9, సెప్టెంబర్ 2023, శనివారం

PF Complaints: ఈపీఎఫ్‌వో పోర్టల్‌లో PF కంప్లైంట్స్‌ ఎలా చేయాలి? స్టెప్ బై స్టెప్ గైడ్‌ | PF Complaints: ఈపీఎఫ్‌కు సంబంధించి ఏవైనా సమస్యలు లేదా ఫిర్యాదులు ఉంటే ఈపీఎఫ్‌వో పోర్టల్‌లో ఫిర్యాదు చేయవచ్చు. ఇతర విషయాలతోపాటు క్లెయిమ్‌లు, డిపాజిట్లు, అకౌంట్‌ బ్యాలెన్స్, కంపెనీ అక్రమాలు వంటివి రిపోర్ట్‌ చేయవచ్చు.

PF Complaints: ఈపీఎఫ్‌కు సంబంధించి ఏవైనా సమస్యలు లేదా ఫిర్యాదులు ఉంటే ఈపీఎఫ్‌వో పోర్టల్‌లో ఫిర్యాదు చేయవచ్చు. ఇతర విషయాలతోపాటు క్లెయిమ్‌లు, డిపాజిట్లు, అకౌంట్‌ బ్యాలెన్స్, కంపెనీ అక్రమాలు వంటివి రిపోర్ట్‌ చేయవచ్చు. 

కష్టపడి సంపాదిస్తున్నంత కాలం అవసరాలు, కోరికలు తీర్చుకునేందుకు ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ వృద్ధాప్యంలో సంపాదన ఉండదు. అవసరాలు, ఆరోగ్య ఖర్చులూ పెరుగుతాయి. ఇలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా పదవీ విరమణ కోసం పొదుపు చేసేలా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ప్రోత్సహిస్తుంది. EPFO ప్రధాన వ్యవస్థల్లో ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌(EPF) ఒకటి. ఉద్యోగులకు తప్పనిసరి కాంట్రిబ్యూషన్‌ స్కీమ్‌గా పేర్కొంటారు. దీనికి ఉద్యోగుల ఆర్థిక భద్రతను కాపాడేందుకు కంపెనీలు, ఉద్యోగులు ఇద్దరూ నెలవారీ కాంట్రిబ్యూషన్‌లు చెల్లించాలి.

ఈపీఎఫ్‌కు సంబంధించి ఏవైనా సమస్యలు లేదా ఫిర్యాదులు ఉంటే ఈపీఎఫ్‌వో పోర్టల్‌లో ఫిర్యాదు చేయవచ్చు. ఇతర విషయాలతోపాటు క్లెయిమ్‌లు, డిపాజిట్లు, అకౌంట్‌ బ్యాలెన్స్, కంపెనీ అక్రమాలు వంటివి రిపోర్ట్‌ చేయవచ్చు. EPF సభ్యులు ఫిర్యాదులను సమర్పించడానికి EPF i-Grievance Management System (EPFiGMS) ఆన్‌లైన్‌లో ఉపయోగించవచ్చు.

* EPFO పోర్టల్ అంటే ఏంటి?

EPFO, EPFIGMS (EPF i-గ్రీవెన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్) అనే ప్రత్యేక ప్లాట్‌ఫారమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. EPFO సేవలకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించడానికి ఈ ప్లాట్‌ఫారమ్‌ రూపొందించారు. EPF సభ్యులు ఈ పోర్టల్ ద్వారా కంప్లైంట్‌ చేసినప్పుడు, సంబంధిత అధికారులకు చేరుతాయి. ముందుగా నిర్ణయించిన సమయ వ్యవధిలో రెస్పాన్స్‌ అందుతుంది.

