఈ నేపథ్యంలో.. గ్రూప్స్, పోలీస్, బ్యాంకింగ్ తదితర పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ ప్రాధాన్యం, వాటిపై పట్టు సాధించడమెలాగో తెలుసుకుందాం..

- ఉద్యోగ నియామక పరీక్షల్లో కీలకంగా మారుతున్న కరెంట్ అఫైర్స్
- గ్రూప్-1 మొదలు గ్రూప్-4 వరకు కరెంట్ అఫైర్స్‌కు ప్రాధాన్యం
- ముఖ్య అంశాల గుర్తింపే కీలకం అంటున్న సబ్జెక్ట్ నిపుణులు
కరెంట్ అఫైర్స్.. తన చుట్టూ జరుగుతున్న పరిణామాలపై అభ్యర్థులకున్న అవగాహన తెలుసుకునేందుకు ఉద్దేశించిన విభాగం ఇది. గ్రూప్-1 నుంచి గ్రూప్-4 వరకూ..అదే విధంగా సివిల్ సర్వీసెస్, ఎస్‌ఎస్‌సీ సీజీఎల్, సీహెచ్‌ఎస్‌ఎల్ వంటి పోటీ పరీక్షల్లో దాదాపు 30 నుంచి 40 శాతం మేరకు కరెంట్ అఫైర్స్ సంబంధిత ప్రశ్నలు అడుగుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వహించాలనుకునే వారికి సామాజిక, సమకాలీన పరిణామాలపై ఉన్న అవగాహనను పరీక్షించేందుకు ఉద్దేశించిన విభాగమే కరెంట్ అఫైర్స్ అంటున్నారు నిపుణులు.
కోర్ + సమకాలీనం
కొంతకాలంగా కరెంట్ అఫైర్స్ నుంచి అడుగుతున్న ప్రశ్నల తీరు మారుతోంది. నేరుగా కరెంట్ అఫైర్స్ సంబంధిత ప్రశ్నలు మాత్రమే కాకుండా.. కోర్ అంశాలతో సమ్మిళితం చేస్తూ కూడా అధిక సంఖ్యలో ప్రశ్నలు అడుగుతున్నారు. ఉదాహరణకు రాష్ట్ర, కేంద్ర స్థాయిలో కొత్త బిల్లులు లేదా ఆర్డినెన్స్‌లు తెస్తున్న విషయం తెలిసిందే. సదరు బిల్లులకు సంబంధించి సమకాలీన పరిణామం, దాని నేపథ్యం,బిల్లు ప్రవేశపెట్టేందుకు దారితీసిన పరిస్థితుల గురించి తెలిస్తేనే.. సమాధానం ఇవ్వగలిగేలా కరెంట్ అఫైర్స్ విభాగం నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి అభ్యర్థులు తాజా పరిణామాలతోపాటు కోర్ సబ్జెక్ట్‌లోని మూల భావనలపైనా అవగాహన పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
చదవండి: Competitive Exam Preparation Tips: పోటీపరీక్షల్లో విజయానికి కరెంట్ అఫైర్స్
విస్తృత విభాగం
కరెంట్ అఫైర్స్ అనేది ఒక సముద్రం లాంటిది. ప్రతి రోజు ఎన్నో కొత్త పరిణామాలు సంభవిస్తుంటాయి. జాతీయం,అంతర్జాతీయం,సైన్స్, స్పోర్ట్స్.. ఇలా ఏ విభాగాన్ని తీసుకున్నా.. ప్రతిరోజు అనేక సంఘటనలు జరుగుతుంటాయి. వీటిలో పరీక్షల కోణంలో ముఖ్యమైనది ఏదో గుర్తించడం ఎలా.. అనే ప్రశ్న అభ్యర్థులకు ఎదురవుతోంది. ఇలాంటి అభ్యర్థులు విస్తృత ప్రాధాన్యం, ఎక్కువ ప్రభావం చూపే సంఘటనలపై అధికంగా దృష్టి కేంద్రీకరించాలి. జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రాంతీయ సంఘటనలను పరిగణనలోకి తీసుకోవాలి. నిర్దేశిత అంశం నేపథ్యాన్ని పరిశీలించాలి. అలాగే ఆర్థిక, సామాజిక,విద్య, పరిపాలన ప్రాధాన్యం కలిగిన జాతీయ అంశాలను ముఖ్యమైనవిగా పరిగణించాలి.
చదవండి: Current Affairs Practice Tests(TM)
అంతర్జాతీయ అంశాలు
అంతర్జాతీయ పరిణామాల్లో ప్రతి అంశాన్ని చదవాల్సిన అవసరం లేదు. ముఖ్యమైన
వాటిపై దృష్టిపెడితే సరిపోతుంది. ఉదాహరణకు.. సదస్సులు, సమావేశాలకు
సంబంధించి ప్రతిదానికి తేదీలు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఆయా
సదస్సుల్లో విడుదల చేసిన డిక్లరేషన్లను, 'వాటి థీమ్' ను నోట్ చేసుకోవాలి.
అదే విధంగా ఆయా సదస్సుల నిర్వహణ ఉద్దేశం తెలుసుకోవాలి.
మన దేశానికి, ఇతర దేశాలకు మధ్య ఇటీవల కాలంలో జరిగిన ద్వైపాక్షిక సమావేశాలు,
ఒప్పందాలకు అభ్యర్థులు ప్రాధాన్యం ఇవ్వాలి. వీటితో మన దేశానికి ఒనగూరే
ప్రయోజనాలు, అంతర్జాతీయంగా లభించే గుర్తింపు వంటి అంశాలను తెలుసుకోవాలి.
వాస్తవానికి కరెంట్ అఫైర్స్ విభాగంలో..'జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం
ఉన్న అంశాలు' అని సిలబస్‌లో పేర్కొంటున్నారు. ఆ 'ప్రాధాన్యం' ఉన్న అంశాలను
గుర్తించే నేర్పును అభ్యర్థులు సొంతం చేసుకోవాలి. అంతర్జాతీయంగా, జాతీయంగా
జరిగే ప్రతి సమావేశాన్ని, లేదా సంఘటనను చదువుకుంటూ వెళ్లకుండా.. అవి చూపే
ప్రభావం, వాటి ప్రయోజనం, ఉద్దేశం ఆధారంగా ప్రాధాన్యం ఇవ్వాలి.
చదవండి: Current Affairs Practice Tests(EM)
నివేదికలు, గణాంకాలు
తాజాగా విడుదలయ్యే నివేదికలు,గణాంకాలకు సంబంధించి ప్రాంతీయ ప్రాధాన్యమున్న అంశాలపై ముందుగా దృష్టిపెట్టాలి. తర్వాత ఆ నివేదికలను విడుదల చేసిన సందర్భాన్ని గుర్తించాలి. ఉదాహరణకు..కోవిడ్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన నివేదికల్లో.. మహమ్మారి కారణంగా మన దేశంపై పడిన ప్రభావం, జీవనోపాధి, వలస కూలీల పరిస్థితులు, వ్యాక్సినేషన్ వంటి కీలక అంశాలను చదివితే సరిపోతుంది. ఇలా చదివే సమయంలో సంబంధిత గణాంకాలను నోట్స్‌లో రాసుకోవాలి. ఇది ప్రిపరేషన్ చివర్లో, పరీక్షకు ముందు రివిజన్‌కు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
కాల పరిమితి
పరీక్ష తేదీకి నెల రోజుల ముందు నుంచి అంతకుముందు ఏడాది కాలంలోని అన్ని ముఖ్య పరిణామాలపై పట్టు సాధించాలని పోటీ పరీక్షల నిపుణులు సూచిస్తున్నారు. ఉదాహరణకు వచ్చే ఏడాది జనవరి 8న నిర్వహించనున్న ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష కోసం అభ్యర్థులు ఈ ఏడాది డిసెంబర్ 15 నుంచి అంతకుముందు ఏడాది కాలంలోని పరిణామాలపై అవగాహన పెంచుకోవాలని చెబుతున్నారు.
చదవండి: Reference Books for Groups Preparation: చదివే పుస్తకాలే.. విజయానికి చుక్కానీ!
పుస్తకాల ఎంపిక
కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్‌లో పుస్తకాల ఎంపిక కూడా కీలకంగా నిలుస్తోంది. వాస్తవానికి ప్రస్తుతం కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి విస్తృతమైన మెటీరియల్ మార్కెట్‌లో అందుబాటులో ఉంది. అది కొత్త అభ్యర్థులను ఆందోళనకు గురి చేయడం సహజం. కాబట్టి అభ్యర్థులు గత కొన్నేళ్ల ప్రశ్న పత్రాలను పరిశీలించి.. ట్రెండ్ తెలుసుకోవాలి. దీనికి అనుగుణంగా సమకాలీన పరిణామాలున్న పుస్తకాలను ఎంచుకోవాలి.
చదవడమూ భిన్నంగా
ప్రామాణిక పుస్తకాలను సేకరించాక.. ఆయా కరెంట్ టాపిక్స్‌ను చదవడంలోనూ విభిన్నంగా వ్యవహరించాలి. చాలామంది అభ్యర్థులు సదరు అంశాలను మూసధోరణితో, నవలగానో లేదా కథగానో చదువుకుంటూ ముందుకు వెళతారు. దీనివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. ఒక అంశం చదవడం ప్రారంభించినప్పుడే.. ఆ టాపిక్ ఉద్దేశం, ప్రాధాన్యతల గురించి తెలుసుకోవాలి. ముఖ్యాంశాలను, ఘట్టాలను, కీలక తేదీలను షార్ట్ నోట్స్‌లో రాసుకోవాలి. దాన్ని తరచూ రివైజ్ చేస్తుండాలి.
చదవండి: Competitive Exams: ఏ పోటీ పరీక్షలకైనా.. రాజకీయ అవగాహన తప్పనిసరి.. ఈ వ్యూహాలను అనుసరిస్తే..!
పేపర్ రీడింగ్.. ప్రత్యేక పద్ధతి
కరెంట్ అఫైర్స్ విషయంలో ఎక్కువ మంది అభ్యర్థులు దినపత్రికలపై ఆధారపడుతుంటారు. ప్రతి రోజు పేపర్ చదువుతూ ముఖ్య సంఘటనల గురించి అవగాహనకు ప్రయత్నిస్తుంటారు. పేపర్ రీడింగ్ విషయంలోనూ ప్రత్యేక దృక్పథంతో వ్యవహరించాలి.సమకాలీన అంశాలపై ప్రచురితమయ్యే ఎడిటోరియల్స్, ఇతర ముఖ్యమైన వ్యాసాలు చదివేటప్పుడు వాటి ఉద్దేశాన్ని గుర్తించాలి. ఆ తర్వాత వాటి సారాంశాన్ని ముఖ్యమైన పాయింట్ల రూపంలో నోట్స్‌లో రాసుకోవాలి. ముఖ్యమైన పాయింట్లను గుర్తించే నైపుణ్యం పెంచుకోవాలి.
APPSC&TSPSC: గ్రూప్స్‌కు సొంతంగా నోట్స్ రాసుకుని.. గుర్తు పెట్టుకోవడం ఎలా..?
సొంత నోట్స్
కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి ముఖ్య సంఘటనలను సొంత నోట్స్‌లో రాసుకోవాలి. ఒక టాపిక్‌కు సంబంధించిన ముఖ్యాంశాలను రాసుకునే క్రమంలో..భవిష్యత్తుల్లో పునశ్చరణకు ఉపయోగపడేలా రూపొందించుకోవాలి. పుస్తకంలో లేదా న్యూస్ పేపర్స్‌లో కనిపించే సమాచారం మొత్తాన్ని నోట్స్‌లో పొందుపర్చకుండా.. వాటికున్న ప్రాధాన్యాన్ని పరిగణనలోకి తీసుకుని సంక్షిప్తంగా రాసుకోవాలి.
మెమొరీ టెక్నిక్స్
కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి అభ్యర్థులు అనుసరించాల్సిన మరో వ్యూహం.. మెమొరీ టెక్నిక్స్‌ను పాటించడం. ప్రతి అభ్యర్థికి తనకంటూ సొంత మెమొరీ టెక్నిక్స్ ఉంటాయి. కొందరు విజువలైజేషన్ టెక్నిక్స్, కొందరు మైండ్ మ్యాపింగ్(మనసులోనే ఆయా అంశాలను ముద్రించుకునే విధానం) వంటివి అనుసరిస్తారు. మరికొందరికి ఆయా అంశాలను టేబుల్స్, గ్రాఫ్స్‌లో రూపంలో రాసుకుని సులువుగా జ్ఞప్తికి తెచ్చుకునే లక్షణం ఉంటుంది. అభ్యర్థులు తమకు అనుకూలంగా ఉండే విధానాన్ని ఆచరణలో పెట్టాలి. ఇలా.. సమకాలీన ప్రాధాన్యం ఉన్న అంశాలు,కోర్ టాపిక్స్‌తో అనుసంధానం, మంచి పుస్తకాల ఎంపిక, పేపర్ రీడింగ్ వరకూ.. అడుగడుగునా శాస్త్రీయంగా ప్రిపరేషన్ సాగిస్తే ఈ విభాగంలో మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుంది.
గ్రూప్స్ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులు కోచింగ్ సెంటర్లకు, గ్రంథాలయాలకు క్యూ కడుతున్నారు. హడావుడిగా ప్రిపరేషన్ ప్రారంభిస్తున్నారు.

అయితే చాలామంది అభ్యర్థులు పుస్తకాలు లేదా మెటీరియల్ ఎంపికలో..తడబాటుకు గురవుతున్నారు! మార్కెట్లో.. ఒక్కో సబ్జెక్ట్‌కు పదుల సంఖ్యలో పుస్తకాలు, ప్రచురణలు! దీంతో.. ఏ పుస్తకాన్ని ఎంచుకోవాలి.. ఏ పుస్తకంలో ఎంత సమాచారం ఉంది.. ఆ సమాచారాన్ని ఎలా చదవాలి.. సిలబస్‌కు అనుగుణంగా సొంతం నోట్స్ రాసుకోవడం ఎలా..? ఇలా ఎన్నో సందేహాలు!! ఇలాంటి కీలక నేపథ్యంలో.. గ్రూప్స్ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులు సొంతంగా నోట్స్ రాసే విధానం.. టిప్స్.. మీకోసం..
సొంతగా నోట్స్ రాసుకునే టిప్స్..
పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు సొంత నోట్స్ రాసుకునే విధానాన్ని
పాటించాలి. ఇది వారికి మలి దశలో ఎంతో మేలు చేస్తుందని నిపుణులు, గత విజేతలు
చెబుతున్నారు. ఈ సొంత నోట్స్ రాసుకునే విషయంలో కూడా అభ్యర్థులు కొంత
గందరగోళానికి గురయ్యే ఆస్కారం ఉంది. ఇలాంటి అభ్యర్థులు.. ఏదైనా అంశాన్ని
చదువుతున్నప్పుడు ముందుగా వాటి ప్రాథమిక భావనలు నోట్స్‌లో
పొందుపరుచుకోవాలి. ఆ తర్వాత వాటిని సమకాలీన అంశాలతో అనుసంధానిస్తూ.. తగిన
సమాచారాన్ని సదరు నోట్స్‌లో రాసుకోవాలి.
☛ గణాంకాలు, ముఖ్యమైన ఘట్టాలు, సంవత్సరాలు ఉండే ఎకానమీ, హిస్టరీ వంటి
వాటికి ఆయా సంవత్సరాల్లో జరిగిన సంఘటనల ప్రాధాన్యతను బట్టి నోట్స్‌లో
రాసుకోవాలి.
☛ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అంశాలను చదువుతున్నప్పుడు.. ఆయా పథకాల
లక్ష్యం, లక్షిత వర్గాలు, లబ్ధిదారులు, ఆర్థిక కేటాయింపులు, సదరు పథకాల
ప్రస్తుత పరిస్థితి వంటి అంశాలను నోట్స్‌లో రాసుకోవాలి.
☛ బడ్జెట్, సామాజిక సర్వేల్లో ఎక్కువగా గణాంకాలే ఉంటాయి. కాబట్టి పరీక్ష
ప్రాధాన్యత ఆధారంగా వాటిని నోట్స్‌గా పొందుపర్చుకోవాలి. వాటికి సమకాలీన
అంశాలను అనుసంధానం చేసుకునేలా వ్యవహరించాలి.
గ్రూప్-1,2,3,4 ప్రీవియస్ కొశ్చన్ పేపర్స్ కోసం క్లిక్ చేయండి
గుర్తు పెట్టుకోవడం ఎలా ?

☛ విస్తృతమైన సమాచారంతో ఉండే పుస్తకాలను చదివేటప్పుడు ఆయా అంశాలను
గుర్తుంచుకోవడం ఎలా? అనే ఆందోళన కూడా కలుగుతుంది. దీనికి పరిష్కారంగా
అభ్యర్థులు తమ వ్యక్తిగత సామర్థ్యం ఆధారంగా మెమొరీ టిప్స్ పాటించాలి.
☛ ముఖ్యమైన అంశాలను పాయింట్స్‌గా రాసుకోవడం; విజువలైజేషన్ టిప్స్‌ను
పాటించడం; పిక్టోరియల్ అప్రోచ్(అంటే ఆయా అంశాలకు సంబంధించి చార్ట్‌లు,
డయాగ్రమ్స్ రూపంలో పొందుపర్చుకోవడం) వంటి వాటిని అనుసరించాలి. ఈ మెమొరీ
టిప్స్ అనేవి అభ్యర్థుల వ్యక్తిగత సామర్థ్యంపై ఆధారపడి ఉంటాయి.
Groups Books: గ్రూప్-1&2కు కచ్చితంగా చదవాల్సిన పుస్తకాలు.. వీటి జోలికి అసలు వెళ్లోద్దు..!
వీటికే అధిక ప్రాదాన్యత ఇవాలి...
☛ గ్రూప్స్ అభ్యర్థులు ప్రిపరేషన్ సమయంలో ఎదుర్కొనే మరో ప్రధాన సమస్య..
గణాంకాలకు ప్రాధాన్యం ఇవ్వాలా? లేదా కాన్సెప్ట్‌లు ముఖ్యమా అనేది? ఇది
అభ్యర్థులు చదివే అంశం, పోటీ పడే పరీక్ష స్థాయిపై ఆధారపడి ఉంటుందని
గుర్తించాలి.
☛ పథకాలు లేదా వనరుల కేటాయింపునకు సంబంధించిన అంశాలను చదువుతున్నప్పుడు
గణాంకాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. వాటిని సమకాలీన అంశాలతో సమ్మిళితం
చేసుకోవాలి. కాన్సెప్ట్యువల్ ప్రిపరేషన్ ఉపయుక్తంగా ఉంటుంది.
☛ ఆబ్జెక్టివ్ తరహాలో ఉండే గ్రూప్–2లో గణాంకాలకు కొంత ఎక్కువ ప్రాధాన్యం
ఉంటుంది. కేవలం గ్రూప్–2కే పోటీ పడే అభ్యర్థులు ఆయా గణాంకాలపై ప్రత్యేక
దృష్టి పెట్టాలి.
☛ గ్రూప్–1, 2 రెండింటికీ ప్రిపరేషన్ సాగించే అభ్యర్థులు.. ఆబ్జెక్టివ్
తరహాలో ఉండే గ్రూప్–1 ప్రిలిమ్స్, గ్రూప్2కు ప్రిపరేషన్ సాగిస్తూనే..
గ్రూప్1 మెయిన్స్ పరీక్షను పరిగణనలోకి తీసుకుని డిస్క్రిప్టివ్ విధానంలో
చదవడం ఉపయుక్తంగా ఉంటుంది.
☛ ఇలా..మెటీరియల్ ఎంపిక నుంచి పరీక్ష స్థాయి వరకూ..ప్రతి అంశాన్ని
పరిగణనలోకి తీసుకుంటూ..శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం చేస్తే..పరీక్షలో
మెరుగైన ప్రతిభ చూపే అవకాశం ఉంటుంది.
For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి