25, నవంబర్ 2023, శనివారం

ఐటీడీలో వర్చువల్‌ రియాలిటీ కోర్సు | Virtual Reality Course at CITD

దిక్సూచిసీఐటీడీలో వర్చువల్‌ రియాలిటీ కోర్సు

D I K S U C H I

హైదరాబాద్‌–బాలానగర్‌లోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్‌(సీఐటీడీ)– ‘సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ వర్చువల్‌ రియాలిటీ ఫర్‌ ఇండస్ట్రీస్‌’ను నిర్వహిస్తోంది. కోర్సు వ్యవధి మూడు నెలలు. రోజుకు మూడు గంటలు తరగతులు ఉంటాయి. ప్రతినెలా రెండు, నాలుగు బుధవారాల్లో బ్యాచ్‌లు ప్రారంభమౌ తాయి. ప్రతి బ్యాచ్‌లో 15 మందికి అవకాశం కల్పిస్తారు. ఇంజనీరింగ్‌ విభాగాల్లో డిప్లొమా/ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసు కోవచ్చు. ఫస్ట్‌ కం ఫస్ట్‌ సర్వ్‌ పద్ధతిలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

కోర్సులోని అంశాలు

• ఫండమెంటల్స్‌ ఆఫ్‌ వర్చువల్‌ రియాలిటీ కాన్సెప్ట్‌, టెక్నాలజీస్‌, వీఆర్‌ హార్డ్‌వేర్‌ డివైజెస్‌, సెన్సర్స్‌; ఏఆర్‌/వీఆర్‌ టెక్నాలజీ; బేసిక్‌ నాలెడ్జ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌; బేసిక్‌ నాలెడ్జ్‌ ఆఫ్‌ క్యాడ్‌ ప్యాకేజ్‌.

ముఖ్య సమాచారం

• కోర్సు ఫీజు: రూ.5000

• ఫోన్‌ నెం: 040 29561793

• వెబ్‌సైట్‌: citdindia.org

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

సెయిల్‌లో ఆపరేటర్‌/ టెక్నీషియన్‌ ఖాళీలు | అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగం లో ఐటీఐ, డిప్లొమా, మెట్రిక్యులేషన్‌ ఉత్తీర్ణత | Operator/ Technician Vacancies in SAIL

సెయిల్‌లో ఆపరేటర్‌/ టెక్నీషియన్‌ ఖాళీలు
ఒడిశాలోని స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (సెయిల్‌), రవుర్కెలా స్టీల్‌ ప్లాంట్‌(ఆర్‌ఎస్‌పీ)లో... కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 110

1. ఆపరేటర్‌–కం–టెక్నీషియన్‌

2. అటెండెంట్‌ – కం– టెక్నీషియన్‌(ట్రెయినీ)

విభాగాలు: బాయిలర్‌ ఆపరేటర్‌, ఎలక్ట్రికల్‌ సూపర్‌ వైజర్‌, ఎలక్ట్రీషియన్‌, ఫిట్టర్‌, ఎలక్ట్రానిక్స్‌, మెషినిస్ట్‌, డీజిల్‌ మెకానిక్‌, సీఓపీఏ, ఐటీ.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగం లో ఐటీఐ, డిప్లొమా, మెట్రిక్యులేషన్‌ ఉత్తీర్ణత.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా

దరఖాస్తు ఫీజు: ఆపరేటర్‌–కం–టెక్నీషియన్‌కు రూ.500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.150; అటెండెంట్‌–కం–టెక్నీషియన్‌లకు రూ.300, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.100

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 16

వెబ్‌సైట్‌: https://www.sail.co.in/en/home

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

హెచ్‌సీయూలో ఫ్యాకల్టీ | Faculty Jobs in HCU

హెచ్‌సీయూలో ఫ్యాకల్టీ
యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌– డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: ప్రొఫెసర్‌/అసోసియేట్‌ ప్రొఫెసర్‌

ఖాళీలు: 22

సబ్జెక్టులు:మేథమెటిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌, ఫిజిక్స్‌, ఇంజనీరింగ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, హెల్త్‌ సైకాలజీ, ఇంగ్లీష్‌, ఫిలాసఫీ, ఆంత్రోపా లజీ, డ్యాన్స్‌, మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌

అర్హత:సంబంధిత సబ్జెక్టులో మాస్ట ర్స్‌ డిగ్రీ, ఎంఫిల్‌/పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు బోధన/ పరిశోధనానుభవం ఉండాలి.

వేతనం: నెలకు ప్రొఫెసర్‌ పోస్టుకు రూ.1,44,200– రూ.2,18,200; అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు రూ.1,31,400 – రూ.2,17,100

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 30

దరఖాస్తు హార్డ్‌కాపీలు పోస్టులో పంపేందుకు చివరి తేదీ: డిసెంబరు 7

వెబ్‌సైట్‌: https://uohyd.ac.in/teaching-guest-faculty/

నేడు 'హార్టీకల్చర్' ఆఖరి విడత కౌన్సెలింగ్ | ఆసక్తి ఉండి దరఖాస్తు చేసుకోలేకపోయిన విద్యార్థులు కూడా హాజరుకావచ్చు. | Today 'Horticulture' final phase counseling | Students who are interested but unable to apply can also attend.

నేడు 'హార్టీకల్చర్' ఆఖరి విడత కౌన్సెలింగ్
తాడేపల్లిగూడెం: డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని తొమ్మిది ఉద్యాన కళాశాలల్లో బీఎస్సీ (హార్టీకల్చర్) డిగ్రీ కోర్సులో ప్రవేశానికి ఆఖరి విడత కౌన్సెలింగ్ శనివారం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెంలోని పరిపాలనా భవనంలో జరుగనుంది. గతంలో ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు, ఆసక్తి ఉండి దరఖాస్తు చేసుకోలేకపోయిన విద్యార్థులు కూడా హాజరుకావచ్చు. విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాల్సి ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలకు సంబంధించి 100 సీట్లకు పైగా కౌన్సెలింగ్ జరుగుతుందని, ఇతర వివరాలకు ఉద్యాన వర్సిటీ వెబ్సైట్లో చూడవచ్చునని రిజిస్ట్రార్బి శ్రీనివాసులు పేర్కొన్నారు.

24, నవంబర్ 2023, శుక్రవారం

Junior Assistant cum Computer Assistant in Revenue Department under Group-IV Notification No.23/2021 selection process shortlisted the candidates

Recruitments – APPSC Direct Recruitment for the post of – Junior Assistant cum Computer Assistant in Revenue Department under Group-IV Notification No.23/2021 selection process shortlisted the candidates @ 1:2 Certificate verification conducted – ‘Computer Proficiency Test’ held on 12.10.2023 – selection list published calling for objections / claims if any from the affected candidate Regarding.

Collectorate

Ananthapuramu

View (195 KB) 

Selected List (1 MB) 

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ పద్దతిన పని చేసేందుకు 13-10-2023 న ఇచ్చిన నోటిఫికేషన్లో దరఖాస్తు చేసుకుని మెరిట్ ఆధారంగా ఎంపికైన అభ్యర్థులకు 27న కౌన్సెలింగ్

అనంతపురం(వైద్యం), న్యూస్టుడే: వైద్య విధాన పరిషత్ పరిధిలో వివిధ కేడర్లలో ఖాళీగా ఉన్న పోస్టులకు సంబంధించి ఒక సంవత్సరం పాటు కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ పద్దతిన పని చేసేందుకు 13-10-2023 న ఇచ్చిన నోటిఫికేషన్లో దరఖాస్తు చేసుకుని మెరిట్ ఆధారంగా ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 27న ఉదయం 10 గంటలకు అనంతపురం లోని సర్వజన వైద్యశాల ఆవరణలో ఉన్న వైద్యవిధాన పరిషత్ (డీసీ హెచ్ ఎస్) కార్యాలయంలో కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు సమన్వయ కర్త డాక్టర్ పాల్ రవికుమార్ తెలిపారు. పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల
వివరాలు http:///ananthapuramu.ap.gov.in వెబ్సైట్లో ఉంచటంతో పాటు కార్యాలయంలోని నోటీసు బోర్డులో ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు కౌన్సెలింగ్కు తమ ఒరి
జినల్ విద్యార్హత సర్టిఫికెట్స్ తీసుకుని హాజరుకావాలని తెలిపారు.