EPFiGMS పోర్టల్‌లో కంప్లైంట్స్‌ చేయడంతో పాటు, సభ్యులు EPFO ​​సేవలకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలను కూడా తెలుసుకోవచ్చు. అదే విధంగా సభ్యులు తమ ఫిర్యాదులను ఢిల్లీలోని EPFO ​​ప్రధాన కార్యాలయానికి లేదా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఫీల్డ్ ఆఫీసులలో ఒకదానికి పంపే అవకాశం కూడా ఉంది. అదే విధంగా EPFiGMS పోర్టల్ EPF సభ్యులకు వారి ప్రస్తుత కంప్లైంట్స్‌, రిక్వెస్ట్‌ల స్టేటస్‌ని ట్రాక్ చేసే అవకాశం అందిస్తుంది.

* ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్ ఫండ్ (EPF)కి సంబంధించిన విషయాలపై ఎలా ఫిర్యాదు చేయాలి?

- ముందుగా సభ్యులు https://epfigms.gov.in/లో ఈపీఎఫ్‌ ఐ-గ్రీవెన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేయండి.

- హోమ్‌పేజీకి కుడివైపు ఎగువన ఉన్న మెనూలో 'రిజిస్టర్ గ్రీవెన్స్' ఆప్షన్‌ ఎంచుకోండి.

- ఇప్పుడు కొత్త పేజీ ఓపెన్‌ అవుతుంది. అక్కడ స్టేటస్‌కి అనుగుణంగా సెలక్ట్‌ చేసుకోవడానికి 4 ఆప్షన్‌లు ఉంటాయి.

- తర్వాత యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN), సెక్యూరిటీ కోడ్‌ని ఎంటర్‌ చేయాలి.

- మొత్తం ఇన్‌ఫర్మేషన్‌ పొందడానికి ‘గెట్ డిటైల్స్’పై క్లిక్ చేయండి. (పేరు, UAN, మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడి స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతాయి).

- ‘గెట్ ఓటీపీ’ సెలక్ట్‌ చేసుకోండి రిజిస్టర్డ్ కాంటాక్ట్ నంబర్‌కు OTP వస్తుంది.

- పేజీలో 'పర్సనల్ డీటైల్స్‌' సెక్షన్‌ కనిపిస్తుంది, అందులో సంబంధిత PF నంబర్‌ని ఎంచుకోండి.

- తర్వాత ‘గ్రీవెన్స్ డీటైల్స్‌’ సెక్షన్‌కి వెళ్లి, కంప్లైంట్‌ చేయాలనుకుంటున్న టైప్‌ని సెలక్ట్ చేసుకుని, సరైన డిస్క్రిప్షన్‌ రాయాలి.

- అవసరమని భావించిన డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేసి, 'యాడ్‌' బటన్‌పై క్లిక్ చేయండి.

- ఈ విధానాన్ని అనుసరించడం ద్వారా, కంప్లైంట్‌ రిజిస్టర్ అవుతుంది. రిజిస్ట్రేషన్ నంబర్‌ అందుకుంటారు, ఇది కంప్లైంట్‌ స్టేటస్‌ చెక్‌ చేయడానికి ఉపయోగపడుతుంది.

* కంప్లైంట్‌ స్టేటస్‌ ఎలా చెక్‌ చేయాలి?

1. https://epfigms.gov.in/లో ఈపీఎఫ్‌ ఐ-గ్రీవెన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ పోర్టల్‌ను ఓపెన్‌ చేయండి.

2.మెను బార్‌లోని 'వ్యూ స్టేటస్' ఆప్షన్‌పై క్లిక్‌ చేయండి.

3. కంప్లైంట్‌ ఫైల్‌ చేసినప్పుటు అందిన రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఎంటర్‌ చేయండి.

4. సెక్యూరిటీ కోడ్‌తో పాటు పాస్‌వర్డ్, మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్ IDని ఎంటర్‌ చేయమని కోరుతుంది.

5. వ్యాలిడ్‌ డీటైల్స్‌ ఎంటర్‌ చేసి, 'సబ్మిట్‌' క్లిక్ చేయండి. కంప్లైంట్‌ స్టేటస్‌ స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది.

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

కామెంట్‌లు లేవు: