9, సెప్టెంబర్ 2023, శనివారం

Accounting లో Career: అకౌంటింగ్‌లో కెరీర్ స్టార్ట్ చేయాలనుకునేవారు ఈ విషయాలు తెలుసుకోండి

Career In Accounting: హై-డిమాండ్ ఉన్న అకౌంటింట్ రంగంలో కెరీర్ గ్రోత్‌కు అనేక అవకాశాలు ఉన్నాయి. ఈ ఫీల్డ్‌లో కొనసాగాలంటే అకౌంటింగ్ లేదా సంబంధిత రంగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేయాలి. సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్ (CPA) పరీక్షలో కూడా ఉత్తీర్ణత సాధించాలి.

 

మాథ్స్, ప్రాబ్లమ్-సాల్వింగ్, కమ్యూనికేషన్‌ స్కిల్స్ ఉన్న వారికి అకౌంటింగ్ (Accounting) ఒక గొప్ప కెరీర్ ఆప్షన్ అవుతుంది. హై-డిమాండ్ ఉన్న అకౌంటింట్ రంగంలో కెరీర్ గ్రోత్‌కు అనేక అవకాశాలు ఉన్నాయి. ఈ ఫీల్డ్‌లో కొనసాగాలంటే అకౌంటింగ్ లేదా సంబంధిత రంగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేయాలి. సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్ (CPA) పరీక్షలో కూడా ఉత్తీర్ణత సాధించాలి. అకౌంటింగ్ ప్రిన్సిపుల్స్‌లో బలమైన పునాది, అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్‌లో టెక్నికల్ ప్రొఫిషియన్సీ సైతం అవసరం. కమ్యూనికేషన్, కొలాబరేషన్ స్కిల్స్ కూడా అభివృద్ధి చేసుకోవాలి. ఇంటర్న్‌షిప్ లేదా ఎంట్రీ-లెవల్ పొజిషన్లో ఉద్యోగం చేయడం ద్వారా ఎక్స్‌పీరియన్స్ సాధించే భవిష్యత్తులో బాగా రాణించొచ్చు. ఈ ఫీల్డ్‌లోని ఇతర అకౌంటెంట్లు, నిపుణులతో కూడా నెట్‌వర్క్ ఏర్పరచుకోవచ్చు.

జాబ్ కోసం ట్రై చేసేటప్పుడు రెజ్యూమ్‌లో ఉద్యోగానికి సరిపోయే స్కిల్స్, ఎక్స్‌పీరియన్స్ హైలెట్ చేయాలి. ప్రీవియస్ అకౌంటింగ్ ఇంటర్వ్యూల్లో అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ప్రాక్టీస్ చేయాలి. ఈ రంగంలో అడుగుపెట్టడానికి అసోసియేషన్ ఆఫ్ చార్టర్డ్ సర్టిఫైడ్ అకౌంటెంట్స్ (ఇండియా) డైరెక్టర్ మహ్మద్ సాజిద్ ఖాన్ అందిస్తున్న సూచనలు ఇలా.

* ఫౌండేషన్ ప్రిన్సిపుల్స్

అకౌంటింగ్‌లో సక్సెస్‌ఫుల్ కెరీర్ కొనసాగించడానికి, ఫీల్డ్ ఫండమెంటల్ ప్రిన్సిపుల్స్‌పై పట్టు సాధించాలి. ఈ ప్రిన్సిపల్స్‌లో డెబిట్, క్రెడిట్ల బేసిక్స్ గురించి తెలుసుకోవడం, ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్స్ చదవడం, అక్రూవల్ అకౌంటింగ్ ప్రిన్సిపుల్స్‌పై అవగాహన పెంచుకోవడం వంటివి ఉంటాయి. ఈ బేసిక్ నాలెడ్జ్‌ని పొందడానికి అఫీషియల్ ఎడ్యుకేషన్ ఉత్తమ మార్గం. అకౌంటింగ్ లేదా సంబంధిత రంగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేస్తే అవసరమైన స్కిల్స్, నాలెడ్జ్‌ వస్తుంది. దీంతోపాటు ప్రొఫెషనల్ సర్టిఫికేషన్లను పొందడం ద్వారా అకౌంటింగ్ నాలెడ్జ్ మరింత అభివృద్ధి చేసుకోవచ్చు. ఈ సర్టిఫికేషన్లతో కెరీర్‌లో మంచి అవకాశాలను సంపాదించడం, హయ్యర్ శాలరీ ప్యాకేజెస్ పొందడం సులభతరం అవుతుంది.

* అప్‌డేట్‌

అకౌంటింగ్ ఫీల్డ్ నిరంతరం అభివృద్ధి చెందుతోంది, కాబట్టి ఉద్యోగులు లైఫ్ లాంగ్ కొత్త ట్రెండ్స్‌, టెక్నాలజీలు, స్కిల్స్ నేర్చుకుంటూనే ఉండాలి. అకౌంటింగ్ రంగంలో అప్‌డేటెడ్‌గా ఉండటానికి అనేక మార్గాలు ఉన్నాయి. వర్క్‌షాప్‌లు, మీటింగ్స్‌కు హాజరుకావచ్చు, ఇండస్ట్రీ పబ్లికేషన్స్ చదవవచ్చు లేదా ఆన్‌లైన్ కోర్సులను తీసుకోవచ్చు. ఇతర అకౌంటెంట్లు, నిపుణులతో కూడా డిస్కషన్స్ చేస్తూ కొత్త విషయాలు తెలుసుకోవచ్చు.

* ట్రేడ్ టూల్స్

ప్రస్తుత డిజిటల్ యుగంలో అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్, స్ప్రెడ్‌షీట్ ప్రోగ్రామ్‌లు, ఎంటర్‌ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ (ERP) సిస్టమ్‌లలో అకౌంటెంట్లు నైపుణ్యం సాధించాల్సిన అవసరం ఉంది. వారు IFRS, జనరల్లీ యాక్సెప్టడ్ అకౌంటింగ్ ప్రిన్సిపుల్స్ (GAAP) వంటి అకౌంటింగ్ సిస్టమ్స్ బేసిక్స్ అర్థం చేసుకోవాలి. IFRS, GAAP ప్రపంచంలో ఉపయోగించే రెండు ప్రధాన అకౌంటింగ్ స్టాండర్డ్స్ . IFRSను యూఎస్ వెలుపల చాలా దేశాలు ఉపయోగిస్తాయి, GAAPను యూఎస్‌లో ఎక్కువగా ఉపయోగిస్తారు. కచ్చితమైన ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్స్ సిద్ధం చేయడానికి వీటిని అకౌంటెంట్లు అర్థం చేసుకోవాలి.

అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్ అనేది అకౌంటెంట్లు రేపిటిటివ్ టాస్క్స్ ఆటోమేట్ చేయడం, యాక్యురసీని మెరుగుపరచడం, సామర్థ్యాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. డేటా అనాలసిస్, బడ్జెట్ కోసం స్ప్రెడ్‌షీట్ ప్రోగ్రామ్‌లను ఉపయోగించవచ్చు. ERP వ్యవస్థలు సంస్థ మొత్తం ఆర్థిక డేటాను ఒకే సిస్టమ్‌లో ఇంటిగ్రేట్ చేస్తాయి. ట్రేడ్ టూల్స్‌లో నైపుణ్యం ఉన్న, అకౌంటింగ్ ప్రమాణాలను అర్థం చేసుకున్న అకౌంటెంట్లు కెరీర్‌లో ఉన్నత స్థానాలకు ఎదగడానికి ఎక్కువ అవకాశం ఉంది.

* అకౌంటింగ్‌లో సాఫ్ట్ స్కిల్స్

టెక్నికల్ స్కిల్స్‌తో పాటు, అకౌంటెంట్లు కమ్యూనికేషన్, కొలాబరేషన్ వంటి సాఫ్ట్ స్కిల్స్‌ను కూడా డెవలప్ చేసుకోవాలి. క్లయింట్లు, కొలీగ్స్, ఇతర వాటాదారులతో కలిసి పనిచేయడానికి ఈ స్కిల్స్ అవసరం. అకౌంటెంట్లకు కమ్యూనికేషన్ స్కిల్స్ ముఖ్యమైనవి ఎందుకంటే వారు ఫైనాన్స్‌లో అవగాహన లేని వ్యక్తులకు అర్థం కాని ఆర్థిక అంశాలను వివరించగలగాలి. సమస్యలను పరిష్కరించడానికి, ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడానికి వారు ఇతర నిపుణులతో కూడా కొలాబరేట్‌ అవ్వగలగాలి.

  • సింహాచల దేవస్థానంలో సామూహిక వరలక్ష్మీ వ్రతం..!
  • జిల్లాలో అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు బీఆర్ఎస్ అధిష్టానం భారీ స్కెచ్
  • భద్రాద్రి ఆలయంలో వైభవోపేతంగా ఉట్ల పండగ
  • ప్రసాద్ పథకముతో సింహగిరికి మహర్దశ... 55 కోట్లతో త్వరలో అభివృద్ధి పనులు..!
  • భారీగా పతనమైన టమాట ధరలు... సరైన గిట్టుబాటు ధరలేక రోడ్లపైనే వదిలి వెళుతున్న రైతులు..!

Tags: Career and Courses, Career opportunities, EDUCATION, JOBS

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

కామెంట్‌లు లేవు: