గణితం - స్వభావం, పరిధి
మాదిరి ప్రశ్నలు
1. ఆర్స్ మేథమెటికా అనేది ఏ భాషా పదం?
జ: లాటిన్
2. ‘గణితం ఆత్మ యొక్క ఉత్తమోత్తమమైన అభ్యసనం... ప్రపంచ వృత్తులన్నింటిలోనూ ఇది చక్కనిది!’ అని పేర్కొన్నది?
జ: పాస్కల్
3. ఒక విషయాన్ని అనేకసార్లు పరిశీలించినప్పుడు ఒకే ఫలితాన్ని పొందినట్లయితే మిగిలిన అన్ని సందర్భాల్లోనూ అదే ఫలితాన్నిస్తుందని నమ్మడమే
జ: ఆగమన హేతువాదం
4. కిందివాటిలో ప్రాథమికోన్నత స్థాయిలో గణితశాస్త్ర ఉద్దేశం కానిది
1) తార్కికతను అభివృద్ధి చేయడం.
2) శాస్త్రీయ, అన్వేషణా దృక్పథాన్ని కలిగించడం.
3) ఆధునిక ప్రపంచంలో గణిత ప్రాముఖ్యాన్ని, స్థానాన్ని తెలియజేయడం.
4) సహజత్వాన్ని అలవరచడం.
జ: 4 (సహజత్వాన్ని అలవరచడం.)
5. తార్కికవాదంలో భాగంగా పరిగణించే గణిత వివేచన
జ: సమర్థనాత్మక వివేచన
6. 'Going beyond information given' అనే గ్రంథంలో నిర్మాణాత్మక సిద్ధాంతాన్ని సోదాహరణంగా వివరించినవారు
జ: బ్రూనర్
7. 'Π' విలువను 3.1416 గా మొదట తెలియజేసినవారు
జ: ఆర్యభట్ట
8. ‘డేటా’ గ్రంథ రచయిత
జ: యూక్లిడ్
9. భాస్కరాచార్యుడు రాసిన ‘సిద్ధాంత శిరోమణి’ గ్రంథంలో మొదటి భాగం
జ: లీలావతి
10. పరస్పర సంగతాలైన స్వీకృతాల నుంచి తప్పనిసరిగా ఉత్పన్నమయ్యే ఫలితాల సమగ్ర చర్చే గణితం అన్నది
జ: బెర్ట్రాండ్ రస్సెల్
11. కిందివాటిలో వ్యక్తి స్వీయ మూల్యాంకనా జ్ఞానం?
1) వాస్తవానికి సంబంధించిన జ్ఞానం 2) భావనకు సంబంధించిన జ్ఞానం
3) విధానపరమైన జ్ఞానం 4) అధి అభిజ్ఞ జ్ఞానం
జ: 4 (అధి అభిజ్ఞ జ్ఞానం)
12. సవరించిన బ్లూమ్స్ వర్గీకరణలో రెండో అత్యున్నత స్థాయి మూల్యాంకనం
జ: మూల్యాంకనం చేయడం
13.
a = l × b అనే సూత్రాన్ని దీర్ఘచతురస్ర వైశాల్యం; దాని పొడవు, వెడల్పుల
లబ్ధానికి సమానమని చెప్పిన జాహ్నవి అనే విద్యార్థినిలో నెరవేరిన లక్ష్యం
జ: అవగాహన
14. గణితపరమైన ఆలోచనలను సొంత మాటల్లో వివరించగలిగిన నిహాల్ అనే విద్యార్థిలో నెరవేరిన విద్యా ప్రమాణం
జ: భావవ్యక్తీకరణ
15. సంధ్యారాణి అనే విద్యార్థిని ఒక గణిత సమస్య సాధనా పద్ధతిని అర్థం చేసుకోగలిగింది. ఆమెలో నెరవేరిన విద్యాప్రమాణం
జ: కారణాలు - నిరూపణలు
16. ఆర్.హెచ్.దవే సూచించిన కనీస అభ్యసన స్థాయిలో గణితంలో గల ఉపసామర్థ్యాలు?
జ: 207
17. భావావేశ రంగంలో అతిక్లిష్టమైన లక్ష్యం?
జ: లాక్షణీకరణం
18. ‘వైశాల్యం’ పాఠం విన్న రవి అనే విద్యార్థి తన ఇంటి స్థలం వైశాల్యాన్ని కనుక్కోగలిగాడు. అతడిలో నెరవేరిన విద్యా ప్రమాణం
జ: సంధానాలు
19. ‘విద్యార్థి ప్రవర్తన అతడి ఆలోచనలు, అనుభూతులు, చర్యల కలయిక’ అని పేర్కొన్నవారు
జ: బి.ఎస్.బ్లూమ్స్
20. మానసిక చలనాత్మక రంగంలోని లక్ష్యాలను ప్రధానంగా కింది ఏ లక్షణాల ఆధారంగా వర్గీకరించారు?
1) అంతర్‌వృద్ధి 2) అంతర ప్రేరణ
3) బహిర్గత సమన్వయం 4) సమన్వయీకరణ
జ: 4 (సమన్వయీకరణ)
21. 5E నమూనాలో ఏ దశలో విద్యార్థులు అభ్యసించిన అంశాలను నిత్య జీవితంలో అన్వయిస్తారు?
జ: విశదీకరించడం
22. ఒక సిద్ధాంతం నుంచి మరో సిద్ధాంతాన్ని ఆస్వాదించడానికి ఉపయోగపడే బోధనా పద్ధతి
జ: నిగమన పద్ధతి
23. విద్యార్థికి జీవన నైపుణ్యాలు పెంపొందించే బోధనా పద్ధతి
జ: ప్రాజెక్టు పద్ధతి
24. కిండర్‌గార్టెన్ పద్ధతిలో బోధనలో వివిధ ప్రక్రియలు చేపట్టే సరైన క్రమం
జ: కథలు − పాటలు − ఆటలు − నిర్మాణాత్మక పని
25. మాంటిస్సోరి విధానంలో విద్యార్థులు చేయని ఏకైక పని
జ: వంటపని
26. సమస్యా పరిష్కార పద్ధతిలో సమస్య పరిధిని తెలుసుకునే సోపానం
జ: సమస్యను నిర్వచించడం
27. చింతగింజలను కుప్పలుగా ఉంచడం ద్వారా విద్యార్థులతో ఎక్కాలు రాయించడం ఏ పద్ధతి?
జ: అన్వేషణ
28. అన్వేషణ పద్ధతిలో శిక్షణ ఇవ్వడానికే ప్రథమ ప్రాధాన్యం, జ్ఞానానికి ద్వితీయ ప్రాధాన్యం అన్నది
జ: వెస్టేవే
29. చింతగింజలను లెక్కించడం ద్వారా కూడికలను నేర్పడం... ఏ బోధనా నియమం?
జ: మూర్తం నుంచి అమూర్తానికి
30. ‘సకల శాస్త్రాలకు మూలం, ద్వారం లాంటిది గణితం’ అని నిర్వచించినవారు?
జ: బేకన్
గణితం − బోధనోపకరణ సామగ్రి
31. సమాంతర రేఖలు గీయడానికి ఉపయోగపడే గణితశాస్త్ర బోధనా పేటిక బోధనోపకరణం
జ: ఘనాకార కడ్డీలు
32. కిందివాటిలో గణిత వనరు కానిది?
1) గణిత పత్రిక 2) గణిత గ్రంథాలయం 3) గణిత ఫోరం 4) గణిత రికార్డు
జ: 4 (గణిత రికార్డు)
33. నిర్ణీత కాల వ్యవధిలో సమాధానాలు చెప్పే విధంగా ఉండే ప్రశ్నలు అడిగే పద్ధతి లేదా పరీక్ష విధానం
జ: గణిత క్విజ్
34. ఆపరేషన్ బ్లాక్ బోర్డు పథకం ఎప్పుడు అమల్లోకి వచ్చింది?
జ: 1987
35. దశాంశ సంఖ్యలను చూపడానికి ఉపయోగపడే బోధనోపకరణం
జ: పూసల చట్రం
36. సమబాహు, సమద్విబాహు, విషమబాహు త్రిభుజ ఆకారాలను ఏర్పరచడానికి ఉపయోగపడే బోధనోపకరణం
జ: ఘనాకార కడ్డీలు
37. పాఠ్య పుస్తకం అంటే ప్రధాన మార్గదర్శక సూత్రాలను కలిగి ఉన్న ప్రామాణిక గ్రంథం అని తెలియజేసింది
జ: ఛాంబర్స్ ఇంగ్లిష్ డిక్షనరీ
38. Library అనే పదం Libar నుంచి వచ్చింది. Libar ఏ భాషా పదం?
జ: లాటిన్
39. ఎడ్గార్‌డేల్ అనుభవ శంకువులో నాటకీకరణాల కంటే ఎక్కువ అమూర్త స్వభావాన్ని అందించేవి?
జ: ప్రదర్శితాలు
40. పాఠ్య
పుస్తకం సమర్థతను లెక్కించే హంటర్స్ స్కోరు కార్డులో పాఠ్యపుస్తకం
ఉపయోగపడేవిధం, భౌతిక రూపం, విషయానికి ఇవ్వాల్సిన పాయింట్లు వరుసగా
జ: 50, 100, 250
గణితం - విద్యాప్రణాళిక
41. ప్రస్తుతం 3 నుంచి 5వ తరగతి వరకు గణిత పాఠ్యాంశాలను అమర్చడానికి ఉపయోగించిన విద్యాప్రణాళిక నిర్వహణ రీతి
జ: సర్పిలాకార, ఏకకేంద్ర వృత్తాకార
42. విషయ కాఠిన్యం, విషయ పరిపూర్ణక సూత్రాధారమైన పద్ధతి
జ: శీర్షిక పద్ధతి
43. కిందివాటిలో పునరుక్తి ఎక్కువగా ఉండే విద్యాప్రణాళికా నిర్వహణ రీతి
1) శీర్షిక పద్ధతి 2) ఏకకేంద్ర వృత్తాకార పద్ధతి
3) వర్తులాకార విధానం 4) ప్రకరణాల పద్ధతి
జ: 3 (వర్తులాకార విధానం)
44. ప్రస్తుతం 3 నుంచి 5వ తరగతి వరకు గల గణిత పాఠ్యాంశాల్లోని కింది ఏ కృత్యం పిల్లలకు అదనపు అభ్యసనంగా తోడ్పడుతుంది?
1) ఇవి చేయండి 2) ప్రయత్నించండి
3) ఆలోచించండి - చర్చించండి 4) అభ్యాసాలు
జ: 3 (ఆలోచించండి - చర్చించండి)
45. సంవత్సరానికి ఒకసారి శీర్షిక మాత్రమే పునరావృతమై విషయం పునరావృతం కాని పద్ధతి
జ: ఏకకేంద్ర వృత్తాకార
46. హెర్బార్ట్ సోపానాల్లో దేనిలో ఉపాధ్యాయుడు బోధనా సామగ్రిని ఎక్కువగా ఉపయోగిస్తాడు?
జ: ప్రదర్శన
47. పాఠ్యపుస్తకమనేది ఒక ప్రత్యేకమైన అధ్యయన శాఖకు ప్రాథమిక లేదా అనుబంధంగా ఉండే ప్రామాణిక గ్రంథం అన్నవారు
జ: లాంగ్
48. పాఠ్యపుస్తక మూల్యాంకనానికి ఉపయోగించే హంటర్ స్కోరు కార్డులో ఏ అంశానికి అతి తక్కువ స్కోరు కేటాయించారు?
జ: ఉపాధ్యాయులకు ఉపయోగపడే విధం
49. కిందివాటిలో వోగల్స్ స్పాట్ చెక్‌లిస్టులో ముఖ్యాంశం కానిది?
1) పుస్తక రచనా పద్ధతి 2) బోధనోపకరణాలు 3) పటాలు 4) అభ్యాసాలు
జ: 4 (అభ్యాసాలు)
50. కిందివాటిలో హంటర్ స్కోరు కార్డులో ఏ అంశానికి ఎక్కువ స్కోరు కేటాయించారు?
1) విషయం 2) పుస్తక బౌద్ధికరూపం 3) అభ్యాసాలు 4) భాషా శైలి
జ: 1 (విషయం)
గణితం - మూల్యాంకనం
51. విద్యార్థి భవిష్యత్ విద్యా విజ్ఞాన ప్రగతిని తెలియజేసే మూల్యాంకనం
జ: ప్రాగుక్తీకరణ మూల్యాంకనం
52. కిందివాటిలో సాధన పరీక్ష ప్రయోజనం కానిది?
1) విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయడం.
2) తరగతిని సెక్షన్‌లుగా విభజించడం.
3) విద్యార్థులను తుది పరీక్షలకు ప్రేరేపించడం.
4) విద్యార్థుల అభ్యసనంలో బలహీనతలు తెలుసుకోవడం.
జ: 4 (విద్యార్థుల అభ్యసనంలో బలహీనతలు తెలుసుకోవడం.)
53. ఆర్‌టీఈ - 2009లో నిరంతర సమగ్ర మూల్యాంకనం గురించి వివరించే అధ్యయనం ఎన్నోది?
జ: 5
54. నిర్మాణాత్మక మదింపులో ‘రాత అంశాలు’ అనే సామర్థ్యానికి కేటాయించిన మార్కుల శాతం?
జ: 10%
55. సంగ్రహణాత్మక మదింపులో 1, 2 తరగతుల గణితంలో మౌఖిక పరీక్షకు కేటాయించాల్సిన మార్కుల శాతం?
జ: 40%
56. 3 - 5వ తరగతుల గణిత సంకలనాత్మక మదింపులో ‘కారణాలు నిరూపణ’ అనే సామర్థ్యానికి కేటాయించాల్సిన మార్కులు?
జ: 10
57. గ్రేడ్ అనే పదానికి మూలమైన ‘గ్రాడ్యూస్’ ఏ భాషా పదం?
జ: గ్రీకు
58. పాండిత్యరంగంలో విద్యార్థుల వికాస మాపనానికి ఉపయోగించే సాధనం?
1) నియోజనాలు 2) పరీక్షలు 3) ప్రాజెక్టులు 4) అన్నీ
జ: 4 (అన్నీ)
59. వ్యక్తి లక్షణాంశ ఉనికిని తెలిపేవి?
జ: పరిశీలన పట్టికలు
శ్రీ ప్రజ్ఞ కాంపిటీటివ్ స్టడీసర్కిల్, తిరుపతి.
Courtesy from eenadu
For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
కామెంట్‌లు