+

వైద్యుల పోస్టుల భర్తీకి వాక్-ఇన్ ఇంటర్వ్యూలు Walk-in interviews for filling up the posts of doctors

వైద్య విధాన పరిషత్ (డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్) ఆధ్వర్యంలో పనిచేసే ఆసుపత్రుల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషాలిటీ వైద్యుల పోస్టులను శాశ్వత, ఒప్పంద విధానంలో భర్తీ చేసేందుకు డిసెంబరు 11, 13, 15 తేదీల్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూలు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైద్య విధాన పరిషత్ ప్రధాన కార్యాలయంలో జరగనున్నాయని ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్ బోర్డు గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. 11న జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, డెర్మటాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, 13న గైనకాలజీ, అనస్తీషియా, ఈఎన్టీ, పెధాలజీ, 15న పీడియాట్రిక్స్, ఆర్గో, ఆప్తమాలజీ, రేడియాలజీ, సైకియాట్రీ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు జరుగుతాయని, పూర్తి వివరాలు https://cfw.ap.nic.in వెబ్సైట్లో ఉన్నాయని తెలిపింది.

150 స్పెషలిస్ట్ వైద్య పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
వచ్చే నెల 11, 13, 15 తేదీల్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూలు సాక్షి, అమరావతి: రాష్ట్ర వైద్య శాఖ పరిధిలోని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ (గతంలో ఏపీవీ వీపీ) ఆస్పత్రుల్లో 13 స్పెషాలిటీల్లో 150
సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్(సీఏఎస్ఎస్) పోస్టుల భర్తీకి ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. వాక్-ఇన్ రిక్రూట్మెంట్ ద్వారా శాశ్వత, కాంట్రాక్ట్ పద్ధతుల్లో పోస్టుల భర్తీ చేపట్టనున్నామని బోర్డ్ మెంబర్ సెక్రటరీ ఎం. శ్రీనివాసరావు తెలిపారు. వచ్చే నెల 11వ తేదీ జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, డెర్మటాలజీ, ఫోరెన్సిక్ సైన్స్, 13వ తేదీ గైనకాలజీ, అనస్తీషియా, ఈఎన్టీ, పాథాలజీ, 15వ తేదీ పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, ఆప్తమాలజీ, రేడియాలజీ, సైకియాట్రీ విభాగాల వారీగా ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. అర్హులైన అభ్యర్థులు గుంటూరు జిల్లా తాడేపల్లి పాతూరు రోడ్డులోని డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కార్యాలయంలో షెడ్యూల్ ప్రకారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్యలో ఇంటర్వ్యూలకు హాజరవ్వాల్సి ఉంటుంది. నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాల కోసం https://cfw.ap.nic.in/, http://hmfw.ap.gov.in/ వెబ్సైట్లను సందర్శించవచ్చు.

కంప్యూటర్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం | Applications for Computer Training

పెనుకొండ రూరల్, నవంబరు 23: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్థానిక పరిటాల శ్రీరాములు ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు చేసిన స్కిల్హాబ్లో నిరుద్యోగులకు ఉచితంగా కంప్యూటర్ శిక్షణ ఇస్తున్నట్లు ఎంపీడీఓ శివశంకరప్ప గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. నిరుద్యోగులకు డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సుపై మూడు నెలలు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. పెనుకొండలో ఉన్న కళాశాలలోని స్కిల్హాబ్లో ఈనెల 30లోగా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు స్కిల్హబ్ కోఆర్డినేటర్ శివప్రసాద్ 9676706976కు సంప్రదించాలన్నారు.

డిగ్రీ ఆనర్స్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

కదిరిఅర్బన్, నవంబరు 23: పట్టణంలోని ఎన్డీ -ఎస్ఎన్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో 4 ఏళ్ల డిగ్రీ ఆనర్స్ ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. స్మిత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ ఆనర్స్ లో కెమిస్ట్రీ, కామర్స్, తెలుగు సబెక్టులలో ప్రవేశాలకు అర్హత కలిగిన విద్యార్థులు కళాశాలలో సప్రందించి దరఖాస్తులు అందిచాలన్నారు. శ్రీసత్యసాయి జిల్లాలోనే డిగ్రీ ఆనర్స్ కోర్సు మొట్టమొదటిగా కదిరి డిగ్రీ కళాశాలో ప్రారంభమైనట్లు చెప్పారు. అవకా శాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డిగ్రీ ఆనర్స్ చదివిన విద్యార్థులు నేరుగా వివిధ విశ్వవిద్యాలయాల్లో సంబంధిత సబ్జెక్టులలో ద్వితీయ సంవత్సరం పీజీలో ప్రవేశం పొందవచ్చని చెప్పారు.

12 బార్లకు నోటిఫికేషన్

అమరావతి, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 12 బార్ల వేలానికి ఎక్సైజ్ కమిషనర్ వివేక్ యాదవ్ గురువారం నోటిఫికేషన్ జారీచేశారు. గురువారం నుంచి ఈనెల 28 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తా మని, 30న ఆన్లైన్ వేలం ప్రక్రియలో బార్లు కేటాయిస్తామని తెలిపారు. ఇప్పుడు కేటాయించే బార్ లైసెన్సుల కాలపరిమితి రెండేళ్లుగా పేర్కొన్నారు. 50 వేల వరకు జనాభా ఉంటే రూ.5 లక్షలు. 50 వేల నుంచి 5 లకల జనాభాకు రూ.7.5 లక్షలు, 5లక్షలు దాటిన ప్రాంతాల్లో రూ.10 లక్షలు దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుందని వివరించారు.

12 బార్ల లైసెన్స్ల కోసం నోటిఫికేషన్ జారీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 12 బార్లకు వేలం ద్వారా లైసెన్సులు కేటాయించేందుకు ఎక్సైజ్
శాఖ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలో నిర్వహించిన వేలంలో లైసెన్సులు
దక్కించుకుని, బిడ్డర్ల లైసెన్స్ ఫీజు, నాన్ రిఫండబుల్ చార్జీలు, బిడ్ మొత్తం చెల్లించడంలో
విఫలమైన బార్లకు ప్రస్తుతం మరోసారి వేలం నిర్వహించాలని నిర్ణయించారు. అందుకోసం
ఈ నెల 23 నుంచి 28 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 30న ఆన్లైన్ ద్వారా వేలం ప్రక్రియ నిర్వహిస్తారు. వివరాల కోసం http://apcpe.aptonline.in వెబ్సైట్లో సంప్రదించాలని ఎక్సైజ్ శాఖ కమిషనర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

27, 28 తేదీల్లో AGBSC ఏజీబీఎస్సీ సీట్లకు వెబ్ ఆప్షన్లు

27, 28 తేదీల్లో ఏజీబీఎస్సీ సీట్లకు వెబ్ ఆప్షన్లు
అమరావతి, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ కళాశాలల్లో అగ్రికల్చర్ బీఎస్సీ(హాన్) కోర్సులో ప్రవేశానికి ఈనెల 27, 28 తేదీల్లో రెండో దశ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ నిర్వహించను న్నట్లు రిజిస్ట్రార్ రామారావు గురువారం తెలిపారు. అగ్రిసెట్-2023 ర్యాంక్ల ద్వారా డిప్లొమా విద్యార్థులు వెబ్ ఆప్షన్ల ద్వారా ఏజీబీఎస్సీలో మిగిలి ఉన్న సీట్లను పొందవచ్చని తెలిపారు. ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్న డిప్లొమా విద్వార్థులు రిజిస్టర్ చేసుకోకపోయినా వెబ్ ఆప్షన్లు వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు.

23, నవంబర్ 2023, గురువారం

NLC ఇండియా గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీలు గేట్ 2023 ద్వారా పొందండి 295 పోస్ట్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి | NLC India Graduate Executive Trainees GET Through GATE 2023 Apply Online for 295 Post

గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ గేట్ 2023 ద్వారా గెట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ఎన్‌ఎల్‌సి ఇండియా గెట్ 2023లో ఆసక్తి ఉన్న మరియు అర్హతను పూర్తి చేసే అభ్యర్థులందరూ 22 నవంబర్ 2023 నుండి 21 డిసెంబర్ 2023 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. సమాచారం కోసం ప్రకటనను చూడండి. NLC ఇండియా గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పరీక్ష 2023లో వయోపరిమితి, సిలబస్, ఎంపిక విధానం, పే స్కేల్‌కు సంబంధించినవి.

NLC ఇండియా లిమిటెడ్

NLC గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీలు గేట్ 2023 పరీక్ష ద్వారా పొందండి

NCL GET అడ్వాట్ నెం. : 08/2023 | నోటిఫికేషన్ యొక్క సంక్షిప్త వివరాలు

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తు ప్రారంభం: 22/11/2023
  • ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 21/12/2023 సాయంత్రం 05:00 గంటల వరకు
  • పూర్తి ఫారమ్ చివరి తేదీ 21/12/2023 :
  • పరీక్ష తేదీ: షెడ్యూల్ ప్రకారం
  • అడ్మిట్ కార్డ్ అందుబాటులో ఉంది: పరీక్షకు ముందు

దరఖాస్తు రుసుము

  • Gen / OBC/ EWS : 854 /-
  • SC / ST : 354/-
  • PH (దివ్యాంగ్) : 354/-
  • పరీక్ష రుసుమును డెబిట్ కార్డ్ / క్రెడిట్ కార్డ్ / నెట్ బ్యాంకింగ్ / UPI ఫీజు మోడ్ ద్వారా మాత్రమే చెల్లించండి.

NLC ఇండియా గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ 2023: వయోపరిమితి 01/11/2023 నాటికి

  • కనీస వయస్సు: NA
  • గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు
  • NLC ఇండియా లిమిటెడ్ గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ GET పరీక్ష 2023 ప్రకారం వయస్సు సడలింపు.

NLC గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ GET 2023 : ఖాళీ వివరాలు మొత్తం : 295 పోస్ట్

వాణిజ్య పేరు

మొత్తం పోస్ట్

NLC ఇండియా గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ అర్హత

మెకానికల్

120

  • గేట్ 2023 పరీక్ష స్కోర్‌తో మెకానికల్ ఇంజనీరింగ్/మెకానికల్ & ప్రొడక్షన్ ఇంజనీరింగ్‌లో BE/B.Tech డిగ్రీ.

ఎలక్ట్రికల్

109

  • గేట్ 2023 పరీక్ష స్కోర్‌తో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్/పవర్ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్ డిగ్రీ.

సివిల్

28

  • గేట్ 2023 పరీక్ష స్కోర్‌తో సివిల్ ఇంజనీరింగ్/సివిల్ & స్ట్రక్చరల్ ఇంజినీరింగ్‌లో BE / B.Tech డిగ్రీ.

గనుల తవ్వకం

17

  • గేట్ 2023 పరీక్ష స్కోర్‌తో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్/పవర్ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్ డిగ్రీ.

కంప్యూటర్

21

  • గేట్ 2023 పరీక్ష స్కోర్‌తో మైనింగ్ ఇంజినీరింగ్‌లో BE/B.Tech డిగ్రీ.

ద్వారా NCL GET పరీక్షను ఎలా పూరించాలి గేట్ ఆన్‌లైన్ ఫారమ్ 2023

  • NLC ఇండియా గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీలు GET 2023. అభ్యర్థి 22/11/2023 నుండి 21/12/2013 మధ్య దరఖాస్తు చేసుకోవచ్చు .
  • ఎన్‌ఎల్‌సి ఇండియా గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీలు గేట్ 2023 స్కోర్ జాబ్స్ 2023 ద్వారా పొందండి రిక్రూట్‌మెంట్ దరఖాస్తు ఫారమ్‌ను దరఖాస్తు చేయడానికి ముందు అభ్యర్థి నోటిఫికేషన్ చదవండి.
  • దయచేసి అన్ని పత్రాలను తనిఖీ చేసి, సేకరించండి - అర్హత, ID ప్రూఫ్, చిరునామా వివరాలు, ప్రాథమిక వివరాలు.
  • రిక్రూట్‌మెంట్ ఫారమ్‌కి సంబంధించిన దయతో సిద్ధంగా ఉన్న స్కాన్ డాక్యుమెంట్ - ఫోటో, సైన్, ID ప్రూఫ్, మొదలైనవి.
  • దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించే ముందు ప్రివ్యూ మరియు అన్ని కాలమ్‌లను జాగ్రత్తగా తనిఖీ చేయాలి.
  • అభ్యర్థి దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటే తప్పనిసరిగా సమర్పించాలి. మీకు అవసరమైన దరఖాస్తు రుసుము లేకపోతే మీ ఫారమ్ పూర్తి కాలేదు.
  • ఫైనల్ సమర్పించిన ఫారమ్ నుండి ప్రింట్ అవుట్ తీసుకోండి.

తాజా అప్‌డేట్‌ల కోసం మొబైల్ యాప్‌లను డౌన్‌లోడ్ చేయండి

కొన్ని ఉపయోగకరమైన ముఖ్యమైన లింకులు

ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి

ఇక్కడ నొక్కండి

నోటిఫికేషన్‌ను డౌన్‌లోడ్ చేయండి

ఇక్కడ నొక్కండి

రెజ్యూమ్ మేకర్, ఫోటో రీసైజర్, టైపింగ్ టెస్ట్ మరియు మరిన్ని

మా ఛానెల్‌లో చేరండి

WhatsApp

అధికారిక వెబ్‌సైట్

NCL ఇండియా అధికారిక వెబ్‌సైట్

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ RCF మేనేజ్‌మెంట్ ట్రైనీస్ మెటీరియల్ మరియు లీగల్ ఆన్‌లైన్ ఫారం 2023 | Rashtriya Chemicals and Fertilizers Limited RCF Management Trainees Material and Legal Online Form 2023

మేనేజ్‌మెంట్ ట్రైనీస్ మెటీరియల్ మరియు లీగల్ 2023 కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ RCF మేనేజ్‌మెంట్ ట్రైనీస్ మెటీరియల్ మరియు లీగల్ 2023లో ఆసక్తి ఉన్న అభ్యర్థులందరూ 17 నవంబర్ 2023 నుండి 01 డిసెంబర్ 2023 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. RCF మేనేజ్‌మెంట్ ట్రైనీస్ మెటీరియల్ మరియు లీగల్ 2023లో వయోపరిమితి, సిలబస్, ఎంపిక విధానం, పే స్కేల్‌కు సంబంధించిన సమాచారం కోసం ప్రకటనను చూడండి.

రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (RCF)

RCF మేనేజ్‌మెంట్ ట్రైనీలు MT రిక్రూట్‌మెంట్ 2023

RCF MT 2023 | నోటిఫికేషన్ యొక్క సంక్షిప్త వివరాలు

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తు ప్రారంభం: 17/11/2023
  • ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 01/12/2023 సాయంత్రం 05:00 వరకు
  • పూర్తి ఫారమ్ చివరి తేదీ 01/12/2023 :
  • పరీక్ష తేదీ: షెడ్యూల్ ప్రకారం
  • అడ్మిట్ కార్డ్ అందుబాటులో ఉంది: పరీక్షకు ముందు

దరఖాస్తు రుసుము

  • Gen / OBC/ EWS : 100 0/-
  • SC / ST : 0/-
  • PH (దివ్యాంగ్) : 0/-
  • అన్ని వర్గం స్త్రీలు : 0/-
  • పరీక్ష రుసుమును డెబిట్ కార్డ్ / క్రెడిట్ కార్డ్ / నెట్ బ్యాంకింగ్ / UPI ఫీజు మోడ్ ద్వారా మాత్రమే చెల్లించండి.

RCF మేనేజ్‌మెంట్ ట్రైనీస్ రిక్రూట్‌మెంట్ 2023 : వయో పరిమితి 01/09/2023 నాటికి

  • కనీస వయస్సు: NA
  • గరిష్ట వయస్సు: 27 సంవత్సరాలు
  • రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (RCF) మేనేజ్‌మెంట్ ట్రైనీస్ రిక్రూట్‌మెంట్ 2023 ప్రకారం వయస్సు సడలింపు.

RCF మేనేజ్‌మెంట్ ట్రైనీ పరీక్ష 2023 : ఖాళీ వివరాలు మొత్తం : 25 పోస్ట్

పోస్ట్ పేరు

మొత్తం పోస్ట్

RCF అప్రెంటీస్ అర్హత

మేనేజ్‌మెంట్ ట్రైనీ (మెటీరియల్)

23

  • కనీసం 60% మార్కులతో కెమికల్ ఇంజినీర్/ పెట్రోకెమికల్ ఇంజినీర్/ మెకానికల్ ఇంజినీర్/ ఎలక్ట్రికల్ ఇంజినీర్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీర్‌లో బీఈ/బీటెక్ డిగ్రీ.
  • SC / ST అభ్యర్థులకు: 55% మార్కులు.
  • మరిన్ని అర్హత వివరాలు నోటిఫికేషన్ చదవండి.

మేనేజ్‌మెంట్ ట్రైనీ (లీగల్)

02

  • 60% మార్కులతో భారతదేశంలోని ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా (LLB) డిగ్రీ మరియు LLM డిగ్రీ.

ఎలా పూరించాలి RCF మేనేజ్‌మెంట్ ట్రైనీ MT పోస్ట్ ఆన్‌లైన్ ఫారమ్ 2023ని

  • రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (RCF) మేనేజ్‌మెంట్ ట్రైనీస్ మెటీరియల్ మరియు లీగల్ పోస్ట్ 2023. అభ్యర్థి 17/11/2023 నుండి 01/12/2013 మధ్య దరఖాస్తు చేసుకోవచ్చు .
  • రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (RCF) మేనేజ్‌మెంట్ ట్రైనీస్ జాబ్స్ 2023లో రిక్రూట్‌మెంట్ అప్లికేషన్ ఫారమ్‌ను అప్లై చేయడానికి ముందు అభ్యర్థి నోటిఫికేషన్ చదవండి.
  • దయచేసి అన్ని పత్రాలను తనిఖీ చేసి, సేకరించండి - అర్హత, ID ప్రూఫ్, చిరునామా వివరాలు, ప్రాథమిక వివరాలు.
  • రిక్రూట్‌మెంట్ ఫారమ్‌కి సంబంధించిన దయతో సిద్ధంగా ఉన్న స్కాన్ డాక్యుమెంట్ - ఫోటో, సైన్, ID ప్రూఫ్, మొదలైనవి.
  • దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించే ముందు ప్రివ్యూ మరియు అన్ని కాలమ్‌లను జాగ్రత్తగా తనిఖీ చేయాలి.
  • అభ్యర్థి దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటే తప్పనిసరిగా సమర్పించాలి. మీకు అవసరమైన దరఖాస్తు రుసుము లేకపోతే మీ ఫారమ్ పూర్తి కాలేదు.
  • ఫైనల్ సమర్పించిన ఫారమ్ నుండి ప్రింట్ అవుట్ తీసుకోండి.

తాజా అప్‌డేట్‌ల కోసం

కొన్ని ఉపయోగకరమైన ముఖ్యమైన లింకులు

ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి

ఇక్కడ నొక్కండి

నోటిఫికేషన్‌ను డౌన్‌లోడ్ చేయండి

ఇక్కడ నొక్కండి

రెజ్యూమ్ మేకర్, ఫోటో రీసైజర్, టైపింగ్ టెస్ట్ మరియు మరిన్ని

WhatsApp

అధికారిక వెబ్‌సైట్

RCF అప్రెంటిస్ అధికారిక వెబ్‌సైట్

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

దరఖాస్తుల ఆహ్వానం Invitation of Applications

ఎస్కేయూ. న్యూస్టుడే: కేంద్రీయ విశ్వవిద్యాలయంలో సంస్కృత భాష కోర్సు అభ్యసించే అవకాశం కల్పించినట్లు వీసీ ఎస్ఏ కోరి తెలిపారు. సంస్కృత భాషా సర్టిఫికెట్ కోర్సు నిర్వహిస్తు న్నామన్నారు. 15 సంవత్సరాలు పైబడిన వారి నుంచి విశ్రాంత ఉద్యోగుల వరకూ ఈ కోర్సులో చేరవచ్చు. వారంలో మూడు రోజులు, రోజుకు ఒకగంట సేపు తరగతులు జరుగుతాయన్నారు. ఆసక్తి గల వారు ఇందులో చేరవచ్చని తెలిపారు. వివరాక9756076965 ఫోను నంబరును సంప్రదించవచ్చని  విజ్ఞప్తి చేశారు.

Work From Home Jobs Do not pay money for these jobs

హైదరాబాద్‌లోమార్‌కమోర్‌ కన్సల్టింగ్‌
1. సోషల్‌ మీడియా
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: నవంబరు 30, 2023
అర్హతలు: కంటెంట్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

internshala.com/i/ba89b5

2. బిజినెస్‌ డెవలప్‌మెంట్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: నవంబరు 30, 2023

అర్హతలు: క్లయింట్‌ రిలేషన్‌షిప్‌, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, లీడ్‌ జనరేషన్‌ నైపుణ్యాలు

internshala.com/i/97541b

3. సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: నవంబరు 30, 2023

అర్హతలు: కంటెంట్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

internshala.com/i/ddd674

4. హ్యూమన్‌ రిసోర్సెస్‌

సంస్థ: మార్‌కమోర్‌ కన్సల్టింగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: నవంబరు 30, 2023

అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌ నైపుణ్యాలు

internshala.com/i/01d51e

ఐటీ ఇన్‌ఫ్రా/ డెవోప్స్‌

సంస్థ: ల్యాబ్‌చైల్డ్‌ సొల్యూషన్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.2,000

దరఖాస్తు గడువు: నవంబరు 30, 2023

అర్హతలు: కంప్యూటర్‌ నెట్‌వర్కింగ్‌, డెవోప్స్‌, గిట్‌హబ్‌, లినక్స్‌, సిస్టమ్‌ అడ్మినిస్ట్రేటర్‌ నైపుణ్యాలు

internshala.com/i/133820

ఎడ్యుకేషనల్‌ వీడియో క్రియేషన్‌

సంస్థ: ఎస్‌ఆర్‌ ఎడ్యు టెక్నాలజీస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.15,000-20,000

దరఖాస్తు గడువు: నవంబరు 27, 2023

అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటంలో నైపుణ్యం

internshala.com/i/ca0dbd

మీడియా అండ్‌ పీఆర్‌

సంస్థ: కనెక్షన్స్‌ ఐమేగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.15,000

దరఖాస్తు గడువు: నవంబరు 27, 2023

అర్హతలు: క్రియేటివ్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

internshala.com/i/28c6bd

గుంటూరు, హైదరాబాద్‌,  విజయవాడ, విశాఖపట్నంలలో

రిక్రూట్‌మెంట్‌

సంస్థ: సింప్లిఫై సొల్యూషన్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: నవంబరు 29, 2023

అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌ నైపుణ్యాలు

internshala.com/i/9150ff

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

నోటిఫికేషన్స్‌ | ప్రభుత్వ ఉద్యోగాలు | ఎన్‌ఐఐహెచ్‌లో పర్సనల్‌ అసిస్టెంట్‌ ఖాళీలు | టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు | ఓయూలో ఉచిత సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమ్స్‌ కోచింగ్‌ | ఉస్మానియా యూనివర్సిటీలో డిప్లొమా కోర్సులు | తాత్కాలిక ప్రాతిపదికన పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు

ఎన్‌ఐఐహెచ్‌లో పర్సనల్‌ అసిస్టెంట్‌ ఖాళీలు ముంబయిలోని ఐసీఎంఆర్‌- నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇమ్యునోహెమటాలజీ (ఎన్‌ఐఐహెచ్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ప్రభుత్వ ఉద్యోగాలు

ఎన్‌ఐఐహెచ్‌లో పర్సనల్‌ అసిస్టెంట్‌ ఖాళీలు

ముంబయిలోని ఐసీఎంఆర్‌- నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇమ్యునోహెమటాలజీ (ఎన్‌ఐఐహెచ్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

1. పర్సనల్‌ అసిస్టెంట్‌: 01 పోస్టు 2. లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌: 01 పోస్టు

అర్హత: ఇంటర్‌, డిగ్రీ, షార్ట్‌ హ్యాండ్‌, టైపింగ్‌ స్కిల్‌.

ఎంపిక: ఆన్‌లైన్‌ పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఉంటుంది.

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో.

దరఖాస్తు ఫీజు: రూ.300 ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు మినహాయించారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 27-11-2023.

రాత పరీక్ష తేదీ: 10.12.2023.

స్కిల్‌ టెస్ట్‌ తేదీ: 17.12.2023.

వెబ్‌సైట్‌: https://niih.org.in/

మహాత్మాగాంధీ వర్సిటీలో..

బిహార్‌ రాష్ట్రం మోతిహరిలోని మహాత్మాగాంధీ సెంట్రల్‌ యూనివర్సిటీ (ఎంజీసీయూ), కామర్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సైన్సెస్‌ విభాగం... టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

1. ప్రొఫెసర్‌: 02 పోస్టులు  2. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌: 03 పోస్టులు

విభాగాలు: కామర్స్‌, మేనేజ్‌మెంట్‌, సైన్స్‌.

అర్హత: సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీ, నెట్‌/ స్లెట్‌/ సెట్‌ ఉత్తీర్ణతతో పాటు బోధన/ పరిశోధనానుభవం ఉండాలి.

దరఖాస్తు ఫీజు: రూ.2,000. ఎస్సీ/ ఎస్టీ/ మహిళలు/ దివ్యాంగులకు మినహాయించారు.

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 02-12-2023.

వెబ్‌సైట్‌: https://mgcub.ac.in/

ప్రవేశాలు

ఓయూలో ఉచిత సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమ్స్‌ కోచింగ్‌

హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన సివిల్‌ సర్వీసెస్‌ అకాడమీ- యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ (ప్రిలిమ్స్‌)కు సంబంధించి ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులు కోరుతోంది. ఉస్మానియా వర్సిటీ పరిధిలో పీజీ, పీహెచ్‌డీ చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉచిత యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ (ప్రిలిమ్స్‌) కోచింగ్‌

అర్హత: ఓయూ పీహెచ్‌డీ విద్యార్థులు, క్యాంపస్‌ కాలేజీలతో పాటు సికింద్రాబాద్‌, సైఫాబాద్‌ పీజీ కళాశాలలు, నిజాం కళాశాలకు చెందిన పీజీ విద్యార్థులు అర్హులు.

సీట్ల సంఖ్య: 100.

ఎంపిక: డిగ్రీ మార్కులు, పీజీ ఎంట్రన్స్‌లో సాధించిన ర్యాంకు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అనుసరించి. శిక్షణ వ్యవధి: నాలుగున్నర నెలలు.

దరఖాస్తు: ఓయూ వెబ్‌సైట్‌లో దరఖాస్తును పూర్తిచేసి, ధ్రువపత్రాల నకళ్లను ఓయూ సివిల్‌ సర్వీసెస్‌ అకాడమీ కార్యాలయంలో అందజేయాలి.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 02-12-2023.

పూర్తి వివరాలకు: 8331041332.

వెబ్‌సైట్‌: https://www.osmania.ac.in/

ఉస్మానియా యూనివర్సిటీలో డిప్లొమా కోర్సులు

ఉస్మానియా యూనివర్సిటీలోని జర్మన్‌ విభాగం- 2023-24 విద్యా సంవత్సరానికి డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

ఫ్రెంచ్‌/ జర్మన్‌లో డిప్లొమా కోర్సులు(జూనియర్‌/ సీనియర్‌): వ్యవధి నాలుగు నెలలు

అర్హత: జూనియర్‌ డిప్లొమాకు ఇంటర్మీడియట్‌, సీనియర్‌ డిప్లొమాకు జూనియర్‌ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపిక: ప్రవేశ పరీక్ష ఆధారంగా.

దరఖాస్తుకు చివరి తేదీ: 04-12-2023.

వెబ్‌సైట్‌: https://www.osmania.ac.in/

వాక్‌ఇన్‌

సీఆర్‌ఐడీఏలో యంగ్‌ ప్రొఫెషనల్‌

హైదరాబాద్‌ సంతోష్‌నగర్‌లోని సెంట్రల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డ్రైల్యాండ్‌ అగ్రికల్చర్‌- తాత్కాలిక ప్రాతిపదికన పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

యంగ్‌ ప్రొఫెషనల్‌-1, 2: 04 పోస్టులు

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత.

వేతనం: నెలకు వైపీ-1 పోస్టుకు రూ.25,000; వైపీ-2 పోస్టుకు రూ.35,000.

ఇంటర్య్వూ తేది: 07-12-2023.

ప్రదేశం: సెంట్రల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డ్రైల్యాండ్‌ అగ్రికల్చర్‌, సంతోష్‌నగర్‌, హైదరాబాద్‌.

వెబ్‌సైట్‌: http://www.icar-crida.res.in/

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

నీట్-2024 సిలబస్ తగ్గింపు NEET-2024 Syllabus Reduction

నీట్-2024 సిలబస్ తగ్గింపు
» కెమిస్ట్రీ, బయాలజీలో కొన్ని చాప్టర్లు తొలగింపు!
న్యూఢిల్లీ, నవంబరు 22 : వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించిన నీట్ యూజీ -2024 పరీక్ష సిలబస్ ను ఎన్టీఏ తగ్గించింది. సీబీఎస్ఈ, ఇతర బోర్డులు తమ సిలబస్ చేసిన మార్పులకు అనుగుణంగా ఈ చర్యలు తీసుకుంది. రసాయన శాస్త్రం(కెమిస్ట్రీ) నుంచి తొమ్మిది పాఠాలు, జీవశాస్త్రం(బయాలజీ) నుంచి తొమ్మిది పాఠాలను నీట్ సిలబస్ నుంచి తొలగించింది. విద్యార్థులు ఈ మార్పులను గమనించి పరీక్షకు సిద్ధం కావాలని కోరింది. అయితే, సిలబస్లో చేసిన ఈ అనవసర మార్పులు విద్యార్థులను గందరగోళానికి గురిచేస్తాయనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
యూజీ-2024 పరీక్ష వచ్చే ఏడాది మే 5న జరగనుంది.
నీట్

22, నవంబర్ 2023, బుధవారం

IDBI: ఐడీబీఐ బ్యాంకులో 2,100 జేఏఎం/ ఎగ్జిక్యూటివ్ పోస్టులు

IDBI: ఐడీబీఐ బ్యాంకులో 2,100 జేఏఎం/ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 

ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ బ్యాంక్‌ లిమిటెడ్‌)…  2023-24 సంవత్సరానికి దేశవ్యాప్తంగా ఉన్న ఐడీబీఐ శాఖల్లో జేఏఎం/ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.  

వివరాలు:

1. జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (జేఏఎం), గ్రేడ్ ‘ఒ’: 800 (ఎస్సీ- 120, ఎస్టీ- 60, ఓబీసీ- 216, ఈడబ్ల్యూఎస్‌- 80, యూఆర్‌- 324)

2. ఎగ్జిక్యూటివ్‌- సేల్స్ అండ్ ఆపరేషన్స్ (ఈఎస్‌వో)(ఒప్పంద ప్రాతిపదికన): 1300 (ఎస్సీ- 200, ఎస్టీ- 86, ఓబీసీ- 326, ఈడబ్ల్యూఎస్‌- 130, యూఆర్‌- 558)

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: 01-11-2023 నాటికి 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: జూనియర్ అసిస్టెంట్ మేనేజర్‌ పోస్టులకు ఏడాదికి రూ.6.14 - రూ.6.50 లక్షలు. ఎగ్జిక్యూటివ్‌ ఖాళీలకు నెలకు రూ.29,000- రూ.31,000.

దరఖాస్తు రుసుము: రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.200. 

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ప్రీ రిక్రూట్‌మెంట్ మెడికల్ టెస్ట్ ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు....

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 22-11-2023

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 06-12-2023.

ఆన్‌లైన్ పరీక్ష తేదీ: జేఏఎం పోస్టులకు 31-12-2023; ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు 30-12-2023.

Important Links

Posted Date: 22-11-2023

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

AAICLAS: ఏఏఐ కార్గో లాజిస్టిక్స్‌లో 906 సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టులు

AAICLAS: ఏఏఐ కార్గో లాజిస్టిక్స్‌లో 906 సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టులు 

న్యూదిల్లీలోని ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్‌ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్… దేశవ్యాప్తంగా ఏఏఐసీఎల్‌ఏఎస్‌ కేంద్రాల్లో మూడేళ్ల కాలవ్యవధికి ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన 906 సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఖాళీల వివరాలు........

* సెక్యూరిటీ స్క్రీనర్(ఫ్రెషర్‌): 906 పోస్టులు

అర్హత: కనీసం 60% మార్కుల(ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 55%)తో ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ/ సంస్థ నుంచి గ్రాడ్యుయేషన్. ఇంగ్లిష్, హిందీ లేదా స్థానిక భాషతో మాట్లాడే సామర్థ్యం కలిగి ఉండాలి.

వయోపరిమితి: 01.11.2023 నాటికి 27 ఏళ్లు మించకూడదు.

పోస్టింగ్ స్థలం: చెన్నై, కోల్‌కతా, గోవా, కోజికోడ్ (కాలికట్), వారణాసి, శ్రీనగర్, వడోదర, మధురై, తిరుపతి, రాయ్‌పుర్, వైజాగ్, ఇందౌర్, అమృత్‌సర్, భువనేశ్వర్, అగర్తల, పోర్ట్ బ్లెయిర్, తిరుచ్చి, దేహ్రాదూన్, పుణె, సూరత్, లేహ్ శ్రీనగర్, పట్నా.

జీత భత్యాలు: నెలకు రూ.30,000 నుంచి రూ.34,000.

దరఖాస్తు రుసుము: జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.750. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌, మహిళా అభ్యర్థులకు రూ.100.

ఎంపిక ప్రక్రియ: డిగ్రీ మార్కులు, ఐ/ కలర్‌ బ్లైండ్‌నెస్‌ ఎగ్జామ్‌, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 08-12-2023

Important Links

Posted Date: 22-11-2023

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

TCS Jobs with one Exam ఒక టీఎసీఎస్‌ ఎన్‌క్యూటీ పరీక్షతో లక్షన్నర కొలువు అవకాశం

ప్రసిద్ధ కార్పొరేట్‌ సంస్థల్లో ఉద్యోగాలకు ప్రకటన వెలువడినప్పుడు.. విడిగా దరఖాస్తు చేసుకుని, పరీక్షకు సిద్ధం కావాల్సిందే. ఒక్కో దానికీ దరఖాస్తు చేయాలంటే.. సంస్థలవారీ పరీక్షలకు సన్నద్ధం కావాలంటే.. చాలా కష్టం. ఇప్పుడీ చింత  లేదు. ఒకే పరీక్షతో పేరున్న సంస్థల్లో కొలువులకు పోటీ పడే అవకాశం వచ్చింది. ఇందుకోసం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) జాతీయ అర్హత పరీక్ష (నేషనల్‌ క్వాలిఫయర్‌ టెస్టు) రాస్తే చాలు. వివిధ సంస్థలు, విభాగాల్లో 1.60 లక్షల ఉద్యోగాలకు పోటీ పడవచ్చు. 

ఐటీ, బీఎఫ్‌ఎస్‌ఐ, ఎఫ్‌ఎంసీజీ, ఎడ్‌టెక్‌.. ఇలా 23 కంటే ఎక్కువ పరిశ్రమల్లో 170కి పైగా  హోదాల్లో పలు ఉద్యోగాలు అందుతున్నాయి. టీసీఎస్, జియో ప్లాట్‌పాం, ఆసియన్‌ పెయింట్స్, టీవీఎస్‌ మోటార్స్‌.. ఇలా ఎన్నో పేరున్న సంస్థలు జాబితాలో ఉన్నాయి. ఐటీలో సాఫ్ట్‌వేర్‌ డెవలపర్, ఫుల్‌స్టాక్‌ డెవలపర్, క్లౌడ్‌ ఇంజినీర్‌.. ఇలా 20 కంటే ఎక్కువే హోదాలు దక్కుతాయి. బిజినెస్‌ అనలిస్ట్, హెచ్‌ఆర్‌ స్పెషలిస్ట్, సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌.. ఇలా 150కి పైగా నాన్‌ ఐటీ ఉద్యోగాలూ పొందవచ్చు. అవకాశం వచ్చినవారు గరిష్ఠంగా రూ.19 లక్షల వార్షిక వేతనమూ అందుకోవచ్చు. 

ఆసక్తి ఉన్నవారు ముందు టీసీఎస్‌ ఎన్‌క్యూటీ కోసం ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకోవాలి. తర్వాత పరీక్ష రాయాలి. అనంతరం అందులో సాధించిన స్కోరుతో టీసీఎస్‌ ఎన్‌క్యూటీ వెబ్‌సైట్‌లోనే పలు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా ఇతర సంస్థల వెబ్‌సైట్లలోకి వెళ్లి వాటిలోనూ ఈ స్కోరుతో వివరాలు పంపవచ్చు. 

ఎన్నిసార్లైనా..

పరీక్షలు ఆంగ్ల మాధ్యమంలోనే ఉంటాయి. రుణాత్మక మార్కులు లేవు. మొదటి పరీక్షకు పేరు నమోదు చేసుకున్న 90 రోజుల వ్యవధి తర్వాత మళ్లీ ఫీజు చెల్లించి, పరీక్ష రాసుకోవచ్చు. ఇలా ఎన్నిసార్లైనా అవకాశం కల్పిస్తారు. ఎక్కువ మార్కులు పొందిన స్కోరును పరిగణనలోకి తీసుకుంటారు. అన్ని ఎన్‌క్యూటీ పరీక్షల స్కోరూ రెండేళ్ల వరకు చెల్లుతుంది. పరీక్షలన్నీ టీసీఎస్‌ అయాన్‌ కేంద్రాల్లోనే నిర్వహిస్తారు. ప్రతి రెండు నుంచి నాలుగు వారాలకు ఒకసారి ఇవి జరుగుతాయి. పరీక్షల్లో కటాఫ్, పాస్, ఫెయిల్‌ మార్కులు ఉండవు. సాధించిన స్కోరుతో సంతృప్తి చెందితే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో ఉచితంగా లెర్నింగ్‌ కోర్సుతోపాటు ప్రాక్టీస్‌ టెస్టులూ ఉన్నాయి. అలాగే మరికొంత స్వల్ప మొత్తం చెల్లిస్తే విస్తృతంగా కోర్సు మెటీరియల్, ప్రాక్టీస్‌ పరీక్షలు పొందవచ్చు. ఉద్యోగం ఆశించే పరిశ్రమ/ హోదా ప్రకారం పలు పరీక్షలు ఉన్నాయి. వాటిలో అభ్యర్థులు తమకు అవసరమైనవి ఎంచుకోవాలి. ఆసక్తి ఉంటే ఎన్‌క్యూటీలో ఉన్న అన్ని పరీక్షలూ రాసుకోవచ్చు.   

ఎన్‌క్యూటీ కాగ్నిటివ్‌

భిన్న పరిశ్రమలు/ సంస్థల్లో ఐటీ, నాన్‌ ఐటీ ఉద్యోగాలకు కాగ్నిటివ్‌ స్కోరు ఉపయోగపడుతుంది. ఈ పరీక్షతో వెర్బల్, న్యూమరికల్, రీజనింగ్‌ నైపుణ్యాలు తెలుసుకుంటారు. పరీక్ష రుసుము రూ.599. ఈ మొత్తాన్ని చెల్లిస్తే 30 గంటలు ఆన్‌లైన్‌లో నేర్చుకోవచ్చు. అలాగే పరీక్షకు ముందు ఒక ప్రాక్టీస్‌ టెస్టూ రాసుకోవచ్చు. కాగ్నిటివ్‌ స్కోరుతో ఒక్క టీసీఎస్‌లోనే యాభై వేలకు పైగా ఐటీ సర్వీసెస్‌/బీపీవో ఉద్యోగాలు ఉన్నాయి. ఇతర కార్పొరేట్‌ సంస్థల్లో ఐటీ/ప్రొడక్ట్‌ సాఫ్ట్‌వేర్‌ విభాగాల్లో 28,000 కొలువులు పొందవచ్చు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సర్వీసెస్, ఇన్సూరెన్స్‌ విభాగాల్లో 24,300 ఇతర అంటే.. ఆటోమోటివ్, ఈ కామర్స్‌/ ఇంటర్నెట్, ఎఫ్‌ఎంసీజీ, హెల్త్‌కేర్, మాన్యుఫ్యాక్చరింగ్, రిటైల్, టెలికాం, మార్కెటింగ్‌ అండ్‌ అడ్వర్టైజింగ్, ఎడ్‌టెక్‌.. ఇలా పలు పరిశ్రమలకు చెందిన సంస్థల్లో 15,300 ఉద్యోగాలు పొందవచ్చు. ఈ పరీక్షతోనే 121 హోదాల్లో లక్షకు పైగా ఉద్యోగాలకు పోటీ పడొచ్చు. అన్ని విద్యా నేపథ్యాలవారూ ఈ పరీక్షకు అర్హులే.  

రూ.999 చెల్లించి ఎన్‌క్యూటీ కాగ్నిటివ్‌ విత్‌ ప్రిపరేషన్‌ ప్యాక్‌ పొందవచ్చు. దీన్ని తీసుకున్నవారు ఆన్‌లైన్‌లో 60 గంటలు కోర్సు బేసిక్, అడ్వాన్స్‌డ్‌ స్థాయిలో నేర్చుకోవచ్చు. కాగ్నిటివ్‌ నైపుణ్యాలూ పెంచుకోవచ్చు. అలాగే పరీక్షకు ముందు 3 ప్రాక్టీస్‌ టెస్టులు రాసుకోవచ్చు. సైకోమెట్రిక్‌ టెస్టు, ఇంటర్వ్యూలను ఎదుర్కొనేలా కెరియర్‌ రెడీనెస్‌ కోర్సు, ప్రిపరేషన్‌ మెటీరియల్‌ పొందవచ్చు. కొన్ని ప్రశ్నలకు మీరిచ్చే సమాధానాలతో.. మీ ఆసక్తులు, సామర్థ్యాలు, నైపుణ్యాలు, పని విలువలు.. వీటిని మదింపుచేయడం ద్వారా మీ గురించి తెలిపే నివేదికనూ పొందవచ్చు. 

పరీక్ష ఎలా?

65 మార్కులకు దీన్ని 105 నిమిషాల వ్యవధిలో నిర్వహిస్తారు. మూడు విభాగాల్లో ప్రశ్నలు వస్తాయి. న్యూమరికల్‌ ఎబిలిటీలో నంబర్‌ సిస్టం, అరిథ్‌మెటిక్, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, డేటా ఇంటర్‌ప్రెటేషన్‌ నుంచి 20 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. వ్యవధి 25 నిమిషాలు. వెర్బల్‌ ఎబిలిటీలో ఇంగ్లిష్‌ గ్రామర్, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ నుంచి 25 మార్కులకు 25 నిమిషాల్లో ప్రశ్నలు పూర్తిచేయాలి. రీజనింగ్‌ ఎబిలిటీలో ఐడెంటిఫయింగ్‌ వర్డ్‌ అండ్‌ న్యూమరికల్‌ ప్యాటర్న్స్, ప్రాబ్లమ్‌ సాల్వింగ్, ఫిగరల్‌ అండ్‌ ఫ్యాక్చువల్‌ అనాలిసిస్, డెసిషన్‌ మేకింగ్, ప్రపోజిషనల్‌ రీజనింగ్, విజువల్‌/స్పేషియల్‌ రీజనింగ్‌ విభాగాల్లో 20 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. వ్యవధి 25 నిమిషాలు. సైకోమెట్రిక్‌లో భాగంగా బిగ్‌ 5 మోడల్‌ ఆధారంగా.. పర్సనాలిటీ ట్రైట్, మోటివేషన్‌ నీడ్‌ థియరీతో మోటివేషన్‌ టెస్టు 30 నిమిషాల వ్యవధితో నిర్వహిస్తారు. 

ఎన్‌క్యూటీ - ఐటీ 

ఐటీలో అధిక వేతనంతో ఉద్యోగాలు ఆశించేవారు రాయదగిన పరీక్ష ఇది. ఈ విధానంలో అవకాశం వచ్చినవారికి రూ.3 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు వార్షిక వేతనం లభిస్తుంది. కోడింగ్, ఆప్టిట్యూడ్‌లో అడ్వాన్స్‌డ్‌ నైపుణ్యాలు తెలుసుకునేలా పరీక్ష నిర్వహిస్తారు. ఇందుకోసం రూ.999 ఫీజు చెల్లించాలి. ఇందులో భాగంగానే 30 గంటలు ఆన్‌లైన్‌ లెర్నింగ్, ఒక ఉచిత ప్రాక్టీస్‌ టెస్టు, సైకోమెట్రిక్‌ టెస్టు, ఇంటర్వ్యూలు ఎదుర్కునేలా కెరియర్‌ రెడీనెస్‌ కోర్సు, మీ నైపుణ్యాలకు సంబంధించిన నివేదిక పొందవచ్చు. ఈ పరీక్షను ఫ్రెషర్లు, రెండేళ్లలోపు పని అనుభవం ఉన్నవారు రాసుకోవచ్చు. ఈ పరీక్షలో స్కోరుతో ఎంట్రీ లెవెల్‌ ఉద్యోగాలు అంటే డెవలపర్, సిస్టమ్‌ ఇంజినీర్, ఐటీ ఎనలిస్ట్‌.. మొదలైనవి పొందవచ్చు. ఫ్రెషర్స్‌ అయితే రూ.8 లక్షల వరకు వేతనం దక్కుతుంది. పార్ట్‌-బి అడ్వాన్స్‌డ్‌ సెక్షన్‌లో నైపుణ్యం చూపినవాళ్లు రూ.7 లక్షలు మొదలు కొని, వీలైనంత అధిక వేతనం పొందవచ్చు. ఈ పరీక్షలో ప్రతిభ చూపినవారు టీసీఎస్‌ నింజా, టీసీఎస్‌ డిజిటల్‌ ఆఫీసర్‌ ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చు. 

ఎన్‌క్యూటీ ఐటీ విత్‌ ప్రిపరేషన్‌ ప్యాక్‌ రూ.2298 చెల్లించి పొందవచ్చు. దీనిద్వారా 60 గంటలపాటు బేసిక్, అడ్వాన్స్‌డ్‌ కాగ్నిటివ్‌ స్కిల్స్‌తోపాటు, ఐటీ ఫౌండేషన్‌లో 150 గంటలు ఆన్‌లైన్‌లో అభ్యసించవచ్చు. 3 ప్రాక్టీస్‌ పరీక్షలు, సైకోమెట్రిక్‌ టెస్టు రాసుకోవచ్చు. ఇంటర్వ్యూ కోసం కెరియర్‌ రెడీనెస్‌ కోర్సు పొందవచ్చు.

పరీక్షలో రెండు విభాగాలు

దీనికి 160 మార్కులు. వ్యవధి 195 నిమిషాలు. రెండు విభాగాలుంటాయి. పార్ట్‌-ఎ ఫౌండేషన్‌ సెక్షన్‌లో.. న్యూమరికల్‌ ఎబిలిటీ, వెర్బల్‌ ఎబిలిటీ, రీజనింగ్‌ ఎబిలిటీల్లో ప్రశ్నలు వస్తాయి. వీటికి 65 మార్కులు. పరీక్ష వ్యవధి 75 నిమిషాలు. పార్ట్‌-బి అడ్వాన్స్‌డ్‌ సెక్షన్‌లో.. అడ్వాన్స్‌డ్‌ క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ, అడ్వాన్స్‌డ్‌ రీజనింగ్‌ ఎబిలిటీ, అడ్వాన్స్‌డ్‌ కోడింగ్‌లో ప్రశ్నలు సంధిస్తారు. వీటికి 95 మార్కులు. వ్యవధి 90 నిమిషాలు. సైకోమెట్రిక్‌లో భాగంగా పర్సనాలిటీ ట్రైట్, మోటివేషన్‌ టెస్టు ఉంటాయి. వ్యవధి 30 నిమిషాలు. 

ఎన్‌క్యూటీ - బీఎఫ్‌ఎస్‌ఐ

ప్రైవేటు బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ విభాగాల్లో అధిక వేతనంతో ఉద్యోగాలు ఆశించేవారు రాయదగ్గ పరీక్ష ఇది. ఇందులో ప్రతిభావంతులు రూ.2.5 లక్షల నుంచి రూ.11 లక్షల వార్షిక వేతనం అందుకోవచ్చు. ఈ పరీక్ష కోసం రూ.999 చెల్లించాలి. ఇందులో భాగంగా 30 గంటల ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ కోర్సు ఉచితంగా పొందవచ్చు. పరీక్షకు ముందు ఒక ప్రాక్టీస్‌ టెస్టు రాసుకోవచ్చు. ఇంటర్వ్యూలు ఎదుర్కోవడానికి కెరియర్‌ రెడీనెస్‌ కోర్సు, నైపుణ్యాలకు సంబంధించి ప్రత్యేక రిపోర్టు పొందవచ్చు. ఫ్రెషర్లు, రెండేళ్లలోపు పని అనుభవం ఉన్నవారు పరీక్ష రాసుకోవచ్చు. వీరికి అకౌంట్స్‌ ఎగ్జిక్యూటివ్, అకౌంట్‌ ఆపరేషన్స్‌ ఆఫీసర్, డేటా ఎనలిస్ట్, ఫైనాన్షియల్‌ ఎనలిస్ట్, ఆడిటర్, ఆపరేషన్స్‌ అకౌంట్‌ ఎగ్జిక్యూటివ్, టెల్లర్, క్యాషియర్‌.. తదితర ఉద్యోగాలు దక్కుతాయి.  

పరీక్ష ఇలా

మొత్తం 140 మార్కులు. వ్యవధి 180 నిమిషాలు. పార్ట్‌-ఎ కాగ్నిటివ్‌లో న్యూమరికల్, వెర్బల్, రీజనింగ్‌ విభాగాల్లో ప్రశ్నలు అడుగుతారు. వీటికి 65 మార్కులు. వ్యవధి 75 నిమిషాలు. పార్ట్‌-బిలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సర్వీసెస్, ఇన్సూరెన్స్‌ల్లో ప్రశ్నలు వస్తాయి. ఈ విభాగానికి 75 మార్కులు. వ్యవధి 75 నిమిషాలు. కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్, జనరల్‌ నాలెడ్జ్, బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అవేర్‌నెస్, ఇన్సూరెన్స్‌ అండ్‌ ఎకానమీల నుంచి ప్రశ్నలు అడుగుతారు. సైకోమెట్రిక్‌ టెస్టు వ్యవధి 30 నిమిషాలు. ఇందులో పర్సనాలిటీ ట్రైట్, మోటివేషన్‌ టెస్టు ఉంటాయి.  

ముఖ్య వివరాలు..

అర్హత: ప్రీ ఫైనల్, చివరి ఏడాది కోర్సులు చదువుతున్న ఏదైనా డిగ్రీ లేదా పీజీ విద్యార్థులు వీటిని రాసుకోవచ్చు. 2018 నుంచి 2024లోపు చదువు పూర్తయిన, పూర్తిచేసుకుంటున్న వారంతా అర్హులే. ఒకవేళ ఇప్పటికే ఏదైనా ఉద్యోగంలో ఉన్నవారైతే అనుభవం రెండేళ్లలోపు ఉంటే మేటి అవకాశాల నిమిత్తం వారూ ప్రయత్నించవచ్చు. 

వయసు: 30 ఏళ్లలోపు ఉండాలి. 

దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 27

ప్రవేశ పత్రాలు: పరీక్షకు రెండు రోజుల ముందు అభ్యర్థుల ఈ మెయిల్‌కు అందుతాయి.

పరీక్ష తేదీ: డిసెంబరు 9

తర్వాత నిర్వహించే పరీక్ష తేదీ: జనవరి 14 (దీనికీ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు) 

వెబ్‌సైట్‌: https://learning.tcsionhub.in/hub/national-qualifier-test/